మా పాఠకులనుండి
నేరస్థులకు పునరావాసం కారాగారంలో వున్న నా కొడుకు అవేక్! పత్రికను (ఆంగ్లం) క్రమంగా పొందుతున్నాడు. వాని హృదయాన్ని చేరే శీర్షికల కొరకు నేను మానక ప్రార్థనలుచేశాను. “సత్యమునకున్న పునరుజ్జీవింపజేయు శక్తి” అనే శీర్షికలను నేనెంతో మెచ్చుకున్నాను. (ఆగస్టు 8, 1992) “అందరూ మారుమనస్సు పొందవలెనని కోరు” దేవునికెంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ, నేనా శీర్షికను కన్నీటితో చదివాను. (2 పేతురు 3:9) ఏదో ఒకనాడు నాకొడుకు కూడా అలాగే మారుతాడని ఆశిస్తున్నాను.
ఏ. ఎఫ్., అమెరికా
“సత్యమునకున్న పునరుజ్జీవింపజేయు శక్తి” అనే శీర్షికకొరకు కృతజ్ఞతలు (ఆగస్టు 8, 1992) నేను ప్రస్తుతం జైల్లో కాలం గడుపుతున్నాను. వేరెవరో తన జీవితాన్ని మలచుకున్నారని చదివి నేను ప్రోత్సాహం పొందాను. అధికారులు నేరస్థులకు పునరావాసం కల్పించుటకు ప్రయత్నిస్తారు కాని వారిని తిరిగి తప్పు చేయుటకు అవకాశమున్న సాతాను లోకంలోనికి పంపిస్తారు. స్నేహభావం కనపరిచే యెహోవాసాక్షుల సేవకుల సహాయంతో దేవున్ని వెదకి ఆయనను సేవించడంలోనే శాశ్వత పునరావాసం ఇమిడివుందని నేను కనుగొన్నాను.
జె. ఎస్., అమెరికా
“అవేక్!” రూపురేఖలు (ఆంగ్లంలో) అవేక్! యొక్క అందమైన కొత్త రూపురేఖలను గూర్చి నేను నా అభినందనను, తెలియజేయాలను కుంటున్నాను. ప్రచురణల సాంకేతిక రూపు రేఖలు, అచ్చు అక్షరాల రకాలు, రంగులలో మార్పులను వెంటనే గమనించాను. ఈ పత్రిక యెహోవా వైపు ప్రజలను మరల్చుటకు, సమయంతోపాటు, మనోరంజకంగా మరియు ఆకర్షింపజేయునట్లు దీనికి వచ్చిన మార్పులన్నింటిని నేను గత 20 సంవత్సరాలుగా గమనిస్తున్నాను. కేవలం ఈ క్రొత్త మంచి మార్పులను చూపించి నేను నాతోటి పనివారికి ఒక ప్రతిని అందజేశాను!
డి. ఎ., అమెరికా
విమర్శను గైకొనుట నేను క్రైస్తవునిగా మారినప్పటినుండి నా తలిదండ్రులు నన్ను విమర్శించుటకు కారణాలు వెదకుతున్నారు. ఇది నన్ను చాలా ఉద్రేకపరచేది. కానీ “విమర్శను స్వీకరించుటకు అసహ్యించుకొందువా?” (మార్చి 8, 1992) అనే మీ శీర్షిక ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నాకు చూపించింది.
యం. యం., అమెరికా
క్రీడలు ఒక శారీరక విద్యగా మరియు క్రీడోపాధ్యాయునిగా “క్రీడలు—వాటికున్న స్థానమేమి? అనే ధారావాహిక శీర్షికలపై ప్రత్యేక శ్రద్ధచూపాను. విపరీతమైన పోటీలు, వాణిజ్య ఆసక్తి, హింస మరియు మోసమువంటి ఆధునిక క్రీడయొక్క ప్రమాదాలు, అక్రమాలను మీరు సరిగ్గా గుర్తించారు. అయినా, ఐరోపా మరియు అమెరికా క్రీడలలో గమనించదగ్గ తేడాలున్నవి. మీ శీర్షిక విశిష్టంగా అమెరికా క్రీడలపైనే కేంద్రీకరించింది.
ఎస్. ఓ., ఫ్రాన్స్
“అవేక్!” క్రీడల శీర్షికలలో తరచు అంతర్జాతీయ దృష్టిని వ్యక్తపరుస్తుంది. దీనిలో ఐరోపా, ఆఫ్రికా, మరియు లాటిన్ అమెరికాల క్రీడాకారులు స్వయంగా చెప్పిన విషయాలుకూడా ఇమిడియున్నవి. ప్రస్తుత శీర్షిక అమెరికా క్రీడలపై కేంద్రీకరించబడినప్పటికి అనేక దేశాలలోని పాఠకులు అందులో చర్చించిన బైబిలు సిద్ధాంతాలను తమ జీవితాలలో అమలుపరచటం వల్ల ప్రయోజనం పొందగలరని మేము నమ్ముతున్నాము.—ఎడిటర్
“క్రీడలు లేక “శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమ” నుటకు నేను సజీవ సాక్షిని. చదువుకునే రోజుల్లో, స్కూలు వాలిబాల్ జట్లో వుండి విస్తృతంగా ఆటలలో, పోటీలలో పాల్గొనేదాన్ని. అప్పట్లో నా సాంగత్యము అంత మంచిది కాదు. గనుక చాలా సమయం వృధా అయ్యేది. నా చదువు తరువాత యెహోవాకు సమర్పించుకోవాలని నిర్ణయం తీసుకొని పూర్తికాల సేవను చేపట్టాను. ఈనాడు యీ పనిలో నేను సంతోషిస్తున్నాను. కారణం, “దైవభక్తి . . . అన్ని విషయములలో ప్రయోజనకరమవును.”—1 తిమోతి 4:8.
పి. జి., బ్రెజిల్