కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 8/8 పేజీలు 21-23
  • ఆరాధనా మందిరం దహించబడింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆరాధనా మందిరం దహించబడింది
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కఠోర వ్యవహారాన్ని సహించింది
  • అనేక ప్రాంతాలనుండి సహాయం
  • యెహోవా బలంతో దుర్ఘటనను ఎదుర్కొనడం
    తేజరిల్లు!—1996
  • “దేవుడు పక్షపాతి కాడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఆరాధనా స్థలాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 8/8 పేజీలు 21-23

ఆరాధనా మందిరం దహించబడింది

అక్టోబర్‌ 4, 1992, ఆదివారం మధ్యాహ్నం వేళ, కొరియా రిపబ్లిక్‌, వెన్జూలో ఉన్న రెండవ అంతస్థులోని చిన్న రాజ్యమందిరంలోకి ఒక ఉన్మాదుడు దూసుకువచ్చాడు. అది 90కంటే ఎక్కువ మంది ఆరాధికులతో క్రిక్కిరిసి ఉంది. “నా భార్యను బయటకు తీసుకురండి!” అని అతడు చాలాసార్లు అరిచాడు. అతని మాటలు విని, వెనుకనున్న అత్యవసర ద్వారంగుండా అతని భార్య వెంటనే వెళ్లిపోయింది.

అతడు ముఖ ద్వారం ఎదుటనున్న తివాచీ మీద ఒక డబ్బా పెట్రోలు పోశాడు. తర్వాత, అక్కడ ఉన్నవారు ఎంత వేడుకున్నా వినకుండా, తివాచీకి నిప్పంటించాడు. పెట్రోలు విరజిమ్మి మంటలను, నల్లటి పొగను పైకప్పు వేదికల వైపు ఉవ్వెత్తున లేపి, తర్వాత గదంతా వ్యాపింప జేసింది. కొద్ది క్షణాల వ్యవధిలోనే, ప్రేక్షకులలో చాలామంది మంటలలో చిక్కుకుపోయారు. ప్రతి కిటికీనుండి మంటలు, పొగ రేగుతున్నాయి.

చాలా మంది వెనుక ద్వారంనుండి లేదా కిటికీలగుండా క్రింది కిటికీ పైనుండే సన్నని కాంక్రీటుబల్ల మీదికి దూకి తప్పించుకున్నారు. అక్కడినుండి వాళ్లు ప్రక్కనున్న భవంతి పైకప్పు మీదకు వెళ్లి, ఆ తర్వాత క్రిందకు దిగారు. కొందరు రెండవ అంతస్థునుండే దూకేశారు. ఆ గృహదహనకుడు తాను తప్పించుకున్న తర్వాత, క్రిందకు దూకి గాయాలతో ఉన్న వారిని తిరస్కారంగా తన్నాడు.

ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఇస్తున్న ప్రయాణకాపరి, “త్వరపడండి, పిల్లల్ని రక్షించండి,” అని కేకవేశాడు. వారు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించకుండా ఉంటే ఆయనా, ఆయన భార్యా తప్పించుకొనుండే వారని బ్రదికి బయటపడ్డ వారు అనుకున్నారు. చనిపోయిన 15 మందిలో వీరూ ఉన్నారు; మొత్తం 26 మంది ఇతరులకు గాయాలు తగిలాయి. అటుతర్వాత ఆసుపత్రిలో మరణించిన ఇంకొకవ్యక్తి, వృద్ధులను బయటకు పంపడానికి సహాయం చేయడానికి తన ప్రాణాలకు తెగించాడు.

చనిపోయినవాళ్లు గదిలో ముందు కూర్చున్న వాళ్లే. ప్రయాణకాపరి ఆయన భార్య దట్టమైన పొగలో చిక్కుకుపోయి, ఊపిరాడక చనిపోయారు. చనిపోయిన వారిలో తొమ్మిది కుటుంబాల వారున్నారు; ముగ్గురు 3, 4, 14, ఏండ్ల పిల్లలు. ఇళ్లు ఇరుకుగా ఉన్నా, మంటల మూలంగా ముఖ ద్వారం నుండి బయటకు పోయే అవకాశం లేకపోయినా ఎక్కువ మంది చనిపోక పోవడం లేక గాయపడక పోవడం నిజంగా అద్భుతమే.

ఏడు ఫైర్‌ ట్రక్‌లతో, 30 మంది అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలానికి వచ్చారు, కాని మంటలు చెలరేగి అప్పటికే ప్రాణాలను బలిగొన్నాయి. మంటలు ఒక గంటలో ఆర్పివేయబడ్డాయి. అయితే, అగ్ని తీక్షణంగా ఉండడంవల్ల, మృతులను గుర్తుపట్టడం చాలా కష్టమై, రెండుగంటలకు పైగా పట్టింది.

తర్వాత వెన్జూ పోలీసులు నిప్పంటించిన వ్యక్తిని నిర్బంధించి, హత్య, గృహదహన నేరాలు మోపారు. పోలీసు నిర్భందంలో ఉన్నప్పుడు, అతడు ఆత్మహత్యా ప్రయత్నంచేసి విఫలుడయ్యాడు.

కఠోర వ్యవహారాన్ని సహించింది

గృహదహనకుని భార్యకు బైబిలు బోధయందు ఆసక్తి పెరిగినప్పుడు, ఆమెను భయపెట్టడం అతని అలవాటైపోయింది. యెహోవా సాక్షుల వెన్జూ సంఘాన్ని ప్రయాణ కాపరి సందర్శించడానికి ఇంచుమించు రెండు వారాల ముందు, సెప్టెంబరు మధ్యభాగంలో, గృహదహనకుడు తన భార్యను స్మారకంలేకుండా స్పృహ కోల్పోయేంతవరకూ కొట్టాడు. ఆమె కోలుకున్న తర్వాత, ఆమెపై లాక్యూర్‌ థిన్నర్‌ పోసి నిప్పంటించాడు. మంటలు మొదలవ్వగానే, తాను ఎంతపని చేశాడో తెలుసుకొని త్వరపడి మంటలు ఆర్పేసాడు.

ఆ విషాదకరమైన ఆదివారంనాడు, తన భార్యను రాజ్యమందిరానికి వెళ్లొద్దని దబాయించాడు. అతను కోపోద్రేకుడైనా, ఆమె భయపడలేదు. ఆరాధనకు సంబంధించిన ఈ విషయంలో దేవునికి తప్ప తన భర్తతో సహా ఏ మనిషికీ లోబడ కూడదని ఆమె భావించింది. (అపొస్తలుల కార్యములు 5:29; హెబ్రీయులు 10:24, 25) కావున ఆమె కూటాలకు హాజరయ్యింది.

రాజ్యమందిరాన్ని తగులబెట్టిన తర్వాత, భర్త తరపు వకీలు ఆమె తన మత మౌఢ్యాన్ని వదులుకోడానికి నిరాకరించినందున, ఆమె అతనికి విధేయురాలైన భార్యగా ఉండక పోయినందున తన భర్త ఈ అసహ్య కార్యానికి ఒడగట్టాడని తెల్పే ఒక వివరణపై సంతకం చేయమని ఆ స్త్రీని ఒత్తిడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఆమె ఆ వివరణపై సంతకం చేయలేదు. సత్యం విషయములో రాజీపడి, తాను బైబిలు పఠించడం మూలంగా ఈ భయంకర దుర్ఘటన జరిగిందని తెల్పుటకు ఆమె నిరాకరించింది.

ఆ దుర్ఘటన సంభవించిన తర్వాత వారాంతమున యెహోవా సాక్షుల ఒక సమావేశంలో, విశ్వసర్వాధిపతి అయిన యెహోవా దేవున్ని సేవించడానికైన తన సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకోవాలన్న తన నిర్ణయాన్ని నెరవేర్చుకుంది.—కీర్తనల 83:18.

అనేక ప్రాంతాలనుండి సహాయం

వెన్జూకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్‌సంగ్‌లోని యెహోవా సాక్షుల బ్రాంచీ కార్యాలయానికి ఈ దుర్ఘటన విషయం తెలియగానే, గాయాలు తగిలిన వారికి, వారి కుటుంబాలకు, అలాగే మృతుల కుటుంబ సభ్యులకు సహాయం పంపబడింది. ధనం సమకూర్చడమే కాకుండా ఇంకా ఏ సహాయం అవసరమౌతుందో నిర్ణయించడానికి బ్రాంచీనుండి క్రైస్తవ పెద్దలు పంపబడ్డారు.

సంఘాన్ని వెన్జూలోని వేరొక రాజ్యమందిరానికి తరలించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి, అవసరతలో ఉన్న వారికి ఇతర ఏర్పాట్లు చేయబడ్డాయి. కొరియా రిపబ్లిక్‌ అంతటా ఉన్న తోటి క్రైస్తవుల నుండి సహకారం లభించింది. వాస్తవానికి, దుర్ఘటన సంభవించిన వెంటనే చాలామంది ప్రజలు ఇతర పట్టణాలనుండి వచ్చి సహాయాన్ని అందించారు. 75 మంది సాక్షులు ఉన్న ఒక సంఘం 1,200 డాలర్లు విరాళం ఇచ్చింది, 87 మంది ఉన్న ఇంకొక సంఘం 2,200 డాలర్లు పంపడం విశేషము.

దుర్ఘటన సంభవించిన సంఘంలోని క్రైస్తవ పెద్దలు ఇతరులకు సహాయపడేందుకు తాము చేయగలిగిందంతా చేశారు, కాని అధికంగా నష్టపోయిన వారిలో వీరు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో సంఘాధ్యక్షుని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఇంకొక క్రైస్తవ పెద్ద తన కుమారున్ని పోగొట్టుకున్నాడు, మరింకొక పెద్దకైతే ముఖం చాలా మట్టుకు కాలిపోయింది. ఈ క్రైస్తవులు ఏది పోగొట్టుకున్నా, వారు మరియు సంఘమంతా కూడా నెమ్మదిగా ఉండి విశ్వాసంలో దృఢంగా నిలిచారు.

దుర్ఘటన సంభవించిన కొద్ది రోజుల తర్వాత, బ్రాంచీ కార్యాలయ ప్రతినిధి సామూహిక అంత్యక్రియలు జరిపాడు. తమ స్నేహితులపట్ల ప్రేమను, శ్రద్ధను చూపిస్తూ దేశమంతటినుండి చాలా మంది సాక్షులు హాజరయ్యారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని యెహోవా సాక్షుల అనేక బ్రాంచీ కార్యాలయాలవారు తమ సానుభూతిని తెలియజేసారు.

ప్రాంతీయ పోలీసు శాఖలోని రహస్య సమాచార విభాగాధికారి అంత్యక్రియలకు హాజరయ్యాడు, సాక్షుల ప్రవర్తననుబట్టి ప్రభావితం చెందాడు. వారు ఎంత శాంతంగా, నెమ్మదిగా ఉన్నారో, మంటల్లో నష్టపోయిన వారిపట్ల వారు ఎలా దయగా వ్యవహరిస్తున్నారో ఆయన గమనించాడు. బ్యూరో ఆఫ్‌ సొసైటీ అండ్‌ ఇండస్ట్రీ డైరెక్టరు కూడా అంత్యక్రియలప్పుడు ఉన్నాడు. తర్వాత, దేశమంతటినుండి వచ్చిన ప్రేమపూర్వక విరాళాల గురించి తెల్పినప్పుడు, విశ్వాసం లేకుండా ఇది సాధ్యం అయ్యుండేది కాదు అని ఆయన అన్నాడు. వెన్జూ ఉప నగరాధ్యక్షుడు కూడా నిజమైన ఆసక్తి చూపాడు. సాక్షుల ప్రశాంతతను, పరస్పర ప్రేమను, వ్యవస్థీకరించగల సామర్థ్యాన్ని బట్టి తాను వ్యక్తిగతంగా ప్రభావితం చెందానని ఆయన చెప్పాడు.

ఈ దుర్ఘటన మనం “అంత్యదినములలో [ఉండే] అపాయకరమైన కాలములలో” జీవిస్తున్నామనేదానికి ఇంకొక నిదర్శనమై ఉంది. (2 తిమోతి 3:1) ఇటువంటి భయంకరమైన సంగతులు జరుగుతాయని తెలిసికొని ఉండాలి. కాని వెన్జూలోని యెహోవా సాక్షులు నిరుత్సాహం చెందలేదు. వారు తమ అద్వితీయ సత్య దేవుడైన యెహోవా ఆరాధనలో కొనసాగడానికి నిశ్చయించుకొని, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటలో పట్టుదలకలిగి ఉండడానికి తీర్మానించుకున్నారు.—కొరియా రిపబ్లిక్‌లోని అవేక్‌! ప్రతినిధి నివేదిక. (g93 4/22)

[22వ పేజీలోని చిత్రాలు]

కుడివైపు: రాజ్య మందిరం, (క్రింద) కాలిపోయిన వేదిక అక్కడ చాలామంది చనిపోయారు

క్రింద: అగ్నిలో ఇద్దరు పిల్లలను పోగొట్టుకొని, తోటి సాక్షిచే ఓదార్పు పొందుత్తున్న సె-సాన్‌-ఓడ్‌ మరియు క్రైస్తవ పెద్ద అయిన షిమ్‌-హ్యో-సిన్‌ తన ఇద్దరు పిల్లలకూ గాయాలు తగిలాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి