కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 6/8 పేజీలు 19-22
  • అత్యాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అత్యాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహాయాన్ని అంగీకరించండి
  • ఆమెకు మద్దతివ్వండి
  • భయాన్ని, నిరాశనిస్పృహలను ఎదుర్కొనుట
  • కోపాన్ని మళ్లించుట
  • అత్యాచారాన్ని ఏది ఆపగలదు?
  • సమస్య త్వరలో అంతమౌతుంది
  • అత్యాచారపు నిజస్వరూపం
    తేజరిల్లు!—1993
  • అత్యాచారాన్ని ఏవిధంగా నిరోధించవచ్చును
    తేజరిల్లు!—1993
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
తేజరిల్లు!—1993
g93 6/8 పేజీలు 19-22

అత్యాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి

ముప్పై-మూడు సంవత్సరాల క్రితం మేరీని చాకుతో బెదిరించి అత్యాచారం చేశారు. మేరి దానినిప్పుడు వర్ణించడానికి ప్రయత్నిస్తే ఆమె గుండె వేగంగా కొట్టుకొని అరచేతులు చెమటతో నిండిపోతాయి. “ఒక స్త్రీ అటువంటి పరిస్థితికి గురి కావడం ఎంతో నీచాతినీచమైన విషయము,” అని ఆమె కన్నీళ్లతో చెప్తుంది. “అది చాలా అసహ్యకరమైన, భయంకరమైన విషయం.”

ఒక వ్యక్తి జీవితంలో అత్యాచారం అనేది భావోద్రేకంగా తీరని నాశనం చేసే సంఘటనల్లో ఒకటైయుండవచ్చును, మరిదాని ప్రభావాలు జీవితాంతం ఉండగలవు. అత్యాచారానికి గురైనవారిలో దాదాపు మూడువంతుల మంది ఆత్మహత్యను గూర్చి తలంచారు లేదా చేసుకోవాలనుకున్నారు. మరి అట్టి అనుభవము వారిని శాశ్వతంగా మార్చివేసిందని చాలామంది తెల్పినట్లు ఒక అధ్యయనంలో తేలింది.

అత్యాచారం చేసిన వ్యక్తి ఆమెకు తెలిసే ఉంటే దాని ప్రభావం మరీ భయంకరంగా ఉంటుంది. పరిచయస్థుని వల్ల అత్యాచారమునకు గురైనవ్యక్తికి ఇతరులనుండి ఏమంత మద్దతు ఉండదు. ఎందుకంటే తాను ఎవరికీ చెప్పుకోలేదు పైగా తాను చెప్పేది ఎవరూ నమ్మరుకూడా. తాను నమ్మినవ్యకై తనపై అత్యాచారం జరిపినందున ఆమె తనను తానే నిందించుకొని ఇతరులను అర్థంచేసుకోలేనంత అసమర్థురాలని బహుశ అనుకోవచ్చును.

సహాయాన్ని అంగీకరించండి

చాలామంది అత్యాచార బాధితులు మొదట వణుకుతో కాదన్నట్లు ప్రతిస్పందిస్తారు. ఒక స్త్రీ ప్రాముఖ్యమైన కళాశాల పరీక్ష వ్రాసే ముందు అత్యాచారానికి గురయ్యింది. తాను పరీక్ష వ్రాసేంతవరకూ దానిని మరచిపోవడానికి ప్రయత్నించింది. “నా కళ్లముందే నేను నమ్మిన పరిచయస్థుడు నాపై అత్యాచారం చేశాడు. గనుక నేను ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోనని మరొక బాధితురాలు తెల్పింది. నీకు తెలిసిన వ్యక్తే నీపై అత్యాచారం చేస్తాడని నాకు తెలియదు. అది హేళనగా ఉండవచ్చు, కానీ ఆ నమ్మకమే నాకు ఏ నిరీక్షణా లేకుండా చేసింది. నేను ఏకాకి నయ్యాను.”

కొంతమంది స్త్రీలు తమపై అత్యాచారం ఎలా జరిగిందో ఎవ్వరికీ చెప్పకుండా నిరాకరిస్తున్నారు. వారు ఆ దాడిని అనేక సంవత్సరాలు దాచిపెడతారు, అందువల్ల ఆ గాయం మానుటకు ఆలస్యమగుటయే కాకుండా అట్టి అత్యాచారం వల్లనే భావోద్రేక సమస్యలు వస్తున్నాయని వారు గుర్తించలేకపోతున్నారు.

ఆ విషయాన్ని నీవు ఇతరులతో చెప్పేంతవరకు నీవు కోలుకోలేవు. నీపై జరిగింది అత్యాచారమే గాని అది నీ తప్పుకాదని నమ్మకమైన నీ స్నేహితులు నీకు సహాయం చేయవచ్చు. ఒక పాత సామెత ఇలా తెల్పుతుంది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.” (సామెతలు 17:17) ఇంకను, ఆత్మీయకాపరులు “గాలికి మరుగైనచోటువలెను గాలి వానకు చాటైన చోటువలెను ఉండును.” (యెషయా 32:2; 1 థెస్సలొనీకయులు 5:14) కొంతమంది బాధితులకు, వారి భావావేశాలను పరిష్కరించుకొనుటకు సహాయపడే సలహాదారులుగానీ అత్యాచార బాధితుల సలహా కేంద్రానికి గాని వెళ్లవలసిన అవసరమేర్పడవచ్చును.

ముఖ్యంగా అత్యాచారం జరిగేటప్పుడు వారికి లైంగిక ఉద్రేకం కల్గించనందువలన, వారు దానిని దోషంగా భావించి వారి అత్యాచారాన్ని గూర్చి ఇతరులకు చెప్పడానికి భయపడతారు. అత్యాచారం జరిపిన వాడు నిందించబడవలసియున్నను వారు తమకు తామే నిందించుకొని మలినపర్చబడిన వారిగా ఎందుకు పనికిరాని వారిగా భావిస్తుంటారు.

“తోటి క్రైస్తవరాలితో హృదయం విప్పి మాట్లాడిన తర్వాత, మేరి ఇలా చెప్పింది.” మాట్లాడుటకు మంచి స్నేహితులుంటే ఎంతో ఉపశమనం కల్గిస్తుంది. “నేను అత్యాచారానికి గురయ్యినప్పటికి, మలినపర్చబడిన దానిని మరియు కళంకంగల దానిని అనే భావన కలగకుండా నేను ఆమెతో మాట్లాడగలిగాను.”

ఆమెకు మద్దతివ్వండి

మరోవైపు, ఆ స్త్రీపై నిజంగా “అత్యాచారం చేయబడిందా” అని తమకై తాము నిర్ణయించుకోవడం, లేదా ఊహించడం స్నేహితులకు తగదు, అది ప్రేమలేనితనమే అవుతుంది. తాను దానిని ఆనందించిందని లేదా అవినీతికి పాల్పడిందని ఎప్పుడు చెప్పవద్దు. ఆమె సహాయాన్ని కోరినప్పుడు స్నేహితులు మొదట ఆమెను నమ్మాలి. ఆమెకు ధైర్యాన్నివ్వాలి. ఆమె చెప్పాలని తలంచినపుడు అక్కడ ఉండి ఆమె చెప్పింది వినాలి, కాని వివరాలు చెప్పమని ఆమెను బలవంతం పెట్టొద్దు.

ఒకవేళ ఈమధ్యనే అత్యాచారం జరిగితే, స్నేహితులు బాధితురాలికి వైద్యం చేయించి, వారు సురక్షిత స్థలంలో ఉండేటట్లు సహాయపడవచ్చు. అత్యాచారాన్ని గూర్చి బయటికి చెప్పేలాగున ఆమెను ప్రోత్సహించండి, కానీ నిర్ణయాలు తీసుకోవడానికి ఆమెకే వదలిపెట్టండి. ఆమె తాను స్వాధీనం తప్పేటట్లు చేయబడిన పరిస్థితిని ఆమె ఇటీవలనే ఎదుర్కొన్నది. కొంత సమయాన్ని ఆమెకిచ్చి దాని తరువాత ఆమె ఏమిచేయాలో తానే నిర్ణయించుకొనడానికి ఆమెకు వదలిపెట్టి తన స్వాధీనమును తిరిగి పొందుటకు అనుమతించండి.

అత్యాచార బాధితుల కుటుంబస్థులు ఉద్రేకముతో ప్రతిస్పందించుట మానుకోవాలి. అత్యాచారానికి ఎవరినో నిందించుటకు లేదా అత్యాచారము జరిపినవాని మీద పగతీర్చుకొనుటకు వారు చూడవచ్చు. ఇవేమి బాధితురాలికి సహాయపడవు (రోమీయులు 12:19) అత్యాచారం చేసిన వ్యక్తిని తప్ప ఎవనినైనా నిందించడం నిష్ప్రయోజనము, మరియు పగతీర్చుకొనుట అపాయకరము. ఆమె కోలుకోవడానికి బదులు తాను ప్రేమించిన వ్యక్తుల క్షేమాన్ని గూర్చి బాధపడుటకు అది నడిపించును.

అత్యాచారం జరిగిన తరువాత చాలా మంది లైంగికసంబంధాన్ని వేరుగా దృష్టిస్తారని కూడా కుటుంబస్థులు తెలుసుకోవాలి. వారి మనస్సులో లైంగికత అనేది ఒక ఆయుధంగా మారింది. తాము ప్రేమించి, నమ్మిన జతతో సహితం లైంగికసంబంధం కలిగియుండుట కొంతకాలం వరకు కష్టముగా ఉండవచ్చు. ఆ కారణంచేత, భర్త తన భార్య ఒప్పుకునేంతవరకూ, ఆమెను లైంగిక కలయికకు బలవంతపెట్టకూడదు. (1 పేతురు 3:7) కుటుంబస్థులు ఆ యౌవన స్త్రీలో ఆత్మాభిమానాన్ని నెలకొల్పడం ద్వారా సహాయపడవచ్చును మరియు ఆమెకు అలా జరిగినను, ఆమె ఇంకనూ ప్రేమించబడి, గౌరవించబడుతుందని కూడా చూపించాలి. కొన్నిసార్లు బాధితులు భావోద్రేకంగా తిరిగి కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. గనుక వారికి మద్దతు ఎల్లప్పుడు అవసరం.

భయాన్ని, నిరాశనిస్పృహలను ఎదుర్కొనుట

అత్యాచారానికి గురైన స్త్రీలో ఎక్కువ కలతపరిచే ప్రక్రియ భయం. చాలామంది అత్యాచార బాధితులు ఆ పరిస్థితినుండి తప్పించుకుని బయటపడతారనుకోలేదు. తరువాత మరలా అత్యాచారానికి గురవుతారేమోనని భయం లేదా వారికి అనుకోకుండా ఆ వ్యక్తి కనబడతాడేమో అని భయపడవచ్చును.

అత్యాచారం చేయబడిన సమయంలో పొందిన భయానుభూతి మరల అటువంటి శబ్దాలు, వాసనలు, ప్రదేశాలు చూడడం ద్వారా కలుగవచ్చు. ఒకవేళ ఒక స్త్రీ చిన్న ఇరుకు వీధిలో అత్యాచారానికి గురైతే మరలా ఒక ఇరుకు వీధిలోనికి వెళ్లడానికి భయపడవచ్చును. ఒకవేళ యింటి వద్ద అత్యాచారం చేయబడితే, ఆమెకు అక్కడ సురక్షితంగా ఉండలేదనే భావన మరలా కలుగుతుంది. గనుక అక్కడనుండి వెళ్లిపోవాలనుకోవచ్చుకూడా. ఆ వ్యక్తి ధరించిన దుస్తుల పరిమళం వాసన వచ్చినా ఆమెకు ఆనాటి చెడు స్మృతులే గుర్తుకు రాగలవు.

కొన్ని అత్యాచారాల వలన మాత్రమే గర్భం వచ్చినప్పటికి, అలా జరుగుతుందేమోనని చాలామంది బాధితులు భయపడుతారు. చాలామంది లైంగిక సంబంధమైన రోగాలకు గురౌతారేమోనని కూడా చింతిస్తారు. అత్యాచార బాధితులలో సగం మంది కొన్ని వారాలనుండి కొన్ని మాసాలు వరకూ నిరాశనిస్పృహలను, నిరుపయోగభావాలను అనుభవించవచ్చు. వారు భయము చింత, మరియు ఆందోళనతో సతమతమవుతూ ఉండవచ్చుకూడా.

స్త్రీలు అత్యాచారాన్ని ఆపలేకపోయినప్పటికిని, ఆ దాడివలన కలిగిన ఆలోచనలను భావాలను ప్రతిస్పందనలను సకాలంలో అదుపులో పెట్టుకోవచ్చును. వారు తమంతటతామే తమను గూర్చిన ప్రతికూల ఆలోచనలను అనుకూలదృక్పథాలకు మార్చుకోవడానికి నేర్చుకోవాలి.

“నీవు బలహీనురాలివని, పనికిరానిదానివని లేదా నిస్సహాయురాలివని నీకై నీవు అనుకొనేకంటే, ఆ దౌర్జన్యం జరిగిన తరువాత ఆ గందరగోళంనుండి ఎంతత్వరగా కోలుకున్నావో నీకైనీవు చెప్పుకొనడం నేర్చుకోవాలి,” అని రికవరింగ్‌ ఫ్రమ్‌ రేప్‌ అనే పుస్తకంలో లిండా లిడ్రే ఈ విధంగా చెప్పింది: “ప్రతికూల ఆలోచనలు, భావాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని నీవనుకుంటున్నప్పుడు నన్ను నేను అదుపులో పెట్టుకొనుటను నేర్చుకొంటున్నానని, నీకై నీవు చెప్పుకోవాలి.”

భయానికి కారణమేమిటో కచ్చితంగా గుర్తించడానికి నేర్చుకోవడం ద్వారాకూడా దానిని తొలగించుకోవచ్చు. బాధితురాలు భయాన్ని గుర్తించినప్పుడు, ఆమె ఆ భయం ఎంత వాస్తవమైందని తన్ను తాను ప్రశ్నించుకోవచ్చు, ఉదాహరణకు, ఒకవేళ అత్యాచారం చేసిన వ్యక్తివలె ఆమెకు ఎవరైనా కనబడితే, అతడు అత్యాచారం చేసినవ్యక్తి కాదని అతడు ఆమెనేమి బాధపెట్టడని గుర్తుచేసుకోవాలి.

భయాన్ని తొలగించుకోవడానికి మరొక పద్ధతి ఏమంటే క్రమేపి ఆ భావన మదిలోనుండి తీసివేసుకోవడమే. స్త్రీ తాను భయపడే పరిస్థితులను లేదా చర్యలపట్టికను తయారు చేసుకుని ఏది తక్కువ ఏది ఎక్కువ భయం కల్గిస్తుందోనని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడామె తక్కువ భయపెట్టేదేదో దాన్ని పోగొట్టుకొనేంతవరకు ఆ స్థితిలో ఉన్నట్లు ఊహించుకోవాలి. ఆ పట్టికలోని ఒకొక్క పరిస్థితిలో తానున్నట్లు ఊహించుకొని భయపడకుండా ఉండుటకు ప్రయత్నించాలి.

స్నేహితురాలి సహాయంతో, అప్పుడు ఆమె తన నిజజీవితంలోని కార్యక్రమాలను చేపట్టుటకు అభివృద్ధి పొందవచ్చును, అంటే రాత్రివేళ యింటినుండి బయటకు వెళ్లడం ఒంటరిగా ఉండడం లాంటివి. అలా ఆమె చివరికి భయాన్ని పారద్రోలి అది తన దైనందిన కార్యక్రమాలకు అడ్డురాకుండా చేసుకోగలదు. ఏమైనప్పటికిని, భయాన్ని కలిగించే కొన్ని విషయాలు అంటే రాత్రివేళ చీకటి వీధులలో వెళ్లడం వంటివి మామూలే, అటువంటి పరిస్థితులలో భయపడకూడదని ప్రయత్నించడం సమంజసం కాదు.

కోపాన్ని మళ్లించుట

అత్యాచార బాధితులు కోపాన్ని కూడా వ్యక్తం చేస్తారు, మొదటిగా అది మగవారందరి యెడల చూపించబడుతుంది, కాని క్రమేపి అది సామాన్యంగా అత్యాచారం చేసిన వ్యక్తి మీదికే కేంద్రీకరించబడుతుంది. కోపపడే ప్రజలు తరచూ అవివేకంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు తమ భావనలను అణగద్రొక్కుకుంటూ స్పందించవచ్చు. ఏమైనప్పటికిని, కోపమనేదాన్ని అర్థవంతమైన రీతిలో మార్చుకోవచ్చును, ఒకవ్యక్తి తన కోపాన్ని తిరిగి సరిదిద్దుకుని కోలుకొనేటట్లుగా సహాయపడాలి. లేఖనాలు యిలా చెప్తున్నవి: “కోపపడుడి, కాని పాపము చేయకుడి.”—ఎఫెసీయులు 4:26.

మొదట, బాధితులు కోపాన్ని వ్యక్తం చేయడానికి భయపడనవసరం లేదు. వారు దాన్ని గూర్చి ఇతరులతో మాట్లాడవచ్చును. చట్టాన్ని ఆశ్రయించడం లేదా దానిని గూర్చి వ్రాసిపెట్టుకోవడం ఒక పరిష్కార మార్గం. వారు తమ కోపాన్ని అధిగమించడానికి శారీరక కార్యక్రమాలు, అంటే టెన్నిస్‌, రాకెట్‌బాల్‌, హేండ్‌బాల్‌ ఆడటం, నడవటం, పరుగెత్తటం, సైకిలు తొక్కడం లేదా ఈతకొట్టడం వంటి నిరాశను దూరంచేసే పనులు చేయవచ్చును.

నీవు నీ జీవితాన్ని స్వాధీనంలోనికి తీసుకొనిరాగలవు.

అత్యాచారాన్ని ఏది ఆపగలదు?

అత్యాచారాన్ని ఆపడం అంటే అత్యాచారం చేసేవారినుంచి స్త్రీని దాచడం లేదా వారితో పోరాడి ఆపడం కంటే ఎక్కువ యిమిడి ఉంది. “మగవాళ్లే అత్యాచారం చేసేది, మగవాళ్లకే అత్యాచారాన్ని సమూలంగా ఆపగలిగే శక్తి ఉంది” అని రచయిత తిమోతి బెనేక్‌ మెన్‌ ఆన్‌ రేప్‌ అనే తన పుస్తకంలో తెలిపాడు.

పురుషులు స్త్రీలను ఆటబొమ్మలుగా పరిగణించునంతవరకు, విలువైన బాంధవ్యాలు దౌర్జన్యంతో కూడిన నిరంకుశత్వంపై ఆధారపడిలేవని వారు నేర్చుకునేంతవరకు అత్యాచారం అంతంకాదు. వ్యక్తి పరంగా చూస్తే, అనుభవజ్ఞులైన పురుషులు యితర పురుషులతో మాట్లాడి వారిని ప్రభావితం చేయగలరు. పురుషులు స్త్రీలు యిరువురూ లైంగికపరిహాసాలు, లైంగిక దురాగతాలను చూపించే చలనచిత్రములను తిరస్కరించగలరు లేదా, ఉత్పత్తులను అమ్ముకొనుటకు లైంగికతను ఆయుధంగా వాడుకొని వారికి మద్దతును నిరాకరించగలరు. బైబిలు సలహా యీ విధంగా చెప్పుతున్నది: “మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైననూ ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది; కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.”—ఎఫెసీయులు 5:3, 4.

తలిదండ్రులు స్త్రీలను గౌరవించడాన్ని మాదిరి పూర్వకంగా నేర్పించవచ్చు. యెహోవా దేవుడు స్త్రీలను ఎలా దృష్టిస్తున్నాడో ఆలాగే తామును చేయాలని కుమారులకు నేర్పించవచ్చును. దేవుడు పక్షపాతి కాడు. (అపొస్తలుల కార్యములు 10:34) యేసుక్రీస్తు వలె వారి కుమారులు స్త్రీలతో స్నేహభావాన్ని కలిగియుండేటట్లు, వారితో కలిసి మెలిగేటట్లు తలిదండ్రులు నేర్పించవచ్చు. ప్రేమానుభూతితో జరిగించే లైంగిక సంబంధమైన ప్రక్రియ కేవలం వివాహానికి మాత్రమే పరిమితమై యుంటుందని వారు తమ కుమారులకు నేర్పించవచ్చు. బలత్కారమనేది సహించబడదని ఇతరులపై దౌర్జన్యం చేయడం పనికిమాలినదని తలిదండ్రులు స్పష్టంగా తెలుపవచ్చు. (కీర్తన 11:5) తమతో తమపిల్లలు లైంగిక సంబంధమైన వాటిని గూర్చి స్పష్టంగా మాట్లాడి వాటి వత్తిడిని ఎదిరించురీతిగా తలిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించవచ్చును.

సమస్య త్వరలో అంతమౌతుంది

ఏమైనను, ప్రపంచ సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు రానిదే అత్యాచారం అంతం కాదు. “అత్యాచారమనేది కేవలం వ్యక్తిగత సమస్యేకాదు గాని అది కుటుంబ సమస్య, సాంఘిక సమస్య, మరియు అంతర్జాతీయ సమస్య కూడా,” అని పరిశోధకురాలు లిండా లెడ్రే చెప్పింది.

మానవుడు ఇక ఎన్నడూ ‘మరియొకనిపై అధికారియై తనకు హాని తెచ్చుకొనని,’ దౌర్జన్యం లేనటువంటి ఒక ప్రపంచవ్యాప్త సమాజాన్ని బైబిలు వాగ్దానం చేస్తుంది. (ప్రసంగి 8:9; యెషయా 60:18) అత్యాచారంతో సహా, ఆలాగే మరేవిధమైన శక్తినైనను దుర్వినియోగం చేసేవారిని యెహోవా దేవుడు సహించని సమయం త్వరలో వస్తుంది.—కీర్తన 37:9, 20.

ఆ నూతన లోక సమాజంలో, లింగ, తెగ, జాతిభేదం లేకుండా అందరూ సామరస్యంతో, ప్రేమతో మెలగటానికి ఉపదేశింపబడతారు. (యెషయా 54:13) మరియు ఆ సమయంలో దీనులు, స్నేహితులు లేదా పరాయి వ్యక్తుల భయం లేకుండా జీవిస్తారు “వారు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11. (g93 3/8)

[20వ పేజీలోని బాక్సు/చిత్రం]

నీవు అత్యాచారానికి గురైతే

▫ వైద్య సహాయాన్ని కోరాలి.

▫ ఒకవేళ నీకు యిష్టమైతే, వైద్య, చట్టపరమైన పనులకొరకు అత్యాచారబాధితుల సలహాదారులలో ఒకరిని నీతోపాటు వచ్చి సహకరించుమని అడగవచ్చును.

▫ నీకు వీలైనంత త్వరగా పోలీసులను పిలువుము. నీ క్షేమము నిమిత్తం, ఇతర స్త్రీల క్షేమం నిమిత్తం పోలీసులకు తెలుపమని సలహాదారులు సిఫారసు చేస్తారు. నివేదించడం అనేది నేరారోపణతో సమానం కాదు, కాని ఒక న్యాయస్థానానికి వెళ్లాలనుకుంటే, ఆలస్యంగా వెళ్లినమూలంగా నీ కేసు దుర్భలమైపోవచ్చును.

▫ నిదర్శనలను భద్రపరచుము. అత్యాచారం చేయబడిన తరువాత స్నానంచేయడం గాని, బట్టలను మార్చడంగాని, తలను కడగడం దువ్వడం గాని వ్రేళ్ల కాళ్ల గుర్తులను తొలగించడం గాని చేయకూడదు.

▫ వైద్యులు సాక్ష్యాన్ని సేకరించి లైంగిక సంబంధం వలన కలిగే రోగాలు, గర్భధారణనుగూర్చి పరీక్షిస్తారు. ఒకవేళ వారు గర్భ నిరోధక మాత్రలను గాని లేక సంపర్కం తరువాత తీసుకునే మాత్రలు యిచ్చినట్లయితే, క్రైస్తవులు శిశువుని చంపే మాత్రలను వాడటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

▫ నీ క్షేమము నిమిత్తం నీవు చేయదగింది చేయవచ్చు—తాళాలను మార్చడం, స్నేహితులతో ఉండడం, నీవు అతిగా ప్రవర్తిస్తున్నట్లున్నా లేకున్నా నీ తలుపులకు రక్షక బంధాలను బిగించుము.

▫ అన్నిటికంటే, ఓదార్పు కొరకు లేఖనాలను చూడండి, దౌర్జన్యం జరిగేటప్పుడు కాని తరువాత కాని, యెహోవా నామాన్ని గట్టిగా ఉచ్చరించి, ప్రార్థించండి. మద్దతు కొరకు పెద్దలమీద సంఘంలోనున్న ఇతర సన్నిహిత సహవాసులమీద ఆధారపడండి. ఒకవేళ సాధ్యమైతే కూటాలకు హాజరుకండి, తోటి క్రైస్తవులతో పాటు సేవలో పాల్గొనండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి