విజ్ఞానశాస్త్రం 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోగలదా?
“భూమాత హద్దూపద్దూ లేని శ్రద్ధచూపని తన పిల్లలనిక ఎంతోకాలం భరించజాలదనడానికి ప్రస్తుతం కావలసినంత శాస్త్రీయాధారముంది.”—ది యూరోపియన్, మార్చి 19-25, 1992.
పర్యావరణ శాస్త్రవేత్తలు, భూమికి సంభవించే హాని ఏదోకుండలమోత అన్నట్టు కాకుండా, దాన్ని గంభీరమైనదిగా, శ్రద్ధచూపవలసిన అవసరమున్నట్లు అభిప్రాయపడుతున్నారు. నిజానికి, విపత్తు రాకుండా చూడాలంటే తక్షణచర్య చాలా ప్రాముఖ్యమని వారంటున్నారు. “పరిస్థితులను పరివర్తనం చేసే ప్రయత్నానికి మనకు తరాలేమీ లేవు, సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని” వరల్డ్‌వాచ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు 1980వ దశకాంతంలో చెప్పాడు.
ఈ 5000 డేస్ టు సేవ్ ది ప్లానెట్ అనే పుస్తక సంపాదకులు 1990లో వారి పుస్తకాన్ని ప్రచురించినప్పుడు యీ విషయాన్ని చాలా స్పష్టంగా తెల్పారు. అప్పటినుండి వారి లెక్కలు కొనసాగాయి. వారు చెప్పిన అంతిమ కొలమానం ప్రకారం భూగ్రహాన్ని కాపాడుకొనుటకు ఇప్పుడు మిగిలిన సమయం ఆ 4,000 రోజుల గడువు దగ్గరికి చేరుతుంది. ఇరవై ఒకటవ శతాబ్దం వచ్చేసరికి, ఈ మధ్యకాలంలో అసాధారణమైందేదైనా జరిగితేతప్ప, ఆ సంఖ్య 1,500 రోజులకు తగ్గిపోతుంది.
స్పష్టంగా కన్పిస్తున్న ఈ దుస్థితి ఏర్పడడానికి ఏ అసాధారణ పరిస్థితులు తోడ్పడ్డాయి? రాబోయే శతాబ్దం ఏ సవాళ్లెదుర్కోవలసి వుంటుంది?
సమస్యలకు కొదువ లేదు
ప్రచ్ఛన్నయుద్ధం సమసిపోయిందని శాంతిప్రియులు సంబరపడిపోతున్నారు. కాని సవాలుతో కూడిన ప్రపంచశాంతిని సాధించడం, కాపాడడం అంత సులభంకాదు. జనవరి 1990లో ఐరోపా సమైక్యతా సమస్యలను గూర్చి మాట్లాడుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మిటరాండ్ ఇలా చెప్పాడు: “అన్యాయపుదైనా స్థిరమైన ప్రపంచాన్ని విడిచి పోతున్నాము, అయితే మనం నిరీక్షించే లోకం న్యాయమైనదేగానీ నిశ్చయంగా అస్థిరమైనది.” అంతేకాకుండా ది యూరోపియన్ వార్తాపత్రిక ఇలా వ్రాసింది: “స్వాతంత్ర్య విలువ [మాజీ సోవియట్ సంయుక్త రాష్ట్రాలలో] పెరుగుచున్న అస్థిరత్వం అతికొద్దిపాటి అపాయమైనా అది అణుయుద్ధ అపాయాన్ని పెంచింది.”
ప్రచ్ఛన్నయుద్ధ ఆరంభంలో, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో కొన్ని నిజానికి తెలిసినవి కావు. ఇది 5000 డేస్ టు సేవ్ ది ప్లానెట్ వివరించినట్లుగా ఉంది: “ఈమధ్యే 50 సంవత్సరాల క్రితం కూడ ప్రపంచ వాతావరణం యింకా సమతూకంలో ఉండేది. . . . ప్రపంచం ఒక విశాలమైన, సుందరమైన, సామర్ధ్యమైన స్థలమైయుండేది; దాన్ని మనం ఏవిధంగా పాడుచేయగలిగాము? మన భూగోళం నాశనమార్గంలో వుందని దాన్ని మనం కలుషితం చేస్తున్నామని, భౌగోళిక మహావిపత్తుకు దాన్ని నడిపిస్తామని ఈనాడు మనకు తెలిసిందే.”
ప్రకృతి వైపరీత్యాలని పిలువబడే—వరదలు, తుఫానులు, భూకంపాలు, అగ్నిపర్వతాల ప్రేలుడు ప్రతిచోటా సంభవిస్తున్నాయి. పరిసరాలను మానవుడు పాడుచేయుటలో అతడెంతవరకు ఉత్తరవాది యనేది అనిశ్చయమే కావచ్చును. భూరక్షక ఓజోను పొర కొన్నిచోట్ల విపరీతంగా పల్చబడుతుందనుటకు ఆధారముంది. దుఃఖకర పరిస్థితులను కలుగజేయగల వాతావరణ మార్పులు క్రమంగా వచ్చేబదులు హఠాత్తుగా వచ్చిపడతాయని కొందరు శాస్త్రజ్ఞులిప్పుడు హెచ్చరిస్తున్నారు.
క్యాన్సరు, హృద్రోగాలు, రక్తప్రసరణలోని సమస్యలు, మరితర అనేక రోగాలు ఎంతోకాలంగా వైద్యరంగాన్నే సవాలు చేశాయి. సంవత్సరాల తరబడి వైద్యాభివృద్ధి జరుగుతునప్పటికి, ఈ వ్యాధులు ఇంకనూ ప్రజలను చంపుతున్నాయి. యూరపులోనే, ఒక దశాబ్దం క్రితం కంటె 65 శాతం ఎక్కువమంది, అంటే సంవత్సరానికి షుమారు 12,00,000 మంది క్యాన్సరువల్ల మరణిస్తున్నారు. క్యాన్సరుకంటే చాలా తక్కువమందిని బలితీసుకున్న సరిక్రొత్త వ్యాధియైన ఎయిడ్స్‌ను గూర్చిన అపోహనుబట్టి యీ అపార ప్రాణ నష్టానికి చాలావరకు గుర్తింపులేకుండా పోయింది.
మరొక సవాలేమంటే, ప్రపంచ జనాబా 200 సంవత్సరాలకంటే తక్కువ వ్యవధిలోనే, 100 కోట్లనుండి దాదాపు 550 కోట్లకు పెరిగింది. సాంవత్సరికాభివృద్ధి రేటు ఇటీవల తగ్గినప్పటికి, 2025వ సంవత్సరానికి ప్రపంచ జనాబా బహుశా 800 కోట్లు దాటుతుందని, బహుశా 2050వ సంవత్సరానికి అది 1,000 కోట్లకు చేరుతుందని కొందరి అంచనా. ఈ ప్రజలంతా ఎక్కడ జీవిస్తారు? వారేమి తింటారు? వందకోట్ల ప్రజలు ఇప్పటికే నిరుపేద జీవితాన్ని జీవిస్తున్నారని 1991లో యు.ఎన్. విడుదల చేసిన నివేదన అంచనా వేసింది, వారి జీవితాలు “మానవ ప్రతిభ యొక్క ఏ సహేతుకమైన నిర్వచనానికైనా అట్టడుగున ఉండేవిధంగా పోషకాహారలోపం, నిరక్షరాస్యత, వ్యాధికి మారుపేరుగా తయారయ్యాయి.”
అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జనసంఖ్యను గూర్చిన అధ్యయన ప్రొఫెసర్ పాల్ ఆర్. ఎర్లిక్ ఈ సమస్య గంభీరతను గుర్తించి, ఇలా చెబుతున్నాడు: “అత్యధిక జనసంఖ్య పేదదేశాలలోని ప్రజలను ఒకవైపు పేదరికంలో ముంచెత్తుతుంటే, ధనికదేశాలలోని అధిక జనసంఖ్య జీవాన్ని పోషించే భూగ్రహసామర్ధ్యాన్ని బలహీనపరుస్తుంది.”
ముందు పేర్కొన్నవి లేదా మాదకద్రవ్యాల వాడకం, చాలిచాలని గృహసదుపాయం, నేరం, జాతివైషమ్యాల వంటి మరితర కారకాలు సమీప భవిష్యత్తులో ఒక భూవ్యాపిత విపత్తును పురికొల్పగలవేమోననే సాధ్యతనుబట్టి నిజంగా ఆందోళన చెందవలసి వస్తుంది. సవాలు స్పష్టంగా ఉంది. దానినెలా ఎదుర్కోవాలనేది తెలియదు.
ఎదుర్కోడానికి మార్గాలను వెదకుట
అయినప్పటికి, ఈ సమస్య గంభీరత దృష్ట్యా, పెరుగుతున్న అవసరతనుబట్టి ప్రభుత్వాలు పరిష్కారాన్ని వెదుకుతున్నాయి. ఉదాహరణకు, రియో డి జానెయిరొలో గత జూన్మాసంలో క్రితమెన్నడూ లేనంతగా పరిసరాలకు సంబంధించిన అతిపెద్ద పర్యావరణ సమావేశం నిర్వహించబడింది. స్టాక్‌హామ్, స్వీడన్లో 1972లో జరిగిన పర్యావరణ సమావేశం తరువాత, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన నిర్వహించబడిన యీ సమావేశమే అతిపెద్దది. ఆ సమయంలో ప్రఖ్యాత జర్మను రాజకీయవేత్త ఇలా చెప్పాడు: “ఈ సమావేశం యీ భూగోళ భవిష్యత్ చరిత్రకే ఓ మలుపు కాగలదు.”
నిజంగా, 1972లో జరిగిన సమావేశం తలపెట్టిన లక్ష్యాలను సాధించలేదు. పంతొమ్మిది వందల డెబ్భైరెండు మరియు 1992లో జరిగిన రెండు సమావేశాలకూ ముఖ్య నిర్వాహకుడైన మోరిస్ ఎస్. స్ట్రాంగ్ ఈవిధంగా ఒప్పుకున్నాడు: “స్టాక్‌హామ్ సమావేశం జరిగినప్పటినుండి 20 సంవత్సరాలలో మేము నేర్చుకున్నదేమంటే, పరిసరాలకు సంబంధించిన సంస్థలకున్న ఒకేఒక ఉపకరణమైన పరిసరాల క్రమబద్ధీకరణ యనేది ప్రాముఖ్యమే కానీ అదొక్కటి మాత్రమే సరిపోదు. దీనితోపాటు మన ఆర్ధిక విధానాలలో ప్రాముఖ్యమైన మార్పులుకూడ జరగాలి.”
అయినను, 1992లో జరిగిన సమావేశం 1972లో జరిగినదానికంటే “ప్రాముఖ్యమైన మార్పులు” సాధించడంలో ఏమైనా ఎక్కువ విజయం పొందిందా? మరి పొందకపోతే, మన భూగ్రహం మరో 20 సంవత్సరాల్లో, అనగా 2012లో, మూడవ పర్యావరణ సమావేశం జరుపుకోగలదా?
అతిగొప్ప సవాలును ఎదుర్కొంటోంది
ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి మతానికి, రాజకీయాలకు ఉన్న సామర్ధ్యాన్ని ప్రజలందరూ సంశయిస్తున్నారు. మరి మతముకాకుండ, రాజకీయముకాకుండ, 21వ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్లను ఏది ఎదుర్కొన గలదు?
జర్మన్ ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీ ప్రచురించిన ఒక బ్రోషర్ ఈ ప్రశ్నకు యిలా వివరణ ఇస్తుంది. “ఈ సమస్యలను పరిష్కరించాలంటే మనిషి మూలంగా రాబోయే ఏ మార్పులనైనా తప్పించుకొనుటకు సహాయ పడటమేకాకుండా, భూగోళం యొక్క ప్రతికూల మార్పులను అరికట్టేందుకు కూడా సహాయపడగల్గే రాజకీయ యుక్తులు అవసరము. మనకెదురయ్యే సంక్లిష్ట సమస్యల దృష్ట్యా, దృఢమైన శాస్త్రీయ ప్రక్రియలు, నమ్మదగిన దీర్ఘదృష్టి మార్గదర్శక సూత్రాల మీద ఆధారపడి మాత్రమే అర్థవంతమైన రాజకీయ నిర్ణయాలు చేయవీలగును అంటే నాశనకరమైన, ఖర్చుతోకూడిన, లేదా ఆశించని మరియు ప్రమాదకరమైన పరిణామాలను తప్పించుకోవడానికి ఇదొక్కటి మాత్రమే మార్గమైనట్లు కనబడుతుంది. ఈ సమాచారమును అందించుట శాస్త్రీయ సమాజానికి మహాగొప్ప సవాలును విసురుతోంది.”
పూర్వము విజ్ఞానశాస్త్రం విపత్కర సవాళ్లనెదుర్కొంది. అయిననూ, కొంతమేరకు అది విజయం సాధించింది. ఇంకనూ, రాబోయే 21వ శతాబ్దపు ప్రత్యేక సవాళ్లను విజ్ఞానశాస్త్రం ఎదుర్కొనగలదా అని అడుగుట తప్పదు. మంచి రోజులొస్తాయనే ఆశ ఉందా?
ఈ గంభీరమైన విషయాలను చర్చించుటకు, అవేక్! పత్రిక కొన్ని అంశాల పరంపరలతో శీర్షికను ప్రారంభిస్తుందని ఆనందంగా ప్రకటిస్తున్నది. భాగం 1 దీని తరువాత వస్తోంది.
[4వ పేజీలోని చిత్రాలు]
కాలుష్యం, వ్యాధి, అధిక జనాబా గురించి విజ్ఞానశాస్త్రం ఏం చేయగలదు?
[Credit Lines]
WHO photo by P. Almasy
WHO photo by P. Almasy