చిన్నారులు, గంభీరమైన ఒత్తిడిలు
“నిశ్చయంగా చిన్నారుల బాధలు చిన్నవే, మరి చిన్నారులు చిన్నవారే.”—అని పర్సే బిస్ షెల్లీ అంటున్నాడు.
ఈ క్రిందనున్న టోపీ బొమ్మను చూడండి. ఈ టోపీని మొదట చూచినప్పుడు టోపీ అంచులకంటే దాని ఎత్తు ఎక్కువగా నున్నట్లు కన్పించవచ్చును. అయినప్పటికి, వాస్తవానికి ఎత్తు వెడల్పు రెండూ కూడ సమానమే. కొలతలు తప్పుగా నిర్ణయించి చెప్పడం చాలా సులభం.
అలాగే పెద్దలు పిల్లవానికి కల్గిన ఒత్తిడియొక్క పరిమాణాన్ని తప్పుగా నిర్ణయించి చెప్పడం కూడ సులభమే. ‘పిల్లల సమస్యలు చాలా స్వల్పమైనవి,’ అంటూ కొందరు వాదిస్తారు. కాని ఈ ఆలోచన వట్టి భ్రమే. “పెద్దలు ఇబ్బందులను వాటి పరిమాణాన్నిబట్టి కాదుగాని, అవి తెచ్చే బాధనుబట్టే నిర్ణయించాలి,” అంటూ చైల్డ్‌నెస్! అనే పుస్తకం హెచ్చరిస్తున్నది.
అనేక సందర్భాల్లో ఒక పిల్లవాని బాధలోని తీవ్రత పెద్దలు గుర్తించదగిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. తమ పిల్లల భావాత్మక స్థితిని అంచనా వేయండని పెద్దలను అడిగిన ఒక అధ్యయనం ద్వారా ఇది నిజమని నిరూపించబడింది. దాదాపు అందరూ కూడ తమ పిల్లలు “చాలా సంతోషంగా” ఉన్నారని సమాధానమిచ్చారు. అయినను, పిల్లలను తమ తలిదండ్రులు లేని సమయంలో ప్రశ్నించగా, చాలామంది పిల్లలు తమంతటతాము “అసంతోషంగాను,” “దుఃఖంతోను” ఉన్నామని వివరించారు. వారిని తమ తలిదండ్రులు అల్పంగా చూస్తారనే భయపడుతున్నారు.
డాక్టర్ కాయొరు యామమోటొ జరిపిన మరొక అధ్యయనంలో, ఒక గుంపు పిల్లలను వారి జీవితంలో జరిగిన ఒత్తిడికి సంబంధించిన 20 సంఘటనలను ఒత్తిళ్లకుగల కారణాల ఆధారంగా వివరించమని అడిగాడు. ఆ తర్వాత ఒక గుంపు పెద్దలు కూడ, అవే సంఘటనలను పిల్లలెలా వివరిస్తారో తెలుపండని ప్రశ్నింపబడ్డారు. పెద్దలు 20లో 17 సందర్భాలను తప్పుగా తీర్మానించారు! “మన పిల్లలను గూర్చి మనకు తెలుసని మనమంతా తలుస్తాము, కాని తరచూ మనం నిజంగా వాళ్లను ఇబ్బందిపెట్టేదేమిటో చూడము, లేదా వినము, అర్థం చేసుకోముకూడ” అని డా. యామమోటొ ముగింపులో చెప్పాడు.
తలిదండ్రులు జీవిత అనుభవాన్ని నూతన దృక్పథంతో చూడటానికి నేర్చుకోవాలి: అంటే పిల్లవాని దృక్కోణం ప్రకారం చూడాలి. (బాక్స్‌ను చూడండి.) ప్రాముఖ్యంగా ఈనాడు ఇది చాలా ఆవశ్యకమైనది. బైబిలు ముందుగానే ప్రవచించిందేమంటే, “అంత్యకాలాల్లో అత్యంత ఒత్తిడితో కూడిన అపాయకరమైన కాలములు వచ్చును. . . . వ్యవహరించుటకు, సహించుటకు కష్టము.” (2 తిమోతి 3:1, ది ఆంప్లిఫైడ్ బైబిల్) పిల్లలు అలాంటి ఒత్తిడిని ప్రతిఘటించలేకపోతున్నారు; తరుచూ, వారే దాని ముఖ్యగురి. పిల్లల ఒత్తిళ్లలో కొన్ని కేవలం “యౌవన కాలంలో సంభవించేవే” అయినప్పటికి, మరికొన్ని చాలా అసాధారణమైనవి, మరి వాటికి ప్రత్యేకమైన అవధానం అవసరమే.—2 తిమోతి 2:22.
[5వ పేజీలోని బాక్సు]
పిల్లవాని దృక్కోణం ప్రకారం చూడటం
తలిదండ్రుల మరణం = నేరం. తల్లి లేదా తండ్రితో కోపగించిన సందర్భాలను పిల్లవాడు జ్ఞప్తికి తెచ్చుకుని, వారు చనిపోవడానికి తానే బాధ్యుడనని కుమిలిపోతాడు.
విడాకులు = విడిచిపెట్టడం. ఒకవేళ తలిదండ్రులు ఒకరికొకరు ప్రేమించుకోవడం మాని, వారు తనను కూడా ప్రేమించడం మానేస్తారేమోనని హేతుబద్ధంగా తలుస్తాడు.
త్రాగుబోతుతనం = ఉద్రిక్తత. క్లాడియ బ్లేక్ యిలా వ్రాస్తుంది: “త్రాగుబోతుల యింటిలో ఉండే భయం, విడచిపెట్టబడటం, త్యజించడం, పొసగకపోవడం, మరి దౌర్జన్యమే జరిగే లేదా జరుగబోయే వాతావరణమున్న ఇల్లు కార్యశీలమైన మంచి వాతావరణంతో కూడినది కానేకాదు.”
తలిదండ్రుల కొట్లాట = భయం. తలిదండ్రుల కొట్లాటలు చాలా ఒత్తిడికల్గించేవిగా ఉన్నాయని, తత్ఫలితంగా పిల్లలకు వాంతులు వచ్చినట్లనిపించడం, ముఖంమీది నరాల చంచలత, వెంట్రుకలు ఊడిపోవడం, బరువు తగ్గడం లేదా పెరగడం, యింకా పుండ్లు ఏర్పడతాయని 24మంది విద్యార్థులతో జరిపిన అధ్యయనం బయల్పరచింది.
మితిమీరిన కార్యసిద్ధి = నిష్పృహ. పిల్లలు ఎటుబోయినా, వారి కొరకు పెద్దలు ఏర్పాటు చేసిన విరామంలేని పోటీలో ప్రాణరక్షణ కొరకు పరుగెడుతున్నట్లుగా కన్పిస్తారు” అని మేరీ సూసన్ మిల్లర్ వ్రాస్తుంది. పాఠశాలలో, ఇంట్లో, ఆట్లాడే సమయంలో కూడా ఒక మంచి స్థానం పొందాలని పిల్లవాడు ఒత్తిడి చేయబడతాడు, వాడెన్నడూ విజయం సాధించడు, పందెం ఎన్నడూ ముగియదు.
క్రొత్తగా జన్మించిన సవతిబిడ్డ = పోగొట్టుకొనడం. ప్రస్తుతం తలిదండ్రుల అవధానం, ఆప్యాయతలను పంచుకొనేందుకు, ఒక తోబుట్టువును సంపాదించుకున్నాడనే తలంపుకంటే తల్లి లేదా తండ్రినే కోల్పోయానని అనుకోవచ్చును.
పాఠశాల = విడిచి వెళ్తున్నాడనే మనస్తాపం. అమీ తన తల్లిని విడిచిపెట్టి, పాఠశాలకు వెళ్లడమనేది చచ్చేంతపనిగా భావిస్తుంది.
పొరపాట్లు = అవమానం. పిల్లలు వారికున్న అస్థిరబుద్ధితో, “కొన్ని విషయాలను ఉన్నదానికంటే చాలా గంభీరమైన సమస్యలుగా దృష్టిస్తారని” డా. యాన్ ఎప్‌స్టిన్ చెబుతున్నది. అవమానమే పిల్లలు ఆత్మహత్య చేసుకోడానికిగల అత్యంత సర్వసాధారణ కారణమని ఆమె కనుగొన్నది.
అంగవైకల్యతలు = నిష్పృహ. కనికరంలేని మిత్రుల హేళనతోపాటు, భౌతికంగా లేదా మానసికంగా అంగవైకల్యుడైన పిల్లవాడు, అతని సామర్థ్యతకు మించి నిరుత్సాహాన్ని వ్యక్తంచేసే ఉపాధ్యాయుల, కుటుంబ సభ్యుల అసహనాన్ని బహుశ ఓర్చుకోవలసి వుంటుంది.
[4వ పేజీలోని చిత్రం]
పాతకాలపు టోపీ