కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 11/8 పేజీ 23
  • దైవిక తలిదండ్రులను ప్రశంసించుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవిక తలిదండ్రులను ప్రశంసించుట
  • తేజరిల్లు!—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • తల్లిదండ్రులారా, యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • పిల్లలకు క్రమశిక్షణ ఎలా ఇవ్వాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • యెహోవాను మహిమపర్చే పెళ్లిని ఎలా చేసుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 11/8 పేజీ 23

దైవిక తలిదండ్రులను ప్రశంసించుట

తమ పిల్లలను దైవభయం గల వయోజనులుగా తీర్చిదిద్దే తలిదండ్రులు వారు చేసే కృషి ఫలించినపుడు ఎంతో తృప్తిచెందుతారు. అలా మంచిగా పెంచబడినందుకు వారి పిల్లలు ప్రశంసను వ్యక్తం చేసినప్పుడు కూడా వారు చాలా ఆనందిస్తారు.

ఒక కుమారుడు, అతని భార్య కలిసి, తమ వివాహమైన తర్వాత వ్రాసినదే ఈ క్రింది లేఖ:

“ప్రియమైన అమ్మానాన్నలకు:

“ఆహా, మేమెక్కడ ప్రారంభించాలి? మా పెళ్లిరోజు మీరు చూపిన ప్రేమ, మద్దతు, ఉదారతనుబట్టి మిమ్మల్ని మేమెంతగానో మెచ్చుకుంటున్నామని చెబుతూ దీన్ని మొదలుపెడుతున్నాం. అది నిజంగా ఒక ప్రత్యేకమైన రోజు, అప్పుడు మీరు మాతో ఉండటం నిజంగా వెలకట్టలేనిది. అంతేకాకుండా, అది చాలదన్నట్లు, మీరు మా హనీమూన్‌ను ఎంతో సంతోషదాయకమగునట్లు సహాయంచేశారు. మీరు ప్రేమ, సహేతుకత కలిగినవారై, వేడుకనభిమానించే తలిదండ్రులుగా, ఎప్పుడూ అలాగే ఉంటున్నారనే దానికి పైన తెల్పినదంతా నిదర్శనం!

నేను ఇరుకునూ సంకుచితమైన మార్గంలోనే ఎందుకు ఉండగల్గానో మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే, యెహోవా యెడల నాకున్న ప్రేమతో పాటు, నేనెల్లప్పుడూ మీ యిద్దరి యెడల గొప్ప గౌరవం కల్గియున్నాను. మీ గద్దింపుతో కూడిన ఈ గౌరవం చాలా దృఢమైనది, ఇది నేను ఏదైనా చేసినప్పుడు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు గంభీరంగా ఆలోచించేటట్లు చేసింది. నేను దేవుని చిత్తం చేయుటలో నా జీవితంలో విజయం పొందానంటే, నిజంగా మీరు తదేకంగా చూపిన ప్రేమకు, నాకిచ్చిన గద్దింపుకు, యెహోవా యెడల, ఆయన సంస్థ యెడల మీకున్న శాశ్వత భక్తికి ఎంతో ఋణపడివున్నాను.

“మీ యిద్దరిని గూర్చి నేను నా చిన్ననాటి జ్ఞాపకాలను మరల జ్ఞాపకానికి తెచ్చుకుంటే, వాటన్నిటిని నేను జ్ఞాపకం చేసుకోలేకపోయినప్పటికి, నేను మాత్రం మీ అద్భుతమైన ప్రవర్తనను, ప్రాముఖ్యంగా యితరుల యెడల, యెహోవా యెడల మీరు చూపిన ప్రేమను మర్చిపోలేను.

“మేమిద్దరమూ మిమ్మల్ని మరీ, మరీ ప్రేమిస్తున్నాము.

“మీ కుమారుడు, కోడలు,

“ఎల్‌., డబ్ల్యు.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి