మారుతున్న మన ప్రపంచము—నిజముగా దాని భవిష్యత్తేమిటి?
ఒక వేళ మన ప్రపంచము మంచిగా అభివృద్ధి చెందితే, మనమేమి కోరుకొనుటకు ఉన్నవి? ఒక కోరిక ఏమనగా ప్రపంచ పాలకులు మరియు నాయకులు తుదకు నిస్వార్ధపరులై, మానవజాతిని పరస్పర సహనానికి, శాంతికి, అవగాహనకు నడిపించుట కారంభించాలని విశ్వసించుటయే.
అనగా జాతి మరియు జాత్యహంకారము నిర్మూలము చేయబడి, దానికి బదులుగా ప్రపంచమునకు సామరస్యమును తెచ్చే ప్రకృతి బాహ్యమైన వైఖరి వచ్చునని విశ్వసించుటయే దాని అర్ధము.
బారీ వైద్య బిల్లులచెల్లింపులు, గృహములకొరత, నిరుద్యోగము ఉన్న యీ ప్రపంచములో లాభార్జనే అనైతికతయని సంపన్న దేశనాయకులు గుర్తించెదరని నమ్ముట దీనిలో యిమిడి యున్నది.
అంతే కాకుండా, ప్రపంచములోని యుద్ధ సామాగ్రి తయారు చేయువారు ప్రపంచశాంతిని కోరుతూ తమ ఖడ్గములను నాగటి నక్కులుగా తయారుచేయుటకు మొదలుపెడతారని విశ్వసించడము.
ఇంకనూ, ప్రపంచములోని దొంగ ముఠాలు, నేరస్తులు, తూర్పుదేశ నేర సంస్థల నాయకులు మరియు దక్షిణ అమెరికా యొక్క మాదకద్రవ్య ప్రభువులతో సహా అందరూ మారు మనసు పొంది క్రొత్త జీవితమును ప్రారంభిస్తారని దాని భావము.
వేరే మాటలలో చెప్పాలంటే సాంఘిక సంక్షేమానికి మానవులు నిర్మించిన వ్యవస్థలపై విశ్వసించుట ఊహాజనితలోకమే—అది జరుగని కల. ఒకవేళ ఇవన్నియు దేవుని సహాయము లేకుండా జరిగినయెడల చరిత్రకారుడైన పౌల్ జాన్సన్ హిస్టరీ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ అను తన పుస్తకములో వివరించిన దానికి మన పరిస్థితి సరిపోతుంది. మన శతాబ్దములోని “విషాదములకు వైఫల్యములకు ముఖ్యకారణములలో ఒకటేమనగా “స్త్రీ పురుషులు తమ స్వంత తెలివితేటలతో లోక సమస్యలనన్నిటిని పరిష్కరించుదురని మొండివిశ్వాసం కలిగియున్నారనేదే,” అని ఆయన రాశారు. —యెషయా 2:2-4 పోల్చుము.
అయినప్పటికిని, వాస్తవమైన మార్పు ఉందనే నమ్మిక కలదు. అంటే భూస్ధాపకుడు, మన గ్రహ యజమాని, మహాగొప్ప వాస్తు శిల్పియైన యెహోవా దేవుడు తన చేతిపనిని పరీక్షించుటకు మానవుల కార్యములలో జోక్యం కల్పించుకొనునని నమ్మవచ్చు. బైబిలు చరిత్ర చూపునదేమనగా గత కాలంలో దేవుడు తన సంకల్పాలను నెరవేర్చుటకు చర్య గైకొనెను. భూమియెడలను, మానవజాతియెడలను తన ఆది సంకల్పాలను నెరవేర్చుటకు అతితొందరలో మరల ఆయన చర్య గైకొనునని బైబిలు ప్రవచనం సూచిస్తుంది.—యెషయా 45:18.
విశ్వసనీయ సమాచారము కొరకు అపూర్వ ఆధారం
మానవజాతికి ఎటువంటి భవిష్యత్తు ఉన్నదనే నిజమైన సమాచారాన్ని గూర్చిన ఏకైకా మూలము యెషయా ప్రవక్తచే వర్ణించబడింది: “చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నన్ను పోలినవాడెవడును లేడు, ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.”—యెషయా 46:9-11
మానవజాతి మీద ప్రభావంచూపే సంఘటనలను గూర్చి ఎందుకు యెహోవా దేవుడు ముందుగా ఊహించెను? మరలా యెషయా ఈ విధముగా సమధానమిచ్చెను: “ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.” మానవజాతి భవిష్యత్తు యెడలగల దేవుని ఆలోచనలు బైబిలునందు తెలియజేయబడినవి.—యెషయా 55:9.
“అపాయకరమైన కాలములు”
మన తరమును గూర్చి ముందుగానే దేవుని వాక్యమైన, బైబిలులో ఏమి చెప్పబడింది? “అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము” అని క్రైస్తవుడైన అపొస్తలుడగు పౌలు హెచ్చరించెను. (2 తిమోతి 3:1) మరియు మొదటి ప్రపంచయుద్ధకాలము, 1914 నుండి మనమెంతో కష్టతరమైన కాలములలో జీవించుచున్నాము. అధికారం కొరకు మానవుని స్వార్థం, అత్యాశ, అధికారవ్యామోహం వంటివి, తనతోటి మానవులకు వ్యతిరేకంగా నీచాతినీచమైన దురాగతాలకు పాల్పడటమే కాకుండా, ప్రకృతికి వ్యతిరేకంగా దురాగతాలు చేయడానికి నడిపిస్తున్నవి. పరిసరాల యెడలగల మానవుని వ్యతిరేక స్వభావం తమ పిల్లల, మనుమళ్ల భవిష్యత్తు ఉనికిని బెదరిస్తుంది.
జెకొస్లొవేకియా మాజీ అధ్యక్షుడైన వాట్స్లఫ్ హాఫల్ ఆ దేశంలోని భయంకర పరిస్థితులను గూర్చి వివరంగా తెల్పాడు. ఇతని మాటలు ప్రపంచములోని విషయములకు సరిపోవును. “ఇవన్నియు జీవం యెడల, తోటిమానవుల యెడల, ప్రకృతి యెడల, ప్రపంచము యెడల అసలు ప్రాణం యెడల మానవునికున్న దృక్పదముల . . . పరిణామాలే. ప్రకృతికి, ప్రపంచానికి తానే యజమానియని, తనకంతా తెలుసని, అర్ధంచేసుకోగలనని నమ్మే ఆధునిక మానవుని అహంభావ . . . ఫలితాలే యివి. తనకంటే గొప్పదైన. . .దేనినైనా గుర్తించడానికి అంగీకరించని విధంగా వుంది మానవుని ఆలోచనా విధానం.
“అనేకులు భవిష్యత్తునందు నమ్మకాన్ని కోల్పోయారని నేను తలస్తున్నాను ఎందుకంటే మన ప్రస్తుత అవసరతలు, తాత్కాలిక సమస్యలపై తదేకంగా దృష్టి నిలుపవలసి వస్తున్నందు వలన మన భవిష్యత్తు ఎంతో సందేహాస్పదంగా ఉన్నట్లు మన నాగరికతలోని ప్రతిభాగంలోను కనబడుతుంది.” అని ముందు పేర్కొన్న ఆల్గోర్ వ్రాశాడు. నిజంగా భవిష్యత్తు యెడల అపనమ్మకం వ్యాప్తిలోనున్నట్లుగా కనిపిస్తుంది.
“మనుష్యులు స్వార్ధప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తలిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు గర్వాంధులు, దేవునికంటె సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండి దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.” అని పౌలు తెల్పిన మాటలు నెరవేరుచున్నవి గనుకనే యీ పరిస్థితి పాక్షికంగా సంభవించింది.—2 తిమోతి 3:2-5.
ఒక శ్రేష్ఠమైన ప్రత్యామ్నాయం
కాని భూమి మీద మంచి మార్పు కలుగవలెనని దేవుడు ఉద్దేశించెను. దేవుడు చేసిన వాగ్దానం ఇదే; “క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి . . , వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13) ఈ కలుషితమైన భూమిని పరదైసుగా పునఃస్థాపించుటకు మొదట యెహోవా దేవుడు “భూమిని నాశనం చేయువారిని నాశనము చేయును.” (ప్రకటన 11:18) ఏ విధముగా ఇది జరుగును?
సూచనార్ధక భాషనుపయోగించి, బైబిలు తెలియజేయునదేమనగా దేవుడు ఐక్యరాజ్యసమితితో సహా బహుశా రాజకీయనాయకుల హృదయాలలో మానవచరిత్రలోకెల్లా అత్యంత ప్రభావంగల భూవ్యాప్తంగా ఉన్న జాతీయతా వాదమును, మతప్రభావాలను నాశనము చేయునట్లు పురికొల్పును.a కనీసం పశ్చిమదేశాల్లోనైనా 300 సంవత్సరములకంటె ఇప్పుడు ఎక్కువగా, ఆయుధ పోటీని ఉధృతం చేయటంలో మతపరమైన వైఖరి, మతపరమైన నమ్మకాలు, వెఱ్ఱితనము ఎక్కువపాత్రను కలిగియున్నదని ఆశించడానికి మనకు కారణాలు కలవని” మార్టిన్ ఫాన్ క్రేవేల్డ్ ది ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ వార్ అనే తన పుస్తకములో తెలిపారు. రాజకీయాల్లో తలదూర్చిన కారణంగా, మతం రాజకీయశక్తుల హింసకు గురికాగలదు. ఇంకనూ వారు తెలియకుండానే దేవుని ఉద్దేశమును నెరవేర్చుచున్నారు.—ప్రకటన 17:16, 17; 1821, 24.
తదుపరి దేవుడు ప్రపంచంలోని సాతాను యొక్క మృగమువంటి రాజకీయశక్తులవైపు తన ధ్యానమును మళ్లించి, తన అంతిమ యుద్ధం లేక అర్మగెద్దోను పాలు చేస్తాడని బైబిలు తెల్పుచున్నది. మోసపుచ్చువాడైన సాతాను అతని క్రూరమైన రాజకీయశక్తులు తీసివేయబడిన తరువాత దేవుడు వాగ్దానము చేసిన నూతన శాంతియుతమైన ప్రపంచమునకు మార్గము తెరువబడును.b—ప్రకటన 13:1, 2; 16:14-16.
రానైయున్న యీ మార్పులను గూర్చి యెహోవాసాక్షులు 80 సంవత్సరములనుండి ఇంటింటికి వెళ్లి ప్రకటించుచున్నారు. ఈకాలములో మానవజాతి తెచ్చిన పలు మార్పులను వారుచూశారు, అనుభవించారు. బైబిలులోని సూత్రములకొరకు వారు నాజీ జైళ్లకు, కాన్సెంట్రేషన్ క్యాంపులకు గురయ్యారు. ఆఫ్రికాలోని అనేకప్రాంతాలలో వారు అంతర్యుద్ధాలు, జాతిపోరాటాలే కాకుండా అనేక శ్రమలను బాధలను అనుభవించారు. రాజ్యప్రచార పనియందున్న ఉత్సాహముతో రాజకీయ, మతపరమైన వ్యక్తులచేతుల్లో శ్రమలు పొందినప్పటికిని వారు వారి యథార్థతను కోల్పోలేదు. ఇన్ని శ్రమలున్నప్పటికిని, వారు 1914లో కొద్ది వేలమంది నుండి 1993 నాటికి 45 లక్షలకుపైగా అభివృద్ధి చెంది ప్రపంచమంతటనున్న విద్యా పనియందు దేవుని ఆశీర్వాదములను పొందారు.
ఆశావాదము కొరకు కారణములు
భూమిమీద మహాగొప్ప, శ్రేష్టమైన మార్పులు జరుగుననే నమ్మకముతో వారు ఎన్నో అపజయాలను ఎదుర్కొన్నప్పటికిని సాక్షులు అపనమ్మకమునకు బదులు ఎంతో ఆశాజనకంగా ఉన్నారు. 1914 నుండి జరిగే యేసు తెల్పిన సంఘటనలు ప్రవచనాలు నెరవేరుతూ, తన అదృశ్య రాజ్య ప్రత్యక్షతను సూచిస్తున్నవి. మానవ ప్రేరేపిత “అస్తవ్యస్త నూతనలోకము” అంతమయ్యేకాలములో మనమున్నామని సమీప భవిష్యత్తునందుండే మేలులను ఫ్రెంచి రచయిత లెమోండ్ తెలిపెను. మీరు యీ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడని” యేసు తెలిపెను.—లూకా 21:7-32.
మానవ ప్రేరేపిత “నూతనలోకవ్యవస్థ” (విధానం)లో అన్యాయము, అవినీతి, పేరాశ, కామకోరికలుగల మానవ దోషభరిత దుర్భలతలున్నవి. దేవుని నూతన ప్రభుత్వము న్యాయమునకు హామీనిస్తుంది. ఆయనను గూర్చి ఈవిధంగా వ్రాయబడెను: “ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు, ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.”—ద్వితీయోపదేశకాండము 32:4.
“ప్రముఖనాయకుల సమ్మోహితులనుచేసే సంకుచిత జాతీయభావాలు” అని యీ మానవ “నూతనలోకవ్యవస్థ”ను అమెరికా విదేశీ వ్యవహారాల్లో ప్రవీణుడైన మేక్జోర్జ్ బండి అన్నాడు. ఇంకనూ అయన యిట్లు తెలియజేశాడు: “ఆర్ధిక, సాంఘిక వైఫల్యాలు అతివాదులకు శక్తినిచ్చుచున్నవని చరిత్ర ఆధారంగా తెలుసుకున్నాము. ఏమైనప్పటికి అటువంటి దేశాభిమానం ఉన్నయెడల అది అపాయకరమని కూడ మాకు తెలుసు.”
దేవుని నూతన ప్రపంచములో అన్నిరకాల ప్రజలలోను జాతులలోను దేశాలలోను సమాధానముంటుందని దేవుని నూతన లోకం అభయమిస్తుంది. ఎందుకంటే వారు యెహోవా నిస్వార్ధమైన ప్రేమమార్గాలలో బోధింపబడతారు. యెషయా ఇలా ప్రవచించాడు: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.” (యెషయా 54:13) “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” అని క్రైస్తవుడైన అపొస్తలుడగు పేతురు తెలిపెను.—అపొస్తలుల కార్యములు 10:34, 35.
నిశ్చయంగా, యీలోకానికి తక్షణ భవిష్యత్తులో ఆకస్మిక మార్పులు వచ్చునని మనకు తెలుసు. అయితే దేవుడు కలుగజేస్తానని వాగ్దానము చేసిన గొప్పమార్పులు మాత్రము శాశ్వతమైనవి మరియు ప్రయోజనకరమైనవి. ఆయన “అబద్ధమాడనేరడు.”—తీతుకు 1:2. (g93 1/8)
[అధస్సూచీలు]
a బైబిలునందు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యము “వేశ్యలకు తల్లియైన మహాబబులోనునకు” పోల్చబడినది. అది రక్తముతో మత్తిల్లినదై “దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి.” (ప్రకటన 17:3-6, 16:18; 18:5-7) ఇంకనూ మహాబబులోనుగూర్చి విపులంగా తెలుసుకొనుటకు మ్యాన్కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్ అనే పుస్తకమును చూడుము, పేజీలు 368-71, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి న్యూయార్క్ వారిచే ప్రచురించబడింది.
b బైబిలులో ప్రవచించబడిన ఈ సంఘటనల వివరాల కొరకు రెవెలేషన్—ఇట్స్ గ్రాండ్ క్లైమాక్స్ ఎట్ హ్యాండ్! అనే పుస్తకంలో 30-42, అధ్యాయములు చూడుడి. ఇది 1988లో వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి న్యూయార్క్ వారు ప్రచురించారు.