వేధించే తలిదండ్రులే—అసలు ఒత్తిడితెచ్చేది
“పిల్లలకు ప్రపంచజ్ఞానం లేనందువల్ల, తమను గూర్చి, యితరులను గూర్చి వారు ఇంట్లో నేర్చుకున్న విషయాలే విశ్వవ్యాప్తమైన నిజాలుగా వారి మనస్సులో బాగా నాటుకుపోతాయి.”—డా. సూసన్ ఫార్వర్డ్
ఒక కుండను చేయాలంటే నిరాకార మట్టిముద్దకు సరైన పాళ్లలో నీళ్లు కలిపి, కుమ్మరి ఒక అందమైన పాత్రగా రూపించగలడు. అలాగే, తలిదండ్రులు కూడా పిల్లవానికి తననుగూర్చి, లోకాన్నిగూర్చి ఉన్న దృక్పథాన్ని రూపించవచ్చును. ప్రేమ, నేతృత్వం, గద్దింపులతో పిల్లవాడు ఒక స్థిరమైన వయోజనుడుగా వృద్ధియౌతాడు.
అయినప్పటికి, తరచూ వేధించే తలిదండ్రులద్వారా పిల్లవాని మనస్సునందు, హృదయమందు ముద్రలు వేయబడతాయి. ఉద్రేకపూరిత, భౌతిక, లైంగిక దురాచారాలు వక్రాలోచనలను సృష్టించి, అవి వారిలో దృఢంగా నాటుకుపోతాయి, ఇక వాటిని పునఃనిర్మించడం చాలా కష్టమౌతుంది.
భావోద్రేక వేదన
కొన్నిమాటలు బాణాల్లా గుచ్చుకోగలవు. “నాకు జ్ఞాపకమున్నంత వరకూ, నేను పుట్టకపోతే బాగుండేదని [నా తల్లి] చెప్పని రోజంటూ ఏదీ లేదు,” అని జేసన్ చెబుతున్నాడు. కేరెన్ యిలా నిందించింది: “నేను చెడ్డదాన్నని, లేదా అంత మంచిదాన్ని కాదని పదేపదే సూటిగా అనేది.”
పిల్లలు సాధారణంగా వారికి విరుద్ధంగా చెప్పినదాన్నే నమ్ముతుంటారు. ఒకవేళ పిల్లవాణ్ని పదేపదే మూర్ఖుడని పిలిస్తే, చివరకు తాను మూర్ఖుడనే భావిస్తాడు. ఒక అమ్మాయిని పనికిరానిదానా అని అంటే, ఆమె అలాగే నమ్ముతుంది. పిల్లల దృక్కోణం నిర్ధిష్టంగానే వుంటుంది, తరచూ ఏది ఖచ్ఛితమైందో, ఏది అసూయతో పెద్దదిచేసి లేదా తప్పుగా చెప్పబడిందో గ్రహించలేరు.
భౌతికంగా కొట్టడం
భౌతికంగా కొట్టే తన తండ్రిని జోయ్ ఈ విధంగా గుర్తుకు తెచ్చుకుంటున్నాడు: “ఆయన నన్ను గోడకు పెట్టి గుద్దడం మొదలుపెట్టేవాడు. నా కండ్లు బైర్లు కమ్మేంత గట్టిగా నన్ను కొట్టేవాడు. . . . ఆ సందర్భంలో మరింత నొప్పించే విషయమేమంటే, ఆయనలా ఉద్రేకంతో నిండిపోడానికి కారణమేమిటో అర్థమయ్యేది కాదు!
జాక్ అస్తమానం తన తండ్రిచేత తన్నులు తినేవాడు. జాక్‌కు కేవలం ఆరు సంవత్సరాల వయస్సున్నప్పుడు అలాంటి ఒక సందర్భంలోనే, తన చేయి విరిగింది. “నేను నా సహోదరీలనుగాని మా నాన్నను అమ్మనుగాని నేనేడ్వటం చూడటానికి ఒప్పుకోలేదు, నాకు అదొక్కటే మిగిలింది,” అంటూ జాక్ గుర్తుకు తెచ్చుకుంటున్నాడు.
స్ట్రాంగ్ ఎట్ ది బ్రోకెన్ ప్లేసెస్ అనే పుస్తకం సూచించేదేమంటే, బాల్యదశలో భౌతికంగా కొట్టడాన్ని “ప్రతిదినమూ, ప్రతీవారమూ కారు ప్రమాదంలో చిక్కుకోవడంతో” పోల్చవచ్చును. అలా కొట్టడం పిల్లవానికి నేర్పేదేమంటే ప్రపంచమంతా సురక్షితమైంది కాదు, ఎవరినీ నమ్మకూడదు. ఇంకా, దౌర్జన్యం తరచూ దౌర్జన్యానికే దారితీస్తుంది. “ఒకవేళ పిల్లలను తమను వేధించే వారినుండి రక్షించకపోతే, పిల్లల బారినుండి సమాజాన్నే రక్షించాల్సివస్తుంది,” అంటూ టైమ్ పత్రిక హెచ్చరిస్తుంది.
లైంగిక దౌర్జన్యం
ఒక అంచనా ప్రకారం, ముగ్గురు ఆడపిల్లల్లో ఒకతె, ఏడుగురు మగపిల్లల్లో ఒకడు వారికి 18ఏండ్లు నిండే లోపునే లైంగిక అనుభవాన్ని పొందేందుకు బలవంతం చేయబడుతున్నారు. ఈ పిల్లల్లో చాలామంది లోలోపలే కుమిలిపోతున్నారు. “తప్పిపోయిన సైనికుల వలే, దౌర్జన్యం చేయబడిన పిల్లలు భయము, దోషము అనే ఒక బాహ్యారణ్యంలో సంవత్సరాల తరబడి తప్పిపోతారని” ది చైల్డ్ ఇన్ క్రైసిస్ అనే పుస్తకం సూచిస్తుంది.
“నన్ను దౌర్జన్యం చేస్తున్నందుకు నా తండ్రిని నేనెంతో ద్వేషించాను, అలా ద్వేషించినందుకు నేనెంతో పాపం చేసినట్లుగా భావించాను,” అంటూ లూయిజ్ చెబుతున్నది. “నేనలా సిగ్గుపడింది ఎందుకంటే సాధారణంగా ఒక బిడ్డ తలిదండ్రులను ప్రేమించాలి, నేనలా ఎల్లప్పుడూ నా తలిదండ్రులను ప్రేమించేదాన్ని కాదు.” బిడ్డను సంరక్షించేవాడే దుష్కార్యం చేస్తే అలాంటి గాభరాపెట్టే భావాలు రావడం సమంజసమే. బెవెర్లే ఎంజెల్ ది రైట్ టు ఇన్నోసెన్స్ అనే పుస్తకంలో యిలా ప్రశ్నిస్తున్నది: “ప్రేమించి సంరక్షించవలసిన మన స్వంత తండ్రే, మన యెడల అంత నిర్లక్ష్యంగావుంటే మనమెలా దానిని సహించగలం?”
లైంగిక దౌర్జన్యం కూడ ఒక బిడ్డ జీవన దృక్పథాన్నంతటినీ పాడుచేస్తుంది. “బాల్యంలో లైంగిక దురాగతానికి గురై పెరిగి పెద్దవారైన ప్రతి వ్యక్తి ఇప్పుడు యోగ్యతలేదని, పనికిరామని, పూర్తిగా చెడిపోయామనే నిరాశాభావాలతో ఉన్నవారు,” అని డా. సూసన్ ఫార్వర్డ్ వ్రాస్తున్నది.
అది ఊరకే పోదు
“వేధించబడింది లేదా అలక్ష్యం చేయబడింది కేవలం పిల్లవాని శరీరమే కాదు,” అంటూ పరిశోధకురాలైన లిండా టి. సాన్‌ఫోర్డ్ వ్రాస్తున్నది. “కష్టాల్లోనున్న కుటుంబాలు పిల్లవాని మనసును వేధిస్తాయి.” భావోద్రేకంగా, భౌతికంగా, లేదా లైంగికంగా బాధించినప్పుడు, ఆ బిడ్డ ఆడపిల్లైనా, మగపిల్లైనా ప్రేమించబడ్డంలేదని, పనికిరాననే భావాలతోనే ఎదుగుతుంది.
ముందుగా వివరించిన జేసన్ అలాగే పెద్దవాడనే స్వగౌరవం కోల్పోయినవాడై ఆత్మహత్య చేసుకునే వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అనవసరంగా జీవితాన్ని ప్రమాదంలోదించే పరిస్థితుల్లో తనకుతాను మునిగిపోయి, ‘నీవు పుట్టకుండా ఉంటే బాగుండేది’ అని అతని తల్లి అతనికి నేర్పించినట్లుగా తన జీవితానికి తక్కువ విలువకట్టాడు.
పిల్లవానిగా నున్నప్పుడు భౌతికంగా దెబ్బలుతిన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, జోయ్ యిలా చెబుతున్నాడు: “నీవు ఇల్లు వదిలిపెట్టిపోయినా లేదా వివాహం చేసుకున్నా తిన్న దెబ్బల ప్రభావం ఊరకేపోదు. నేనెప్పుడూ ఏదొకదాని నిమిత్తం భయపడతాను, అలా భయపడుతున్నందుకు నన్ను నేనే అసహ్యించుకుంటాను.” భౌతికంగా హింసించే కుటుంబీకులలో వున్న ఉద్రిక్తత, పిల్లలు ఎదిగిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుందని చాలామంది పిల్లలు తలంచేలా చేస్తుంది, అలాంటి కర్కషమైన ఆంక్షలు సంరక్షించే బదులు బంధించేస్తాయి.
కానే అనే ఆవిడ వావితప్పి చేసిన వ్యభిచారం తాను ఎదిగిన తర్వాత తనలో ఒక వక్రస్వరూపాన్ని సృష్టించింది, అది ఆమెలో పాతుకుపోయింది: “ప్రజలు నా ఆంతర్యాన్ని చూడగల్గుతూ నేనెంత అసహ్యమైనదాన్నో చూచే సమయాన్ని గురించి, నేనింకా ఎంతగానో ఆలోచిస్తాను.”
అన్ని రకాల దౌర్జన్యాలు కూడా విషపూరిత పాఠాలను నేర్పుతాయి, అవి వయస్సొచ్చే సమయానికల్లా లోతుగా పాతుకుపోగలవు. నిజమే, నేర్చుకున్న వాటిని మర్చిపోగలం. బాల్యదశలో బాధలనుండి బ్రతికి బయటపడి కోలుకున్న లెక్కలేనంతమంది ఈ వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు. కాని తలిదండ్రులకు బిడ్డ జన్మించినప్పటి నుండి కూడ వానిని గూర్చి, ఈ లోకాన్ని గూర్చి అతని యోచనలన్నింటిని బాల్యం నుండికూడ సరిచేయాలని గుర్తెరిగితే ఎంత బాగుంటుంది. ఒక పిల్లవాని భౌతిక, భావాత్మక సంక్షేమం ఎక్కువగా అతని తలిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది.
[7వ పేజీలోని చిత్రం]
కొన్నిమాటలు దెబ్బలకంటె ఎక్కువగా బాణాల్లా గుచ్చుకోగలవు