కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 1/8 పేజీలు 3-6
  • ఒంటరితనం—మనస్సులో దాగిన వ్యధ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒంటరితనం—మనస్సులో దాగిన వ్యధ
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒంటరి స్త్రీలు
  • ఒంటరి పురుషులు
  • ఒంటరి యువత
  • నీకై నీవు సహాయపడాల్సిన అవసరత
  • సన్నిహిత స్నేహితుల అవసరత
  • ఒంటరితనం మీ జీవితాన్ని హానికరంగా ప్రభావితం చేయనివ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • నాకు స్నేహితులు ఎందుకు లేరు?
    యువత అడిగే ప్రశ్నలు
  • యువత ఒంటరితనంతో బాధపడుతుంటే
    తేజరిల్లు!—2015
  • ఒంటరితనం—దీనితో పోరాడి విజయం సాధించాలని నీవు నిశ్చయించుకున్నావా?
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 1/8 పేజీలు 3-6

ఒంటరితనం—మనస్సులో దాగిన వ్యధ

ఒంటరితనం అనుభవించే వారిని గుంపులో గుర్తించగలవా? అది వారి ముఖంలో కన్పిస్తుందా? మీరు వారిని కలిసి నమస్తే చెప్పినప్పుడు, వారి చిరునవ్వు దాన్ని కప్పేస్తుందా? వారి నడకనుబట్టి, వారి తీరునుబట్టి మీరు చెప్పగలరా? పార్క్‌లో బెంచీపై కూర్చున్న ఒక పెద్దమనిషిని లేదా ఒంటరిగా కళామందిరంలో ఉన్న యౌవన స్త్రీని గమనించండి—వారు ఒంటరితనంతో వ్యధ ననుభవిస్తున్నారా? మూడు తరాలను సూచించే, నడిబజారులో సంచరిస్తున్న తల్లి, కూతురు, మనుమరాలను గమనించండి. వాళ్లు కొండంత సంతోషంతోవున్నట్లు కన్పించవచ్చు, కాని వాళ్లు ఒంటరితనాన్ని అనుభవించడం లేదని మీరు హామీ యివ్వగలరా? మీతోపాటు ఉద్యోగం చేసేవాళ్లను పరిశీలించండి. వారు పోషించాల్సిన కుటుంబాలు కలిగి, వారిని మంచిగా చూచుకోడానికి సరిపడినంత జీతంతో సంతోషంగావున్న ప్రజలని బహుశ మీకు తెలిసియుండవచ్చు. అయినా, వాస్తవంగా వారిలో ఒకరు “నేను ఒంటరిగా ఉన్నాన”ని చెప్పవచ్చేమో? సంతోషంగా, నిండు యౌవనంతోనున్న ఆ యవ్వన స్త్రీ ఒంటరిగా ఉండటానికిగల కారణమేమిటి? ఈ ప్రశ్నల సమాధానాలు మిమ్మల్ని ఆశ్చర్యపర్చవచ్చును.

“ఒంటరి” అనే పదాన్ని “నిరాధారము లేదా నిరాశ అనే భావాన్ని కలిగించేది”గా వెబ్‌స్టర్స్‌ నైన్త్‌ కాలేజియేట్‌ డిక్సనరీ నిర్వచించింది. ఇది అంతర్గత శూన్యం, ఏదొకటి లోటుగా ఉందనే భావన, మరియు ఎప్పుడూ ఒకరి బాహ్యరూపాన్నిబట్టే దీనిని గ్రహించలేము. ఒక పరిశోధకురాలు యిలా చెబుతుంది: “మన సమాజంలో ఒంటరితనమనేదాన్ని మనం బయటకు కనపర్చకుండా రహస్యంగా దాచుకుంటాం—కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నామని మనంతట మనం ఒప్పుకోము. ఒంటరితనానికి ఓ మచ్చ ఉంది. మీరొకవేళ ఒంటరిగా ఉంటే, మీలో ఏదో దోషముందని సమాజం ఊహిస్తుంది. లేకపోతే, మీకు నిజంగా ఎందరో స్నేహితులుంటారు, అది నిజం కాదా?” ప్రాముఖ్యంగా మనం యితరులనుండి వారి తాహతుకు మించి కోరినా లేదా ఆశించినా కొన్నిసార్లు ఇది నిజమే కావచ్చు.

ఒంటరి స్త్రీలు

స్త్రీలు, ప్రాముఖ్యంగా వివాహిత స్త్రీలు ఏ వయస్సు వారైనాసరే—పురుషులకంటే ఎక్కువగా జీవితంనుండి ఆశిస్తారని నిపుణులు ఒప్పుకున్నట్లు కన్పిస్తుంది. విశదంగా, విధవరాండ్రు, పరిత్యజింపబడిన స్త్రీలు, అవివాహిత వృద్ధస్త్రీలు అప్పుడప్పుడు ఒంటరిగా ఉంటారు. కాని కుటుంబాలతో సంతోషంగా ఉన్నట్లు కన్పించే స్త్రీల విషయమేమి? ఉదాహరణకు, 40 ఏళ్ల టీచరు విలాపాన్ని గమనించండి: “స్నేహితుల కొరకు నాకు సమయంలేదు; దాన్ని నేనెంతగానో కోల్పోయాను. అయితే నేనలా చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఒంటరిగా ఉన్నానని నేనెలా సాకుచెప్పగలను . . . ? నా పరిస్థితిని చూస్తే, నాకు చక్కటి వివాహమైంది, మంచి పిల్లలున్నారు, అందమైన ఇల్లుంది, నాకిష్టమైన ఉద్యోగముంది. నేను సాధించినవాటి నిమిత్తం నేనెంతో గర్విస్తున్నాను. కాని ఏదో పోగొట్టుకున్నట్లనిపిస్తుంది.”

స్త్రీలు తమ భర్తలను ప్రేమించి, వారికే అంకితమైనప్పటికి, వారు తమ భర్తలనుండి కూడ అలాంటి ప్రతిస్పందననే పొందుతున్నప్పటికీ, అలాంటి ప్రేమ వారి సహవాసానికి కావలసిన అవసరతలన్నింటినీ నిజంగా తీర్చలేదు. పైన పేర్కొన్న టీచరు యిలా వివరిస్తుంది: “నా భర్త నాకొక మంచి స్నేహితుడైనప్పటికి, అది మంచి స్నేహితురాండ్రు లేని లోటును తీర్చదు. పురుషులు కేవలం వింటారు కాని, స్త్రీలు శ్రద్ధతో వింటారు. నేనెంత చిక్కుల్లో మునిగిపోయానో తెలుసుకోడానికి నా భర్త ఇష్టపడడు. ఆయన తొందరగా సమస్యల్ని సరిచేయాలనుకుంటాడు. కాని నా స్నేహితురాళ్లు దాన్ని గూర్చి నన్ను చెప్పనిస్తారు. కొన్నిసార్లు కేవలం నేను మాట్లాడాలనే కోరుకుంటాను.”

ప్రియమైనవారు మరణించినప్పుడు, లేదా తనను పరిత్యజించినప్పుడు, ఒక స్త్రీ బహుగా దుఃఖిస్తుంది. ఒంటరితనం అలుముకుంటుంది. దుఃఖంలో ఉన్న స్త్రీ లేదా పరిత్యజింపబడిన స్త్రీ, ఆధారం కొరకు తన పుట్టింటికి, స్నేహితుల వద్దకు వెళ్తుంది, కాని ఆమె క్రొత్త వాస్తవాలతో సర్దుకొనిపోడానికి తన హృదయంలో తన స్వంత శక్తివైపు కూడ తిరగాల్సి ఉంటుంది. తాను పోగొట్టుకున్నది ఎల్లప్పుడూ తన జీవితంలో ఒక భాగంగా ఉన్నప్పటికి, తన జీవితంలో చురుకుగా కొనసాగడానికి ఇది ఒక అడ్డంకుగా ఉండకూడదని ఆమె గ్రహించాల్సి ఉంటుంది. దృఢమైన వ్యక్తిత్వమున్నవారు తరచూ ఇతరులకంటే తొందరగా ఒంటరితనం నుండి కోలుకుంటారని నిపుణులు గుర్తిస్తున్నారు.

పరిత్యజించబడిన స్త్రీ లేదా విధవరాలు—యీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ బాధననుభవిస్తారనే విషయమై వేర్వేరు అభిప్రాయాలున్నాయి. “మేము ఎప్పుడైనా పరిత్యజింపబడిన స్త్రీలను, ఒకరికొకరు ప్రోత్సహించుకునే మా విధవరాండ్ర సంఘానికి పిలిస్తే, ఎవరి దుఃఖం ఎక్కువ అనే విషయంలో రెండు పక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ‘అరే, కనీసం మీ భర్త బ్రతికే ఉన్నాడ’ని విధవరాలు చెబుతుంటే, ‘అరే, నామాదిరి నీవు వ్యక్తిగతంగా తృణీకరింపబడలేదు. నీవు జీవితంలో ఓడిపోయాననే భావనే లేదు,’ అని పరిత్యజింపబడిన స్త్రీ చెబుతుంది” అని 50 ప్లస్‌ అనే పత్రిక రిపోర్టు చేసింది.

ఒంటరి పురుషులు

ఒంటరితనం విషయానికొస్తే, స్త్రీపురుషుల్లో పురుషులే దృఢంగా యీవిషయంలో వ్యవహరించగలరని ప్రగల్భాలు పలకలేరు. “పురుషులు మానసికంగా కాకుండా ఎక్కువగా భౌతికంగానే వ్యవహరించడానికి చూస్తార”ని విధవరాండ్రకు సేవలనందించే ఎఎఆర్‌పి (అమెరికన్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌) కార్యక్రమ నిపుణురాలైన ఆని స్టడ్నర్‌ చెప్పింది. “స్త్రీలు తమ మానసిక బాధను పదేపదే చెబుతారు, కాని పురుషులు దుఃఖంతో వ్యవహరించేందుకు బదులు తమ భార్యలనే విడనాడి తిరిగి వివాహం చేసుకోడానికి చూస్తారు.” పురుష సలహాదారులు, ఎడబాసిన పురుషుల మానసిక భావాలను చర్చించే ముందు వారితో కావలసినంత సమయాన్ని వెచ్చిస్తారు.

స్త్రీలవలే గాక, పురుషులు తమ రహస్యాలను పురుషులతో కాకుండా స్త్రీలతోనే చెప్పాలనుకుంటారని నిపుణులు గుర్తించారు. రోచెస్టర్‌ యూనివర్సిటీలో ఒంటరితనాన్ని గూర్చిన నిపుణుడైన డా. లేడ్‌ వీలర్‌ వెల్లడిచేసేదేమంటే, ఒకరి నొకరు మానసికంగా లోతుగా హత్తుకుని ఉన్నామని పురుషులు అంతగా నమ్మరు. “భార్యను పోగొట్టుకున్న తర్వాత అలుముకున్న మానసిక ఒంటరితనం నుండి బయటపడే అవసరత, ఆ పిమ్మట స్త్రీ స్నేహితురాలితో సంభాషించడమనేవి విడాకులు పొందిన తర్వాత స్త్రీలకంటే పురుషులే ఎందుకు ప్రత్యేకంగా తిరిగి వివాహం చేసుకుంటారో వివరించడానికి కూడ సహాయపడతాయి.”—50 ప్లస్‌ అనే పత్రిక.

ఒంటరి యువత

పిల్లలు, యౌవనులు ఎందుకు ఒంటరివారౌతారో చెప్పడానికి చాలా కారణాలున్నాయి—పెద్దల వలెనే, తరచూ అవే కారణాలవల్ల ప్రభావితులౌతారు. క్రొత్త ప్రదేశానికి తరలి వెళ్లడం, స్నేహితులను విడిచిపెట్టడం; క్రొత్త స్కూల్లో తోటివిద్యార్థులు అయిష్టత చూపడం; మత, జాతి పూర్వరంగాలు; గృహంలో విడాకులు పొందడం; తలిదండ్రులు ప్రేమించడం లేదనే భావన; స్త్రీపురుషులు పరస్పరంగా తృణీకరించుకోవటం—అలాంటి విషయాలన్నీ ఒంటరితనాన్ని ప్రోత్సహించే కారకాల్లో ముఖ్యమైనవి.

తమతోపాటు ఆటపాటల్లో భాగం వహించడానికి పసివాళ్లకు ఎవరో ఒకరి అవసరతవుంది. వారిని అర్థంచేసుకోవడం, మానసిక మద్దతు అవసరం. వారి విలువను గుర్తించడం, ఆప్యాయతనివ్వడం వారికి అవసరం. ఇతరులు యథార్థమైనవారు, నమ్మకమైనవారుగా ఉంటారని వారికి తెలియాలి. ప్రేమించినప్పుడు, వారు ఎంతో భద్రతగావున్నట్లు భావించి, ఇతరులకు కూడ ప్రేమను కనబర్చడానికి నేర్చుకుంటారు. ఈ సాంఘిక మద్దతు వేర్వేరు మూలాలనుండి అనగా కుటుంబం, స్నేహితులు, మరి పెంపుడు జంతువులనుండి సహితం రావచ్చును.

విద్యార్థినీ విద్యార్థులు, ప్రాథమిక పాఠశాలనుండి కళాశాల వరకూ, అందరూ కూడ తరచు ఒకే పరిమాణంలో ఒంటరితనంతో బాధపడతారు, చాలాసార్లు తమ స్నేహితులు తమను యిష్టపడటం లేదనేదాన్నిబట్టే యిది జరుగుతుంది. “నేను చాలా బాధపడతాను ఎందుకంటే నేను ఒంటరిదాన్ని, నేను మాట్లాడను,” అని ఒక ఉన్నత పాఠశాల విద్యార్థిని విలపిస్తోంది. “నేను టీచరు చెప్పేవే వింటాను, నా పాఠశాల పని తప్ప మరేదీ నేను చేయను. ఖాళీ సమయమున్నప్పుడు, నేను కేవలం బొమ్మలు గీయడమో లేకపోతే ఏదో ఒకటి చేస్తాను. ప్రతిఒక్కరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, కాని నాతో ఎవరూ మాట్లాడరు. . . . నిత్యం సంభాషించకుండా ఉండలేనని నాకు తెలుసు. ప్రస్తుతానికి దాన్ని హృదయంలో దాచుకోవడమే నేను చేయగల్గేది.”

అయినప్పటికి, తప్పును ఎల్లప్పుడూ ఇతరుల ఒంటిరితనం మీద, లేదా వారు చూపే గర్వం మీద మోపకూడదు. ఒక వ్యక్తికి చాలా సిగ్గుపడటం, ఐహికంగా, మితిమీరి ఉద్రేకంగా ఉండటం, స్నేహితులతో స్త్రీపురుషులు కలిసిమెలసి ఉండటం కష్టంగా ఉండటంలాంటి ప్రవర్తనాసంబంధ లేదా సాంఘిక సమస్యలుండవచ్చును. అంగవైకల్యులు దృఢంగా లేకపోయినా, స్నేహపూర్వకంగా లేకపోయినా, అంగవైకల్యత కూడా యౌవనులు వారు ఏ వయస్సువారైనా ఒంటరితనాన్ని అనుభవించునట్లు అంగవైకల్యత కూడా కృంగదీయగలదు.

నీకై నీవు సహాయపడాల్సిన అవసరత

కాలిఫోర్నియాలోని ఫుల్లర్టన్‌ యూనివర్సిటీలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌గా పనిచేస్తున్న డెలోరస్‌ డెల్కోమా, ఒంటరితనంతో పోరాడే వ్యక్తిని గూర్చి మాట్లాడినప్పుడు ఓ మూలసత్యాన్ని గుర్తించింది: “కృషి అనేది ఒకనికి అంతర్గతంగా రావలసిన అవసరత ఉంది. అతడు చివరకు తన సమస్యను తానే గుర్తించాలి, ఎందుకంటే సహాయం చేయడానికి ఇతరులెంత కృషిచేసినా, అతడు తన ఒంటరితనమనే గూటినుండి బయటపడాలంటే కేవలం తనకుతాను మాత్రమే సహాయం చేసుకొనగలడు.”

సరిచేసుకోవడాన్ని తమకుతాము కష్టతరం చేసుకున్నవారే ఒంటరితనానికి అనువైన వ్యక్తిత్వాలని డా. వారెన్‌ జోన్స్‌ గుర్తించాడు: “ఇతరులకు దగ్గరయ్యామనే భావాలు తమలో రాకుండా వీరు తమకు తెలియకుండానే అడ్డుకుంటారు. కొందరికి ఎలా వినాలో తెలియదు, మరి వారు సంభాషణంతటినీ తమ స్వంతం చేసుకుంటారు. వారు తమకును, ఇతరులకును సమస్యగా తయారౌతారు; వారు తక్కువగా ప్రశ్నలడుగుతారు, మరి నీచమైన లేదా సహించజాలని విషయాలను చెప్పడంద్వారా తరచూ స్నేహాన్ని తెంచుకుంటారు.”

అసలు స్వగౌరవం కోల్పోయినటువంటి వ్యక్తులే కాకుండా, ఇతరులకు చెప్పాల్సిన సాంఘిక నైపుణ్యతలు లేనివారు కూడ ఉన్నారు. అలాంటి వారిని గూర్చి, వైద్యనిపుణురాలైన ఎవ్లాన్‌ మోషెట యిలా చెబుతుంది: “ఒంటరిగానున్న ప్రజలు తమను గూర్చి అంత మంచిగా భావించరు. తృణీకరింపబడతామని ఎదురుచూస్తూ, వారు ఉన్నత స్థానానికెదగాలని అనుకోరు.”

అయినను, సాధారణంగా వాడుకలో ఉన్న జ్ఞానంకంటే, పరిశోధకులు కనుగొన్నదాన్నిబట్టి చూస్తే, వృద్ధస్త్రీలూ పురుషులూ యౌవనులకంటె తక్కువగా ఒంటరితనంతో బాధపడుతుంటారు. ఎందుకో వారికీ తెలీదు. వాళ్లు యింకా కనుగొన్నదేమంటే పెద్దవాళ్లు ఒంటరితనంతో బాధపడేది బంధువులకంటే ఎక్కువగా స్నేహితులు లోపించినందువల్లనే. “అలాగని కుటుంబ బాంధవ్యాలనేవి పెద్దవాళ్లకు ప్రాముఖ్యం కాదనికాదు. వారు సహాయం కొరకు కుటుంబాన్నే ఆశ్రయిస్తారు. కాని వాళ్లకు తోడ్పడటానికి కావల్సినంతమంది కుటుంబ సభ్యులున్నప్పటికి, వాళ్లకు స్నేహితులు లేనట్లైతే వారు ఒంటరిగా ఉన్నామని ఎంతగానో బాధపడతారు.”

సన్నిహిత స్నేహితుల అవసరత

చిన్నలకూ పెద్దలకు కూడ కుటుంబ సభ్యులూ బంధువులూ చేయగల్గేదానికంటే ఎక్కువ సన్నిహిత స్నేహితులే చేస్తారు. ప్రజలందరికీ ఒక స్నేహితుడు, తమకు నమ్మకమున్న లేదా నొప్పించామనే భయంలేకుండా తమ మనస్సులోని విషయాలు విప్పిచెప్పుకోగల్గే సన్నిహిత స్నేహితుడు అవసరం. అలాంటి స్నేహితుడు లేనట్లైతే ఒంటరితనం అధికం కావచ్చు. అలాంటి స్నేహితుని గూర్చే అమెరికన్‌ వ్యాసరచయిత రాల్ఫ్‌ వాల్డో ఎమర్సన్‌ యిలా వ్రాశాడు: ‘నేను ఎవరి ముందైతే బిగ్గరగా ఆలోచించగలనో వాడే నా స్నేహితుడు.’ మోసగిస్తాడనే భయం లేకుండా లేదా నిన్ను అగౌరపర్చడానికి, లేదా యితరులు నిన్ను హేళన చేయడానికి నీ రహస్యాలను బయటపెడతాడనే చింత లేకుండా నీ మనసువిప్పి చెప్పుకోగల అలాంటి వ్యక్తి నమ్మకమైనవాడు. నీకు నమ్మకమైన స్నేహితులని నీవు దృష్టించిన కొందరు, ఎల్లప్పుడూ అలాగే నమ్మకస్థులుగా వుండకపోవచ్చు, గాని “పరునిగుట్టు బయటపెట్టని,” “సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.”—సామెతలు 18:24; 25:9.

కర్కశంగా, ఎవరి అవసరతా లేదన్నట్టు నటించే వారు కూడ ఉన్నారు. తాము స్వయం తృప్తిగలవారని స్వతంత్రులమని చెప్పుకుంటారు. అయినప్పటికి, తరచు వాళ్లు గుంపులుగా చేరి మొండివాళ్లుగా తయారౌతారు. పిల్లలకు బాల సమాజలున్నాయి, వాళ్లు క్లబ్‌లను ఏర్పాటుచేస్తారు, ముఠాలుగా తయారౌతారు; యౌవనులకు మోటారు సైకిల్‌ ముఠాలున్నాయి; నేరస్థులకు వారిని గూర్చి ఆచూకీ యివ్వని ప్రాణమిత్రులున్నారు; తాగే జబ్బున్న వారు కోలుకోడానికి త్రాగుబోతులకు సహాయాన్నందించే సంస్థల్లో చేరతారు; లావుగావున్న వారు బరువు తగ్గించుకొనుటకు సలహా యిచ్చే సంస్థల్లో చేరిపోతారు. ప్రజలు సహజంగా గుంపులుగా జీవిస్తారు; ఒకరికొకరు మద్దతు పొందు నిమిత్తం గుమికూడతారు. సమస్యలున్నప్పుడు కూడ వాళ్లు, అదేరకమైన సమస్యలున్న ప్రజలతో సహవాసం చేయాలనే కోరతారు. మరి వాళ్లంతా ఏకగ్రీవంగా ఒంటరితనాన్ని అసహ్యించుకుంటారు. ఒంటరితనం గూర్చి మనమేం చేయగలము?

[5వ పేజీలోని చిత్రం]

“ఒంటరి ప్రజలు తమను గూర్చి అంత మంచిగా భావించరు”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి