కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 12/8 పేజీలు 14-16
  • ముచ్చటైన కోలా ముగ్ధులను చేస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ముచ్చటైన కోలా ముగ్ధులను చేస్తుంది
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజంగా ఎలుగుబంటి కాదు
  • ఆకుకూరల ఆహారం
  • అవి మచ్చిక చేయబడగలవా?
  • అధికముగా చంపబడిననూ ఇప్పుడు సంరక్షించబడినవి
  • ముచ్చటైన కోలా అంతరించకుండునా?
  • యూకలిప్టస్‌ అదెంత ఉపయోగకరమైనది?
    తేజరిల్లు!—2001
  • డౌన్‌ అండర్‌ జీవితం భిన్నంగా ఉంది
    తేజరిల్లు!—1997
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1997
తేజరిల్లు!—1992
g92 12/8 పేజీలు 14-16

ముచ్చటైన కోలా ముగ్ధులను చేస్తుంది

ఆస్ట్రేలియాలోని అవేక్‌! ప్రతినిధి పంపినది

పూర్వ కాలములందు అన్వేషింపబడని క్రొత్త ప్రదేశములలో ఉత్తేజపరచు అసాధారణ జంతువులను కనుగొనుట అత్యంత ఆశ్చర్యానందము కలుగజేయు వాటిలో ఒకటై ఉండవచ్చును. ఇదే 1788 సంవత్సరం తరువాత ఆస్ట్రేలియాలో నిశ్చయంగా జరిగింది.

పూర్వం, జాక్‌సన్‌ ఓడరేవు, (ఇప్పుడు సిడ్నీ) చుట్టుపట్ల ఉన్న నేరస్థులు నివసించే కాలనీలలో ఇంగ్లాండు నుండి ఆస్ట్రేలియాకు ఖైదీలుగా తీసుకు రాబడిన నేరస్థులు నివసించేవారు. పది సంవత్సరాల తరువాత విడుదల చేయబడిన ఒక నేరస్థుడు అన్వేషకుడుగా మారి ఆ దేశంలోనే దక్షిణ ప్రాంతంలో 130 కిలోమీటర్ల దూరం ఉన్న పీఠభూమికి బయలుదేరాడు. అతడు మొదటిసారి ఆస్ట్రేలియా కోలాను చూసినప్పుడు అతనికి ఆహ్లాదకరమైన విస్మయం కలిగింది. అతడు ఇలా వ్రాశాడు: “అది, స్థానికులు (ఆదిమవాసులు) ‘కాలవీన్‌’ అని పిలిచే అమెరికాలోని క్షీరద జాతి జంతువులను పోలివుండే ఒక జంతువు.”

రెండు వందల సంవత్సరముల తరువాత అధిక సూర్యరశ్మి పొందే ఆస్ట్రేలియాకు పర్యాటకులను ఆకర్షింప చేసిన ముగ్ధులను చేయు బొచ్చుగల ఈ జీవిని గూర్చి పరిశీలించుటకు మీరిష్టపడతారా? నిస్సందేహముగా, మీరు ఇష్టపడతారు, ఎందుకనగా కంగారును చూడాలని అడిగే వారి తరువాత, ఆస్ట్రేలియాకు వచ్చే సందర్శకులు తరచుగా అడిగేదేమంటే: “నేను మీ ముచ్చటైన బొమ్మలాంటి ఎలుగుబంటిని చూసి, దానిని స్పర్శించాలి.”

నిజంగా ఎలుగుబంటి కాదు

నిస్సందేహముగా, కోలా ముచ్చటైన చిన్న జంతువు. అది దాదాపు 80 సెంటీ మీటర్ల పొడవు మాత్రం పెరిగి, మెత్తని నాజూకైన బొచ్చుకలిగి, గుండీవంటి ముక్కుతో, ఎలుగుబంటిలా కనిపిస్తుంది. అది ఎలుగుబంటి జాతికి ఎంతమాత్రం చెందదని తెలుసుకొనటానికి మీరు ఆశ్చర్యపోవచ్చు.

అవును, అది తరచూ కోలా ఎలుగుబంటి లేక ఆస్ట్రేలియా స్థానిక ఎలుగుబంటి అని పిలువబడుతుంది. కాని ఇవన్నీ తప్పుపేర్లే. కోలా, ఎలుగుబంటి కుటుంబానికి చెందడం కంటె, దాదాపు బీవర్‌వలె వుండే ఆస్ట్రేలియా లోకడుపుగల స్తన జాతి జంతువైన వాంబట్‌తో చాల దగ్గర పోలిక కల్గివుంటుంది.

ముగ్ధులను చేయు ఈ ముచ్చటైన జీవిని గూర్చి ది ఆస్ట్రేలియన్‌ ఎన్‌సైక్లోపిడియా ఒక ఆకర్షణీయమైన చిత్రాన్ని వేస్తుంది: “కోలా బలిష్ఠమైన శరీరం, పైన బూడిద రంగునుండి గోధుమవన్నె, క్రింద పసుపుతో కలిసిన తెలుపు రంగుగల దట్టమైన ఉన్ని వంటి బొచ్చుకలిగి, పెద్దగా గుండ్రని బొచ్చుగల చెవులు, తోలువంటి విశాలమైన, దాదాపు తొండం వంటి ముక్కు కలిగివుంటుంది . . . ఇది ధైర్యంగా పైకెక్కగలదు గాని, నేలపై నడవడంలో నేర్పులేనిది.”

పూర్తిగా ఎదిగిన కోలా 14 కిలోల బరువుంటుంది. అవి అడవులలో దాదాపు 20 సంవత్సరాల వరకు జీవించగలవు. బోనులో కొన్ని 12 సంవత్సరాల వరకు జీవించాయి.

ఆస్ట్రేలియా కంగారులానే కోలా ఒక లోకడుపున్న స్తనజాతి జంతువు (లాటిన్‌లో “చిన్న సంచి” లేదా “తిత్తి”) మరియు వీటి జనన విధానం లోకడుపున్న స్తన జాతి జంతువులానే అపూర్వమైనది. జన్మించినప్పుడు చాల చిన్నవిగా ఉండి, ఇంకా పూర్తిగా ఎదగని పిల్ల కోలాలు ఏ తోడ్పాటు లేకుండానే తల్లి లోకడుపు సంచిలో దూరి అక్కడ దాని రెండు పొదుగులలో ఒక దానిని అంటిపెట్టుకుని ఉంటాయి.

ఆరునెలల తరువాత, చిన్నది పూర్తిగా ఎదిగిన శిశువై, సంచిని కొద్దికాలం కొరకు విడిచిపెట్టు సామర్థ్యం కలిగి ఉంటుంది. కాని ఇంచు మించు ఇంకొక రెండు నెలల తరువాత, మళ్లీ లోనికి వెళ్ళడానికి అది మరీ పెద్దదవుతుంది. ఇప్పుడు ఏమిచేయాలి? అది నిజంగా సమస్యేమీ కాదు! తనతల్లి, చెట్టు ఎక్కి దిగునపుడు అది తనతల్లి వీపు పైకెక్కి గట్టిగా పట్టుకొని ఉంటుంది.

ఏది ఏమైనా, ఈ ఉచిత స్వారీలు నిత్యము వీలుకావు. కాబట్టి ఇంకొక ఐదు లేక ఆరునెలల తరువాత, చిన్నది తనకు కావలసిన ఆహారాన్ని తాను వెదుక్కోవలసిందే! ఈకొద్ది సమయంలో తన బొచ్చుగల వీపుకు వ్రేలాడుతున్న బిడ్డను సంతోషంగా ఎత్తుకొని తిరుగుతున్న తల్లి కోలాను చూడడం కనులపండుగగా ఉంటుంది. తన తల్లిని విడిచిన తరువాత, చిన్న కోలా ఒంటరి జీవితాన్ని గడుపుతూ, కేవలం జతకూడునప్పుడు మాత్రమే ఇతరులతో సంబంధము కలిగి ఉంటుంది.

ఆకుకూరల ఆహారం

కోలా అనే పేరు చాల తక్కువ నీరు త్రాగు జంతువు అని అర్థమిచ్చే ఆదివాసుల పదమునుండి సంగ్రహింపబడినది. కాని అవి నీరు లేకుండా ఎలా జీవించగలవు? అవి తినే జిగురు ఆకులలోని తేమ మరియు మంచు ద్వారా అలా జీవించగలవు!

జిగురు ఆకులా? అవును, 50 వేర్వేరు రకాల నీలగిరితైల వృక్షాల ఆకులను (యూకలిప్టస్‌) మేయును, అయితే వీటిలో ఒక డజను కంటే తక్కువ రకాలు వాటికి ప్రీతి పాత్రమైన ఆకులు. నీలగిరి తైలవృక్షాలు సాధారణంగా అడవి ఎఱ్ఱ జిగురు, బూడిద రంగు జిగురు మరియు టాస్‌మేనియా నీలి జిగురు పేరుతో గుర్తింప బడుతున్నాయి.

పూర్తిగా ఎదిగిన కోలా ఒక రోజుకు ఒక కేజి ఆకులను నిదానంగానే కాని పూర్తిగా నములుతూ తింటుంది. అవి వాటి సమయాన్ని ఎక్కువగా జిగురు చెట్లమీదనే గడుపుతూ, కేవలం ఇంకొక చెట్టుపైకి వెళ్లటానికి మాత్రం క్రిందికి దిగి వస్తుంటాయి. నేలపై అవి అసంబద్దంగా, వికారంగా నడుస్తాయి.

అవి నిశాచర జంతువులు గనుక పగలు చాల వరకు నేలనుండి ఎత్తైన చెట్టుపంగలో అనిశ్చితముగా వాలి నిద్రిస్తూ గడుపుతాయి. అసౌకర్యమా? అవి అలా భావించవు. ఇతర జంతువులను చంపితినే వాటి బారినుండి తప్పించుకొనుటకు వాటికి ఆ స్థానం మంచి రక్షణ కల్పిస్తుంది.

అవి మచ్చిక చేయబడగలవా?

చిన్న కూనలుగా వున్నపుడే వాటిని తెచ్చుకున్నపుడు కోలాలు మచ్చిక చేయబడి, ప్రేమగల పెంపుడు జంతువులయ్యాయి. ఉత్తర క్వీన్‌లాండులోని ఒక దంపతులు అలాంటి పెంపుడు జంతువును మూడు నెలలు ఉన్నప్పటి నుండి పెంచారు. ఈ చిన్న ఆడ కూన ప్రతి రాత్రి ఏడ్చేది, చివరకు కోలా బొచ్చును కొద్దిగా తీసుకుని దిండుకు చుట్టి దాని ప్రక్కన తల్లికి మారుగా బుట్టలో పెట్టినపుడు ఏడ్పు మానుకుంది. దానికి వారు టెడ్డి అని పేరుపెట్టారు, ఘనపదార్థ ఆహారమైన జిగురు ఆకులు తినడం మొదలు పెట్టేంత వరకు అది ఆవు పాలను పిల్లిలా నాలుకతో గతుకుచూ పెరిగింది.

సమస్యేమంటే ఈ టెడ్డి మనుష్యులకు ఎంతగా అలవాటు పడిందంటే ఒంటరిగా విడిచి పెట్టబడుటకు అది ఇష్టపడేది కాదు, చిన్న పిల్లవలె దాన్ని వెంట బెట్టుకొని తిప్పాలని ఇష్టపడేది. అది నిజంగా చికాకుగా తయారయ్యింది. దాని సంతుష్టమైన జీవితం 12 ఏళ్లకు ముగిసింది. అవును, కోలాలు మచ్చిక చేయబడగలవు, కాని ఇప్పుడు వాటిని పెంపుడు జంతువులుగా ఉంచుకోవడం ఆస్ట్రేలియాలో చట్టవిరుద్ధం.

అధికముగా చంపబడిననూ ఇప్పుడు సంరక్షించబడినవి

ఆస్ట్రేలియాలో 1900 సంవత్సర కాలంలో, కోలాలు చాల అధికంగా అంటే లక్షల కొలదిగా ఉన్నట్లు నివేదించబడినది. నీలగిరితైల చెట్ల పంగలలో పగటిపూట నిద్రించుచుండుట వలన అవి సుళువుగా చిక్కేటట్లు ఉండేవి గనుకనే కేవలం ఆట కొరకు వేలకొలదిగా కాల్చి చంపబడ్డాయి.

అటు తరువాత వాటి మెత్తని, తెలుపు బూడిద రంగు బొచ్చుకు గిరాకి పెరిగినప్పుడు వధించుట అధికమైంది. ఉదాహరణకు 1908 లో ఒక్క సిడ్నీలోనే దాదాపు 60,000 కోలా చర్మాలు అమ్మ బడ్డాయి. మరియు 1924 లో 20 లక్షల బొచ్చు చర్మాలు ఆస్ట్రేలియా యొక్క తూర్పు రాష్ట్రాలనుండి ఎగుమతి చేయబడినవి.

సంతోషదాయకంగా, ఆస్ట్రేలియా ఫెడరల్‌ ప్రభుత్వం ఈ ముచ్చటైన జీవి అంతరించి పోగలదని గ్రహించి, 1933 లో కోలాలు మరియు వాటి మూలముగా తయారు చేయబడిన వస్తువులు ఎగుమతి చేయుటను నిషేధించు చట్టములు అమలులో పెట్టింది. కోలా ఇప్పుడు సంరక్షించబడిన జంతువు.

ఇతర దేశాలు కోలాలను తమ జంతు ప్రదర్శన శాలల్లో ఉంచటానికి ప్రయత్నించినవి కాని అంత సఫలం కాలేదు. తాజా నీలగిరి తైల చెట్ల ఆకులు ప్రత్యేక ఆహారాన్ని ఇవ్వటం కష్టమైనదే. ఎలాగైనా, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో నీలగిరితైల వృక్షాలను పెంచటానికి వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ విజయం సాధించగలిగారు. ఇప్పుడు సాన్‌డియాగో మరియు లాస్‌ ఏంజలీస్‌లోని జంతుప్రదర్శన శాలల్లో ఆరోగ్యవంతమైన కోలాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ మధ్యనే కోలాలు జపానుకు పంపబడ్డాయి, అచ్చట, జాగ్రత్తగా అధ్యయనం చేయబడిన పద్ధతులుపయోగించి వాటిని ఆరోగ్యవంతంగా వుంచు ఏర్పాటు చేస్తున్నారు.—అవేక్‌! ఆగష్టు 22, 1986 చూడుము.

ముచ్చటైన కోలా అంతరించకుండునా?

సరదా కొరకు వాటిని చంపకుండ వుండాలనే కనీస జ్ఞానం వుంటే అవి ఉనికిలో ఉండుటకు బహుశా దోహదపడవచ్చును. ఫర్ర్‌డ్‌ ఆనిమల్స్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా అనే తన పుస్తకాన్ని రచయిత ఎలిన్‌ట్రోటన్‌ ఈ ఆశతో ముగించాడు: “ముచ్చటైన కోలా ప్రతిచోట పూర్తిగా ప్రమాదంలేనిదే. అమెరికాలోని పిల్లి జాతి జంతువులవలె అవి ఎక్కువగా వుండి పొలాలలో మరియు నగర పరిసర ప్రాంతములలో తరచుగా సంచరిస్తుంటే అందరికి ఎంత ఆనందంగా ఉంటుంది! అరణ్యాలలో శాంతియుతంగా ఆకులు అలములు మేయటానికి వాటి సంఖ్య అద్భుత రీతిగా పెరుగును గాక!”

కేవలం ముచ్చటైన కోలా కొరకే కాదు, మన ఆహ్లాదము, ఆనందం కొరకు ఇక్కడ భూగ్రహంపై మనతోపాటు జీవిస్తున్న అందమైన జీవులన్నింటి కొరకై, ఈ ఉత్తమమైన నిరీక్షణను జంతు ప్రేమికులంతా అంతటా బిగ్గరగా అభినందిస్తారు.

[16వ పేజీలోని చిత్రం]

పూర్తిగా ఎదిగిన కోలా ఒక దినానికి ఒక కేజీ నీలగిరితైల చెట్ల ఆకులను నిదానంగానే కానీ పూర్తిగా నములుతూ తింటుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి