బైబిలు ఉద్దేశ్యము
మంత్రవిద్య నభ్యసించుటలో ప్రమాదమున్నదా?
మంత్రవిద్యా వాతావరణం అంతటా వ్యాపిస్తుంది. హఠాత్తుగా, ఢంకా మ్రోగి సద్దుచేసింది. ఒకేరకమైన దుస్తులు ధరించి, తుపాకీలతో వస్తున్న ఇద్దరు మనుష్యులను అందరూ కళ్లప్పగించి తీక్షణంగా చూస్తున్నారు. వారు తమ తుపాకీలను భుజాలపైకెత్తి, ఆకర్షణీయంగా దుస్తులు ధరించిన చైనా మాంత్రికునికి గురిపెట్టారు. ఆయన చైనా ప్లేట్‌ను తన ఛాతిపై పెట్టుకున్నాడు. తుపాకీలు నిప్పురవ్వలు కురిపించాయి. వెంటనే మాంత్రికుడు విపరీతంగా రక్తం కార్చుకుంటూ, నేలపై ఒరిగాడు. ప్లేట్ తూటాలను అడ్డుకుంటుందనే భ్రమ చివరకు విషాదాన్ని సృష్టించింది. ఒక తుపాకీలోని యాంత్రిక లోపంవల్ల తూటా విడుదలై మాంత్రికుని గుండెల్లో చొచ్చుకుంది. ఈ విషయాన్ని హెన్రీ గోర్డెన్స్ వరల్డ్ ఆఫ్ మేజిక్ అనే పుస్తకం వివరిస్తుంది.
జీవిత బహుమానాన్ని పాడుచేసుకోవడమే—ఇదంతా సందేహం, గగుర్పాటు, వినోదంతో కూడిన మంత్రాల కొరకు చేసేదే. మీరు కూడా అలాగే స్పందిస్తారా? లేక అలాంటి ప్రదర్శనలో ఉండే చిక్కుల్లో కేవలం అది ఒక భాగమేనని భావిస్తారా? మీరెలా స్పందించినప్పటికీ, ఈ భ్రమ విఫలమైనప్పుడు ప్రాణాపాయమయింది. ఇది మనం యిలా అడిగేటట్లు పురికొల్పుతుంది: మంత్రవిద్యను అభ్యసించడం వల్ల అంతకంటే కుయుక్తితో కూడిన అపాయముందా? సమాధానం కొరకు, మనం ఈ ప్రాచీన కళకు సంబంధించిన మూలాలను పరిశీలిద్దాము.
చరిత్రంతటిలో మంత్రవిద్య ప్రభావం
చరిత్రారంభం నుండి కూడ, మానవుడు మంత్ర రహస్యాలతో మాయోపాయాలు, చమత్కారాలు చేస్తూనే వచ్చాడు. “మంత్రవిద్య” [మ్యాజిక్] అనే పదం మత కార్యకలాపాల్లో ప్రత్యేకత పొందిన పురాతన పర్షియాలోని పూజారుల కులానికి చెందిన “మాగి” [మునులు] అనే వారినుండి ఏర్పడింది. దీని అత్యంత ప్రాథమిక భావమేమంటే, మంత్రవిద్య అనేది సృష్టిని, లేదా అతీతశక్తులను అదుపులో పెట్టి, లేదా నిర్భందించి మానవుని కోర్కెలు నెరవేర్చుకోవడమే. ఐగుప్తులో సా.శ.పూ. 18వ శతాబ్దంలో మంత్రవిద్య నభ్యసించే యాజకులుండేవారు. సా.శ.పూ. 8వ శతాబ్దంలో బబులోనులోని ప్రాచీన కల్దీయుల మతంలో ఈ మంత్రవిద్య ప్రముఖ పాత్ర వహించింది. (ఆదికాండము 41:8, 24; యెషయా 47:12-14; దానియేలు 2:27; 4:7) దీని ప్రభావం ప్రాచీన గ్రీకులు, రోమనులలోను, మధ్యయుగంలోను మన 20వ శతాబ్దంలోను ఉన్నది.
వేర్వేరు మంత్రవిద్యలను అనేక విధాలుగా వర్గీకరించవచ్చు. రాబర్ట్ ఎ. స్టెబ్బిన్స్ ది మెజీషియన్ అనే తన పుస్తకంలో మంత్రవిద్యను మూడు రకాలుగా విభజించాడు.
మూడు రూపాల మంత్రవిద్య
రహస్య మంత్రవిద్య అనేది “గూఢమైన పదం.” అది చెప్పేదేమంటే “సహజ జ్ఞానం, లేదా వైజ్ఞానిక జ్ఞానానికి విరుద్ధంగా వుండే సంఘటనలు, లేదా కార్యాలు వాస్తవమైనవి లేదా తగినవే.” స్టెబ్బిన్స్ ఇంకా వివరించేదేమంటే “గారడివిద్య, . . . చిల్లంగితనం, రసవాదం, కొన్ని షరతులపై మతం యొక్క సేవకురాలే ఈ రహస్య మంత్రవిద్య.”
నమ్మించే మంత్రవిద్యతో, “దాని నభ్యసించేవారు ప్రేక్షకులను తమకుతాముగా నిజత్వాన్ని గ్రహించేటట్టు మాయచేత, అద్భుతం చేస్తారు.” వారు ప్రజలను మోసం చేస్తున్నారని వారికి తెలుసు, కాని స్టెబ్బిన్స్ ప్రకారం, “వారు మంత్రవిద్యను గూర్చి సాక్ష్యమిచ్చే వారిని దానిని నమ్మమని, లేకపోతే నమ్మించటానికి మాంత్రికులుగా వారి దగ్గర అతీతశక్తులున్నాయని లేదా అతీతశక్తులున్న దేవతలతో వారికి సంబంధముందని నమ్మడానికి ప్రోత్సహిస్తారు.”
వినోదకర మంత్రవిద్య మోసపూరిత భ్రమ ద్వారా ఆశ్చర్యాన్ని రేకెత్తించడానికి ఉద్దేశిస్తుంది. ఇది ఐదు ప్రాథమిక పద్ధతులుగా ఒకదానితో ఒకటి పొత్తుకల్గివున్నాయి: “వేదికపై చేసే మంత్రవిద్య, తక్కువ ప్రేక్షకుల ముందుచేసే మంత్రవిద్య, ఇంద్రజాలం, భ్రమించే మంత్రవిద్య, మానసిక సంబంధంగా చేసే మంత్రవిద్య.”
ఇది క్రైస్తవులకు అపాయకరమా?
మొదటిగా మనం రహస్య మంత్రవిద్యను పరిశీలిద్దాం. రహస్య మంత్రవిద్య అనేక విధాలుగా పిలువబడుతుంది. ఉదాహరణకు, “తెలుపు” మంత్రవిద్య, “నలుపు” మంత్రవిద్యలను అభ్యసించే వాళ్లలో దయ్యాలతో సంబంధమున్నవారే వుంటారు. మంత్రించి వశము చేసికోవడం, శపించడం, ఒకరి శత్రువులకు హానికల్గేలా చేతబడి చేయించడం అనేవి “నలుపు” మంత్రవిద్యకు చెందినవి. మరోవైపు, “తెలుపు” మంత్రవిద్య అనేది వశం చేసుకున్న వారి నుండి విడుదల పొందడం, శాపం తీసివేయడం ద్వారా మంచి ఫలితాలను తెచ్చుటకే ఉద్దేశించబడింది. అయినను, రెండూ కూడ, తంత్రాలు లేదా రహస్యాలతో కూడిన పదాలే. ఒక సందర్భంలో పంటలు మంచిగా పండటానికి, క్రీడాకారుడు పందెంలో విజయం సాధించడానికి కూడ రహస్య మంత్రవిద్య ఉపయోగించబడింది. అయినను, ఈ దయ్యాల సంబంధ మంత్రవిద్యను గూర్చి బైబిలు నిర్మొహమాటంగా మాట్లాడుతుంది: “శకునములు చూడకూడదు, మంత్రములు చేయకూడదు.”—లేవీయకాండము 19:26; ద్వితీయోపదేశకాండము 18:9-14; అపొస్తలుల కార్యములు 19:18, 19.
నమ్మించే మంత్రవిద్యలో అపాయమెక్కడ దాగివుంది? శకునముచెప్పు సోదెగాళ్లు, జ్యోతిషం చెప్పేవాళ్లు, విశ్వాస స్వస్థతలు చేసేవాళ్లు, చెప్పాలంటే ఇంకా అనేకమైనవి, స్వంత కోరికలు తీర్చుకోడానికి చేసే నమ్మించే మంత్రవిద్యకు సంబంధించినవే. వారు తమ వృత్తులద్వారా పచ్చిఅబద్దాలాడటం లేదంటారా? దేవుని వాక్యం యిలా చెబుతుంది: “మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు.”—లేవీయకాండము 19:11.
ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా యిలా వివరిస్తుంది: “కొన్ని సందర్భాల్లో, మంత్రతంత్రాలు దయ్యాలను బలవంతం చేస్తాయి.” మనం మనకు తెలియకుండా అలాంటి చేతకాని కార్యకలాపాల్లో తలదూర్చడం ద్వారా దయ్యాలనుండి సమస్యలను కొనితెచ్చుకోవాలని కోరుకుంటామా? అవకాశమిస్తే, దయ్యాలు మనల్ని ఉపయోగించుకోగలవు, ఉపయోగించుకుంటాయి కూడ. అవి ‘అనుకూల సమయం’ కొరకు చూస్తాయి, మరి అవి వాటి ప్రయత్నాల్లో విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాయి.—లూకా 4:13; యాకోబు 1:14.
భ్రమించే, మోసగించే ఈ కళలో నిష్ణాతుడు సాతాను తప్ప మరెవరూ కాదు. అతడు మొదటిగా ఏదెను వనంలో మానవుని ముందు ఈ కళను ప్రదర్శించినప్పటినుండి అతడు దీన్ని అభ్యసిస్తూనే వున్నాడు. (ఆదికాండము 3:1-19) క్రైస్తవుడు అతనివలె ఉండాలని కోరుకుంటాడా? బదులుగా, క్రైస్తవులకు “దేవుని పోలి నడుచుకొను”డని, “దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి” అని సలహాయివ్వబడింది.—ఎఫెసీయులు 5:1; యాకోబు 4:7.
అయినను, అనేకమంది ప్రజలు, “మంత్రవిద్య” అనే దాన్ని వినోదంతో జతచేస్తారు. కళ్లు గ్రహించే దానికంటే వేగంగా చేతులతో క్రియలు చేయవచ్చనే ఆలోచనతో ఒక వ్యక్తి తన చేతులతో (ఇంద్రజాలంతో) భ్రమింపజేయవచ్చును. అలా చేయకూడదని బైబిలెక్కడా చెప్పడం లేదు. అయినను, ఒకవేళ మంత్రతంత్రాల నటన ఉన్నట్లైతే, క్రైస్తవుడు వివరించలేనటువంటి ఏదో అతీతశక్తిని సంపాదించుకున్నాననే తలంపు ఎప్పుడైనా కనబర్చడానికి కోరుకుంటాడా? లేదా “మంత్రవిద్యా” ప్రదర్శన ద్వారా చెడు అభిప్రాయం పొందితే, క్రైస్తవుడు ఇతరులను ఆటంకపర్చే అలాంటి వినోదాన్ని మానుకోవాలని కోరుకోడా? (1 కొరింథీయులు 10:29, 31-33) అంతేకాకుండా, ఒక వ్యక్తి ఇంకా లోతుగా మాంత్రిక కార్యకలాపాల్లో చిక్కుకుపోడానికి శోధించబడే అపాయం ఎక్కువగావుంది.
కాబట్టి, భూతవిద్యతో సంబంధమున్న మంత్రవిద్య విషయానికొస్తే, నిజక్రైస్తవులు దానిని అభ్యసించకుండా తెలివిగా తప్పించుకుంటారు. దానికంటే అధికంగా క్రైస్తవ జీవితంలోని అన్ని రంగాల్లో అంటే ఉద్యోగం, ఆటలు, వినోదం మరి దేనిలోనైనాసరే, అతడు దేవునియెడలను మనుష్యుల యెడలను నిర్దోషమైన “మంచి మనస్సాక్షి” కలిగియుండుటకు కోరుకుంటాడు.—1 పేతురు 3:16; అపొస్తలుల కార్యములు 24:16. (g93 9/8)
[Picture Credit Line on page 23]
The Bettmann Archive