మా పాఠకులనుండి
శరీర హెచ్చరికను లక్ష్యపెట్టుట అండాశయ అనారోగ్యము వలన గడిచిన సంవత్సరము నేను మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నాను. కొన్ని సంవత్సరములుగా రోగ సూచనలు కనబడినప్పటికి నేను అంతగా పట్టించుకోలేదు. చివరకు నేను ఆసుపత్రికి వెళ్లినప్పుడు తక్షణ శస్త్రచికిత్స అవసరమని గ్రహించాను. “శరీర హెచ్చరికను లక్ష్యపెట్టుట” (gbr-10-TU 1992) అను మీ శీర్షిక అప్పుడే నా దగ్గర ఉంటే, అంతకు ముందుగానే నేను వైద్యుని దగ్గరకు వెళ్లే ధైర్యము నాకు కలిగి ఉండేది.
ఎమ్. యు., జపాన్
ఎయిర్-కండిషనింగ్ నేను 35 సంవత్సరాలకు పైగా ఎయిర్ కండిషనర్‌లను బాగుచేస్తున్నాను గనుక, “నీకు ఎయిర్ కండిషనింగ్ అవసరమా?” (gbr-7-TU 1992) అను శీర్షిక నాకు నచ్చింది. నేను 1950లో మొదట నా వ్యాపారము నేర్చుకొనుచున్నప్పుడు, బిటియు’స్ అంశము మేము చాలా రోజులు పఠించవలసి వచ్చింది. మీరు ఈ విషయాన్ని ఒక పేరాలోనే చాలా సరళంగా మరియు అర్థమయ్యే రీతిలో వివరించారు! ఈ శీర్షిక అప్పుడే నావద్ద ఉండివుంటే బాగుండేదేమో.
ఎ. డి., అమెరికా
అనవసరమైన వస్తు సామాగ్రి “వస్తువుల అస్తవ్యస్థత అదుపు తప్పినప్పుడు” (gbr-8-TU 1992) అను మీ శీర్షికకై వందనాలు. నా 44 ఏళ్ల జీవితంలో చాలా మట్టుకు నేను ఈ యుద్ధంతో పోరాడుచుంటిని, నాకు దొరుకు ఏ సహాయాన్నైనా నేను ఉపయోగించగలను. చాలా ఆచరణాత్మకమైన మీ సలహాకై మీకు కృతజ్ఞతలు.
సీ. ఆర్., అమెరికా
మొదట నా భర్త ఈ శీర్షిక చదివి మా ఇల్లు అస్తవ్యస్తంగా ఉందని వ్యంగ్యంగా సూచించాడు. ఆ మధ్యే మేము ఇల్లంతా శుభ్రపరచాము, మా ఇల్లు ఎప్పుడు చక్కగా కనబడదు అని నేను తలంచాను. నేను ఈ శీర్షికను చదివి అర్థంచేసుకొనడం జరిగింది. నా ఇంటియొక్క నిజమైన స్థితిని తెలుసుకొన్నప్పుడు నేను ఎంతగా నవ్వాను! గుట్టలుగా పడివున్న అనవసర సామానులను తొలగించుటకు మీ శీర్షిక నాకు సహాయం చేసింది. మీకు కృతజ్ఞతలు.
ఎస్. సి., అమెరికా
అంతర్జాతీయ నిర్మాణము “యు జస్ట్ హ్యావ్ టు డు ఇట్” (gbr-9-TU 1992) అను శీర్షికను అందుకొనుటకు మేము ఆనందించాము. దక్షిణ అమెరికా నందలి కొలంబియాలోని వాచ్‌టవర్ నిర్మాణ ప్రాజెక్టు నందు నేను నా భార్య స్వచ్ఛంద సేవకులుగా పనిచేయుటకై వెళ్లుటకు ఒక వారము ముందు ఇది వచ్చింది. ఈ శీర్షిక మేము ఎదురు చూడబోవు దానికి ఒక ఊహనందించింది. మేము వెళ్లకముందు దీన్ని కుటుంబస్థులకు, యజమానులకు ఆసక్తి గలవారికి మరియు బైబిలు విద్యార్థులకు చాలా ప్రతులు అందించగలిగాము. మేము ఏ పనిచేయడానికి వెళ్లనైయుంటిమో దాన్ని గూర్చివారు సరైన అవగాహన చేసుకొనుటకిది వారికి సహాయము చేసింది.
టి. జి., అమెరికా
కుటుంబములు తయారుచేయుట “ప్రపంచవ్యాప్తంగా కుటుంబములను తయారుచేయుట—ప్రేమ, క్రమశిక్షణ, మాదిరి, మరియు ఆత్మీయ విలువలతో పెంచుట” (gbr-10-TU 1992) అను శీర్షిక బైబిలు యొక్క క్రొత్త విద్యార్థినగు నాకు చాలా ప్రోత్సాహమిచ్చింది. మేము క్రైస్తవ కూటములకు హాజరగుట మొదలు పెట్టినప్పుడు, నా కుమారుడు ఉన్మాదిలా ప్రవర్తించి ఏడ్చేవాడు కాని మాతో పఠించు క్రైస్తవ స్త్రీయొక్క సహాయము, మరియు మీరు ప్రచురించు పత్రికల ప్రోత్సాహము వలన నేనిప్పుడు సత్ఫలితాలను పొందుచున్నాను. నా రెండున్నర సంవత్సరముల వయస్సుగల కుమారుడు ఇప్పుడు కూటములు జరిగేటప్పుడు నిశ్శబ్దంగా కూర్చుంటున్నాడు మరియు చిన్న వ్యాఖ్యానాలు కూడ చేస్తున్నాడు.
ఎమ్. టి., జపాన్
వృధాప్రసంగం నేను తీవ్రముగా వృధాప్రసంగం చేసేవాడిని. కాని ఒకరోజు నేను పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తరువాత “వృధాప్రసంగం—హానిపొందకుండ తప్పించుకునేదెలా?” (gbr-4-TU 1992) అనే అంశాలను చదివాను. మీ సహాయముతో నేను ఆ చెడ్డ అలవాటును మానుకో గలిగాను. వృధా ప్రసంగం అంత తీవ్రమైనదని అది ఒకరి ప్రతిష్ఠను నాశనం చేయగలదని నాకు నిజముగా తెలియదు. ఈ సమాచారము కొరకు నేను ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
ఎఫ్. బి., అమెరికా
ఆ శీర్షిక అక్షరాలా నా ఉద్యోగమును కాపాడింది. నేను పనిచేస్తున్న ఫ్యాక్టరీని మూసేస్తున్నారనే వదంతును పదేపదే అంతటా చెప్పాను. ఆ రోజు గడవక ముందే, సూపర్‌వైజర్ గారి ఆఫీసుకు నన్ను పిలిచారు. నేను వృధాప్రసంగం చేస్తున్నానని, ఉద్యోగాలు చాలా అరుదుగావున్నందున అటువంటి వదంతులను వ్యాపింపచేయడం ప్రజల్ని భయబ్రాంతుల్ని చేస్తుందని ఆయన నాతో చెప్పాడు. నేను పనిచేస్తున్న స్థలంలోని ప్రజలు నానుండి దూరం కావడం మొదలయ్యారు, మరియు నన్ను వదిలించుకోవడానికే ఇది వారికి సాకు అని అనుకున్నాను. ఎప్పుడైతే వృధాప్రసంగం గూర్చిన అవేక్! ను పొందానో, పైనుండి వచ్చిన సలహాగా దానిని స్వీకరించాను. నేను దానిని మా సూపర్‌వైజర్‌కు చూపించి, దానినుండి ఏం నేర్చుకున్నానో, మరియు వృధాప్రసంగం నుండి దూరం కావడానికి నాకు సాధ్యమైందల్లా చేస్తానని ఆయనతో చెప్పాను. ఆయన నాకు కృతజ్ఞత తెల్పాడు—మరి నేను నా ఉదోగ్యాన్ని నిలుపుకున్నాను.
ఎల్. జి., అమెరికా