కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 6/8 పేజీలు 17-19
  • అత్యాచారాన్ని ఏవిధంగా నిరోధించవచ్చును

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అత్యాచారాన్ని ఏవిధంగా నిరోధించవచ్చును
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వెంటనే చర్య గైకొనుము
  • పోరాడి ఎదిరించుము
  • అత్యాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి
    తేజరిల్లు!—1993
  • అత్యాచారపు నిజస్వరూపం
    తేజరిల్లు!—1993
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
తేజరిల్లు!—1993
g93 6/8 పేజీలు 17-19

అత్యాచారాన్ని ఏవిధంగా నిరోధించవచ్చును

ఎరిక్‌ పొడవుగా చూడ్డానికి అందంగా ఉంటాడు, సంపన్న కుటుంబీకుడు. ఎరిక్‌, అతని రూమ్‌మేట్‌తో కలసి విందు ఆరగించేందుకు 19 సంవత్సరాల లోరి ఆహ్వానించబడింది. ఎరిక్‌ యింట్లో జరుగుతున్న విందుకు ఆమె వచ్చింది, కాని మిగతా జంటలు విందుకు రాకూడదని నిర్ణయించుకొన్నట్లు, ఆమెకు తెలియదు. ఆతర్వాత వెంట వెంటనే మిగిలిన అతిథులు కూడా విందును విడిచి వెళ్లుటకారంభించారు.

“ఏదో పొరపాటుంది, సందేహాస్పదమైనదేదో జరుగుతుందని నేను తలంచుట మొదలు పెట్టాను, కాని నేను దానిని లక్ష్యపెట్టలేదని,” ఆమె చెప్పింది.

లోరి ఒంటరిగా మిగిలిపోయిన సమయంలో, ఎరిక్‌ ఆమెపై అత్యాచారం చేశాడు. అత్యాచారాన్ని గూర్చి లోరి ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, అటు తరువాత ఆమె ఎరిక్‌ను చూడకుండా ఉండేందుకు 240 కిలోమీటర్లు దూరంగా వెళ్లిపోయింది. ఒక సంవత్సరం తరువాత కూడ, ఆమె మగాళ్లతో స్నేహంచేయడానికే భయపడింది.

అత్యాచారమనేది పెరుగుతున్న సమస్య, ఒక స్త్రీ జాగ్రత్తగాను, సిద్ధంగాను ఉండడమే ఆమెకు శ్రేష్ఠమైన రక్షణ. ప్రతి అత్యాచార పరిస్థితిని గూర్చి ముందుగా తెలుసుకోలేము, కాని అత్యాచారం చేసేవాడు దాడి చేయడానికి ఎలా ఆలోచించి పథకం వేస్తాడో తెలుసుకోవడం హెచ్చరికా సూచనలను గుర్తించేందుకు నీకు సహాయపడవచ్చును.a ఒక పురాతన సామెత యిట్లంటున్నది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి తప్పించుకుంటాడు, కాని అవివేకి అదే మార్గంలో వెళ్లి తరువాత దానిని గూర్చి విచారిస్తాడు.”—సామెతలు 27:12, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.

అత్యాచారాన్ని తప్పించుకోవడానికి ఒక శ్రేష్ఠమైన మార్గం అత్యాచారం చేసేవాళ్లకు దూరంగా ఉండటమే. నీకు బాగా తెలిసిన వ్యక్తియైనను ఒకని ప్రవర్తనా సరళి అతడు అత్యాచారం చేసేవ్యక్తని గుర్తిస్తే అతని విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి (పేజీ 7 . లోనున్న బాక్స్‌ చూడండి) కొంతమంది పురుషులు స్త్రీలు దుస్తులు ధరించే విధానాన్ని, లేదా వారు ఒంటరిగా తనతో ఉండటానికి యిష్టపడుతున్నారనుదాన్ని ఆమెపై అత్యాచారం చేయడానికి సాకుగా ఉపయోగిస్తారు. ఒకవేళ మగవాడు అటువంటి హీనమైన మనోభావం కలిగి ఉంటే అందుకు ఆమె బాధ్యురాలు కాకపోయినప్పటికిని అటువంటి ఉద్దేశాలను గుర్తించుటలో ఆమె జ్ఞానయుక్తంగా ఉండాలి.

నీకంతగా పరిచయం లేని వ్యక్తితో ఒంటరిగా ఉండవద్దు. (నీకు పరిచయమున్న వ్యక్తితోనైనా తెలివిగా ప్రవర్తించు) అత్యాచారం చేసే అపరిచితుడు మరమత్తుచేసే వ్యక్తిగా నటించి నీ యింటికి రావచ్చును. అతని అర్హతలను అడుగుము. అత్యాచారం జరిపే పరిచయస్థుడు తరచు బాధితులను ఒంటరిగా చేయుటకు ఏదో ఒక సాకుచెప్పి తన ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు, లేదా నీవు కలుసుకునే స్థలానికి అనేకులు వస్తున్నారని అబద్ధాలు చెప్పి నిన్ను రమ్మనవచ్చును. అలా నమ్మి మోసపోవద్దు.

స్నేహంగా తిరిగేటప్పుడు సమస్యలను తప్పించుకోవడానికి, ఇతర జంటలతో కలిసి వెళ్లడం లేక తోడుగా ఎవరినైనా తీసుకెళ్లడం మంచిది. నీవు కలిసి వెళ్లే వ్యక్తిని బాగా తెలుసుకోవాలి, చనువుగా ప్రవర్తించడాన్ని ఒకవేళ అనుమతించ దలచుకుంటే అందుకు దృఢమైన హద్దులను విధించాలి. మద్యం సేవించుట విషయంలో జాగ్రత్త వహించు! నీ ఆలోచనాపద్ధతి కుంటుబడితే నీవు ప్రమాదము విషయంలో అప్రమత్తంగా ఉండలేవు. (సామెతలు 23:29-35 పోల్చండి.) నీ అంతర్బుద్ధిని నమ్మాలి. ఒక వ్యక్తితో కలిసి ఉండటానికి నీకు అసౌకర్యంగా ఉంటే అతనికి ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉండవని అనుకోవద్దు. అక్కడనుండి వెళ్లిపో.

ప్రాముఖ్యంగా తలిదండ్రులు కౌమార దశలో ఉన్న తమ పిల్లలపై అత్యాచారాన్ని అరికట్టే విధానాన్ని గూర్చి చర్చించాలి, అత్యాచారం చేసేవారు, అత్యాచారానికి గురయ్యేవారు అత్యధికంగా యౌవనస్థులే కాబట్టి, ప్రమాదకరమైన పరిస్థితులను గూర్చి నిర్దింష్టంగా చర్చించాలి.

వెంటనే చర్య గైకొనుము

అత్యాచారం జరిగే పరిస్థితులన్నింటిని మనం ముందే ఊహించలేము. అనుకోకుండా, మీకంటే బలమైన, నిన్ను లైంగికంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించే పరిస్థితిలో నీవు చిక్కుకుపోయావనుకో అప్పుడేమి చేయాలి?

వెంటనే చర్య తీసుకోవాలి, నీ గురిని గుర్తుంచుకో: అదే తప్పించుకోవడం. అత్యాచారం చేయాలనుకునే వ్యక్తి తాను బలత్కరించబోయే వ్యక్తిని మొదట పరీక్షిస్తాడు, కావున అతడు రంగంలో దిగడానికి ధైర్యము తెచ్చుకొనక ముందే అతని పథకాలను వెంటనే వమ్ము చేయుట చాలా ప్రాముఖ్యము. అత్యాచారానికి సంబంధించిన నిపుణులు చేయదగిన రెండు కార్యాలను సూచిస్తున్నారు: పరోక్ష ప్రతిఘటన లేదా క్రియాత్మక ప్రతిఘటన. మొదట నీవు పరోక్షమైన ప్రతిఘటనను ప్రయత్నించవచ్చును, మరి అది పనిచేయకపోతే క్రియాత్మక ప్రతిఘటనను ప్రయోగించాలి.

పరోక్షమైన ప్రతిఘటనలో అతనితో మాట్లాడుటకు సమయాన్ని తీసుకొనుట, నీకు ఏదో సుఖరోగమున్నదని నటించుట, లేక అతనిపై వాంతిచేసుకొనుట ఇమిడియున్నది. (1 సమూయేలు 21:12, 13 పోల్చండి.) “ఒకరు తెలివిగా ఎన్నో ఉపాయాలు ఉపయోగించ వచ్చును,” అని గెరార్డ్‌ విట్‌మోర్‌ విస్డమ్‌ ఫర్‌ విమెన్‌: ఎ హాండ్‌ బుక్‌ ఫర్‌ సర్‌వైవల్‌ అనే పుస్తకంలో వ్రాశారు.

పరోక్షమైన ప్రతిఘటనలో—శరీరకంగా పోరాడడం తప్ప మరేదైనా చేయవచ్చును—దాడిచేసే వ్యక్తిని నెమ్మదిపర్చేందుకు లేదా అతని దృష్టిమళ్లించేందుకు నిర్దిష్ఠమైన ఆలోచన చేయాలి. నీ ప్రతిఘటన ఆ వ్యక్తికి ఎక్కువ కోపాన్నితెచ్చి హింసకు పాల్పడేలా చేస్తే, వేరొక పద్ధతి ప్రయత్నించుము. అయితే నీవు ఆలోచించే సమయంలో మరీ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లేలా అనుమతించవద్దు. పరోక్షమైన ప్రతిఘటనలో చాలా ప్రభావితమైన ఒకదాన్ని గుర్తుంచుకోండి—అదే గట్టిగా కేకలువేయడం.—ద్వితీయోపదేశకాండము 22:23-27 కు పోల్చండి.

మరియొక మార్గమేదనగా ప్రతికూలంగా బలవంతంగా ఎదిరించండి. అతని ఇష్టానికి నీవేమాత్రం లొంగదలుచుకోలేదని నీపై దాడిచేసే వ్యక్తితో చెప్పుము. సరదాగా కలిసి వెళ్లిన సందర్భంలో అత్యాచార ప్రయత్నం జరిగితే, అతన్ని స్తంభింపజేయునట్లు ప్రవర్తించాలి. “ఇది అత్యాచారం! నేను పోలీసులను పిలుస్తాను!” అని గట్టిగా అరిస్తే అత్యాచారం చేయదలచుకున్న వ్యక్తి వత్తిడి చేయడాన్ని గూర్చి మరోసారి ఆలోచించవచ్చును.

పోరాడి ఎదిరించుము

మాటలు పనిచేయకపోతే, క్రియాత్మకంగా ప్రతిఘటించుటకు భయపడకు. నీకు హాని జరుగుతుందని లేదా నీవు చంపబడతావని దాని అర్థం కాదు లేదా నీవు లొంగిపోయినంత మాత్రాన విడిచిపెట్టబడతావని నమ్మకము కూడా లేదు. కావున పోరాడి ఎదిరించాలని అత్యాచార నిపుణులు సలహానిస్తున్నారు.

పోరాడి ఎదురించడమనేది స్త్రీలకు కష్టంగా ఉండవచ్చును ఎందుకంటే వారు జీవితమంతా శారీరిక వత్తిడికి గురై మర్యాదగా, మెత్తగా మరియు లొంగియుండేటట్లు పుట్టినప్పటినుండి నేర్చుకుంటున్నారు. కావున, ఎదురించాలని నీవు ముందే నిర్ణయించుకోవాలి, తద్వారా దాడి జరిగినప్పుడు జంకడము ద్వారా అమూల్యమైన సమయము వృధాకాదు.

నిన్ను ఎవరైనా వత్తిడి చేయజూస్తున్నా లేదా బెదిరిస్తున్నా నీవు మహాకోపాన్ని వ్యక్తపర్చాలి. ఈ దాడి ముందే ఆలోచించి చేసిందని, నీవు లొంగిపోవాలని అతడు ఎదురుచూస్తున్నాడని నీవు గుర్తించాలి. కోపము తెచ్చుకో కాని భయపడకు. “నీ భయమే దాడి చేసే వ్యక్తికి శక్తిగల ఆయుధము కాగలదు,” అని పరిశోధకురాలు లిండా లెడ్రే చెప్పింది. నీవు మితిమీరి ప్రవర్తిస్తున్నావేమోనని లేక మూర్ఖురాలిగా కనిపిస్తావేమోనని భయపడకు. “అత్యాచారానికి గురయ్యేబదులు కఠినంగా ఉండడమే మేలు,” అని ఒక నిపుణురాలు చెప్పింది. విజయవంతంగా ఎదిరించిన స్త్రీలు అలా పోరాడారు ఒకదానికంటె ఎక్కువ పద్ధతులు ఉపయోగించారు, అందులో కొరకడం, తన్నడం, గట్టిగా కేకలు వేయడం కూడా ఇమిడియున్నవి.

నీవు అత్యాచారాన్ని ఎదిరించ లేకపొతే, కనీసము ఆ ముద్దాయిని తరువాత గుర్తించే ప్రయత్నము చేయండి. సాధ్యమైతే గోళ్లతో గీరడం, లేదా బట్టలను చింపడము వలన రక్తము, బట్టల సాక్ష్యాధారం నీతో మిగులుతుంది. అయితే ఆ పరిస్థితులలో, నీవే మాత్రం పోరాడలేని స్థితికి రావచ్చును. అలా జరిగినట్లయితే, “అత్యాచారము జరుగనిచ్చినందుకు నిన్ను నీవు కించపరచుకొనకుము,” అని రాబిన్‌ వార్షా ఐ నెవర్‌ కాల్డిట్‌ రేప్‌ అనే పుస్తకంలో అన్నాడు. “నీపై అత్యాచారం జరిగిందని నిరూపించడానికి నీవు గాయపరచుకోవడమో లేదా మరణానికి గురికావలిసిన అవసరమో లేదు.”

[అధస్సూచీలు]

a ఏ రెండు పరిస్థితులు కూడా ఒకే విధంగా ఉండవు, కాగా నిరోధించుటకు ఇచ్చిన ఏ సలహా కూడ లోపరహితం కాదు. దాడి జరిగేటప్పుడు ఒక బాధితురాలు ఏ చర్య గైకొనాలి ఎంతగా ఎదురాడాలనే దానిపై అత్యాచారానికి సంబంధించిన ప్రముఖులలో భిన్నాభిప్రాయాలున్నాయి.

[18వ పేజీలోని బాక్సు]

అత్యాచారం చేయగల వ్యక్తి లక్షణాలు

▫ నిన్ను అవమానపరచి, నీ అభిప్రాయాలను త్రోసిపుచ్చి లేదా మీరేమైనా సలహాయిస్తే కోపగించుకొని విసుక్కొని భావోద్రేకంగా నిన్ను గాయపరుస్తాడు.

▫ నీవు ఏవిధంగా దుస్తులు ధరించుకోవాలి లేక నీ మిత్రులెవరై యుండాలి అనే నీ జీవితానికి సంబంధించిన విషయాలపై అధికారం చెలాయించడానికి ప్రయత్నిస్తాడు.

▫ ఏకారణంలేకుండా ఈర్ష్యపడుతుంటాడు.

▫ సాధారణంగా స్త్రీలను కించపరచి మాట్లాడుతుంటాడు.

▫ త్రాగి లేదా “మితిమీరి” త్రాగి నీవు ఆలాగే చేయాలని ప్రయత్నిస్తాడు.

▫ నీవు తనతో ఏకాంతముగా ఉండాలని లేదా లైంగిక సంబంధం కల్గియుండాలని వత్తిడిచేస్తుంటాడు.

▫ సరదాగా బయటికి వెళ్లినపుడు ఖర్చు పంచుకోవడానికి నిన్ను అనుమతించడు లేక నీవు ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తే కోపంతెచ్చుకుంటాడు.

▫ శారీరకంగా హింసాత్మక ధోరణికలిగి, లాగడం లేక నెట్టుకెళ్లడం వంటివి చేస్తుంటాడు.

▫ నీకు అతిదగ్గరగా కూర్చొని, మార్గానికి అడ్డువస్తూ, ముట్టవద్దంటే ముట్టుకుంటూ బెదిరిస్తాడు, లేక వాస్తవానికంటే నిన్ను గూర్చి అతనికి ఎక్కువ తెలిసినట్లుగా మాట్లాడుతుంటాడు.

▫ కోపపడకుండా విసుగుదలను అదుపుచేసుకోలేడు.

▫ నిన్ను సాటి వ్యక్తిగా ఎంచడు.

▫ ఆయుధాలంటే ఇష్టం మరియు జంతువులు, పిల్లలు, అధికారం చెలాయించగల యితరుల విషయంలో క్రూరంగా ప్రవర్తిస్తాడు.

రాబిన్‌ వార్షా వ్రాసిన ఐ నెవర్‌ కాల్డిట్‌ రేప్‌ నుండి తీసుకొనబడినవి.

[18వ పేజీలోని చిత్రం]

విజయవంతంగా ఎదిరించిన స్త్రీలు సాధారణంగా పోరాడారు ఒకదానికంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి