కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 6/8 పేజీలు 10-12
  • మీకు కట్టుడుపండ్లు అవసరమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు కట్టుడుపండ్లు అవసరమా?
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కట్టుడుపండ్లు ఎందుకు?
  • ఈ రెండురకాల పండ్లమధ్యగల తేడా
  • మీరు మీ పళ్ళు పటపటలాడిస్తారా?
    తేజరిల్లు!—1998
  • ఆర్తోడాన్టిక్స్‌—ఏమి ఇమిడి ఉంది?
    తేజరిల్లు!—1998
  • దంతవైద్యుని దగ్గరికి ఎందుకు వెళ్లాలి?
    తేజరిల్లు!—2007
  • సుకుమారమైన పళ్లను కాపాడడం
    తేజరిల్లు!—2001
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 6/8 పేజీలు 10-12

మీకు కట్టుడుపండ్లు అవసరమా?

తరచూ తమాషాకు గురౌతున్న కట్టుడుపండ్లు, వాటిని కట్టించుకున్న అనేకులకు మాత్రం తమాషాగా లేవు. మీకు సహజసిద్ధంగా వచ్చిన పండ్లు మంచి స్థితిలో వున్నట్లైతే, కట్టుడుపండ్లను గూర్చిన అంశం మీకు ప్రాముఖ్యంగా కన్పించకపోవచ్చును. ఒకవేళ మీరెన్నడూ ఆ సమస్య ఎదుర్కోనవసరం లేకపోయినను, కనీసం మీకు సాధ్యమైనంతమట్టుకు, మంచిగా, ఆరోగ్యంగానున్న మీ పండ్లను మెచ్చుకోడానికి, వాటిని అదేస్థితిలో కాపాడుకొనుటకు ఈ శీర్షికలోని సమాచారం మీకు సహాయం చేయగలదు.

చాలామంది వారి పండ్ల విషయమై జాగ్రత్త వహించామని తలంచేవారు సహితం ఏదో ఒకరోజు ఎందుకు వారి పండ్లు కదులుతున్నట్లు కనుగొంటున్నారు? ఏ దంతవైద్యుడైననూ ఇలా చెబుతాడు. ఒకసారి ప్రజలు 30 సంవత్సరాల వయస్సు దాటేసరికి, వ్యాధిసోకిన చిగుళ్లే (చిగుళ్ల వ్యాధి) పండ్లు ఊడిపోవడానికి గల కారణం. అయినప్పటికి, ఒక వ్యక్తి ఏదైనా ప్రమాదంవల్ల లేదా పుచ్చినపన్ను వల్ల కూడా పండ్లు పోగొట్టుకోవచ్చును.

కానీ ఒకవేళ మీరు పండ్లన్నింటిని లేదా కొన్నింటిని పోగొట్టుకున్నట్లైతే మీకు కట్టుడుపండ్లు నిజంగా అవసరమా?a కట్టుడుపండ్లు లేకుండానే కొందరెందుకు సర్దుకుపోతూంటారు? కట్టుడుపండ్లు ప్రజలపై ఊరకనే రుద్దిన మరొక వ్యాపార కిటుకా?

కట్టుడుపండ్లు ఎందుకు?

ఈ ప్రశ్నల సమాధానం కొరకు, మనమంతా మన పండ్ల విధులను గూర్చి చూద్దాం. అవి మన ఆకారం పైగల ప్రభావం కంటే ఎక్కువే పని చేస్తాయి. మనం మన ఆహారం నమిలినపుడు, అది ముక్కలౌతుంది తద్వారా జీర్ణరసాలు ఈ మెత్తని ముక్కలతో మిళితమై, శరీరం పోషకాహారాన్ని శోషించడానికి వీలుకల్గిస్తుంది. కాని ఒకవేళ మనకు కొన్నిపండ్లు లేదా అసలు పండ్లే లేకపోతే, మన ఆహారం అవసరమైనంత చిన్న చిన్న ముక్కలు కాదు. ఎముక వంటి గట్టిచిగుళ్ల వరుసలు కూడా ఈ పనిని సరిగా చేయవు. కాబట్టి పండ్లులేనివారు ఆహారాన్ని కాఫీ, టీ, లేదా మరితర పానీయాలతో కలిపి సులభంగా మ్రింగడానికి ప్రయత్నించే వారికి అజీర్తి సమస్యలుండవచ్చును. కొన్నిపండ్లు మాత్రమే ఊడిపోయినప్పుడు కూడా, ఆహారం పరిమితం చేయబడుతుంది ఎందుకంటే గట్టిగా లేదా పీచుతోనున్న ఆహారాన్ని గట్టిగా నమలవలసివస్తుంది గనుక సాధారణంగా దాన్ని తీసుకోరు.

మాట్లాడటానికి కూడా పండ్లు సహాయ పడతాయి, మనం కొన్నింటిని పోగొట్టుకొనేంత వరకూ ఎప్పుడూ వాటి ప్రయోజనం గూర్చి ఆలోచించము. అర్థంచేసుకోడానికి ప్రాముఖ్యమైన భాషాధ్వనులు చేయడానికి నాలుకకు, పెదవులకు ఇవి సహాయపడతాయి. ఉదాహరణకు, పండ్లు కన్పించకుండా గుణితాక్షరాంతంలోని హల్లుల భాషాధ్వనులను సరిగా పలుకలేము. పండ్లులేని వ్యక్తి మాట్లాడినపుడు బహుశా మీరిది గమనించియుండవచ్చు. కాబట్టి, కృత్రిమమైన పండ్లున్న ఒక వ్యక్తి మరలా సరియైన ధ్వనులు చేయడానికి తన నాలుకను వాటికి అనుకూలంగా మలచుకోవాలి. దీనికి కొంత సమయం పట్టవచ్చు. కానీ, అసలు పండ్లు లేనప్పటికంటే ఇవి సాధారణంగా సత్ఫలితాలే ఇస్తాయి.

ఒక వ్యక్తికి కట్టుడు పండ్లున్నట్లయితే పాడేవిషయంలో లేదా కొన్ని సంగీత వాయిద్యాలను వాయించే విషయంలో ఏమౌతుంది? ఇందుకు అనుకూలంగా కట్టుడుపండ్లను కట్టడంద్వారా సాధారణంగా ఈ పనులను మరింత అమోఘంగా చేయవచ్చును. గాయకులు, కొందరు నటులు, బూరవాయిద్యాలను వాయించే వారు, ప్రచారకులు, కొంతమంది మోడల్స్‌ ఇచ్చేవారు పండ్లు లేకుండా వాళ్లపనిని నిర్వర్తించడం అసాధ్యమని, లేదా చాలా కష్టమని గుర్తించారు.

పండ్లు లేకపోవడంవల్ల ఒక వ్యక్తి రూపం కూడా దెబ్బతింటుంది. నోటి చుట్టూ ఒకరకమైన మెత్తటి మాంసం చేరి, ముక్కు, బుగ్గలు కుంచించుకు పోవడంవల్ల ఒక వ్యక్తి వయస్సు అసలుకంటే ఎక్కువ వయస్సున్నట్లు కన్పించేలా చేస్తుంది. ఇది ఒకరి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి కొందరిని మానసికంగా కలత పరచవచ్చును.

ఒక దంతాన్ని పోగొట్టుకోవడంవల్ల కమానువలే అమరివున్న మన దంతాలవరుస పాడైపోవచ్చును. రోమీయులు నిర్మించిన వలయాకార కమానులోని రాళ్లవలెనే, మన దంతాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి వుంటాయి. అందువల్ల, “ప్రక్క దంతం” ఒకటి పోతే మిగతావి కూడా కదలడానికి అవకాశముంది. ఈ కదలిక మిగిలిన దంతాలమధ్య ఖాళీలు ఏర్పడేటట్లు చేస్తుంది, ఆహారం చిగుళ్లలో ఇరుక్కుపోవడానికి కూడా వీలుకల్గించవచ్చు, ఇందుమూలంగా తరచూ చిగుళ్లమంటకు దారితీస్తుంది. దంతకదలిక దంతాల అమరికను కూడా పాడుచేయవచ్చు, తద్వారా నమిలే సమస్యలు రావచ్చును.

ఈ రెండురకాల పండ్లమధ్యగల తేడా

కట్టుడుపండ్లకు మామూలు పండ్లకు మధ్యగల ప్రధానమైన తేడా ఏమనగా సహజంగా వచ్చిన పండ్లు దవడల ఎముకతో దృఢంగా పాతుకుపోయి ఉంటాయి. అందువల్ల అవి మన ఆహారాన్ని అతి నేర్పుగా కొరకడానికి, చీల్చడానికి, చాలా చిన్నని మెత్తని ముక్కలుగా నూరడానికి వీలౌతుంది. బలంగా పోడిచేయడానికి, కత్తిరించడానికి క్రింది దంతాలు, పై దంతాలకు వ్యతిరేకదిశలో కదులుతాయి.

అయితే పూర్తిగా కట్టినపండ్లు, చిగుళ్లపైన లేదా వాటి వరుసలపైన మాత్రమే ఆనుకుని ఉంటాయి. నాలుక, బుగ్గలు, జిగురుమూలంగా కలిగే బలహీనమైనపట్టు వల్ల మాత్రమే అవి వాటి స్థానంలో నిలబడతాయి. సహజసిద్ధంగా వచ్చిన దంతాలవలే స్థిరంగా అమర్చబడలేదు గనుక, వాటిని సులభంగా తొలగించవచ్చును.

అయినను కట్టుడుపండ్ల ప్రాముఖ్యతయనేది ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వేర్వేరుగా ఉంటుంది. ఏ కట్టుడుపండ్లు కూడా సహజంగా వచ్చిన దంతాలకున్నంత ప్రాముఖ్యత కల్గివుండవు. దవడల ఆకృతి, పరిమాణం, ధాతువు రకం, వాటిని ఉపయోగించడం నేర్చుకొనే సమర్థతతో పాటు, వాటిని ఉపయోగించే వారి మానసిక వైఖరిపై కూడా కట్టుడుపండ్లు ఎంత ప్రయోజనకరంగా ఉంటాయో ఆధారపడి ఉంటుంది. వాటికి లోపించిన స్థిరత్వమే వాటికున్న ముఖ్యమైన పరిమితి. అయినప్పటికి, అవి ఎలా కన్పిస్తాయనే విషయానికొస్తే, కట్టుడుపండ్లు, సహజంగా వచ్చిన పండ్లు అనే తేడా కనుక్కోలేని రీతిగా వాటిని తయారుచేయవచ్చును.

కొన్నిసార్లు, ఊహించనివిధంగా, సహజమైన దంతాలలోనున్న జ్ఞానము, తయారుచేసిన తీరు, వాటి ఉపయోగాన్ని ఒక వ్యక్తి కట్టుడుపండ్లను ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాతనే గుర్తిస్తాడు. అసలు దంతాల నకలు మాత్రమే చేయగలడుగాని, అదే రకమైన పరిమాణంలో అదే అద్భుతమైన నేర్పరితనాన్ని ఎన్నడూ సాధించలేడు.

మీకున్న పరిస్థితినిబట్టి నిజంగా కట్టుడుపండ్లు కొద్దిగా అవసరమా లేదా పూర్తిపండ్లు అవసరమా అనేదాని గురించి మీరు తీవ్రంగా ఆలోచించే పనియేర్పడవచ్చును. నిర్ణయమనేది నిజంగా మీ సొంతమే, గాని వాటి లాభాలను గురించి ఆలోచించడం తెలివైనదిగా కనపడుతుంది. జీర్ణానికి సంబంధించిన సమస్యలను అరికట్టడంలోను, సరియైన పోషకాహారాన్ని పొందడంలోను, మాట్లాడే సామర్థ్యాన్ని పెంచడంలోను అవి మీకు సహాయపడగలవు. ఆలాగే అవి నిజంగా మీ బాహ్యరూపాన్ని మెరుగుపర్చగలవు.

నిజంగా, కట్టుడుపండ్లు పెట్టుకునేవాళ్లు వారి అసలు దంతాలను గూర్చి విలపించినప్పటికి, కృత్రిమ దంతాల వృద్ధి అనేది ప్రపంచవ్యాప్తంగానున్న వేలకొలది వ్యక్తులు తాము బాగానేవున్నామనే భావన, వ్యక్తిగత సంతృప్తి కల్గివుండుటకు దోహదపడింది.

[అధస్సూచీలు]

a ఈ శీర్షికలో, “కట్టుడుపండ్లు” అనే పదం, నిర్దేశాలనుబట్టి తయారు చేసిన ఉపకరణాన్ని సూచిస్తుంది. సహజసిద్ధంగా వచ్చిన పండ్లన్నీ ఊడిపోతే, పూర్తిగానున్న కట్టుడుపండ్లు అవసరం. ఒకవేళ కొన్ని పండ్లు మాత్రమే మిగిలివుంటే, పాక్షికమైన కట్టుడుపండ్లు ఉపయోగించవచ్చును. ఈ శీర్షిక పూర్తిగానున్న కట్టుడుపండ్లను గూర్చి, తీయడానికి వీలుగానున్న పాక్షికమైన కట్టుడుపండ్లను గూర్చి చర్చిస్తుంది.

[11వ పేజీలోని బాక్సు]

మీ దంతముల కొరకు అయ్యే ఖర్చును తగ్గించుట

దంతవైద్యుని, దంతవైద్యనిపుణుని సందర్శించడమంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడినదే. అయినప్పటికి, మీ పిల్లలకు సహాయపడగల కొన్ని అన్వేషణలు మిమ్మును ప్రోత్సహించవచ్చును.

“అమెరికన్లలో స్థానభ్రంశంచెందిన దంతాలు, అసలురూపం కోల్పోయిన దవడలు ఏర్పడడానికి గల కారణం, అతిగా శుద్ధిచేయబడిన వారి ఆహారమే అయ్యుండవచ్చని” ది న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిస్తుంది. అసలు రహస్యమేమంటే ఎక్కువగా నమలవలసిన ఆహారం “దవడ పెరుగుదలను పురికొల్పుతుంది (ఫలితంగా దంతాలు ఒకదానిమీద ఒకటి ఉండకుండ వాటిమధ్య కావలసినంత స్థలం ఏర్పడుతుంది), శాశ్వతదంతాలు సరిగా పైకి రావడానికి మార్గమేర్పడుతుంది మరియు ముఖం పెరుగుదలకు, నోటికుహరం పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.”

శాస్త్రజ్ఞులు ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి కోతులకు మెత్తటి, గట్టి ఆహారాన్ని తినిపించి ప్రయత్నించారు. ఫలితాలు? ఎక్కువగా నమలవలసి వచ్చిన ఆహారం తీసుకున్న వారికి చాలా తక్కువగా “దంతాలకు సంబంధించిన సమస్యలు” వచ్చాయి. కాబట్టి మీ పిల్లవానికి బాగా నమలవలసిన ఆహారం ఇస్తే అది ఒకవిధంగా మీ దంతపు ఖర్చులను తగ్గించుటకు ఒక మార్గం కావచ్చును. మరొక మార్గమేదనగా క్రమంగా పండ్లు తోముకుని, డెంటిల్‌ఫ్లాస్‌ వాడి శుభ్రంచేసుకునే అలవాటును మీ పిల్లలకు నేర్పించడమే. (g93 2/22)

[12వ పేజీలోని చిత్రం]

మన దంతాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి వుంటాయి. వాటిని సరియైన స్థానంలో ఉంచే “ప్రక్క దంతాలు” లేకపోతే, దంతాలు తొందరగా బిగువు తప్పి, మిగతావాటిపై గట్టి ప్రభావాన్ని చూపుతాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి