శాంతి కోసం పాటుపడే సంస్థలు శాంతిని తేగలవా?
ప్రపంచంలో ఎటు చూసినా యుద్ధాలు, గొడవలు భగ్గుమంటున్నాయి. అందుకే ఐక్య రాజ్య సమితి అలాగే వేరే సంస్థలు, శాంతిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా, ఎప్పుడూ గొడవగొడవగా ఉండే ప్రాంతాల్లో వాళ్ల దళాల్ని పెట్టాయి. అలాంటి చోట్ల శాంతి ఉండేలా చూడాలన్నదే వాళ్ల ధ్యేయం. “ఐక్య రాజ్య సమితి తరఫున శాంతి కోసం ఆయా చోట్ల పనిచేసే వాళ్లు, ప్రపంచాన్ని శాంతిమయం చేయాలనే మా ఆశకు గుండె చప్పుడు” అని UN సెక్రెటరీ-జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్ అన్నాడు.
సంవత్సరాలు గడుస్తుండగా, వాళ్లు చేసిన ప్రయత్నాలు కొంతవరకు విజయం సాధించాయి. ఉదాహరణకు, పౌరుల్ని కాపాడడం, యుద్ధం వల్ల తలదాచుకోవడానికి వచ్చినవాళ్లను తమ సొంత దేశాలకు పంపించడం, నీళ్లు-ఆహారం లాంటివి ఇవ్వడం, పాడైన ఇళ్లను-బిల్డింగ్‌లను బాగుచేయడం లాంటివి వాళ్లు చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా వాళ్లు పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోవడానికి పెద్ద సమస్యలే ఉన్నాయి. మరి వాటికి పరిష్కారం దొరికి, అసలైన శాంతి ఎప్పటికైనా వస్తుందా? బైబిలు దీని గురించి ఏం చెప్తుంది?
శాంతి పరిరక్షణా దళాలకు వచ్చే సమస్యలు, వాటికి బైబిలు ఇచ్చే పరిష్కారాలు
సమస్య: సహకరించకపోవడం. మిలటరీ సంస్థలు, పౌర సంస్థలు చాలావరకు వేర్వేరు దేశాలకు చెందినవి కాబట్టి వాళ్లు ఒకరికొకరు సహకరించుకుని ఒకే తాటి మీదికి రావడం కుదరని పని. కొన్నిసార్లు అపార్థాల వల్ల, వేర్వేరు అభిప్రాయాల వల్ల అలాంటి సంస్థలు కలిసి పని చేయడానికి తిప్పలు పడుతున్నాయి.
బైబిలు ఇచ్చే పరిష్కారం: “పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు . . . అది ఆ రాజ్యాలన్నిటినీ [మనుషుల ప్రభుత్వాలన్నిటినీ] నలగ్గొట్టి నాశనం చేస్తుంది, అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది.”—దానియేలు 2:44.
అతిత్వరలో, దేవుడు యుద్ధాల్ని ఆపేసి భూమంతటా శాంతిని తెస్తాడు. (కీర్తన 46:8, 9) ఆయన భూమ్మీదున్న ప్రభుత్వాలన్నిటి స్థానంలో ఒకే ఒక్క ప్రభుత్వాన్ని తెస్తాడు. అదే దేవుని రాజ్యం. అది పరలోకం నుండి పరిపాలించే ఒక పరిపూర్ణ ప్రభుత్వం. దాని పరిపాలనలో భూమ్మీద గొడవల శబ్దమే వినబడదు, శాంతి పరిరక్షణా సంస్థలతో పనే ఉండదు.
సమస్య: చాలీచాలని వనరులు, సామర్థ్యాలు. శాంతి పరిరక్షణా దళాలకు కావల్సినంత మంది మనుషులు, డబ్బు, లేదా వేరే వనరులు లేకపోవడం వల్ల వాళ్ల పని కొన్నిసార్లు ముందుకు వెళ్లకపోవచ్చు. అంతేకాదు, వాళ్ల సిబ్బంది రోజురోజుకీ కష్టంగా, క్లిష్టంగా తయారౌతున్న పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది.
బైబిలు ఇచ్చే పరిష్కారం: ‘మన ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుడు, క్రీస్తును పరలోకంలో తన కుడిపక్కన కూర్చోబెట్టుకున్నాడు. దేవుడు క్రీస్తుకు ఇచ్చిన స్థానం ప్రభుత్వాలన్నిటి కన్నా, అధికారాలన్నిటి కన్నా, శక్తులన్నిటి కన్నా, ఎంతో ఉన్నతమైనది.’—ఎఫెసీయులు 1:17, 20, 21.
సర్వశక్తిమంతుడైన యెహోవా,a దేవుని రాజ్యానికి రాజైన యేసుకు కావల్సిన వనరులన్నీ ఇచ్చాడు. (దానియేలు 7:13, 14b) ఏ మానవ ప్రభుత్వానికి, సంస్థకు లేనంత గొప్ప అధికారాన్ని, జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను ఆయన యేసుకు ఇచ్చాడు. (యెషయా 11:2) అంతేకాదు, ఒక్క మాట చెప్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేసే శక్తివంతమైన దేవదూతల సైన్యం యేసుకు ఉంది. (ప్రకటన 19:14) అవును, ఏ పరిస్థితి కూడా ఆయనకు కష్టమైనది కాదు, క్లిష్టమైనది కాదు.
దేవుడిచ్చిన వనరులు, సామర్థ్యాలతో యేసు కేవలం గొడవల్ని ఆపడమే కాదు, దేవుని రాజ్యం కింద ఉండే ప్రతీఒక్కరికి అసలైన ప్రశాంతతను, భద్రతను, శాంతిని తెస్తాడు.—యెషయా 32:17, 18.
సమస్య: చట్టం వాళ్ల చేతుల్ని కట్టేయడం. శాంతి పరిరక్షణా దళాలకు కొన్నిసార్లు నిర్దేశాలు స్పష్టంగా ఉండవు. ఇంకొన్నిసార్లేమో చట్టాలు వాళ్ల చేతుల్ని కట్టేస్తాయి. దానివల్ల వాళ్లు ప్రజల్ని సరిగ్గా కాపాడలేకపోవచ్చు, వాళ్లు అనుకున్నది పూర్తిగా చేయలేకపోవచ్చు.
బైబిలు ఇచ్చే పరిష్కారం: “పరలోకంలో, భూమ్మీద [యేసుకు] పూర్తి అధికారం ఇవ్వబడింది.”—మత్తయి 28:18.
ప్రపంచంలో శాంతిని తీసుకొచ్చే పనిలో దేవుడు యేసుకు స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చాడు, ఇలా చేయొద్దు-అలా చేయొద్దు అని చేతులు కట్టేసే బదులు పూర్తి అధికారం ఇచ్చాడు. (యోహాను 5:22) యేసు అన్యాయస్థుడిగా, అవినీతిపరుడిగా మారే ప్రసక్తే లేదు. (యెషయా 11:3-5) యేసు “శాంతికి అధిపతి” అని, ఆయన రాజ్యం “నీతిన్యాయాల” పునాది మీద ఉంటుంది అని బైబిలు ఊరికే చెప్పట్లేదు.—యెషయా 9:6, 7.
దేవుని రాజ్యం అసలైన శాంతికి నాంది పలుకుతుంది
శాంతి పరిరక్షణా దళాలు ఒక గుప్పెడు శాంతిని తేగలరు, మహా అయితే ఒక ప్రాంతంలో గొడవను ఆపగలరు అంతే. కానీ హింస అనే అగ్నిజ్వాలను ఆర్పాలంటే, చాలామంది గుండెల్లో మండుతున్న ద్వేషం అనే నిప్పు రవ్వను ఆర్పాలి. అది అవ్వని పని.
“శాంతిని కాపాడాలంటే ముందు శాంతి ఉండాలి కదా, అదే ఇక్కడ సమస్య.”—డెన్నిస్ జెట్, మాజీ U.S. ప్రతినిధి.
మరోవైపు, దేవుని రాజ్యం మనుషుల గుండెల్లో రగులుతున్న ద్వేషాన్ని తీసేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకు, యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఆయన తన అనుచరులకు నలుగురితో ఎలా శాంతిగా ఉండాలో, ప్రేమను ఎలా పంచాలో తన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా చూపించాడు:
ప్రేమే దేవుని రాజ్య పౌరులకు బండగుర్తు అని కూడా యేసు చెప్పాడు. సాటిమనిషిని ప్రేమించని వాళ్లను దేవుని రాజ్యం కొంచెం కూడా సహించదని బైబిలు స్పష్టంగా చెప్తుంది:
మనుషుల్ని తయారుచేసిన యెహోవా దేవునికి, ఈ భూమ్మీద శాంతిని తీసుకురావడానికి ఒకే ఒక్క దారి ఏదో బాగా తెలుసు. శాంతి పరిరక్షణా దళాలతో సహా మనుషులు చేయలేకపోయిన వాటిని దేవుని రాజ్యం చేస్తుంది.
a యెహోవా అనేది దేవుని పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్ చూడండి.
b దానియేలు 7:13, 14 లో ఉన్న ‘మానవ కుమారుడు’ యేసుక్రీస్తే.—మత్తయి 25:31; 26:63, 64.