నా కుటుంబానికి రోగనిరోధక టీకాలు కావాలా?
“బిడ్డకు టీకాలు వేయించే సమయమిది,” అంటూ వైద్యుడు చెబుతున్నాడు. అది బహుశ పసివాడికి అశుభసూచక మాటగా వినిపించవచ్చు, అందుకు సాధారణంగా తలిదండ్రులు ధైర్యంగా చిరునవ్వుతో, అంగీకరించే విషయమే.
అయినను, ఈమధ్యనే, జనసమ్మతమైన యీ పిల్లలకు, పెద్దలకు సంబంధించిన రోగనిరోధక అలవాట్లను గూర్చిన ప్రశ్నలు ఉద్భవించాయి. ఏ రకమైన టీకాలు నిజంగా అవసరం? వాటివల్ల కలిగే దుష్ఫలితాలను గూర్చి ఏమిటి? రక్తం ఏవిధంగానైనా టీకాలమందు ఉత్పత్తి చేయుటలో యిమిడివుందా?
సంబంధిత క్రైస్తవ కుటుంబం పరిశీలించుటకు యివి మంచి ప్రశ్నలే. వీటి సమాధానాలు నేరుగా మీ పిల్లలు, వారి భవిష్యత్, అలాగే మీమీదను ప్రభావం కల్గివుంటాయి.
పూర్వరంగం
చాలా దేశాల్లో పోలియో భయాన్ని పూర్తిగా తొలగించిన మంచి ప్రభావం తగల టీకాలమందు 1950వ దశకంలో కనిపెట్టబడింది. ఈ ప్రభావవంతమైన టీకాలు వేసే పథకం ద్వారా 1980 వచ్చేసరికి మశూచికం మొత్తం ప్రపంచంనుండే నిర్మూలం చేయబడినట్లుగా ప్రకటించబడింది. “నయం చేయుటకన్న నిరోధించుటే మిన్న,” అన్నట్లుగా, ఇది బెంజామిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన మాటలను (ఏన్ ఔన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఈజ్ వర్థ్ ఎ పౌండ్ ఆఫ్ క్యూర్) అవునని నిశ్చయం చేసినట్లనిపించింది.
ఈనాడు, ధనుర్వాతం, పోలియో, డిఫ్తీరియా, కక్కువాయి దగ్గు (ఊపింగ్ కాఫ్) మొదలైన అనేక రకాల వ్యాధులను అరికట్టుటలో సాధారణంగా రోగనిరోధక పథకాలు ప్రభావశీలంగా ఉన్నాయి. అంతేకాకుండా, కొన్ని కారణాలవల్ల రోగనిరోధకశక్తి తగ్గినప్పుడు, వ్యాధి తిరిగి సోకినట్లు యిది చూపింది. కక్కువాయి దగ్గు ఒక దేశంలో అలాగే సంభవించింది.
ఈ రోగనిరోధకాలు చేసేదేమిటి? ప్రాథమికంగా, రెండు పద్ధతుల్లో ఒకటేమంటే, క్రిములు, వైరస్‌లతో సహా, పేథోజెన్స్ అని పిలువబడే వ్యాధిక్రిముల దాడిని నిరోధించడానికి అవి శరీర రక్షకాలకు సహాయమందిస్తాయి. మొదటి పద్ధతిని క్రియాశీలక రోగనిరోధకత అని అంటారు. ఈ సందర్భంలో టీకాలమందులో బలహీనమైన లేదా చనిపోయిన పేథోజెన్‌లను (లేదా వాటి విషాన్ని) కల్గివుంటుంది, అది శరీరానికి ప్రమాదం కల్గించని విధంగా సవరించబడుతుంది. అప్పుడు అసలైన రోగాన్ని ఎదిరించే నాశనకారి పరమాణువులు అంటే రక్తంలోని విరుగుడు పదార్ధాలను తయారుచేయడానికి, శరీరపు రోగనిరోధక రక్షక యంత్రాంగం ఉపక్రమిస్తుంది. అవి నిజమైన వ్యాధికారకాలతో పోరాడగలవు, అవి అలానే వృద్ధవ్వాల్సివుంటుంది. ఒకవేళ రోగనిరోధక టీకాలమందు వ్యాధిక్రిముల విష (టాక్సిన్) సారాన్ని కలిగివుంటే, అది టాక్సాయిడ్ అని పిలువబడుతుంది. ఒకవేళ యిది బలహీనమైన (పలుచని) సజీవ వ్యాధిక్రిములనుండి లేదా చనిపోయిన జీవులనుండి తయారుచేయబడితే, యిది టీకాలమందు (వాక్సీన్) అని పిలువబడుతుంది.
మీరు ఊహించగల్గినట్లుగా, ఈ టీకాలమందులు తక్షణ రోగనిరోధకశక్తినివ్వవు. శరీరానికి రక్షక విరుగుడు పదార్ధాలను తయారు చేయడానికి కొంత వ్యవధి పడుతుంది. చురుకైన ఈ రోగనిరోధకాలలో సాధారణ టీకాలుగా పరిగణించిన పసిబిడ్డలకిచ్చే టీకాలమందు, ఇంజక్షన్‌లు యిమిడివున్నాయి. ఒకటి తప్ప (తర్వాత చర్చించబడింది), మిగతావన్నింటి తయారీలోను ఏ దశలో కూడ రక్తం ఉపయోగించబడదు.
వేరే పద్ధతిని బయటి రోగనిరోధకత (పాసివ్ ఇమ్యునైజేషన్) అంటారు. ఇది సాధారణంగా ఒక వ్యక్తి పిచ్చికుక్క కరిస్తే వచ్చే రాబిస్‌వంటి గంభీరమైన వ్యాధికి లోనైనప్పుడు, మాత్రమే ఉపయోగించబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో, శరీరానికి స్వయంగా రోగనిరోధకశక్తిని నిర్మించడానికి సమయం సరిపోదు. కాబట్టి వ్యాధిసోకిన వ్యక్తి శరీరంలోని వ్యాధిక్రిములతో పోరాడేందుకు, వేరేవాళ్ల శరీరంలో ముందుగానే తయారు చేయబడ్డ విరుగుడు పదార్ధాలను ఎక్కించవచ్చును. గామాగ్లోబ్యులిన్, యాంటిటాక్సిన్, హైపెరిమ్యూన్ సీరమ్ అనేవి రోగనిరోధక మానవులరక్తంనుండి లేదా జంతువులనుండి తీసిన సారంతో ఉత్పత్తి చేయబడ్డ టీకాలమందుల పేర్లు. ఎరువుగా తెచ్చిన లేదా బయటి రోగనిరోధకతలు ఆక్రమించిన సూక్షక్రిములతో పోరాడేందుకు, శరీరానికి తక్షణ సహాయం అందించడానికి ఉద్దేశింపబడ్డాయి, కాని ఇవి తాత్కాలికమైనవే. ఈ ఎరువుగా తెచ్చిన విరుగుడు పదార్ధాలు తొందరలోనే శరీరంనుండి అన్య ప్రోటీనులుగా బహిష్కరించబడతాయి.
నా బిడ్డ టీకాలమందు వేయించుకోవాలా?
ఈ ఆధారం యిచ్చినప్పటికి, కొందరు యింకా యిలా తలంచవచ్చు, ‘నా బిడ్డ యే రకమైన రోగనిరోధక టీకాలు వేయించుకోవాలి?’ శిశువుల టీకాలమందు బాగా లభ్యమయ్యే ప్రపంచంలోని చాలా దేశాల్లో, వాడుకగా యిచ్చే రోగనిరోధకాలు పసిపిల్లల రోగాలను చాలవరకు తగ్గించాయి.
చాలా సంవత్సరాలుగా అమెరికా శిశుచికిత్సా అకాడమీ, ప్రపంచంలో అదే స్థాయికి చెందిన యితర సంస్థలతో సాధారణ ఒప్పందం కల్గి డిఫ్తీరియా, కక్కువాయిదగ్గు, ధనుర్వాతం మొదలైన రోగాలకు మామూలు రోగనిరోధకాలను సిఫారసు చేసింది. ఈ మూడూ సాధారణంగా కలిపి, ఒకే టీకాగా యివ్వబడతాయి—డి పి టి—మూడు ఉత్ప్రేరక (అదనపు బలంగల) డి పి టి టీకాలతో కలిపి కనీసం రెండు మాసాల వ్యవధుల్లో యివ్వబడతాయి. అదేగాక మరొకదాన్ని, దద్దుర్లు, గవదబిళ్లలు, పొంగు (జర్మన్ మీజిల్స్) రోగనిరోధకాలను ఒకే—ఎమ్ ఎమ్ ఆర్—టీకాగా ఒక సంవత్సరం వయస్సున్న పిల్లలకిస్తారు. అంతేకాకుండా, డి పి టి వలే నిర్ణీతకాలంలో పోలియో చుక్కలమందు (ఒ పి వి) నాలుగు సార్లు యిస్తారు.a
కావలసిన ఉత్ప్రేరకాల సంఖ్య వేర్వేరుగా ఉన్నప్పటికి, చాలా ప్రాంతాల్లో మామూలుగా యిచ్చే యీ టీకాలు తప్పనిసరియైనవి. ఇటీవల, చాలాసార్లు దద్దుర్లు రావడం వల్ల, కొన్ని పరిస్థితుల్లో అధికంగా దద్దుర్ల టీకాలకు సంబంధించిన ఉత్ప్రేరకాలను యివ్వడం జరిగింది. వివరాల కొరకు మీరు మీ ప్రాంతంలోని వైద్యుని కలవాల్సిన అవసరముండవచ్చు.
ఇది కాకుండా, ఊపిరితిత్తులకు సంబంధించిన వాక్సీన్ (న్యూమోవేక్స్) కూడా వుంది. పిల్లలకు, కొన్ని కారణాలవల్ల ప్రత్యేక న్యూమోనియా అనే శ్వాసకోశవ్యాధి వుందని అనుమానించిన పెద్దలకు కూడ ఇది జీవితకాల రోగనిరోధకశక్తి నిస్తున్నట్లుగావుంది.
శిశువులకిచ్చే మరొక వాక్సీన్ హిబ్ వాక్సీన్ అని పిలువబడుతున్నది. హీమోఫిలస్ అనే విషజ్వరం పిల్లల్లో ఉండే సాధారణ వ్యాధిక్రిములను ఎదుర్కోడానికి యివ్వబడుతుంది. ఈ క్రిమి శిశువుల్లో చాలా వ్యాధులను, ప్రాముఖ్యంగా మెదడువాపువ్యాధి అనే అత్యంత బాధాకరమైన వ్యాధిని కలుగజేస్తుంది. ఈ వాక్సీన్ సాధారణంగా ప్రమాదం లేనిదిగా గుర్తించబడింది, మరి శిశువులకిచ్చే టీకాలలో భాగంగా ఎక్కువగా సిఫారసు చేయబడుతున్నది.
అనుకోకుండా, ఇప్పటికీ కూడ పొంగువ్యాధికి మామూలుగా యిచ్చే రోగనిరోధకత ఏమీ లేదు. మరి మశూచికానికైతే యిక టీకాలు అందుబాటులోనే లేవు, ఎందుకంటే ముందు వివరించినట్లుగా, ప్రపంచ వ్యాప్తంగావున్న యీ టీకాల కార్యక్రమం, ఈ మరణకర రోగాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది.
దీనివల్ల వచ్చే దుష్ఫలితాలేమిటి?
రోగనిరోధకత మూలంగా వచ్చే దుష్ఫలితాల విషయమేమి? ఎక్కువ టీకాలవల్ల, తాత్కాలికంగా వచ్చే కన్నీళ్లు, హఠాత్తుగా బిడ్డ ఏడ్వడం తప్ప, దానికిమించి వచ్చే దుష్పరిణామాలు సాధారణంగా తక్కువే, తాత్కాలికమైనవే—యింకా తీవ్రమైతే ఒక రోజంతా జ్వరం రావచ్చు. అయినను, చాలామంది తలిదండ్రులు యీ టీకాలను గూర్చిన ప్రమాదాల యెడల చింతిస్తారు. ఒక వైద్య అధ్యయనం, పిల్లల ఆరోగ్యం గురించిన తలిదండ్రుల చింతలను సర్వే చేశారు, సర్వే చేయబడ్డ తలిదండ్రులలో 57శాతం మంది, రోగనిరోధకాల వలన వచ్చే దుష్ఫలితాలను గూర్చి కలత చెందారని కనుగొన్నారు.
ఇటీవల, కక్కువాయిదగ్గుకు సంబంధించిన డి పి టి అనే మూల పదార్థాన్ని గూర్చి గంభీరమైన ఆందోళన చెలరేగింది. ఈ వాక్సీన్ సాధించిన విజయం ఫలితంగా క్రితం భయంపుట్టించిన రోగం చెప్పుకోదగినంతగా తగ్గిపోయింది—ఈ వాక్సీన్ రాకముందు కేవలం ఒక్క దేశంలోనే ఈ వ్యాధి 2,00,000 నుండి, వాక్సీన్ విస్తృతంగా ఉపయోగించిన అనంతరం 2,000లకు తగ్గిపోయింది. అయినప్పటికి, గంభీరమైన దుష్పరిణామాలు అనగా హఠాత్తుగా సంభవించే రోగాలు, మెదడు పాడైపోవడం అనేవి—1,00,000 సార్లు యిచ్చిన మందులో దాదాపు ఒకటి అలా సంభవించింది.
ఈ ప్రతిక్రియ చాలా అరుదైనప్పటికి, తమ పిల్లలు పాఠశాలకు వెళ్లే యోగ్యత రావాలంటే, వారికి టీకాలు వేయించడం తప్పదని కనుగొన్న చాలామంది తలిదండ్రులకు ఇది ఆదుర్దా కలుగ చేస్తుంది. ఎందుకంటే కక్కువాయిదగ్గు అనే వ్యాధి అసాధారణమైనప్పటికి, సమాజాన్ని పట్టుకుందంటే తుడిచేస్తుంది, సరాసరి బిడ్డకు “వ్యాధివల్ల వచ్చే బాధకంటే ఈ వాక్సీన్ చాలా క్షేమకరమైందని” నిపుణులు తీర్మానించారు. “క్రితం మందుపాళ్లు యిచ్చిన అనంతరం వణుకుడురోగం, మెదడుజబ్బు, నాడీవ్యవస్థ పనిచేయకపోవడం, లేదా హఠాత్తుగా శక్తిహీనం కావడం జరిగినప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో రోగనిరోధక మందు నివ్వవచ్చునని నిపుణులు సలహాయిస్తున్నారు. అలాగే శిశువు ‘మితిమీరి నిద్రించడం, మితిమీరి ఏడ్వడం (మూడు లేదా ఎక్కువ గంటలపాటు ఏకధాటిగా ఏడ్చినా లేదా గోలచేసినా), లేదా ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫారన్‌హీట్ (40.5 డిగ్రీల సెంటీగ్రేడ్) కంటే ఎక్కువైన యెడల,’ ఇక మందుపాళ్లను ఇవ్వకూడదు.”b
చాలా దేశాల్లో ఈ సమస్యకు నిజమైన పరిష్కారమేమంటే ప్రస్తుతం జపాన్‌లో చాలా మంచి ఫలితాలొస్తాయనే ఆశతో ఉపయోగించినటువంటి కణరహిత వాక్సీన్ ఉపయోగించడమే. ఈ నూతనమైన, బహుశ ప్రమాదరహిత వాక్సీన్ యితర దేశాల్లో కూడ లభ్యమౌతుంది.
ఇతర మామూలుగా శిశువులకిచ్చే టీకాలు కూడా పదేపదే ప్రభావవంతమైనవిగా, సాపేక్షంగా ప్రమాదరహితమైనవిగా నిరూపించబడ్డాయి.
వయోజనుల టీకాల విషయమేమి?
ఒకవ్యక్తి యుక్త వయస్సుకెదిగాడంటే, క్రియాశీలక రోగనిరోధకాలు చాలా కొద్దిగామాత్రమే ఉన్నాయని అతడు గుర్తుంచుకోవాలి. ఆదర్శంగా, వయోజనులంతా బాల్యంలో రోగనిరోధకాలు పొందినందువల్ల లేదా రోగాలకు లోనైనందువల్ల యిప్పటికే దద్దుర్లు, గవదబిళ్లలు, పొంగుకు మొదలైన వాటికి రోగనిరోధకశక్తి కల్గివుండాలి. అలాంటి రోగనిరోధకత విషయంలో అనుమానమున్నట్లైతే, ఎమ్ ఎమ్ ఆర్ టీకాలు వేయించుకోమని వైద్యుడు సలహా యివ్వవచ్చును.
టెటానస్ టాక్సాయిడ్ టీకాలు ప్రతి పదిసంవత్సరాల కొకసారి చేయించుకోవడమనేది ధనుర్వాతం రాకుండా అడ్డుకొనేందుకు ఒక మంచి యోచనగా పరిగణించబడింది. ముసలివాళ్లు మరియు దీర్ఘకాల వ్యాధితో బాధపడేవాళ్లు విషజ్వరం రాకుండా వార్షిక టీకాలు వేయించుకోవాలని కోరుకుంటే వైద్యుని సంప్రదించవచ్చు. విదేశాలకు వెళ్లేవారు కామెర్లు, కలరా, ప్లీహజ్వరం, టైఫాయిడ్, లేదా మహమ్మారి మొదలైన వ్యాధులు వారు వెళ్లే ప్రదేశానికే పరిమితమైయుంటే ఖచ్ఛితంగా రోగనిరోధకాలు తీసుకోవాలి.
వేరొక క్రియాశీల రోగనిరోధకాన్ని పరిశీలించాల్సివుంది, ఎందుకంటే యిదొక్కటి మాత్రమే రక్తంతో తయారుచేయబడిన రోగనిరోధక టీకామందు. అదే హెపటెక్స్-బి అని పిలువబడే హెపటైటిస్-బి వాక్సీన్. ఈ రోగనిరోధకమందు ఎరెవరైతే అనుకోకుండా హెపటైటిస్-బి వ్యాధిసోకిన రోగినుండి వచ్చిన రక్తంలోని పదార్థాలకు గురౌతారో, బహుశ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేటటువంటి కొందరు వ్యక్తుల కొరకు ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఒక ఉన్నతిచెందిన ఇదొక వాక్సీనని పొగడబడినప్పటికి, యిది తయారుచేయబడే పద్ధతి చాలామందికి భీతిని కలుగజేసింది.
ప్రాథమికంగా, రక్తంలో ఎన్నుకున్న హెపటైటిస్-బి వైరస్ కల్గియున్నవాటిని ఒకటిగా జోడించి, ఎటువంటి వైరస్‌నైనా చంపడాని కుపయోగింపబడతాయి, మరి ఒక రకమైన హెపటైటిస్-బి ఆంటీజెన్ తయారౌతుంది. శుద్ధీకరించబడిన, నిష్క్రియ గావించబడిన ఈ ఆంటీజెన్‌ను ఒక వాక్సీన్‌గా శరీరంలోకి ఎక్కించవచ్చును. అయినను, చాలామంది, వ్యభిచార రోగులనుండి తీయబడ్డ రక్తపదార్థాల యెడల భయంతో, ఈ వాక్సీన్‌ను తీసుకోడానికి నిరాకరిస్తారు. ఇంకనూ, యిది వేరొక వ్యక్తి రక్తం నుండి తీయబడిన కారణంగా మనస్సాక్షిగల క్రైస్తవులు కొందరు ఈ వాక్సీన్‌ను నిరాకరించారు.c
హెపటైటిస్-బి వాక్సీన్‌తో సమాన సామర్ధ్యమున్న వేరొక దానిని విడుదల చేయడంతో హెపటైటిస్ వాక్సీన్‌కున్న అభ్యంతరాలు పూర్తిగా మటుమాయమయ్యాయి. ఈస్ట్ కణాలలో ఉత్పత్తి చేయబడిన ఈ వాక్సీన్, మానవ రక్తం అవసరత లేకుండానే, జన్యుసాంకేతిక పరిజ్ఞానం ద్వారా తయారుచేయబడింది. మీరొకవేళ ఆరోగ్య సంరక్షక క్షేత్రాల్లో పనిచేస్తున్నట్లయిన, లేదా ఏవైనా కారణాలవల్ల హెపటైటిస్-బి వాక్సీన్ కొరకు ఎవరినైనా సంప్రదిస్తే, ఈ విషయాన్ని మీ వైద్యునితో చర్చించడానికి మీరు కోరుకోవచ్చును.
వాక్సీన్‌ల తయారీలో రక్తం
రక్తాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిషేధించిన బైబిలు యెడల లక్ష్యమున్న క్రైస్తవులకిది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను లేవదీస్తుంది. (అపొస్తలుల కార్యములు 15:28, 29) మరితర వాక్సీన్‌లేవైనా రక్తంతో తయారుచేయబడ్డాయా?
సాధారణంగా, హెపటైటిస్-బి తప్ప, మిగతా క్రియాశీల రోగనిరోధకాలు రక్తంనుండి తయారు చేయబడలేదు. ఉదాహరణకు, శిశువులకిచ్చే టీకాలు కూడ దీనిలో యిమిడివున్నాయి.
బయటి రోగనిరోధకశక్తి విషయంలో మరొకటి సత్యం. ఒకవేళ తుప్పుపట్టిన మేకును తొక్కినతర్వాత లేదా కుక్క కరచిన తర్వాత, ఒక వ్యక్తికి టీకాలు వేయించుకోమని సలహా యిచ్చినప్పుడు, టీకాలు (అవి వాడుకగా యిచ్చే ఉత్ప్రేరకాలు తప్ప) అత్యంత రోగనిరోధకశక్తిగల సీరమ్ అని, రక్తాన్నుపయోగించి తయారు చేయబడినవని ఊహించవచ్చు. ఆర్ హెచ్ ఇమ్యూన్ గ్లోబులిన్ (రోగామ్) విషయంలో యిది నిజమే, యిది తరచూ ఆర్ హెచ్ పాజిటివ్ శిశువు జన్మించినప్పుడు, కొన్ని కారణాలవల్ల ఆర్ హెచ్ పాజిటివ్ రక్తానికి గురైన ఆర్ హెచ్ నెగెటివ్ తల్లికి యివ్వబడుతుంది.
రక్తాన్ని గూర్చిన వివాదంలో ఈ బయటి రోగనిరోధకశక్తులు ఆందోళనకరంగా ఉన్నవిగనుక, మనస్సాక్షిగల క్రైస్తవుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది? ఈ పత్రికలోను, దీని సహపత్రికలోను క్రితం శీర్షికలలో, ది వాచ్‌టవర్ స్థిరమైన నిర్ణయాన్ని వివరించింది: ఈ చికిత్సను తనకొరకు, తనకుటుంబం కొరకు అంగీకరించాలా వద్దా యనేది, బైబిలు శిక్షిత మనస్సాక్షిగల ప్రతి క్రైస్తవునిపై ఆధారపడివుంది.d
నా కుటుంబానికి రోగనిరోధక టీకాలు కావాలా?
క్రైస్తవులు జీవితంయెడల అత్యంత గౌరవం కల్గియున్నారు, మరి యథార్థంగా వారి కుటుంబం యొక్క ఆరోగ్యం కొరకు శాయశక్తులా కృషిచేయుటకు యిష్టపడతారు. మీరు మనస్సాక్షిపూర్వకంగా మీ కుటుంబం రోగనిరోధక టీకాలు పొందాలా లేదా అనేది మీ వ్యక్తిగత నిర్ణయమైయుంది.—గలతీయులు 6:5.
ఒక నిపుణుడు ఈ విషయాన్ని బాగా సంగ్రహించి యిలా చెప్పాడు: “తమ పిల్లలకు సంబంధించిన ప్రతి వైద్య చికిత్సను గూర్చి తలిదండ్రులకు తెలియజేయాల్సి వుంటుంది. వారు చట్టబద్ధమైన సంరక్షకుల కంటే ఎక్కువే. వారిపై ఆధారపడివున్న జీవితకాలంలో వారి సంతానాన్ని సంరక్షించి, కాపాడే బాధ్యత తలిదండ్రులదే.” రోగనిరోధకానికి సంబంధించిన ఈ విషయంలోను, అలాగే యితర వైద్యానికి సంబంధించిన విషయాల్లోనూ, యెహోవాసాక్షులు ఈ బాధ్యతను చాలా గంభీరంగా తీసుకుంటారు.—ఒక వైద్యునిచే అందించబడింది. (g93 8/8)
[అధస్సూచీలు]
a ప్రపంచంలో చాలా దేశాల్లోని శిశువులకు హెపటైటిస్ బికు విరుద్ధంగా మామూలు రోగనిరోధకాల నివ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం సిఫారసు చేస్తుంది.
b హఠాత్తుగా రోగం సంభవించిన పూర్వీకులుగల కుటుంబాల్లో కూడ హెచ్చుగా ప్రతిక్రియలు జరిగినట్లు కన్పించడంలేదు. మరి ఊపిరితిత్తుల అంటువ్యాధులు ప్రతిక్రియలకు అనుకూలంగానున్నట్లు కన్పించకపోయినప్పటికి, బిడ్డ కొద్దిగా నీర్సంగా వుంటే టీకాలు వేయించకపోవడం మంచిది.
c ది వాచ్‌టవర్ జూన్ 1, 1990 “పాఠకులనుండి ప్రశ్నలు” చూడండి.
d ది వాచ్‌టవర్ జూన్ 15, 1978, పేజీలు 30-1 చూడండి.
[26వ పేజీలోని బాక్సు]
రక్తంలేకుండా తయారుచేయబడిన రోగనిరోధకాలు
శిశువుల టీకాలు (డి పి టి, ఒ పి వి, ఎమ్ ఎమ్ ఆర్)
హెచ్ ఐ బి వాక్సీన్
న్యూమోవెక్స్
టాక్సాయిడ్స్
విషజ్వరపు టీకాలు
రీకాంబివేక్స్-హెచ్ బి
రక్తంనుండి తయారుచేయబడిన రోగనిరోధక టీకాలు
హెప్టావేక్స్-బి
రోగామ్
యాంటీటాక్సీన్స్
యాంటీవెనిన్స్ (పాము, సాలీడు విషం కొరకు)
ఇమ్యూన్ గ్లోబ్యులిన్స్ (వివిధ రోగాలకు)
గామా గ్లోబ్యులిన్
అత్యంత రోగనిరోధకతగల సీరమ్‌లు (ఉదాహరణకు కుక్కకాటుమందు)