శ్రేష్ఠమైన పరిచర్య కొరకే నేను మతగురువు పదవిని విడిచిపెట్టాను
నేను 1955 జూలై 31లో, 24 సంవత్సరాల వయస్సులోనే కాథోలిక్ మతగురువుగా నియమించబడ్డాను. ఇండియాలో, గోవాలోని రాకోల్నందు 12 సంవత్సరాలు ప్రధానబిషప్ సెమినరీలో గడిపాను. మరి ఒక మతగురువుగా ఉండాలనే కోరిక నాలో కలుగజేసిందేమిటి?
నేను సెప్టెంబరు 3, 1930లో ఇండియానందలి బొంబాయిలో జన్మించాను. ఆ తర్వాత సంవత్సరమే, నా తండ్రి ఉద్యోగవిరమణ చేశారు, మరి మా కుటుంబం ఇండియాకు నైరుతిదిక్కులో కోస్తాప్రాంతమైన గోవాలోని సాల్వెడోర్ డొ మూండొ బార్డెజ్లో స్థిరపడింది. నలుగురి పిల్లల్లో నేనే చిన్నవాడిని. పోర్చుగీసువారిచే ఆక్రమించుకున్నప్పటినుండి అనగా 1510 నుండి వున్న పోర్చుగీసు కాథోలిక్ సంస్కృతిలోనే నేను బాల్యంనుండి పెరిగాను.
నా తలిదండ్రులు తమ నమ్మకాల యెడల విశ్వాసంతో, ప్రతి సంవత్సరం క్రిస్మస్, లెంట్, ఈస్టర్, కన్య మేరీ మరియు కొంతమంది “పరిశుద్ధుల” గౌరవార్ధంగా మరితర పండుగలను ఆచరించే పట్టుదల కల్గిన కాథోలిక్కులు. ఈ పండుగల్లో భాగం వహించే మతగురువులు తరచూ మా ఇంట్లోనో తిష్టవేసేవారు, కొన్నిసార్లు పదిరోజుల కంటే ఎక్కువగా ఉండేవారు. కాబట్టి, మేము వారితో నిరంతర సన్నిహితత్వం పొందాం, మరి యౌవనునిగా నేనెంతో వారివలన ప్రభావితున్నయ్యాను.
గోవా, సాలెమాంకె, రోమ్లలో నా సేవ
నేను మతగురువుగా సేవను గొప్ప ఉత్సాహంతో ప్రారంభించాను, మరి కాథోలిక్కు చర్చి ఆచరణలు, మతసిద్ధాంతాల యథార్థతను గూర్చి నాకేవిధమైన సంకోచంలేదు. నేను గోవాలో చేసిన నా మొదటి ఏడు సంవత్సరాల సేవలో, గోవా ముఖ్యపట్టణమైన పనజి చర్చిప్రాంతంలో సామాజికపరమైన, మతసంబంధమైన పనులను చేశాను. అదేసమయంలో అప్పటి పోర్చుగీసు ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో, ప్రొఫెసరుగాను, అదే ఇన్స్టిట్యూట్నకు డైరక్టర్గాను రెండు పదవులనూ నిర్వహించాను.
నేను 1962లో స్పెయిన్‌లోని సాలెమాంకె యూనివర్సిటీకి పంపబడ్డాను, అక్కడే నేను తత్వశాస్త్రంలో పిహెచ్డి, చర్చి చట్టాన్ని చదివాను. చర్చికి సంబంధించిన నా కోర్సు జరిగే సమయంలో, నేను చదివిన విషయాలు ప్రాముఖ్యంగా రోమను రాజ్యాంగం, చర్చి రాజ్యాంగ చరిత్ర అనేవి కాథోలిక్కు చర్చి యొక్క రాజ్యాంగం ఏవిధంగా ఏర్పడిందో, అలాగే పోప్‌ను పేతురు తరువాత వారసత్వంగా ‘చర్చిపై సర్వోన్నతాధికారం’ పొందినవాడుగా గుర్తించగలిగే స్థాయికి ఎలా వృద్ధిచెందగలిగిందో అన్వేషించే జ్ఞానాన్ని నాకు అందించాయి.
నేను చాలా ఆనందించాను ఎందుకంటే నాకు ఇటలీలోని రోమ్‌లో మతశాస్త్రం చదవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి, అక్కడే నేను చర్చి అధికార శ్రేణిలను గూర్చి ఎక్కువ నేర్చుకోగల్గాను. నేను 1965 వేసవిలో రోమ్కు తరలివెళ్లాను.
ఈ కాలంలోనే రెండవ వాటికన్ విశ్వవ్యాపిత కౌన్సిల్ దాని పరాకాష్టకు చేరుకుంది. నేను నా మతసంబంధ అధ్యయనాన్ని కొనసాగిస్తూనే, అనేకమంది వేదాంతులతోను, కౌన్సిల్ పర్యవేక్షణాధికారానికి అతీతంగావుండేవారిని అడ్డుకొన్న “కౌన్సిల్ ఫాదర్స్”తోను మంచి ఆసక్తిగల్గిన చర్చలు జరిపేవాన్ని. నేను రోమ్‌లోని ఇండియన్ ప్రీస్ట్స్ అసోషియేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేయడంవల్ల, అప్పట్లో రాజ్యమేలుతున్న పాల్ VI అనే పోప్‌తో వ్యక్తిగతంగా నాకు సంబంధాలుండేవి.
ప్రప్రథమ పోరాటాలు, అనుమానాలు
ఈలాంటి సంప్రదింపులు జరిపిన కాలమంతటిలోను, నేను చదువుకుంటున్న సమయంలోను, మతసిద్ధాంతాలను గూర్చి అన్వేషిస్తున్న సమయంలోనూ మరెక్కువగా కాథోలిక్కు చర్చి యొక్క ప్రాథమిక వ్యవస్థలో అభివృద్ధి, దాని చరిత్రను గూర్చిన జ్ఞానం సంపాదించుటకు నాకు అవకాశం లభించింది.a పయస్ XII (1939-58) యొక్క ఏకరాజ్యాధిపత్య విధానానికి అలవాటుపడిన కౌన్సిల్ పర్యవేక్షకుల దృక్పథాలకు విరుద్ధంగా, స్వతంత్రులు చివరకు చర్చికి సంబంధించిన మత దురభిమాన రాజ్యాంగానికి (ఈ రాజ్యాంగాన్ని లాటిన్లో ల్యూమెన్ జెంటియమ్, లైట్ ఆఫ్ ది నేషన్స్ అని పిలుస్తారు) కౌన్సిల్ ఆమోదాన్ని పొందగల్గారు. మరితర విషయాల్లో, చర్చిపై పోప్‌కున్న పూర్తి సర్వోన్నత అధికారంలో బిషప్‌లు ఒక సంఘంగా భాగం వహించే హక్కును గూర్చి 3వ అధ్యాయం చర్చించింది. ఈ మతసిద్ధాంతం సాంప్రదాయంపై లోతుగా పాతుకుపోయింది, కాని చర్చి పర్యవేక్షకులు సాంప్రదాయ విరుద్ధమైనదిగాను, విప్లవాత్మకమైందిగాను పరిగణించారు.
సువార్తల్లో ఉన్న సత్యాలు ఈ సిద్ధాంతాల్లో లేనందువల్ల, రెండు దృక్పథాలు కూడ నాకు మంచిగా కన్పించలేదు. అవి మత్తయి 16:18, 19కు విరుద్ధమైనవి, అంతేకాకుండా లేఖనాధారంలేని పాత, క్రొత్త మత సిద్ధాంతాలకు, మత విరుద్ధసిద్ధాంతాలకు కూడ అవి అనుమతి నిచ్చాయి.b ఈ సందర్భంలో ఉపయోగించిన గ్రీకు పదాలైన పెట్రా (స్త్రీలింగం) అనగా “ఒక బండ” అని, పెట్రోస్ (పులింగం) అనగా “రాతి ముక్క” అనియు అర్థమిచ్చే పదాలను యేసు ఉపయోగించలేదు. ఇంకనూ, ఒకవేళ పేతురుకే మూల రాయివంటి ఆ బండగా సర్వోన్నతాధికారం యివ్వబడితే, వారిలో ఎవరు గొప్పవారు అనే భేదాలు అపొస్తలుల మధ్య లేకుండా పోయేవి. (మార్కు 9:33-35; లూకా 22:24-26 పోల్చండి.) అలాగే, “సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనక పోవుట”చేత పౌలు పేతురును ధైర్యంగా బహిరంగముగా ఎదిరించియుండేవాడు కాదు. (గలతీయులు 2:11-14) మూలరాయి అయినటువంటి యేసుతో పాటు ఆత్మచే అభిషేకింపబడిన క్రీస్తు అనుచరులందరూ సమానంగా రాయివంటివారని చివరకు గ్రహించాను.—1 కొరింథీయులు 10:4; ఎఫెసీయులు 2:19-22; ప్రకటన 21:2, 9-14.
విద్యాపరంగాను, చర్చి ఉపదేశకుడి హోదాలోను నేను ఎంత ఉన్నతస్థానానికి ఎదిగానో అంత మహత్తరంగా నాకున్న ఆలోచనలను పంచుకుని, అంత ఎక్కువగా అనేక కాథోలిక్కు చర్చి అబద్ధ సిద్ధాంతాలకు, ప్రాముఖ్యంగా “పవిత్రమైన బలి ఆరాధన,” విషయంలోను, “బహుగా ఆశీర్వదించబడిన ప్రభురాత్రి సంస్కారం” అంటే రొట్టె, ద్రాక్షారసం అకస్మాత్తుగా క్రీస్తు శరీరం, రక్తంగా మారిపోతాయనే విషయంలోను మతగురువుల ఆచారసిద్ధాంతాలకు నా మనస్సు, హృదయం దూరమయ్యాయి.
కాథోలిక్కు భాషలో, “పవిత్రమైన బలి ఆరాధన” అంటే “సిలువ”పై యేసు బలిదానాన్ని రక్తంలేకుండా నూతనంగా ప్రతిరోజూ ఆచరించడమే. కాని యేసు బలి అనేది సంపూర్ణమైన బలియని ఊహించడానికి, సాధారణ క్రైస్తవ గ్రీకు లేఖనాలు, ప్రాముఖ్యంగా పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక నాకు తగినంత వివరణనిచ్చాయి. ఆయన పని సంపూర్ణమైనది. ఏవిధమైన మార్పులు, చేర్పులు, లేదా దిద్దుబాట్లు దానికి అవసరంలేదు, అలాంటి మార్పులకు అది ఎడమియ్యదు కూడ. ఆ బలి “ఒక్కసారే” యివ్వబడింది.—హెబ్రీయులు 7:27, 28.
సత్యం కొరకు నా అన్వేషణ కొనసాగింది
నాకు నేను పరీక్షించుకోడానికి, నేను బిషప్‌గా, ప్రధాన బిషప్‌గా అనేక పశ్చిమ ఐరాపా దేశాల్లో, అంటే న్యూయార్క్‌లో ప్రధాన బిషప్‌గా, అలాస్కాలోని ఫెయిర్బాంక్స్లో బిషప్‌గా పనిచేయడంలో కొనసాగాను. సత్యం కొరకు అన్వేషించుటలో, అది నాకు తొమ్మిది సంవత్సరాల కఠినపరీక్ష. నేను ముఖ్యంగా కార్యనిర్వహణ, మతగురువుల ధర్మశాస్త్ర విషయాలు చూడటంలో, న్యాయవిమర్శలు చేయడంలో నిమగ్నమయ్యాను. ప్రతిదిన ఆరాధనను ఉచ్చరించడం మహాగొప్ప సవాలుగా ఉండేది. అది నాలో గంభీరమైన భావాలను, భావోద్రేకాలను సృష్టించింది, ఎందుకంటే పదేపదే రక్తం లేని క్రీస్తు బలిని, లేదా రొట్టె ద్రాక్షారసం అకస్మాత్తుగా క్రీస్తు శరీరం, రక్తంగా మార్పుచెందుతాయని విశ్వసిస్తూ జరిపే ఆచరణ, లేదా మతగురువులు కాథోలిక్కు చట్టప్రకారంగా, క్రమంగా ఆచరించాల్సిన భూసంబంధ ప్రభురాత్రి సంస్కార “మంత్రం”పై నేను విశ్వసించలేదు.
రెండవ వాటికన్ కౌన్సిల్ సమయంలో, ఈ “మంత్రానికి” సంబంధించి అలజడి చెలరేగింది. డచ్ కాథోలిక్ ప్రధాన బిషప్‌ల నడిపింపుగల విశాలహృదయులు కేవలం “ప్రాముఖ్యత”కే అంటే రొట్టె, ద్రాక్షారసం అనేవి కేవలం క్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని సూచిస్తాయనే దానికే మద్దతునిచ్చారు. మరొకప్రక్క, అతినిష్ఠాపరులైన కాథోలిక్‌లు, ఇటాలియన్ ప్రధాన బిషప్‌ల నడిపింపుతో “వస్తురూపాంత”రాన్ని అంటే, ఆరాధన జరిగేటప్పుడు “సంస్కారానికి సంబంధించిన పదాలు” వల్లించడం ద్వారా రొట్టె, ద్రాక్షారసం అనే పదార్ధాలు, వాస్తవమైన, నిజమైన క్రీస్తు శరీరం, రక్తంగా మారతాయని దృఢంగా వాదించారు. అందుకే ‘హాలెండ్‌లో రొట్టె, ద్రాక్షారసం తప్ప అన్నీ మార్పుచెందుతాయి, గాని ఇటలీలో రొట్టె, ద్రాక్షారసం తప్ప ఏమీ మార్పుచెందవు’ అనే సామెత ఉంది.
నేను చర్చినుండి వేరయ్యాను
క్రీస్తును గూర్చి, ఆయన సువార్తను గూర్చి అలా తప్పుగా తెలియజేయడం వల్ల, దేవున్ని మహిమపర్చాలని, ప్రజలను రక్షించాలనే నా గురి అబద్ధ బోధలమూలంగా విలువలేకుండా పోయినందుకు, నేను ఎంతో నిరుత్సాహపడి, కలతచెందాను. కాబట్టి, చివరకు నేను జూలై 1974లో నిరవధిక శెలవు కొరకు అడిగి, క్రియాశీల పరిచర్యకు రాజీనామా చేశాను. బైబిలు ఆధారంలేని యాజకధర్మానికి చేసిన ప్రమాణాలనుండి మినహాయింపు కొరకు అడగడం నాకు తర్కవిరుద్ధంగా, అనంగీకారంగావుంది. ఫలితంగా, నేను జూలై 1974 నుండి 1984 డిశంబరు వరకు ఏ మతంతో కూడ సంబంధం లేకుండా ఏకాకిగా ఉన్నాను. నేను మరేయితర క్రైస్తవ మతమండలితో కూడ సహవసించలేదు ఎందుకంటే త్రిత్వము, ఆత్మ అమర్త్యమైనది, యథార్థవంతులైన ప్రజలందరు పరలోకంలో నిత్యజీవం పొందడం, నిత్యమూ మండే అగ్నిగుండంలో శిక్షించడం అనే తలంపులకు విరుద్ధమైన నా నిర్ణయాలను అవి అంగీకరించలేదు. ఈ మతసిద్ధాంతాలు అన్యమతసిద్ధాంతాల నుండి వచ్చినవే అని నేను దృష్టించాను.
హృదయంలో సంతోష, సమాధానాలు
మతసంబంధంగా నా ఏకాకితనం 1984 డిశంబరులో అంతమయింది. అలాస్కాలో యాంకరిజ్ వాణిజ్య విభాగంలో జమాలెక్కలు స్వీకరించే మేనేజరుగా పనిచేయడంవల్ల, బార్బరా లెర్మా అనే వినియోగదారిణితో అనేక సరకుల వెలల జాబితాలను గూర్చి చర్చించాల్సి వచ్చింది. ఆమె “బైబిలు పఠనానికి” వెళ్లాలని చెప్పి, చాలా కంగారుగా వుంది. “బైబిలు పఠనం” అనే మాట నన్ను ఆకట్టుకుంది, దాంతో నేను ఆమెను కొన్ని బైబిలు ప్రశ్నలడిగాను. ఆమె సరైనరీతిలో, నైపుణ్యంతో నాకు లేఖనాధార సమాధానాలిచ్చింది, అవి నా స్వంత నిర్ణయాలకంటే బాగా తగినట్లున్నాయి. నాకు అనేక ప్రశ్నలుండటం బార్బరా గమనించి, అలాస్కాలోని యెహోవాసాక్షుల బ్రాంచిలోవున్న జెరాల్డ్ రాంకో అనే ఆయనతో పరిచయం చేసింది.
ఆ తర్వాత జరిగిన ప్రోత్సాహకరమైన బైబిలు సంబంధిత చర్చలు నా హృదయంలో సంతోష, సమాధానాలను తెచ్చాయి. ఇలాంటి దేవుని ప్రజల కొరకే నేను వెదకుతూ ఉన్నాను. నేను మార్గంకోసం దేవున్ని ప్రార్థించాను, తగినకాలంలో నేను బాప్తిస్మంపొందని సువార్తికునిగా యెహోవాసాక్షులతో సహవసించడం ఆరంభించాను. నేను (1969, 1971, 1974లో) ఐక్యరాజ్యసమితి చర్చి పారిస్‌కి సహాయక పాస్టర్‌గా పనిచేసిన మన్హాటన్ హోలీ ఫ్యామిలీ చర్చికి కేవలం కొన్ని మైళ్లదూరంలోనే అంటే న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఈ సంస్థ ప్రధానకార్యాలయాలు ఉన్నాయని తెలుసుకుని నేను నిజంగా ఆశ్చర్యపోయాను.
సత్యాన్ని తెలుసుకోడానికి నా కుటుంబానికి సహాయపడుట
యెహోవాసాక్షులతో ఆరు నెలలు సహవసించిన తర్వాత 1985 జూలైలో యాంకరిజ్ నుండి పెన్సిల్వేనియాకు తరలివెళ్లాను. ఇక్కడ యెహోవా రాజ్యమును గూర్చిన సువార్తను మా అక్క కూతురైన మిలెనె మెందాన్యేతో పంచుకునే ఆధిక్యత నాకు లభించింది, ఆమె స్క్రాంటన్ యూనివర్సిటీ నందు జీవరసాయనశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేస్తుంది. నేను యెహోవాసాక్షుల గురించి వెతుకుతున్నానని మిలెనేకు తెలియడంతో ఆమె ఆశ్చర్యపోయింది, ఎందుకంటే యెహోవాసాక్షులనేవారు మతవిశ్వాసంపై ఆధారంలేని ఒక మతవిభాగం మాత్రమేనని ఆమె అపార్థం చేసుకుంది. మొదట్లో ఆమె ఏమీ అనలేదు ఎందుకంటే ఆమె నన్ను మామగాను, మతగురువుగాను గౌరవించింది, నా చదువు, పాస్టరు సంబంధంగా నేను సాధించిన వాటి విషయంలో ఆమెకు చాలా గౌరవముంది.
ఆ తర్వాత ఆదివారం, మిలెనె ఆరాధన కొరకు కాథోలిక్ చర్చికి వెళ్లింది, నేను బైబిలు ప్రసంగం, వాచ్‌టవర్ పఠనం కొరకు రాజ్యమందిరానికి వెళ్లాను. ఆరోజు సాయంత్రమే ఆమె కాథోలిక్ జెరూసలెమ్ బైబిల్ నేను న్యూవరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్ పట్టుకుని మేమిద్దరం చర్చించుకున్నాం. నేనామెకు ఆమె బైబిల్లో యావె అనే పేరును దానికి సమానమైన యెహోవా అనే పేరును న్యూవరల్డ్ ట్రాన్స్లేషన్లోను చూపించాను. దేవునికి ఒక నామమంటూ ఉందని, ఆయన మనలను ఆ పేరుతోనే పిలువమంటున్నాడని ఆమె తెలుసుకుని ఉప్పొంగిపోయింది. త్రిత్వము, ప్రతి రోజు ఆచరించే ప్రభురాత్రి సంస్కారం, ఆత్మ అమర్త్యమైంది, అనే మతసిద్ధాంతాలు లేఖనాధారమైనవి కావని కూడా చెప్పి, నేను తగిన లేఖనాలు చూపించాను. ఆమె ఎంత ఆశ్చర్యపోయిందో!
పరదైసు భూమిపై నిత్యము జీవించే నిరీక్షణ గూర్చి నేను చెప్పినప్పుడు మిలెనె ఆసక్తి యింకా పెరిగింది. ఇంతకు క్రితం ఆమె తాను చనిపోయిన తర్వాత తనకేమౌతుందోనని ఆలోచించింది. ఆమె నేరుగా పరలోకానికి వెళ్లేంత పవిత్రురాలు కాదని తలంచింది, అయినా తాను నిత్యాగ్నిలో శిక్షించబడేంత దుష్టురాలని ఆమె తలంచలేదు. కాబట్టి, ఆమె మనస్సులో వున్నది కేవలం ఆమెను పరలోకానికి పంపడానికి అవసరమైన ప్రజల ప్రార్థనలు, ఆరాధనలు కొరకు ఆమె సహనంతో వేచియుండాల్సిన తత్సమానమైన పర్గేటరీ మాత్రమే. అయినను, నేను పరదైసు భూమిపై నిత్యజీవ నిరీక్షణను గూర్చిన అనేక లేఖనాలు ఆమెకు చూపి, వివరించిన తర్వాత ఆమె ఈ అద్భుతమైన సువార్తను గూర్చి నేర్చుకోడానికి ఆసక్తి చూపింది. మిలెనె నాతో పాటు రాజ్యమందిరానికి కూటాలకు హాజరైంది. మేము స్థానిక సాక్షులతో సరైన బైబిలు పఠనం తీసుకోవడానికి ప్రారంభించాము. కొద్దికాలం తర్వాత, 1986 మే 31న మేమిద్దరం యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాము.
మా కుటుంబం, ప్రాముఖ్యంగా మా పెద్ద అన్నయ్య నేను మతగురువుగా విరమించుకున్నానని తెలిసి చాలా చింతించాడు. ఆయన మా అక్కయ్యను సంప్రదిస్తే, ఆమె “దీని గురించి మనం గాబరా పడాల్సిన పనిలేదు, ఎందుకంటే ఆలినియో తన 43 సంవత్సరాలు కష్టపడి చేసిన పనిని ఊరకే సరైన కారణం లేకుండానే విడిచిపెట్టడు” అంటూ ఆయన్ని నెమ్మదిపర్చింది. మీరా, ఆమె కుటుంబం అమెరికాలోని విస్కొన్సిన్లో 1987 సెప్టెంబరులో నాతోపాటు కలిశారు. లేఖనాధారంలేని అనేక కాథోలిక్ మతసిద్ధాంతాలను, ఆచారాలను వాటి వాస్తవికతను వారికి చూపడంలో నాకంత కష్టమనిపించలేదు. వారు బైబిలు సత్యాలను నేర్చుకొనుటలో చాలా ఆసక్తిగా ఉన్నారు. వెంటనే, నేను, మిలెనె, కలిసి వారితో బైబిలు పఠనం ప్రారంభించాము. వారు ఫ్లోరిడాలోని ఓర్లాండోకు వచ్చిన తర్వాత వారి పఠనం కొనసాగించారు.
మేమంతా అనుభవించిన సంతోష, సమాధానాలు దేవుని రాజ్య సువార్తను కెనడాలోని టొరాంటోలో నివసిస్తున్న జెస్సీ లోబొ అనే మా పెద్ద అక్కతో పంచుకోడానికి దోహదపడ్డాయి. ఆమెకు 1983లో సాక్ష్యమివ్వబడింది. అయినను, ఆమె తమ్ముడు మతగురువైయుండగా తన విశ్వాసాన్ని ఏదీ మార్చలేదని నమ్మింది. మొదటిగా యెహోవాసాక్షులతో సంభాషించిన తర్వాత నాలుగు సంవత్సరాలకు, నేను యెహోవాసాక్షినయ్యానని, మీరా మరియు ఆమె కుటుంబం సువార్తీకులయ్యారని తెలుసుకొంది, దాంతో ఆమె ఒక సాక్షిని కలువగా ఆయన వెంటనే బైబిలు పఠనం ఏర్పాటుచేశాడు. జెస్సీ 1990 ఏప్రిల్‌లో బాప్తిస్మం పొందింది; మీరా, నా బావ ఆజ్వెల్డ్, నా అక్క కూతురైన గ్గినిస్ 1991 ఫిబ్రవరి 2న బాప్తిస్మం పొందారు. మహోన్నతుడైన యెహోవాను సేవించుటలో వారు చాలా సంతోషిస్తున్నారు.
కాథోలిక్ చర్చిలోని సాంప్రదాయ సిద్ధాంతాలనే పట్టుకు వ్రేలాడేవారు, వారికి విరుద్ధంగా పోరాడేవారు కూడ నిజంగా చాలా మేధావులే. వారు దేవుని చిత్తం చేస్తున్నామని విశ్వసిస్తారు. అయినను, మనం “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తుంద”నే వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. (2 కొరింథీయులు 4:4) కనుక ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమనేది స్పష్టమే. (1 కొరింథీయులు 3:18, 19) ఆయన వాక్యంలోని ఖచ్ఛితమైన జ్ఞానం ద్వారా యెహోవా “బుద్ధిహీనులకు జ్ఞానం” కల్గిస్తున్నందుకు నేనెంతో కృతజ్ఞుడను, సంతోషిస్తున్నాను కూడ.—కీర్తన 19:7.
కాథొలిక్ మతగురువుగా నేను చేసిన 19 సంవత్సరాల సేవ కేవలం గతించిన విషయం. ప్రస్తుతం నేను ఒక యెహోవాసాక్షిని. యెహోవా మార్గాల్లో నడవడం, ఆయన కుమారుడును మన రాజు రక్షకుడైన యేసుక్రీస్తును అనుసరించడమే నా కోరిక. సత్యదేవుడైన యెహోవా మహిమార్థమై, ఇతరులు కూడా పరదైసు భూమిలో నిత్యజీవమనే బహుమానం పొందడానికి అర్హులయ్యేలా యెహోవాను తెలిసికొనుటకు నేను యితరులకు సహాయపడాలని ఆశిస్తున్నాను.—ఆలినియో డీ శాంతా రీటా లోబొ చెప్పాడు. (g93 9/8)
[అధస్సూచీలు]
a చర్చి చట్టపరమైన మతసిద్ధాంతాలపై పరిశోధన చేస్తుండగనే, నేను సాలెమాంకెను వదిలివచ్చాను, 1968లో ఆ పరిశోధనను అందజేశాను.
b కాథోలిక్కు న్యూ అమెరికన్ బైబిలులో, ఈ లేఖనభాగం యిలా చెబుతుంది: “నేను నీతో చెప్పేదేమంటే, నీవు ‘బండవు,’ ఈ బండపైనే నేను నా మందిరాన్ని కడతాను . . . భూమిపై నీవు బంధించమని చెప్పిన ప్రతిదీ పరలోకంలోను బంధింపబడును; నీవు భూమిపై విప్పుమని చెప్పిన ప్రతిదీ పరలోకంలోను విప్పబడును.”—పేజి 23లోని బాక్స్ చూడండి.
[21వ పేజీలోని బాక్సు]
రాజ్య తాళపుచెవి
యేసు మతనాయకులను గద్దిస్తూ చెప్పిన మాటలను పరిశీలిస్తే, “పరలోక రాజ్యం యొక్క తాళపుచెవులు,” వాటి భావం స్పష్టమౌతుంది: “మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొనిపోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను.” (లూకా 11:52) ఇంకనూ మత్తయి 23:13 ‘ప్రవేశం’ అంటే “పరలోకరాజ్యము”లోనికి ప్రవేశాన్ని సూచిస్తున్నదని విశదమౌతుంది.
పేతురుకు యేసు వాగ్దానం చేసిన తాళపుచెవులు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి ఆయా వ్యక్తులకు ప్రత్యేక అవకాశాన్ని తెరచే అపూర్వ విద్యావిషయక పనిని ఏర్పరచాయి. ఈ ఆధిక్యతను పేతురు మూడు సందర్భాల్లో అంటే యూదులకు, సమరయులకు, అన్యులకు ఉపయోగించాడు.—అపొస్తలుల కార్యములు 2:1-41; 8:14-17; 10:1-48; 15:7-9.
ఆ వాగ్దాన లక్ష్యమేమంటే, పేతురు పరలోకంలో ఏమి బంధింపవలెనో లేదా బంధించకూడదో లేదా విప్పవలెనో అనే విషయంలో అధికారం చెలాయించుటకు కాదుగాని, పేతురు మూడు ప్రత్యేక పనుల కొరకు వాటిని పరలోక సాధనంగా ఉపయోగించుటయే ఆ వాగ్దాన ఉద్దేశం. అలా ఎందుకంటే యేసు సంఘానికి నిజమైన శిరస్సుగానే ఉన్నాడు.—1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 4:15, 16; కొలొస్సయులు 2:8-10; హెబ్రీయులు 8:6-13, పోల్చండి.
[22వ పేజీలోని చిత్రం]
ఆలినియో డీ శాంతా రీటా లోబొ ప్రస్తుతం ఒక సాక్షి