కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 1/8 పేజీలు 28-29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సెలవు వత్తిడి
  • తలిదండ్రులను కొట్టుట
  • మిలటరీ వాళ్ల అత్యాచారం
  • మంచి భూమి అంతరించిపోతున్నది
  • “పిల్లలారా మేము మిమ్ములను ఎరగా చేశాము”
  • పిచ్చి ఆకర్షణ
  • “యావె” ఏకైక దేవుడని పోప్‌ ప్రకటించాడు
  • చెత్తలో బంగారం
  • సౌందర్యము మరియు పోషకాహారం
  • జాతి వైషమ్యాలకు తావులేదు
  • “కంటికి కన్ను”
  • సరియైన దృష్టితో చూచుట
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1993
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1994
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1994
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—2000
తేజరిల్లు!—1993
g93 1/8 పేజీలు 28-29

ప్రపంచ పరిశీలన

సెలవు వత్తిడి

అధిక వత్తిడికి గురియైన వ్యక్తి సెలవుమీద వెళ్లేదానికంటే కొన్ని అలవాట్లు మార్చుకుంటే ప్రయోజనకరం కావచ్చును. బ్రెజిల్‌లో సావోపౌలోనందలి వైద్య విద్యాలయం ప్రొఫెసర్‌ డా. సెర్టోటుఫెక్‌ యిలా అన్నాడని వేజా నందు పేర్కొనబడెను: “మన జీవశాస్త్ర సంబంధమైన లయబద్ధత ఒక గడియారమువలె నడచుటకు నిర్దేశించబడింది. ఎట్టిమార్పు అయినను, కరేబియన్‌ ప్రాంతములో ఒక వారంరోజులు విలాసవంతంగా గడిపినను, శరీరావయవములు అలసట చెందవచ్చును.” ఒక పని అంతటి సవాలుతో కూడినదైనను, కాకపోయినను, హానికర వత్తిడిని తప్పించుకొనుటకు, అతడిలా సిఫారసు చేస్తున్నాడు: “మీరు చేస్తున్న దానితో తృప్తిపొందండి.” దైనందిన జీవన విధానముకంటే మరింత వత్తిడితో కూడిన దేనినైనా చేయుటకు ఎల్లవేళల ప్రయత్నించే బదులు ఇలా చేయండని వైద్యుడు సలహానిస్తున్నాడు: “బహుశా రహస్యమేమంటే ‘ప్రతిదినము’ సెలవుమీద వెళ్లడం’ అంటే ఉద్యోగమే కాకుండా, సంతృప్తినిచ్చే వివిధ కార్యాలలో పాల్గొనండి.”

తలిదండ్రులను కొట్టుట

ఆస్ట్రేలియాలో తలిదండ్రుల మీద “యౌవనస్థుల కోపోద్రేక అణగారిన భీతి” పెచ్చుపెరిగి పోతున్నది. తమ తలిదండ్రులను కొడుతున్న యువకుల సంఖ్య ఈ దేశంలో అతివేగంగా పెరిగిపోతున్నదని పోలీసువారు, సంక్షేమ సంస్థలు నివేదిస్తున్నవి. సర్వ సాధారణంగా దానికి బలైపోయేది తల్లులైనను, తండ్రులు, తాతమామ్మలు కూడ తీవ్రమైన దాడికి గురియౌతున్నారు. సంక్షేమ సంస్థ సంచాలకుడు యిలా అన్నాడని సిడ్నీ సండే టెలిగ్రాఫ్‌ వార్తా పత్రిక పేర్కొన్నది: “పిల్లలు 10 సంవత్సరముల ప్రాయమందున్నవారు కూడా కొట్టడానికి సిద్ధమౌతున్నారని తమ తల్లిని మరి యితర రక్త సంబంధులను భయపెడుతున్నారని వినడానికి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.” ఒక సమాజ సంక్షేమ సేవా సమితికి తలిదండ్రుల నుండి టెలిఫోన్‌ పిలుపులు ప్రవాహమువలె వస్తున్నవి కావున అది బాధితులకొరకు, నేరస్థులకొరకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టుటకొరకు పథకము వేస్తున్నది.

మిలటరీ వాళ్ల అత్యాచారం

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో, యుద్ధరంగమందు దళాలకు సేవచేసే నిమిత్తం జపాన్‌ మిలటరీ దళం తూర్పు ఆసియా దేశాలలోని వేలాదిమంది బాలికలను, యౌవన స్త్రీలను బంధించి తీసుకువచ్చారు. “ఓదార్పు స్త్రీలు” అని వారిని పిలిచారు, వీరిలో సుఖరోగాల మూలంగా చనిపోని వారిని చావడానికి అనే విడిచి సైన్యం వెనుకకు వెళ్లిపోయారు. యాభై సంవత్సరాల తరువాత ఒక వ్యక్తి ముందుకువచ్చి అందులో తన పాత్రను బహిరంగంగా అంగీకరించి క్షమాపణ కోరాడు. షాజియోషిడా “తన మనుష్యులు జపాన్‌ నిరంకుశ సైన్యానికి లైంగిక బానిసలగు నిమిత్తము వారిని పట్టుకొని ఏడుస్తున్న కొరియా పిల్లలను పక్కకునెట్టేసి, యౌవన తల్లులను వేటాడి ట్రక్కులలో ఎక్కించిన సంఘటనలను తాను మరిచిపోలేక పోతున్నాడు” అని మైనిచి డైలీ న్యూస్‌ తెల్పుచున్నది. అపుడు అతడు ఎలా భావించాడని అడిగినప్పుడు, యిలా సమాధానమిచ్చాడని ఆ వార్తా పత్రిక నివేదించింది: “మేము కేవలం ఆజ్ఞలను శిరసావహించాము. మేము మానసికంగా నిర్వీర్యులయ్యాము. అది కేవలం వ్యాపారం. మరోవిధమైన తలంపు సాధ్యం కాదు. నాకు ఏమి అనిపించలేదు. నేను పనితొందరలో అయోమయ స్థితిలో దానిలో నిమగ్నమై పోయాను.” అనేక దేశాల మిలటరీ అధికారులు తమ సైన్యాలకు స్త్రీలకు బలవంతంగా పట్టుకొనిగాని, ద్రవ్యం చెల్లించి వేశ్యలను తెచ్చిగాని యిచ్చేవారు.

మంచి భూమి అంతరించిపోతున్నది

సైన్స్‌ అనే పత్రికలోని ఒక నివేదిక ప్రకారం ప్రపంచమందలి సాగుభూమి, “అతివేగంగా కొట్టుకొనిపోతూ లేదా గాలిలో ధూళివలె మారిపోతూ” తరిగిపోతున్నది. వాషింగ్టన్‌ డి.సి.కి చెందిన డబ్ల్యు ఆర్‌ ఐ (ప్రపంచ వనరుల సంస్థాపనము) రెండవ ప్రపంచ యుద్ధము నాటినుండి ప్రపంచవ్యాప్తంగా మట్టియొక్క స్థితిగతులు ఎలా మారిపోయినవో వందలాది మంది నిపుణులు పునఃపరిశీలించిన మూడు సంవత్సరాల అధ్యయన ఫలితాన్ని మార్చిలో విడుదల చేసింది. దాని ఫలితాలేమిటి? మానవుడు భూమిని—ముఖ్యంగా అడవులను నరికివేయుట, అధికంగా మేపుట, హానికరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా—ఇండియా, చైనాలను రెండింటినీ కలిపితే ఉన్నంత పరిమాణములో ఉన్న ఒకనాటి సారవంత భూమి యిప్పుడు ఎంతో తరిగిపోయింది. ఈ వైఖరి విషమించవచ్చు. ఎందుకంటే, రానున్న అర్థ శతాబ్దములో పెరగనైయున్న జనాభాకు సరిపడు ఆహారము నందించవలెనంటే ప్రపంచం తన ఆహారోత్పత్తిని మూడింతలు చేయాల్సి ఉంటుందని డబ్ల్యు ఆర్‌ ఐ యొక్క ప్రెసిడెంట్‌ గస్‌ స్పెత్‌ అంచనావేశాడు.

“పిల్లలారా మేము మిమ్ములను ఎరగా చేశాము”

పిల్లవాన్ని పాడుచేయుటా? మామూలు భావంలో కాదు, పైమాటలు డేవిడ్‌ గర్‌విట్స్‌ పలికినవి, అతడు విన్‌స్టన్‌ సిగరెట్‌ వ్యాపార ప్రకటనలో పర్వతారోహణునిగా ఒక కొండ శిఖరమునుండి వ్రేలాడుతుండగా సిగరెట్‌ వెలిగించినట్లు అభినయము చేసిన నటుడు, గెర్‌లిట్స్‌ మరియు వెయిన్‌ మెక్లార్న్‌ (మార్ల్‌ బోర్‌ సిగరెట్‌ వ్యక్తిగా చిత్రీకరించబడినవాడు) పొగత్రాగవద్దని ఒప్పించుటకు పాఠశాల పిల్లల యొద్దకు వస్తున్నారు. “బాలల్లారా మీరు పొగత్రాగితే, మీరు మొనగాళ్లవుతారని మేము మిమ్మును నమ్మించాము,” అని గర్‌లిట్స్‌ వివరించెను. కేన్సర్‌ మూలంగా ఊపిరి తిత్తిని పోగొట్టుకున్న తరువాత మెక్లార్న్‌ విచారంతో యిలా ఒప్పుకున్నాడు, “నేను పొగత్రాగినందున నా జీవితకాలం తగ్గిపోయింది.”

పిచ్చి ఆకర్షణ

యెరూషలేము పాతనగరం వేలాదిమంది పర్యాటకులనేగాక మానసిక బలహీనతగల అనేకులను కూడా ఆకర్షిస్తుంది. వారు బైబిలులో ప్రసావించబడిన వ్యక్తులము తామేనని నమ్ముతారు, లేదా ప్రపంచశాంతికి తమవద్ద మాత్రమే కీలకమున్నదని దానిని యెరూషలేము ప్రాకారముల వద్ద బయల్పరచాలని నమ్ముతారు. “క్రైస్తవులు తమ్మును తాము యేసుగా లేదా కన్య మేరిగా లేదా సర్వసాధారణంగా బాప్తిస్మమిచ్చు యోహానుగా, వయాడొలొరోసా సమాధి తోట వంటివైన యేసుకు సంబంధించిన స్థలాల్లో మానసికంగా అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు” అని ది న్యూయార్క్‌ టైమ్స్‌ తెల్పుచున్నది. “యూదులకు తమ్మును తాము మోషే, రాజైన దావీదు మరి యితర పాతనిబంధనలోని వ్యక్తులకు, పోల్చుకుని, ఒలీవకొండపైన లేదా పశ్చిమార్థ ప్రాకారము వద్ద ప్రత్యక్షమయ్యే అలవాటు ఉన్నది.” ఇటీవల ఒక పర్యాటకుడు హోలీ సెపుల్చర్‌ చర్చినందు ఉన్మాదముతో పరుగులెత్తుచూ సిలువ నొకదానిని ఊడదీసి, దీపాలను పగులగొట్టి విగ్రహాలను ఆరాధించవద్దని కేకలు వేస్తూ ఒక శిలా విగ్రహాన్ని ధ్వంసం చేయ ప్రయత్నించాడు. మానసిక వైద్యులు యెరూషలేము పిచ్చి అని పిలుస్తున్న రోగంతో ప్రతి సంవత్సరము 50 నుండి 200 మంది క్ఫార్‌షౌల్‌ అనే మానసిక రుగ్మతల ఆసుపత్రికి కొనిపోబడుతున్నారు. ఇందులో మానసిక రుగ్మత చరిత్రగల వారి సంఖ్య, లేనివారితో పోలిస్తే నాలుగురెట్లు ఎక్కువే మరియు పురుషులు స్త్రీలకంటె రెండంతలు ఎక్కువగా ఉన్నారు.

“యావె” ఏకైక దేవుడని పోప్‌ ప్రకటించాడు

“మానవులకు దేవుడు తన నామమును బయలు పర్చుచున్నాడు” అని వాటికన్‌ పత్రిక లొస్పెర్‌వాటొరె రొమనో అట్టమీద పెద్ద అక్షరాలలో వేయబడింది. దానిలో పోప్‌ జాన్‌ పాల్‌ ​​రోమునందలి లియోనార్ట్‌ మురియల్‌డొ పారిష్‌ను సందర్శించినపుడు సామాన్యంగా చేసి వ్యాఖ్య ప్రచురించబడింది. “నిర్గమకాండము నందొక భాగములో దేవుడు తన నామమును మనకు తెల్పుచున్నాడు,” అని పోప్‌ చెప్పుట కారంభించాడు. “నేను ఉన్నవాడను . . . అనువాడు నన్ను మీ యొద్దకు పంపెనని” ఇశ్రాయేలీయులకు చెప్పుమని దేవుడు మోషేకు చెప్పిన నిర్గమకాండము 3వ అధ్యాయం 13, 14 వచనాలను పేర్కొన్న తరువాత పోప్‌ యిట్లన్నాడు: “‘నేను ఉన్నవాడను’ అనే మాట, యావె అను పదము నందుకూడ వ్యక్తపర్చబడి దేవుడు ఉనికిలో ఉన్నవాడుని, భౌతిక విశ్వపరిధులకు అతీతమైనవాడని తెలియజేస్తుంది . . . యావె అంటే మరెవరోకాదు, ఏకైక దేవుడేనని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది.”

చెత్తలో బంగారం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో ఒక ఇటాలియన్‌ సంస్థ వ్యర్థపదార్థముల నుండి విలువైన లోహాలను వెలికితీస్తున్నది. ఎల్‌ మెసాజారో ప్రకారం, ఇటలీనందలి ఎరిజ్జో నగరములో ఉన్న ఒక పరిశ్రమ, ప్రపంచము నలుమూలనుండి వ్యర్థపదార్థిలను రప్పించి, దానినుండి బంగారం, వెండి, యితర వెలగల మూల పదార్థములను తీస్తున్నది. ఫోటోగ్రాఫిక్‌ కాగితం, బిన్‌ ఫాయిల్‌, మైక్రోచిప్స్‌, పాడైపోయిన కెమోరాలు, కంప్యూటర్లు, మరి యితర ఎలక్ట్రానిక్‌ వస్తువులు అట్టి విలువైన లోహాలను ఉత్పన్నము చేస్తున్నవి. ఎరిజ్జోనందలి ఈ ఒక్క పరిశ్రమే, సంవత్సరానికి సగటున 120 టన్నుల బంగారం, 200 టన్నుల వెండి, 4 టన్నుల పలాడియమ్‌ ఒక టన్ను ప్లాటినము, 100 కిలోగ్రాముల రోడియమ్‌, కొద్దిపాటి ఇరీడియమ్‌, రుథేనియమ్‌ను వాటినుండి తీయగల్గుతుందని ఎల్‌ మెసాజెరో నివేదిస్తున్నది.

సౌందర్యము మరియు పోషకాహారం

“శరీర పుష్టి, చర్మపు నునుపు ఎక్కువగా ప్రజలు తినే వాటి గుణముపై ఆధారపడి యుంటుంది. సరియైన ఆహారం భుజించుటే నేటికి నిలిచిన ముఖ్య పరిమళ ద్రవ్యం,” అని బ్రెజిల్‌ నందలి సాయోపాలో యూనివర్శిటిలో ఫార్మస్యూటికల్‌ సైన్స్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఇడా కరామికొ పేర్కొంది. బ్రెజిల్‌ పత్రిక గ్లోబో స్యెస్‌స్యా ప్రకారం, కాలుష్యము, విషపూరిత ఆహారము, భావోద్రేక సమస్యలు, అధికంగా సూర్యరశ్మి తగులుట వ్యతిరేకార్థములో చెప్పాలంటే పరిమళ ద్రవ్యం (కాస్మెటిక్స్‌) అమితంగా వాడుట మూలంగా చర్మం ముడతలు పడవచ్చును. చర్మాన్ని నునుపుగా పునరుద్ధరించుటకు కనీసం రోజుకు 8 గ్లాసుల నీళ్లతో పాటు తగిన పరమాణములో పండ్లు, కాయగూరలు, ఆహార ధాన్యాలను తీసుకోవాలని ఆ పత్రిక సలహాయిస్తున్నది. ఇంకా యిట్లంటున్నది: “బాహ్యంగా తీసుకునే ఏ విధమైన శ్రద్ధయైనా కన్పించే తీరును మెరుగుపర్చుటకు ఉపయోగించవచ్చు కాని ఏ రకమైన ఉత్పాదకతయైనా—అది సహజసిద్ధమైనదే గాని కృత్రిమమైనదేగాని—మంచి పోషకారహారానికి మించింది లేదు.”

జాతి వైషమ్యాలకు తావులేదు

జన్యుశాస్త్రంలో యిటీవల కలిగిన పురోభివృద్ధి సహాయంతో మానవుని జన్యుప్రక్రియలో ఎంతోకాలంగా దాగియున్న సమాచారమును శాస్త్రజ్ఞులు విడమర్చుట కారంభించారు. వారు కనుగొన్న సమాచారం జాతిని గూర్చిన సాంప్రదాయ నమ్మకాలనన్నింటిని తుడిచిపెట్టిందని ఫ్రెంచి వార్తపత్రిక లా ఫిగారో తెలియజేస్తున్నది. ఎత్తు, శరీర ఛాయ, మరి యితర బాహ్య తేడాలతో మానవులు అనేకరకాలుగా ఉన్నట్లు కనిపించినను, భూమి మీదనున్న ప్రజలంతా నిస్సందేహంగా ఒకే తలిదండ్రులనుండి, ఒకే ప్రాంతము నుండి విస్తరించుట మొదలై ఎంతో కాలం గతించలేదని జన్యుశాస్త్రం యిప్పుడు అంగీకరిస్తున్నది. “జాతి భేదమును ప్రచారము చేయడానికి చేసిన యుక్తి వివరణలన్ని తప్పుగా నిరూపించబడినవి,” అని లా ఫిగారో తెల్పింది.

“కంటికి కన్ను”

రాటుదేలిన నేరస్థులకు జైలు శిక్ష అంటే లెక్కలేదు గనుక, మెంఫిస్‌, టెన్నెస్సీనందలి న్యాయమూర్తి జో.బి. బ్రౌన్‌ శిక్ష నిమిత్తం తనయొద్దకు వచ్చే నేరస్థులకొరకు తన విధానాన్ని మార్చుకున్నాడు. ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదించిన ప్రకారం, “దొంగతనానికి గురైన వారు ఆ దొంగయింటికి వెళ్లి ఏదొక వస్తువును ‘దొంగిలించుకొని” వెళ్లమని అతడు ఆహ్వానించాడు. ఇటీవల అనేక కేసుల విషయంలో నేరములకు సంబంధించిన న్యాయాధిపతి, గోల్ట్‌ రోలెక్స్‌కు బదులు రెండు చలికోట్లు, రెండు సైకిళ్లకు బదులు స్టీరియో స్పీకర్లు వంటి వస్తువులను తీసుకోమని చెప్పి బైబిలునందు చెప్పబడిన కంటికి కన్ను అనే సిద్ధాంతాన్ని అతడు విపులీకరించాడు. ఒకవేళ దొంగ పారిపోయేందుకు తన సొంత కారునే ఉపయోగిస్తే బట్టలు, నగలు, మరి యితర విలువైన వస్తువులతో దానిని కూడా తీసుకొనవచ్చును.” దొంగతనానికి గురైనవారు ఆ లోటును భర్తీచేసుకొనేందుకు దొంగ యింటికి బహు తరచుగా, పగలుగాని రాత్రిగాని ఏ సమయంలోనైనా వెళ్లేందుకు అతని నియమావళి అనుమతినిస్తుంది. అయితే కొన్ని నిర్దేశిక సూత్రములున్నాయి. నగర అధికారియొక్క సేవకుడు వారితోకూడా వెళ్లి తీసుకువెళ్లే వస్తువులు యితరుల నుండి దొంగిలింపబడినవి కావని నిర్ధారించుకుంటాడు.

సరియైన దృష్టితో చూచుట

ఆదాయం తక్కువగా నున్న దేశాలలో ఉన్న ప్రజలు ఏమంత దుస్థితిలో లేరు చైనాలో తలసరి ఆదాయం సాలీన 350 డాలర్లు మాత్రమేనని ది న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిస్తున్నది. ఉదాహరణకు, గుయాంగ్‌ నందలి ఒక మధ్య వయస్కులైన దంపతులిద్దరి ఆదాయం నెలకు 42 డాలర్ల కన్నా తక్కువే—ఆమె ఒక ఉపాధ్యాయినిగా, అతడు ఒక ఫ్యాక్టరీలో సాంకేతిక నిపుణునిగా పనిచేస్తున్నారు. అయితే వారి అసలు ఆదాయం దానికి రెండంతలు కన్నా ఎక్కువే. బోనస్‌, తగ్గింపు ధరలు, ఒకే పిల్లవాన్ని కలిగియున్నందుకు యిచ్చే ప్రోత్సాహక వేతనం మూలంగా దాదాపు నెలకు 85 డాలర్లు ముడుతుంది. వారి ఆదాయం తక్కువగానే ఉంటాయి. వారి ఆదాయ వ్యయపట్టికలో అది నెలకు 37 డాలర్లు ఉంటుంది. దుస్తులకొరకు మరో 19 డాలర్లు కావలసివుంటుంది. దీని మూలంగా వారు నెలకు 10 లేక అంతకన్నా ఎక్కువ డాలర్లు ఆదా చేసుకొనుటకు వీలవుతుంది—నిశ్చయంగా అది భవిష్యత్‌ సంవత్సరాలకు సరిపడే తగుమాత్రపు ద్రవ్యమే. పనినుండి తొలగిస్తారనే చింత వారికి లేదు, తమ వైద్యపరమైన ఖర్చులు చెల్లించబడతాయని, వృద్ధాప్యంలో తమకు ఉపకారవేతనము యివ్వబడుతుందని వారికి తెలుసు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి