కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 7/8 పేజీలు 26-28
  • మనిషి తాబేలు కలిసేచోటు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనిషి తాబేలు కలిసేచోటు
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన మొదటి దృశ్యం
  • తాబేళ్లకు గుర్తు కట్టుట
  • గ్రుడ్లను వేరే స్థలానికి మార్చుట
  • మానవుడు శ్రద్ధతీసుకోవడం నేర్చుకోవాలి
  • సముద్రపు తాబేలు వార్షిక సందర్శన
    తేజరిల్లు!—1994
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1997
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
తేజరిల్లు!—1993
g93 7/8 పేజీలు 26-28

మనిషి తాబేలు కలిసేచోటు

ఆస్ట్రేలియాలోని అవేక్‌! ప్రతినిధిచే

సాధుచేయని సముద్ర తాబేలును కలుసుకోవాలంటే, అది ఇసుకలో క్రొత్తగా కట్టుకొన్న గూటిలో గ్రుడ్లు పెడుతున్న సమయం తగినది. ఆస్ట్రేలియాలోని ఎండతీవ్రతగల రాష్ట్రంలో క్వీన్స్‌లాండ్‌ ప్రాంతంవద్ద 1.5 కిలోమీటర్ల పొడవున్న మోన్‌ రెపోస్‌ అనే బీచ్‌ని సందర్శించటానికి మాతో రావటానికి మీరు ఇష్టపడతారా? మనం వెళ్లేది రాత్రిసమయంలో గనుక తీవ్రమైన ఎండవల్ల బాధపడవలసి వస్తుందని చింతించకండి. ఆ అద్భుతమైన విహారయాత్రకు సాయంత్రం ఎనిమిది నుండి మధ్యరాత్రి వరకు చాల అనువైన సమయం.

శిక్షణ పొందిన గైడుతో చిన్నగుంపుగా వెళ్లడం మంచిది ఎందుకంటే, మనం పెద్ద తల్లి తాబేలును చూసి ముట్టుకోవాలంటే చేయవలసినవి, చేయకూడనివి కొన్ని ఉన్నాయి. మేము అలల మూలంగా పడే గీతకుపైగా బీచ్‌ వెంబడి నడుస్తున్నప్పుడు గైడు ఫ్లాష్‌ లైట్లు ఆర్పివేయమని చెపుతుంది ఎందుకంటే వెలుగుకు తాబేళ్లు బెదరిపోతాయి. వెలుగు లేకుండా కూడ ఇసుకలో మీటరు వెడల్పున్న తాబేళ్ల జాడను స్పష్టంగా చూచి ఆశ్చర్యపోతాము.

తరువాత, ఆ ప్రాంతంలో ఉన్న సముద్రపు తాబేళ్లను గురించి మన గైడు మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతుంది. ఆస్ట్రేలియా జలాలలో ఆరు వేరువేరు జాతులున్నాయి, కాని ఇక్కడ బండెబర్గ్‌తీరం ముఖ్యమైన గూడుకట్టుకోనే ప్రాంతం కాని యీ మోన్‌ రెపోస్‌లో మాత్రం కేవలం నాలుగే జాతులు ఉన్నాయి. వాటి విస్తారతను బట్టి ఆ నాలుగు జాతులు ఏవనగా: లాగర్‌హెడ్‌ తాబేళ్లు (కారెట్టా కారెట్టా), ఫ్లాట్‌బ్యాక్‌ తాబేళ్లు (నాటాటోర్‌ డిప్రెస్సా), గ్రీన్‌ తాబేళ్లు (కెలోన్య మిడాస్‌), లెథర్‌బ్యాక్‌ తాబేళ్లు (డెర్‌మోకెలిస్‌ కోర్స్య).

మన మొదటి దృశ్యం

మనమొక పెద్ద తాబేలును చూసినప్పుడు చాల ఉత్తేజంగా ఉంటుంది. అది మునుపు చెప్పిన వాటిలో మొదటి జాతియైన లాగ్‌ర్‌ హెడ్‌కు చెందింది. నీటి నురగలో నుండి ఇసుకలో అలల మూలంగా పడే గీతకుపైగా ప్రాకి వస్తున్నప్పుడు మనం నిశ్శబ్దంగా గమనిస్తాము. సమీపానికి వెళ్లినప్పుడు అది, అక్కడున్న గడ్డిని తీసేసి ఇసుకలో రంధ్రం చేసుకున్నట్లు మనము గమనిస్తాము. పిల్లలు 7 నుండి 12 వారాలలో బయటికి వచ్చే సమయానికి వాటికి అడ్డుగా గూడుపైన గడ్డి పెరగకుండ అరికడుతుంది. ఇసుకను తన వెనక్కాళ్లతో—కుడికి తవ్వడం, ఎడంవైపుకి చిమ్మడం; ఎడంవైపు తవ్వడం, కుడికి చిమ్మడం, ఇలా మార్చిమార్చి తవ్వడం చిమ్మడం ద్వారా అది మామిడికాయ ఆకారంలో తన గూటిని తయారు చేస్తుంది. దీనికంతటికీ సుమారు 45 నిమిషాలు పడుతుంది.

ఈపాటికి అది అలికిడికి సులభంగా భయపడి నీళ్లలోకి వెళ్లిపోయేదే కాని అది గ్రుడ్లు పెట్టడం మొదలెట్టిందంటే మనం దాన్ని ముట్టుకోవచ్చు కూడా. అటవీశాఖాధికారిణి దానిపైకి వెలుగు ప్రసరింపజేసినప్పుడు మనకిష్టమైతే ఫోటోలు తీసుకోవచ్చు. తాబేలు 10 నుండి 20 నిమిషాలపాటు గ్రుడ్లు పెడుతూనే ఉంటుంది, గ్రుడ్లు పొదిగే సమయంలో వాటిని నాచు, క్రిముల నుండి కాపాడడానికి తేటగానున్న జిగురువంటి ద్రవాన్ని కూడ విడుస్తుంది. లాగర్‌హెడ్‌ తాబేళ్లు 14 రోజుల వ్యవధిలో ఒక్క సీజన్‌లోనే అనేకసార్లు, టేబుల్‌ టెన్నిస్‌ బంతుల పరిమాణంలో గ్రుడ్లు పెడతాయి. ఇది రెండు నుండి నాలుగు సంవత్సరాల తేడాతో సగటున ఒకొక్క సారికి 120 గ్రుడ్లను పెడుతుంది.

తాబేలును ముట్టుకుంటే దాని చర్మపు నునుపుదనానికి మనం నిజంగా ఆశ్చర్యపోతాము, అందుకే తాబేలు చర్మం అంత ప్రీతిపాత్రమైనది, దాని ఉనికికి ముప్పు కలుగజేస్తోంది. దాని పెంకు లేదా గుల్లను వెన్నెముక మరియు ప్రక్కటెముకలతో పోల్చవచ్చు. ఇప్పుడు అది గ్రుడ్లను కప్పడం మొదలెడుతుంది. గానీ అది సముద్రపు అలకు దగ్గరగా వాటిని పెట్టింది గనుక అవి బ్రతకాలంటే వేరే స్థలంలో వాటిని దాచిపెట్టాలి. మన గుంపుతో కలిసిన పరిశోధకుల గుంపుకు సంబంధించిన ఇద్దరు సభ్యులు దీన్ని చేస్తారు.

తాబేళ్లకు గుర్తు కట్టుట

సముద్రపు తాబేళ్లను గూర్చిన పరిశోధనలలో సహాయం చేయటానికి ఇప్పుడు మన తాబేలు ముందరి కాళ్లలో ఒకదానికి గుర్తు కట్టబోతున్నారు. అది ప్రతిచోట ఇసుకను చిమ్ముతూ వుంటుంది గనుక ఇలా కట్టడం అంత సుళువైన పనేమికాదు. గుర్తింపు చిహ్నాలు హరించుకుపోని లోహదాతువు మిశ్రమంతో చేయబడ్డాయి. ఆ గుర్తింపుకార్డు వెనుక అడ్రసుంటుంది. కనిపించిన తాబేళ్లన్నింటినీ లెక్కవేసి తెలియజేయడం పరిశోధన వ్యవస్థకు చాల అవసరం. తాబేలు చనిపోయినప్పుడు మాత్రమే ఆ గుర్తింపు చిహ్నాన్ని తీసివేసి దాని స్థలాన్ని గూర్చిన వివరాలు ఇస్తూ ఆ గుర్తింపు కార్డును తిరిగి అప్పగించాలి. గుర్తింపుచిహ్నానికి ముందరివైపు తాబేలు గుర్తింపు సంఖ్య ఉంటుంది. మన తాబేలు T54239, కాని దాన్ని మనం తబిత అని పిలుద్దాము.

తబితకు ఇంతకు మునుపు గుర్తింపుచిహ్నం కట్టబడలేదంటే అది మునుపెన్నడు గూడు కట్టుకోలేదు గనుక దక్షిణ పసిఫిక్‌లో తాబేళ్ల, వాటి గ్రుడ్ల భద్రతకు సహాయం చేయటానికి అవసరమయ్యే ముఖ్యమైన సమాచారాన్ని అది ఇవ్వగలదు. ఈ సమాచారం పొందడం కొరకు మనం ఇప్పుడు ఈ బీచ్‌వద్దనే తాబేలుకు చేయబోయే చిన్న శస్త్రచికిత్సను చూడబోతున్నాము. ఈ పద్ధతిని లాపరోస్కోపి అంటారు, సాధారణంగా ఇది మానవులకు ఉపయోగిస్తారు. తబితను మెల్లిగా చక్రాలబండిపై వెల్లకిలాతిప్పి పడుకోబెట్టారు. దాన్ని గురించి మనం బాధపడతాము కాని, దాని గొంతును మెల్లిగా నిమిరితే అది శాంతిస్తుంది. మనం చూసే అవి కన్నీళ్లు కావు కాని తన కళ్లల్లోనుండి ఇసుకను, తానుత్రాగిన సముద్రపు నీటివల్ల తయారైన అదనపు ఉప్పును తీసేసుకోడానికి కార్చే ఉప్పుద్రావకమే. ఆ ద్రవం నొప్పి మూలంగా వచ్చేదికాదు. దాని ముందరికాలి పైభాగపు చర్మాన్ని రుద్ది, తరువాత చిన్న రంధ్రం ద్వారా ఒక గొట్టాన్ని లోనికి పంపించి కొంచెం గాలి ఊదుతారు. దాని అండాశయాన్ని చూసి అది దాని మొదటి ప్రత్యుత్పత్తి కాలమని, ఇంకా ఫలదీకరణ చెందే గ్రుడ్లు చాల ఉన్నాయని పరిశోధకులు కనిపెడతారు. ఈ సమాచారమంతా రికార్డు చేయబడుతుంది; తరువాత గాలిని ఒక కవాటం ద్వారా తీసివేసి, రంథ్రాన్ని కుట్టేస్తారు.

మళ్లీ వెనక్కి తిప్పి ఇసుకలో వదిలివేసినప్పుడు, తబిత సహజంగా నీటిలోనికి వెళ్లుతుంది. అలలు దానిపైకొచ్చి ఉపశమనం పొందిన తబితను సముద్రంలోకి తీసుకెళ్తాయి.

గ్రుడ్లను వేరే స్థలానికి మార్చుట

మనం మళ్లీ వెళ్లినప్పుడు, గ్రుడ్లు అప్పటికే గూటిలో నుండి తీసివేయబడ్డాయి. నాలుగు గంటల తరువాత గ్రుడ్డు చిప్పలోపలి భాగానికి అంటుకొని రక్తనాళాలను తయారుచేస్తుంది. అప్పుడు వాటిని తిరగవేస్తే అవి నాశనమౌతాయి. గ్రుడ్లను వేరే స్థలానికి మార్చడానికి, ఆ గ్రుడ్లను పొదిగే స్థలం వద్ద సాధారణంగా రెండు గంటల సమయం పడుతుంది. గ్రుడ్లను వేరే స్థలానికి మార్చడంలో ఎక్కువశాతం సఫలత ఉంది. దీని ఉద్దేశమేమంటే, గూడు, గ్రుడ్లు నీటివల్ల క్రమేపి హరించుకుపోకుండా కాపాడ్డమే. ఇసుకకున్న ఉష్ణోగ్రతే పిల్లల ఆడమగ తేడాను నిర్ణయిస్తుంది. చల్లని ఇసుకున్న అనేక ద్వీపాలలో ప్రధానంగా మగవి, మోన్‌ రెపోస్‌లో వెచ్చని ఇసుక వల్ల ఎక్కువగా ఆడవి పుడతాయి.

జనవరి నుండి మార్చి వరకు పిల్లలు బయటికి వస్తాయి. అవి ఇసుక పైకప్పును గీకి, ఇసుక వచ్చి గూటి క్రింద పడి తమను పైకి ఎత్తేలా చేసుకుంటాయి. ఒకవేళ ఇసుక ఉష్ణోగ్రత అధికంగా లేకపోతే, అవి గూటిలో నుండి బయటపడి సముద్రంవైపు ప్రయాణం సాగిస్తాయి. కాని వాటి ప్రయాణం కేవలం ఇప్పుడే ప్రారంభమైంది. అవి ప్రత్యుత్పత్తి పరిపక్వత కెదగాలంటే 50 ఏళ్లవరకు పడుతుందని విశ్వసిస్తున్నారు. కేవలం కొద్దిశాతమే అంతవరకు చేరుకోగలవు.

మానవుడు శ్రద్ధతీసుకోవడం నేర్చుకోవాలి

మానవజాతి యొక్క నిర్లక్ష్యత, అనాలోచన సముద్ర తాబేళ్ల యొక్క ఆరు జాతులు తగ్గిపోవటానికి దోహదం చేస్తున్నాయి. సముద్రంలో పడవేయబడే ప్లాస్టిక్‌ బ్యాగులను జెల్లీచేపగా భావించి తాబేళ్లు తినేస్తాయి. అవి వాటి జీర్ణకోశానికి అడ్డుపడి ఆకలితో చనిపోటానికి కారణమౌతాయి. ఇతర చెత్త చెదారం తాబేళ్లు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయగలదు. నావికుడు జాగ్రత్త వహించకపోతే పడవలను నెట్టేతెడ్లు కూడా హాని కలిగించవచ్చు. దీనికి తోడు చమురుతెట్టు, వ్యర్థవిషపదార్థాలు అవి పొదిగే కాలంలో మొత్తం తీర ప్రాంత ప్రాణులన్నింటినీ నాశనం చేస్తాయి. ప్రతి 15 నిమిషాలకు తాబేలు గాలికోసం పైకి రావాలి గనుక, చేపలు పట్టే వలల మూలంగా తాబేలు అందులో చిక్కుకుని మునిగిపోయేలా చేయవచ్చును.

ఈ అపాయాలను గూర్చి ప్రజలు తెలుసుకుని పర్యావరణ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం నేర్చుకుంటే, సృష్టి యొక్క ఆశ్చర్యకరమైన పునరుత్పత్తి చక్రపు అనేక అద్భుతాలతో మానవజాతిని ప్రభావితం, ఆకర్షితం చేసే మనిషి తాబేలు కలిసే మరిన్ని అవకాశాలు నిస్సందేహంగా ఎక్కువకావచ్చును. (g93 3/22)

[27వ పేజీలోని చిత్రాలు]

పైన ఎడమ నుండి: చిన్న శస్త్రచికిత్స, సముద్రానికి తిరిగి వెళ్లడం, గ్రుడ్లను వేరే స్థలానికి మార్చడం, కాలికి గుర్తింపుచిహ్నం కట్టడం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి