కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 6/8 పేజీలు 14-16
  • అత్యాచారపు నిజస్వరూపం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అత్యాచారపు నిజస్వరూపం
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకింత పెరుగుదల?
  • “రెండవ అత్యాచారం”
  • అత్యాచార కల్పనలు, నిజాలు
  • అత్యాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి
    తేజరిల్లు!—1993
  • అత్యాచారాన్ని ఏవిధంగా నిరోధించవచ్చును
    తేజరిల్లు!—1993
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • లైంగిక దాడి గురించి నేను తెలుసుకోవాల్సినవి ఏమిటి?—1వ భాగం: ముందు జాగ్రత్తలు
    యువత అడిగే ప్రశ్నలు
తేజరిల్లు!—1993
g93 6/8 పేజీలు 14-16

అత్యాచారపు నిజస్వరూపం

ఈ పేజీ చివరవరకూ చదవడం ముగించే సమయానికి, అమెరికాలో ఏదొకచోట ఒక స్త్రీ అత్యాచారానికి గురౌతుంది. ఆమె ఒంటరియై బహుశా ఆమెకు తెలిసిన వ్యక్తిచేత వంచించబడి దౌర్జన్యానికి గురౌతుంది. ఆమె దెబ్బలు తినవచ్చును. ఆమె ప్రతిఘటించవచ్చు. ఆమె నిశ్చయంగా ప్రాణభయంతో ఉంది.

అత్యాచారం అనేది ప్రపంచంలో కెల్లా అత్యధిక అత్యాచారాల రేటు గల అమెరికాలో అత్యంత వేగంతో వృద్ధి చెందుతున్న దౌర్జన్యకరమైన నేరం. పోలీసుల నివేదన ప్రకారం, ప్రతి గంటకు సరాసరి 16 మందిపై అత్యాచార ప్రయత్నం జరుగుతున్నది, అందులో 10 మంది స్త్రీలు అత్యాచారానికి గురౌతున్నారు. దీనికి తోడు ఫిర్యాదు చేయని అత్యాచారాలు నిజానికి అంతకంటె పదిరెట్లు ఎక్కువగానే ఉండవచ్చు!

ఈ తీవ్రమైన గణాంకాలతో ఉన్నది కేవలం అమెరికా దేశం మాత్రమే కాదు. ఫ్రాన్స్‌లో 1985-1990 మధ్యలో అత్యాచారం చేయబడిన వారిసంఖ్య, 62 శాతానికి పెరిగింది. కెనడాలో 1990 నాటికి, అంటే ఆ రెండేళ్లలో దౌర్జన్యాలకు గురైనవారి సంఖ్య 27,000లకు రెట్టింపయ్యింది. స్త్రీలపై ప్రతి ఏడు నిమిషాలకు ఒక లైంగిక దౌర్జన్యం జరుగుతున్నట్లు జర్మనీ నివేదించింది.

అత్యాచారం అమాయకులైన పురుషులను కూడ బాధపెడుతుంది.a “అయిష్టంతో, సంశయంతో, భయంతో ఉన్న ప్రజల మధ్య జీవించడానికి పురుషులు బాధపడతారు. వారు వారి భార్యలు, తల్లులు, అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు, స్నేహితుల విషయంలో కూడా వారు ఎడతెగక బాధననుభవించవలసివస్తుంది, లేదా వారు ప్రేమించిన వారిలో ఎవరైనా అత్యాచారానికి గురైతే వారు అట్టి అపరాధాన్ని మోస్తూ తెగబాధపడవలసివస్తుంది.

ఎందుకింత పెరుగుదల?

అత్యాచారాన్ని సహిస్తూ, స్త్రీలతో అనుచితంగా వ్యవహరించే సమాజాలలో, అత్యాచారం బాగా వృద్ధిచెందుతుంది. అనేక దేశాలలో, ప్రచారసాధనాల ద్వారా, కుటుంబాలద్వారా, స్నేహితులద్వారా లైంగిక సంబంధాన్ని గూర్చి బాల్యంనుండే స్త్రీ పురుషులకు తప్పుడు సమాచారం అందించబడింది. లైంగికత, హింస యీ రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కల్గినవని, స్త్రీలు యిష్టపడినా లేకపోయినా, వారు పురుషులకు లైంగిక తృప్తినందించడానికే ఉన్నారనే విషపూరిత భావనలు వారు నేర్చుకుంటున్నారు.

గుమస్తాగా పనిచేస్తున్న 23 సంవత్సరాల, జే మనోవైఖరిని గమనించండి. “నిజమైన మగవాడివనిపించుకోవాలంటే, నీవు తప్పకుండా అనేక స్త్రీలతో తరచు లైంగిక సంబంధాలు కలిగియుండాలని సమాజం చెప్తుంది,” అని యితడు చెప్పాడు. “సరే, నీవు అలా ఉండకపోతే ఏమౌతుంది? నీవు నిజమైన మగాడివేనా?” ఇలాంటి రెచ్చగొట్టే మాటలద్వారా ఒకవేళ ఒక స్త్రీ అతడు కోపపడేటట్లు లేదా విసుగు రప్పించేటట్లు చేస్తే, అతడామెపై అత్యాచారం చేయవచ్చును.

స్త్రీల యెడల అలాంటి హింసాత్మక నిర్దాక్షిణ్య ధోరణులు కల్గివుండటం ఈ అత్యాచార-సంస్కృతిలో సాధారణమైపోయింది అని పరిశోధకురాలగు లిండా లిడ్రే నమ్ముతుంది. “చాలామట్టుకు అత్యాచారం చేసేవాడు, సమాజం ఎలా ఆడమంటే అలా ఆడుతున్నాడని” ఆమె చెబుతుంది. నాశనకరమైన ఆ సాంఘిక దురాచారానికి చలనచిత్రాలు, టెలివిజన్‌ దోహదం చేస్తున్నాయి. అశ్లీల సాహిత్యాలలో అత్యాచారమనేది ముఖ్యాంశమైపోయింది, కానీ అశ్లీల సాహిత్యం ఒక్కటి మాత్రమే కాదు నిందింపబడవలసింది. హింసాప్రవృత్తి లేకుండా లైంగికతను స్పష్టంగా చూపించే చలనచిత్రాలకంటే, లైంగికత లేకుండా హింసాప్రవృత్తిగల చలన చిత్రాలే ఎక్కువగా స్త్రీల యెడల చెడుకోరిక కల్గేటట్లు చేస్తున్నాయని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. “మరెక్కడా లేని నైపుణ్యంతో లైంగికతను చిత్రీకరించడం వల్ల,” టెలివిజన్‌ కూడా దోషియేనని పవెల్‌ చెప్పాడు. వార్తలలోని సమాచారమేమిటి? “కోపమొస్తే ఎవరినైనా బాధపెట్టు.”

ఈ సూచన ఈ దుష్పలితాలతో మనదైనందిన జీవితంలో కార్యరూపందాల్చింది. ఈ స్వేచ్ఛాయుత ప్రపంచంలో, స్త్రీలు లైంగికంగా అచ్చియున్నారని మగవారు తరచూ భావిస్తారు, ముఖ్యంగా మగవాడు స్త్రీకోసం డబ్బు ఖర్చుపెట్టినపుడు లేదా ప్రప్రథమంగా అతని ఆలోచనలను స్వీకరించినప్పుడు ఇలా భావిస్తాడు.

“లైంగిక సంబంధాల విషయానికొస్తే, ‘వద్దు’ అని ఒక ఆడది చెబితే అది తరచూ అర్థరహితమని,” పత్రికా రచయిత రోబిన్‌ వార్షా చెప్పాడు. దాని పర్యవసానమే, తరుచూ జరిగే అత్యాచారాలు.

“రెండవ అత్యాచారం”

కాథీ 15 సంవత్సరాల వయస్సులోనే, తన హైస్కూల్‌ హాకీ జట్టులోనున్న ముగ్గురు సభ్యులచే బలత్కరించబడింది. ఆమె కుటుంబ సభ్యులు కోర్టులో నిందారోపణ చేయగా, ఆమెను తన స్నేహితులు, ఇరుగుపొరుగువారు, పరాయివాళ్లు బహిష్కరించి, వేధించారు. “కుర్రాళ్లు కుర్రాళ్లలాగే ప్రవర్తిస్తారని మీరునుకోవచ్చని” ఆ కుటుంబానికి చెప్పారు. కాథీని పాఠశాలలో చెడ్డపేర్లతో పిలిచేవారు, ఆమె స్కూలు సొరుగుమీద బెదరింపు మాటలు కన్పించేవి. ఆమెపై అత్యాచారం చేసినవాళ్లను బహిష్కరించి, ప్రజాసేవ చేయాలని ఆంక్షలువిధించి శిక్షించిన తరువాత మరలా వారే, క్రీడాకారులలో హీరోలుగా వాళ్ల స్కూలు తరపున వెళ్లారు. కాథీ కొన్ని నెలల పాటు వేదనననుభవించి, చివరకు ఆత్మహత్య చేసుకుంది.

అత్యాచార బాధితులు అత్యాచారం చేసేవాళ్ల చేత, మొదట శారీరకంగాను తర్వాత ఇతరులచేత మానసికంగాను ఎలా బాధించబడతారో చెప్పడానికి కాథీది ఒక విశాద గాథ. అత్యాచారం యెడలగల దృక్పథాలు, అపోహలే, ఈ నేరానికి బాధితులే నిందితులని అనడానికి దారి తీసిందని చాలామంది స్త్రీలు గుర్తించారు. బాధితురాలికి సహాయంచేయవలసిన వారే అంటే స్నేహితులు, కుటుంబం, పోలీసులు, వైద్యులు, న్యాయవాదులు తీర్పు చెప్పే సభ్యులే అత్యాచారం చేసిన వ్యక్తివలెనే అట్టి అపోహలలో పాలుపంచుకొని బహుగా బాధితురాలిని నొప్పించవచ్చును. ఈ సమస్య ఎంత గంభీరమైనదంటే కొంతమంది దీనికి “రెండవ అత్యాచారమని” పేరు పెట్టారు.

అత్యాచారానికి సంబంధించిన కల్పనా కథలు ఓ తప్పుడు భద్రతను కల్గిస్తాయి. వేరే మాటలో చెప్పాలంటే, ఒకవేళ బాధితురాలి ప్రవర్తనలో ఏదో తప్పుపట్టుకోగలిగితే—ఆమె బిగువైన దుస్తులు ధరించిందని లేదా ఆమె ఒంటరిగా రాత్రిపూట బయటకు వెళ్లిందని లేదా నిజంగా లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని కోరుకుందని—మీరు లేదా మీరు ప్రేమించిన వ్యక్తులు ఇటువంటి ప్రవర్తనను విసర్జిస్తే సురక్షితంగా ఉంటారు, గనుక మీరెన్నడూ అత్యాచారానికి గురికారు. బదులుగా, ఆమె ఏ విధంగా బట్టలు ధరించినప్పటికి, అత్యాచారం అనేది దౌర్జన్యంతో కూడిన, బుద్ధిలేని పనియైయుంది, ఇది ఎవరికైనా జరుగవచ్చును, దీనిని అంగీకరించడమనేది చాలా భయకంపితుల్ని చేస్తుంది.

“అది నీచమైంది, సాధారణంగా మీరు చేయగల్గేదేమంటే, అది మీకు జరుగదని నమ్మడమే,” తాను “మంచివాడని గౌరవనీయుడని” తలంచిన వ్యక్తిచేత అత్యాచారం చేయబడిందని ఒక స్త్రీ చెబుతుంది.

అత్యాచార కల్పనలు, నిజాలు

బాధితురాలిపై నేరం మోపడానికి, దుష్కృత్యాలు చేసేవారిని ప్రోత్సహించే దృక్పథాలు నిత్యమూ కొనసాగడానికి, అత్యాచారాన్ని గూర్చి దీర్ఘకాలంగా వున్న అపోహలలో కొన్ని ఈ క్రింద యివ్వబడినవి:

కల్పన: కొత్తవాడు ఒక స్త్రీని బలవంతపెట్టినపుడు మాత్రమే అత్యాచారం జరుగుతుంది.

నిజం: అత్యాచారం చేయబడ్డ చాలామంది స్త్రీలపై దౌర్జన్యం చేసింది వాళ్లకు తెలిసిన వారే, వాళ్లు నమ్మిన వ్యక్తులే. ఒక అధ్యయనం గుర్తించినట్లుగా 84 మంది బాధితులను వాళ్లకు తెలిసినవారు, నమ్మిన వారే వారిపై అత్యాచారం చేశారు. మరియు 57 శాతం అత్యాచారాలు డేటింగ్‌ సమయంలో జరిగినవే. వివాహమైన ఏడుగురు స్త్రీలలో ఒకరు తన సొంత భర్త చేతనే అత్యాచారం చేయబడుతుంది.b పైబడేవాడు పరాయివాడైనా, భర్తయినా లేక డేటింగ్‌ చేసే వాడైనా అత్యాచారాలనేవి మానసికంగా గాయపరచేవి హింసాత్మకమైనవే.

కల్పన: ఒక ఆడది తనకు తగిలిన గాయాలను తర్వాత చూపించితేనే అది అత్యాచారం.

నిజం: వారు ప్రతిఘటించినా లేకపోయినా, కొంతమంది స్త్రీలు మాత్రమే చితికినగాయాలు, తెగినగాయాలవంటి కంటికి కనిపించే ఆధారాలను చూపిస్తారు.

కల్పన: ఒక అత్యాచార బాధితురాలు గట్టిగా ప్రతిఘటిస్తే తప్ప నేరంలో తన వంతు కూడా ఉన్నట్లే.

నిజం: అత్యాచారమనేది నిజానికి ఒక వ్యక్తి యిష్టానికి వ్యతిరేకంగా జరిగేది. అంటే లైంగికంగా లొంగదీసుకోవడానికి బలవంతపెట్టినప్పుడు లేదా బలవంతపెట్టడానికి బెదిరించినపుడు అది జరుగుతుంది. ఒక ఇష్టంలేని బాధితురాలిపై అత్యాచారం చేసేవాన్ని అలా బలవంతపెట్టడమే అతనిని అత్యాచారిగా చేస్తుంది. కాబట్టి అత్యాచార బాధితురాలు వ్యభిచారి కాదు. రక్తసంబంధులవలన మోసగించబడిన వ్యక్తివలెనే, ఆమెకు ఇష్టంలేని పనికి లొంగడానికి బలవంత పెట్టబడవచ్చును. అత్యాచారం చేసేవాడు లొంగిపొమ్మని ఒక స్త్రీని భయపెట్టినా లేక తికమక పెట్టినా, దాని అర్థం అట్టి క్రియకు ఆమె అంగీకరించిందని కాదు. అంగీకారం అనేది భయంలేకుండా ఇష్టంతో కూడినదే గానీ అయిష్టమైందికాదు.

కల్పన: అత్యాచారం కామోద్రేకంతో కూడిన చర్య.

నిజం: అత్యాచారమనేది దౌర్జన్యంతో కూడిన క్రియ. మగవాళ్లు అత్యాచారం చేసేది, వేరొక వ్యక్తిపై తన ప్రతాపాన్ని చూపించడానికే గాని, కేవలం లైంగిక దుశ్చర్యకు మాత్రమే కాదు.c

కల్పన: ఒక స్త్రీ పురుషున్ని అతని కామాన్ని ఇక అతడు అదుపు చేసుకోలేనంతగా అతన్ని ఏడిపించవచ్చు లేదా నడిపించవచ్చును.

నిజం: అత్యాచారం చేసే మగవాళ్లు మిగతా మగవాళ్ల కంటే ఎక్కువ కాముకత్వం కలిగి లేరు. ముఖ్యంగా, అత్యాచారం చేసేవాళ్లలో ముగ్గురిలో ఒకరు లైంగిక చర్యను పూర్తిచేయలేకపోతున్నారు. చాలా కేసులలో అత్యాచారమనేది ఓ పథకం ప్రకారం చేస్తున్న చర్యయే, కాని దానంతట అదే జరిగే ప్రేరణ కాదు. అత్యాచారం చేసేవ్యక్తులలో క్రొత్తవాడే గాని అపరిచయస్థుడే గాని సాధారణంగా తమ బారిన పడేవారిని—క్రొత్తవాడైతే పన్నాగము పన్ని, ఆమె ఒంటరిగా ఉండేంతవరకు రహస్యంగా వెంటాడతాడు, పరిచయస్థుడైతే ఆమె ఏకాంతంగా ఉండే పరిస్థితిని కల్పించి, కార్యం ముగిస్తాడు.

కల్పన: పురుషుని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక స్త్రీ అత్యాచారం జరిగిందని అబద్ధమాడవచ్చు లేదా లైంగిక సంబంధాన్ని కల్గియున్నామని చెప్పుకోవడానికి వారు సిగ్గుపడవచ్చు.

నిజం: ఇతర హింసాత్మక నేరాల రేటుతో సమానంగానే అత్యాచారానికి సంబంధించిన తప్పుడు ఫిర్యాదులు ఇవ్వబడుచున్నాయి. గాని, అత్యాచారం తక్కువగా రిపోర్టుచేయబడుతుందని పరిశోధకులు ఒప్పుకుంటున్నారు.

కల్పన: ఒక ఆడది ఉద్రేకం గొలిపే దుస్తులు ధరించడం, త్రాగడం, డేటింగ్‌ సమయంలో ఒక మగాడు తన ఖర్చులు భరించేటట్లు చేయడంలేదా అతని ఇంటికి వెళ్లడం ద్వారా అత్యాచారాన్ని ఆహ్వానించవచ్చును.

నిజం: తప్పుడు నిర్ణయం తీసుకోవడం, కపటంలేకుండా లేదా అమాయకంగా ఉండడమంటే ఒక ఆడది అత్యాచారానికి అర్హురాలని దాని భావం కాదు. అత్యాచారం చేసేవారు మాత్రమే అత్యాచారానికి పూర్తి బాధ్యులు.

[అధస్సూచీలు]

a అత్యాచార బాధితులలోని 10 మందిలో ఒకడు పురుషుడే.

b ఒక భర్త కామంతో బలవంతంగా భార్యపైబడినపుడు, అక్కడ అత్యాచారం జరుగుతుంది. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా భార్య శరీరంపై భర్తకు “అధికారం” వుందనేదానిని కొందరు భర్తలు తమకు సంపూర్ణాధికారమియ్యబడినట్లు నమ్ముతారు. ఏమైనను, “పురుషులు తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై యున్నారు,” అని కూడా పౌలు వివరించాడు. అపొస్తలుడైన పేతురు వివరించినదేమనగా “మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, బలహీనమైన ఘటమని, భార్యను సన్మానించుడి,” ఇది అత్యాచారానికి లేదా లైంగికంగా బలవంత పెట్టడానికి ఏ విధమైన తావును యివ్వడం లేదు.—1 కొరింథీయులు 7:3-5; ఎఫెసీయులు 5:25, 28, 29; 1 పేతురు 3:7; కొలొస్సయులు 3:5, 6; 1 థెస్సలొనీకయులు 4:3-7.

c “నేరమనేది కేవలం కామంతో కూడిన క్రియకాదు, కాని నేరంచేసేవాడు హింసాత్మకమైన నేరాన్ని చేయుటకు కామోద్రేకాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తాడు.”—వాండ్‌ కీస్‌-రాబిన్‌సన్‌, డివిజన్‌ చీఫ్‌, సెక్య్సుల్‌ ఆఫెన్స్‌ యూనిట్‌, బాల్‌టైమోర్‌ పట్టణము, మోరీల్యాండ్‌.

[14వ పేజీలోని చిత్రం]

అమెరికాలో, ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరు అత్యాచారానికి గురయ్యారు లేదా వారిపై అలాంటి ప్రయత్నం జరిగింది.

[15వ పేజీలోని చిత్రం]

అత్యాచారాన్ని సహిస్తూ స్త్రీలతో అనుచితంగా వ్యవహరించే సమాజాలలో అత్యాచారం బాగా వృద్ధి చెందుతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి