కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 7/8 పేజీ 29
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకులనుండి
    తేజరిల్లు!—1993
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
తేజరిల్లు!—1993
g93 7/8 పేజీ 29

మా పాఠకుల నుండి

పిల్లలను పెంచడం “మీ పిల్లలకొరకు—అత్యంత మేలైన దానిని చేయుట” (జనవరి 8, 1993) అను శీర్షికల పరంపరలు ఒక తల్లిగా నా లోపాలను ఎత్తి చూపించినవి. నా అవధానాన్నంతా వ్యక్తిగత విషయాలు, సంఘ కార్యక్రమాలపైనే ఉంచడం ద్వారా, నా మూడు సంవత్సరాల వయస్సు గల కుమారుడు ఉపేక్షించబడ్డాడు. వాడు మరీ అల్లరి పిల్లవాడైపోయాడు. నేనూ విసుగు చెంది సులభంగా కోపం తెచ్చుకునే దాన్ని, వానికి ఆప్యాయాన్ని చూపడానికి సంశయ పడేదాన్ని. నా కొడుకును కౌగలించుకోవడానికి బదులు, నేను మరీ వాన్ని కట్టుదిట్టం చేశాను. యెహోవా మనందరిపై ఉదారంగా ప్రేమ కురిపిస్తాడు గనుక, యెహోవా నాకు అనుగ్రహించిన యీ స్వాస్థ్యమును ప్రేమతో ఆదరించడానికి నేనిప్పుడు ప్రయత్నిస్తాను.

టీ. టీ., జపాను

నేను తల్లిని కాకపోయినా, పిల్లలను ప్రేమిస్తాను, మరి ఈ శీర్షిక నా మనసును కదిపింది. పిల్లలు ఈనాడు ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చి తెలుసుకొని నేను ఏడ్చాను. రాబోయే సంవత్సరాలలో భయంకరమైన సమస్యలను ఎదుర్కొనకుండా ఉండటానికి ఈ సమస్యలను జీవితంలోని తొలి దశలోనే పరిష్కరించడానికి మీ శీర్షిక చాలా మంచి సమాచారాన్ని అందించింది.

ఎల్‌. బీ., అమెరికా

ఆ శీర్షిక తండ్రిగా నన్ను నేను పరిశీలించుకొనేలా చేసింది. నాకు వివాహం అయినప్పుడు, నేను చాలా యౌవనుడ్ని. నా కుటుంబంతో గాక నా స్నేహితులతో గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపేవాడ్ని. నా కూతురు కొరకు ఎక్కువ సమయాన్ని నేను వెచ్చించలేదని ఈ శీర్షికలు చదవడం ద్వారా నేను గ్రహించాను. తమ పిల్లల కొరకు అత్యంత మేలైన దానిని చేయడానికి ఈ శీర్షికలు తలిదండ్రులను పురికొల్పాలి.

ఏ. వీ., ఇటలీ

జంతు కథలు “కాపిబారా—సృష్టి అద్భుతమా లేక పొరపాటా” అనే శీర్షికకై మీకు వందనాలు (జనవరి 8, 1993). జంతువులను గూర్చిన శీర్షికలను నా పిల్లల కొరకు నేను తరచూ చదువుతుంటాను. అందులో కాపిబారా స్వయంగా మాట్లాడినట్లే ఉండడంతో, నా పిల్లలకు ఆ శీర్షిక చాలా నచ్చింది!

సీ. టీ., జపాను

అనేక పత్రికలు అందిస్తున్న చెత్త సమాచారంకన్న ఎంతో శ్రేష్టమైనది! నేను నా పిల్లలు దాన్ని కలిసి చదివాం. వేర్వేరు, కొత్త జంతువుల గురించి తెలుసుకొనడం సంతోషకరంగా ఉంది!

కె. హెచ్‌., అమెరికా

కన్నీళ్లు మా సంఘంలో చాలా సంవత్సరాలు పెద్దగా సేవ చేసిన ఒక నమ్మకస్థుడైన క్రైస్తవుని అంత్యక్రియలకు నేను ఈ మధ్యనే హాజరయ్యాను. శవపేటికను హాలులో నుండి బయటకు తీసుకుపోతున్నప్పుడు, నేను బహుగా ఏడ్చాను. కాని ప్రేక్షకుల్లో ఉన్న చాలామంది ఇతరులు మాత్రం, వాళ్ల భావాలను అదుపులో ఉంచుకున్నారు. ఆ మరునాడే, “కన్నీళ్లన్నీ ఎందుకు వస్తాయి?” అనే శీర్షికగల జనవరి 8, 1993, అవేక్‌! సంచికను నేను పొందాను. కన్నీళ్లు బలహీనతకు సూచన కాదు కానీ తీవ్రమైన భావాలను వ్యక్తపరచుటకు సూచనయని అర్థం చేసుకోడానికి అది నాకు సహాయం చేసింది. మంచి సమాచారమున్న శీర్షికకై చాలా వందనాలు.

ఎస్‌. జెడ్‌., జెర్మనీ

ప్రార్థన “యౌవనస్థులు ఇట్లడుగుదురు . . . దేవుడు నా ప్రార్థనలకు ప్రత్యుత్తరమిస్తాడా?” అనే శీర్షికకై మీకు వందనాలు (జనవరి 8, 1993) ఆ శీర్షిక చాలా సహాయకరంగా ఉంది. నా ప్రార్థనలలో వస్తుసంబంధ అల్ప కోరికలు కోరకూడదని అది నాకు నేర్పింది. దేవుడు ప్రతిసారి త్వరగా జవాబు చెప్పడు కనుక, నేను ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని కూడా నేర్చుకున్నాను. మనమనుకున్న జవాబు కూడా ఆయన మనకు ఇవ్వకపోవచ్చు.

బీ. జీ., అమెరికా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి