కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 6/8 పేజీలు 7-9
  • కుటుంబ నియంత్రణ—క్రైస్తవ దృక్పథం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కుటుంబ నియంత్రణ—క్రైస్తవ దృక్పథం
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడిచ్చిన బాధ్యత
  • సంతాన నిరోధం
  • తల్లిదండ్రులారా—యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • పిల్లలు “యెహోవా ఇచ్చే ఆస్తి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • వాళ్ళకు పిల్లలెందుకు లేరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • పాఠకులనుండి ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 6/8 పేజీలు 7-9

కుటుంబ నియంత్రణ—క్రైస్తవ దృక్పథం

మొట్టమొదటి ప్రపంచ జనాభా సమావేశంలో, 1974లో కూడిన 140 దేశాలు, దంపతులందరు “ఎంతమంది పిల్లల్ని, ఎంత కాలవ్యవధిలో కలిగివుండాలో నిర్ణయించుకొనే ప్రాథమిక హక్కును, అలా చేయటానికి కావలసిన సమాచారం, విద్య, మరియు ధనం కలిగి వుండాలని” తీర్మానించారు.

ఆ తీర్మానం చాల మంచిదని అనేకులు భావిస్తున్నారు. నిజమే, దేవుడు ఆదాము హవ్వలను, తరువాత నోవహు కుటుంబాన్ని “ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించుడని” చెప్పాడు, అయితే క్రైస్తవులకు అలాంటి ఆజ్ఞ ఏదీ ఇవ్వబడలేదు. (ఆదికాండము 1:28; 9:1) లేఖనాలు క్రైస్తవ దంపతులను పిల్లలు కలిగివుండుడని గాని పిల్లలు లేకుండా వుండుడని గాని ప్రోత్సహించడం లేదు. వివాహిత దంపతులు పిల్లలను కలిగివుండాలా వద్దా, పిల్లలు కావాలనుకుంటే ఎంతమంది, ఎప్పుడు వారిని కలిగివుండాలి అని తమకు తాము నిర్ణయించుకోవచ్చును.

దేవుడిచ్చిన బాధ్యత

దంపతులు “ఎంతమంది పిల్లల్ని, ఎంత కాలవ్యవధిలో కలిగివుండాలో బాధ్యతాయుతంగా” నిర్ణయించుకోవాలని ప్రపంచ జనాభా సమావేశ వ్యాఖ్యానం చెప్పడం మీరు గమనించారా? బాధ్యతకు సంబంధించిన ఈ సూత్రం బైబిలుతో పొందికను కలిగివున్నది. పిల్లలు దేవుడిచ్చిన అమూల్యమైన బహుమానమైనప్పటికీ, బహుమానంతోపాటు గంభీరమైన బాధ్యత కూడ వస్తుందని క్రైస్తవ తలిదండ్రులు గుర్తిస్తారు.

మొట్టమొదటగా, పిల్లల వస్తుసంబంధమైనవాటి విషయంలో శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత ఉంది. బైబిలు ఇలా చెబుతుంది: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును.”—1 తిమోతి 5:8.

ఒకరు తమ కుటుంబానికి కేవలం ఆహార ఏర్పాటుచేసి బిల్లులు కట్టడమే కాదు అలా చేయడం ఎంతో పెద్ద బాధ్యతే అయినప్పటికి అందులో ఇంకా ఎంతో ఇమిడి వుంది. బాధ్యతగల క్రైస్తవదంపతులు, వారి కుటుంబ పరిమితిని గూర్చి పథకం వేసుకొనేటప్పుడు, తల్లి శారీరక ఆరోగ్యం, ఆమె భావోద్రేక, మానసిక, ఆత్మీయ సంక్షేమాన్ని కూడ దృష్టిలో ఉంచుకోవాలి. ఒక బిడ్డను గూర్చి శ్రద్ధ వహించటం చాల సమయాన్ని తీసుకుంటుంది, బిడ్డ తరువాత బిడ్డ కలిగినట్లైతే, తల్లులు సాధారణంగా వారి విశ్రాంతిని, వినోదాన్ని, వ్యక్తిగత అభివృద్ధిని, క్రైస్తవ కార్యక్రమాలలో పాల్గొనడమేగాక వారి శారీరక, ఆత్మీయ ఆరోగ్యాలను కూడ తరచూ త్యాగం చేస్తూవుంటారు.

బాధ్యతగల క్రైస్తవ తలిదండ్రులు వారి పిల్లల అవసరతలను కూడ గమనిస్తారు. ది స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌ పాపులేషన్‌ 1991 చెప్పిన విధంగా: “పిల్లల మధ్య తక్కువ వ్యవధి గల పెద్ద పెద్ద కుటుంబాలలో జన్మించిన పిల్లలు వారి సహోదర సహోదరీలతో ఆహారం, వస్త్రాలు, తలిదండ్రుల అనురాగం వంటి వాటికొరకు పోటీపడవలసి వస్తుంది. వారు అంటురోగాలకు కూడ సులభంగా గురౌతారు. ఈ పిల్లలు దుర్భలమైన ఆ బాల్య సంవత్సరాలను దాటగల్గినా, వారి పెరుగుదల కుంటుపడి, మానసిక అభివృద్ధి బలహీనపడే అవకాశం ఎక్కువగావుంది. ఈ పిల్లల బావిజీవిత ఆశలు బాగా దెబ్బతింటాయి.” అన్ని పెద్ద కుటుంబాలలో ఇదే పరిస్థితి కాదనుకోండి, కాని ఎంతమంది పిల్లలను కలిగివుండాలనేది పథకం వేసుకొనేటప్పుడు క్రైస్తవ దంపతులు ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకోవాలి.

తమ పిల్లల ఆత్మీయతను గూర్చి శ్రద్ధవహించాల్సిన బాధ్యత క్రైస్తవ తలిదండ్రులపై ఉన్నదని బైబిలిలా ఆజ్ఞాపిస్తున్నది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”—ఎఫెసీయులు 6:4.

నైజీరియాలో శాసనాన్ని బోధించే ఇమెకా అనే ఓ క్రైస్తవుడు, ఓ సంవత్సరం క్రితం వివాహం చేసుకున్నాడు కాని పెద్ద కుటుంబానికి తండ్రి కావాలని ఎంతమాత్రం తొందరపడ లేదు. “ఎంతమంది పిల్లల్ని కలిగివుండాలనేది నేను నా భార్య కలిసి చర్చించుకున్నాం. ఐదుగురిని కలిగివుందామనుకున్నాం కాని ముగ్గురు చాలని నిర్ణయించుకున్నాం. తరువాత ఇద్దరైతే బాగుంటుందని తీర్మానించుకున్నాం. పిల్లల్ని బైబిలు సూత్రాల ప్రకారం పెంచడం చాలా కష్టం. అది చాలా బరువైన బాధ్యత.”

దేవుని సేవకు తమ పూర్తి సమయాన్ని వెచ్చించటానికై కొంతమంది క్రైస్తవ దంపతులు అసలు పిల్లలను కలిగివుండకూడదని నిర్ణయించుకున్నారు. పిల్లలు లేకుండా వుండే విషయంలో తన భర్తతో ఏకీభవించిన ఆఫ్రికాలోని ఒక మిషనరీ ఇలా అన్నది: “పిల్లలు లేకుండా వుండడంవల్ల నేనేదో పోగొట్టుకొన్నానని అనుకోను. నేను నా భర్త తలిదండ్రులుగా పొందగల ఆనందాన్ని అనుభవించక పోయినప్పటికీ, మా జీవితాలు ఇతర సంతోషాలతో నిండివున్నాయి. ఇతరులు బైబిలు సత్యాలను నేర్చుకొనుటకు సహాయం చేయడంలో నిమగ్నమై ఉండడం ద్వారా, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మాకు ఆత్మీయ పిల్లలున్నారు. మేము వారిని ప్రేమిస్తాము, వారు మమ్మల్ని ప్రేమిస్తారు. మా మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. కారణసహితంగానే అపొస్తలుడైన పౌలు, తాను ఆత్మీయంగా సహాయం చేసిన వారి యెడల కలిగివున్న సున్నితమైన ప్రేమనుబట్టి తననుతాను పాలనచేసే తల్లికి పోల్చుకున్నాడు.”—1 థెస్సలొనీకయులు 2:7, 8.

సంతాన నిరోధం

సంతాన నిరోధాన్ని బైబిలు ఖండిస్తున్నదా? ఖండించడం లేదు. ఈ ఎంపిక దంపతులకే వదిలివేయబడింది. ఒకవేళ వివాహిత దంపతులు సంతాన నిరోధాన్ని పాటించాలనుకుంటే వారు వారికిష్టమైన గర్భనిరోధకాలను ఎన్నుకోవడమన్నది వారి వ్యక్తిగతమైన విషయం. అయితే ఒక క్రైస్తవజత ఎన్నుకొనే సంతాన నిరోధక పద్ధతి జీవానికి సంబంధించిన పరిశుద్ధతను గౌరవించటంపై ఆధారపడి వుండాలి. ఒక వ్యక్తి జీవితం గర్భధారణతోనే మొదలౌతుందని బైబిలు సూచిస్తుంది గనుక, ఎదుగుతున్న బిడ్డ జీవాన్ని అంతం చేయడం లేక గర్భస్రావం చేయడంవంటి గర్భనిరోధకాలను క్రైస్తవులు నిరోధించాలి.—కీర్తన 139:16; కు పోల్చండి నిర్గమకాండము 21:22, 23; యిర్మీయా 1:5.

కాబట్టి, కుటుంబ నియంత్రణ విషయంలో దంపతులు తగినవిధంగా వివిధ ఎంపికలు చేసుకోవచ్చు. కొంతమంది పిల్లల సంఖ్యను పరిమితి చేసుకోవచ్చు. ఇతరులు, కొన్ని గర్భనిరోధక పద్ధతులను పాటించడంద్వారా అసలు పిల్లలు లేకుండా వుండుటకు నిర్ణయించుకోవచ్చు. ఎన్నో గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి వాటిలో మేలు కీడులున్నాయి. ఏ పద్ధతి ఎన్నుకోవాలన్న విషయంలో కొన్ని పద్ధతులు ఇతరవాటికంటె ఎంతో శ్రేష్ఠమైనవని దంపతులు గుర్తుంచుకోవాలి. వాటివల్ల కలిగే దుష్పరిణామాలను గూర్చి విచారించి తెలుసుకోవాలి. సంతాన నిరోధక పద్ధతులను గూర్చి సలహాలిచ్చుటకు, వారి అవసరతలకు తగిన పద్ధతిని ఎన్నుకొనుటకై దంపతులకు సహాయం చేయటానికి అనువుగా వైద్యులు, కుటుంబ నియంత్రణ శిబిరాలు సంసిద్ధంగా ఉన్నాయి.

ఎక్కువ మంది, తక్కువ మంది లేక అసలు పిల్లలు లేకుండా వుండాలా అనే విషయాన్ని గూర్చి దంపతులు నిర్ణయించు కోవడమన్నది వారి వ్యక్తిగత విషయం. దీర్ఘకాల పరిణామాలుగల యీ నిర్ణయం ప్రాముఖ్యమైనది. వివాహిత దంపతులు ఈ విషయాన్ని జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా ఆలోచించడం తెలివైన పని. (g93 2/22)

[8,9వ పేజీలోని బాక్సు]

పేరుగాంచిన కుటుంబ నియంత్రణ పద్ధతులు

సంతాననిరోధక శస్త్రచికిత్స

పురుషులలో: వృషణకోశానికి చిన్న గాటు పెట్టి, వీర్యనాళాలను కత్తిరించడం ద్వారా చేసే సులభమైన శస్త్రచికిత్సా పద్ధతి.

స్త్రీలలో: అండం గర్భాశయంలోకి ప్రయాణించకుండా నియంత్రించడానికి స్త్రీబీజవాహికలను ముడివేసే లేదా కత్తిరించే శస్త్రచికిత్సా పద్ధతి.

ప్రయోజనాలు: కుటుంబ నియంత్రణ పద్ధతులన్నింటిలోను సంతాననిరోధక శస్త్రచికిత్స అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

లోపాలు: సంతానాన్ని శాశ్వతంగా నిరోధించగలదు. పురుషులలోను, స్త్రీలలోను శస్త్రచికిత్సలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పునఃస్థాపించినవి, అయినా ఇది నమ్మదగినదికాదు.a

కుటుంబ నియంత్రణా మాత్రలు

వీటిలో ప్రోజెస్టిన్‌-ఓన్లీ అనే చిన్న మాత్రకూడా చేర్చబడింది. అండం పరిణతి చెంది విడుదల కాకుండ నిరోధించేందుకుగాను ఇవి స్త్రీలోని సాధారణ హార్మోను ప్రమాణాలతో జోక్యంచేసుకోడానికి పనిచేస్తాయి.b

ప్రయోజనాలు: గర్భధారణను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

లోపాలు: కొన్ని ప్రతికూల పరిణామాలు కలవు, కాని 40 సంవత్సరాల లోపువయస్సుండి పొగత్రాగని ఆరోగ్యవంతులలో ఇవి తక్కువే.

డయాఫ్రం మరియు వీర్యనాశని

డయాఫ్రం అనేది మెత్తని అంచుగల్గి డొప్ప ఆకారంలోనున్న ఒక రబ్బరు గిన్నె. వీర్యాన్ని నాశనం చేసే జెల్లీ లేదా క్రీమ్‌ను (వీర్యనాశని) ఈ గిన్నెకు పూసిన పిదప, సర్విక్స్‌చుట్టూ అమరేటట్లుగా యోనిలోనికి ప్రవేశపెట్టబడుతుంది.

ప్రయోజనాలు: తగినట్లుగా ఉపయోగించినట్లయితే, నమ్మదగినది, సురక్షితమైన పద్ధతి.

లోపాలు: భార్యాభర్తలు సంభోగించే ప్రతిసారి కచ్చితంగా ఉపయోగించాలి. ఈ సాధనాన్ని లోపల అమర్చుకోడానికి నేర్పు అవసరము, మరియు దీనిని సంభోగానికి ముందే లోపల అమర్చుకోవాలి, పిదప దాన్ని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఉంచాలి.

సెర్వికల్‌ క్యాప్‌

ఇది డయాఫ్రం కంటే చిన్నదిగానున్న గిన్నెవంటి ఒక ప్లాస్టిక్‌ లేదా రబ్బరు సాధనం. డయాఫ్రం వలే, దీన్నికూడా సర్విక్స్‌మీదనే అమర్చాలి అయినా ఎక్కువ భద్రంగా అమరుతుంది, మరియు దీనిమీద పూయడానికి తక్కువ వీర్యనాశక జెల్లీ లేదా క్రీమ్‌ అవసరమౌతుంది.

ప్రయోజనాలు: ప్రయోజనాల్లో ఇది డయాఫ్రంతో పోల్చదగినది, మరియు అదే ప్రదేశంలో 48 గంటలు అలాగే వుండగలదు. ఈ సమయంలో సంభోగించే ప్రతిసారి వీర్యనాశని ఉపయోగించనవసరంలేదు.

లోపాలు: డయాఫ్రంకంటే దీనిని లోపల అమర్చడం చాలా కష్టం, మరియు సర్విక్స్‌పై అమర్చిన తర్వాత దాన్ని, సంభోగానికి ముందు, తర్వాతకూడా పరిశీలించాలి. గర్భాశయం లేదా సెర్విక్స్‌కి సంబంధించిన అంటురోగాలు వచ్చే అవకాశముంది. ఈ క్యాప్‌ను స్త్రీలు సాధారణ పాప్‌ పరీక్షల తర్వాతనే ఉపయోగించాలి.

స్పాంజి

సర్విక్స్‌ను మూసివేసి, వీర్యాన్ని భౌతిక, రసాయనపరంగా అడ్డుకోవడానికి యోనిద్వారా ప్రవేశపెట్టబడే ఒక పాలీయూరిథేన్‌ స్పాంజి అనబడే సాధనం. దీనిని ఉపయోగించిన తర్వాత పారవేయాలి.

ప్రయోజనాలు: ఈ స్పాంజిని లోపల 24 గంటల వరకూ ఉంచవచ్చును, ఆ కాలంలో పదేపదే సంభోగం చేసినప్పటికి అది అమోఘంగా పనిచేస్తుంది.

లోపాలు: కొందరిలో ప్రతికూల శరీరతత్వాన్ని కల్గిస్తాయి. మరికొందరిలో విపరీతమైన జ్వరం, గొంతునొప్పితో కూడిన ప్రక్రియ కల్గుతున్నట్లు వారు ఫిర్యాదు చేస్తున్నారు.

ఇంట్రాయూటిరిన్‌ సాధనం

దీనిని ఐయుడి, లూప్‌, లేదా కాయిల్‌ అనికూడా అంటారు, ఈ ప్లాస్టిక్‌ లేదా లోహపు సాధనం గర్భాశయంలో అమర్చబడుతుంది. ఇది నిజంగా ఎలా పనిచేస్తుందనేది సందేహాస్పదమైనప్పటికి, అనేక విధాలుగా ఇది గర్భధారణను నిరోధిస్తుందని వైద్యులు నమ్ముతున్నారు. వీటిలో ఒక మార్గమేదనగా ఒకవేళ ఫలదీకరణం చెందిన అండం గర్భకోశ గోడను అంటుకొనకుండా అడ్డుకుంటుంది.

ప్రయోజనాలు: నమ్మదగిన ఒక కుటుంబ నియంత్రణా పద్ధతి.

లోపాలు: కొన్నిసమయాల్లో రక్తస్రావానికి లేదా నొప్పికి దారితీస్తుంది, మరికొన్ని సమయాల్లో అది పనిచేసే పద్ధతే గర్భస్రావానికి సమానం కావచ్చును.c

కండోమ్‌లు (తొడుగులు)

వీర్యాన్ని యోనిలో ప్రవేశించకుండా నిరోధించుటకు పురుషాంగానికి అమర్చే ఒక తొడుగు.

ప్రయోజనాలు: సురక్షితమైనది, కుటుంబ నియంత్రణకు అమోఘంగా పనిచేసే పద్ధతి. ఎయిడ్స్‌తో సహా, సుఖవ్యాధులు సంక్రమించే అవకాశాలను తగ్గిస్తుంది.

లోపాలు: ఇది ఉపయోగించడం వల్ల సంపర్కానికి మధ్యలో అంతరాయం కల్గుతుంది గనుక కొందరు దీన్ని యిష్టపడరు.

ఉపసంహరణ

వీర్యస్ఖలనానికి కొంచెంముందు పురుషాంగాన్ని యోనిలోనుండి ఉపసంహరించుకొనుట.

ప్రయోజనాలు: ఏ సిద్ధపాటు, ఖర్చు లేదా బాహ్యపరికరాలు ఏమీ అవసరంలేదు.

లోపాలు: లైంగికంగా తృప్తి ఉండదు, చాలా నిగ్రహశక్తి అవసరం, అంత ఎక్కువ నమ్మదగిందికాదు.

ఋతుక్రమ పద్ధతి

స్త్రీ ఋతుచక్రంలో అండం మంచి పరిపక్వస్థితిలోనున్న రోజులలో దంపతులు సంభోగించకుండా మానుకొనుట.

ప్రయోజనాలు: సురక్షితమైనది, ప్రతికూల పరిణామాలు లేవు, సంభోగ సమయంలో ఏచర్యలూ తీసుకోనవసరం లేదు.

లోపాలు: భార్యాభర్తలు పిల్లలు కలుగకూడదని చాలా దృఢంగా నిశ్చయించుకుని, ఈ పద్ధతి పాటిస్తేనే తప్ప ఇది గర్భాన్ని నిరోధించడంలో సఫలమయ్యే పద్ధతి కాదు.

హార్మోనుల ఇంప్లాంట్‌

సరిక్రొత్త గర్భనిరోధక పద్ధతి, అతిచిన్న సిలికాన్‌ సిలిండర్ల పరంపరలు స్త్రీ చేతిచర్మం క్రింద నాటబడతాయి. ఇవి ఐదు సంవత్సరాల వరకూ, రక్తధారల్లోకి ఎడతెగకుండా అతిస్వల్ప పరిమాణంలో ఒక హార్మోనును విడుదల చేస్తాయి. ఈకాలంలో ఆమె గర్భం ధరించకుండా కాపాడబడుతుంది.

ప్రయోజనాలు: అత్యంత అమోఘంగా పనిచేస్తుంది. హార్మోనును తీసివేయడంద్వారా ఫలనసామర్థ్యాన్ని తిరిగి పునఃస్థాపించవచ్చును.

లోపాలు: అతి తక్కువ. ప్రోజెస్టిన్‌-ఓన్లీ అనే కుటుంబ నియంత్రణ మాత్ర వంటివే. (మినీపిల్‌) ప్రోజెస్టిన్‌-ఓన్లీ అనే లోనికిప్రవేశపెట్టే వాటిని ఉపయోగించితే, గర్భం సాధారణంగా గర్భస్రావంద్వారా నిరోధించబడుతుంది.d

[అధస్సూచీలు]

a ది వాచ్‌టవర్‌ మే 1, 1985, పుట 31లో సంతాననిరోధక శస్త్రచికిత్స క్రైస్తవ నియమాలకు అనుకూలమైనదేనా అనే విషయం చర్చించబడింది.

b ది వాచ్‌టవర్‌ జూన్‌ 15, 1989, పుట 29లో కుటుంబ నియంత్రణ మాత్రలు సంతానాన్ని ఏవిధంగా నిరోధిస్తాయో చర్చించబడింది.

c ది వాచ్‌టవర్‌ మే 15, 1979, పుట 30 నుండి 31 వరకు ఐయుడి అనేది క్రైస్తవ నియమాలతో ఏకీభవిస్తుందా అనేదాని గూర్చి చర్చించబడింది.

d ది వాచ్‌టవర్‌ జూన్‌ 15, 1989, పుట 29లో కుటుంబ నియంత్రణ మాత్రలు ఏవిధంగా గర్భాన్ని నిరోధిస్తాయో చర్చించబడింది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి