కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 12/8 పేజీలు 12-13
  • క్రిస్మస్‌ ఎందుకు క్రైస్తవులది కాదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రిస్మస్‌ ఎందుకు క్రైస్తవులది కాదు
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజానికి క్రిస్మస్‌ ఎక్కడనుండి వచ్చింది
  • అన్యాచారాలను క్రైస్తవత్వంగా చేయుట
  • యేసుక్రీస్తు క్రిస్మస్‌నెలా దృష్టించాడు?
  • ఆధునిక క్రిస్మస్‌ మూలాధారాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • క్రిస్మస్‌—ప్రాచ్య దేశాల్లో కూడా ఎందుకుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • క్రిస్టమస్‌ మీకు ఏ భావాన్నిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • క్రిస్మస్‌ క్రైస్తవుల పండుగా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
తేజరిల్లు!—1992
g92 12/8 పేజీలు 12-13

బైబిలు ఉద్దేశము

క్రిస్మస్‌ ఎందుకు క్రైస్తవులది కాదు

‘క్రిస్మస్‌ బహిష్కరించబడింది! ఆ పండుగ నాచరించేవారు గానీ క్రిస్మస్‌రోజు పనికి వెళ్లకుండ యింటి దగ్గరే వుండేవాడుగానీ జుల్మానాలను భరించవలసివుంటుంది!’

ఈ మాట వింతగా వుంది కదండీ, అయిననూ 17 వ శతాబ్దంలో అదొక చట్టంగా రూపొందింది. ప్యూరిటన్స్‌ ఆ పండుగను ఇంగ్లాండులో నిషేధించారు. ఎందుకంత గట్టిగా క్రిస్మస్‌ను వ్యతిరేకించారు? క్రిస్మస్‌ క్రైస్తవులది కాదని ఈనాడు భావించేవారు లక్షలాదిమంది ఎందుకున్నారు?

నిజానికి క్రిస్మస్‌ ఎక్కడనుండి వచ్చింది

యేసు క్రీస్తు క్రిస్మస్‌ను స్థాపించలేదని లేక ఆయనగానీ ఆయన మొదటి శతాబ్దపు శిష్యులుగాని దాన్ని ఆచరించలేదని నీవు తెలిసికొనుటకు ఆశ్చర్యపడతావేమో. నిజానికి, క్రీస్తు మరణించిన 300 సంవత్సరాల వరకు క్రిస్మస్‌ పండుగను జరుపుకున్న దాఖలా లేమీ లేవు.

అప్పుడు జీవించిన అనేకమంది ప్రజలు సూర్యుని సాంవత్సరిక భ్రమణం మీద ఎంతో ఆధారపడి యున్నామని తలంచినందున దానిని పూజించారు. ఐరోపా, ఐగుప్తు మరియు పర్షియా దేశాలలో సూర్యారాధన ఆడంబరముగా చేసుకునేవారు. ఈ పండుగలలోని ముఖ్యోద్దేశం వెలుగు పునరాగమనమే. సూర్యుడు, శీతాకాలంలో బలహీనంగా వుంటున్నందున ‘దూరం నుండి వస్తున్న స్థితినుండి’ పునరాగమనం చెందాలని వారు దాన్ని ప్రార్థించేవారు. సంబరాలు చేసుకొనుట, విందులు, నాట్యాలు, ఇండ్లను లైట్లతోను ఆభరణాలతోను అలంకరించుట, బహుమతులిచ్చుట మొదలగునవి, అన్నీ ఆ పండుగలలో చోటుచేసుకున్నవి. ఈ పనులు జనసామాన్యమైనవా?

వారికున్న నమ్మకాలలో క్రిస్మస్‌ సందర్భమున కాలని దుంగకు మాంత్రిక శక్తులున్నవనియు భోగిమంట సూర్యదేవతకు శక్తినిచ్చి దాన్ని పునరుజ్జీవింపజేస్తుందనియు, ఇండ్లను పచ్చని తోరణాలతో అలంకరిస్తే దయ్యాలను వెళ్లగొట్టవచ్చుననియు, సూర్యుడు పునర్దర్శనమిస్తాడనే అభయం నిమిత్తం సర్వదా పచ్చని ఆకులతోవున్న వృక్షాన్ని ఆరాధించాలనియు, మిస్టెల్‌టొ రెమ్మలను రక్షరేకులుగా (తాయెత్తులుగా) కట్టుకుంటే అదృష్టం కలిసొస్తుందనే విశ్వాసం ఆ సూర్యారాధికులకు ఉండేది. ఈనాడు ఏ పండుగలో యీ వస్తువులు వాడుకనందున్నవి?

అన్యమతమున్న రోమ్‌లో క్రిస్మస్‌ ప్రారంభం కాకమునుపే చాలాకాలం క్రితమే డిశంబరు నెల ముఖ్యంగా పండుగల మాసం. వారం పొడవునా జరిగే శాటర్నాలియా (శనిదేవత, వ్యయసాయ దేవతకు సమర్పించబడినది) మరియు డీస్‌ నాటాలిస్‌ సోలీస్‌ ఇన్‌విక్టీ (అజేయుడైన సూర్యుని జన్మదినం) అనే పండుగలను ఆ కాలంలో జరుపుకునే వారు మరియు పర్షియా దేశపు వెలుగు దేవత మిత్రాస్‌ యొక్క జన్మదినం డిశంబరు 25 ననేయని పరిగణించేవారు.

అన్యాచారాలను క్రైస్తవత్వంగా చేయుట

అన్యులను మార్చే ఉద్దేశంతో, క్రైస్తవ విశ్వాసములను అన్యుల నమ్మకాలతో లేఖన విరుద్ధంగా కలిపేశారు అందుచేతనే చర్చి, అన్యుల అతిప్రాముఖ్య పండుగతోపాటు జరుపుకొనగలిగే ఒక తేదీని క్రిస్మస్‌ కొరకు ఎన్నుకున్నది. మరి క్రిస్మస్‌ పండుగనాటి ఆచార వ్యవహారాల విషయమేమిటి? క్రిస్మస్‌ నాటి ఆచారాలు చాలవరకు “నిజమైన క్రైస్తవ ఆచారాలు కావనియు అయితే అది చర్చి అనుమతించిన లేక అలవర్చుకున్న అన్యాచారాలని” ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలిజియన్‌ అండ్‌ ఎతిక్స్‌ ఒప్పుకుంటుంది. వీటికి క్రైస్తవత్వాన్ని రుద్దడంవల్ల వాటిని ఆచరించే వారిని క్రైస్తవులుగా చేసినట్లవుతుందని నిజంగా భావించారు.

అయితే అన్యమతాన్ని క్రైస్తవత్వంగా మార్చే బదులు యీ ఆచారాలు క్రైస్తవత్వాన్నే అన్యమతంగా మార్చినది. ఆ 17 వ శతాబ్ద కాలంలో ప్యూరిటన్లు క్రిస్మస్‌ యొక్క అన్యాచారంపట్ల ఎంత కలత చెందారంటే వారు ఇంగ్లాండులోను కొన్ని అమెరికన్‌ వలస ప్రాంతాల్లోను ఆ పండుగను నిషేధించారు. క్రిస్మస్‌ను ఆచరించినందుకు లేక క్రిస్మస్‌ రోజున పనికి వెళ్లకుండ ఇండ్లవద్దనే వున్నందుకుగాను జుల్మానాలు వసూలు చేసేవారు. న్యూ ఇంగ్లాండులో (అమెరికాలో) 1856 వరకు క్రిస్మస్‌ చట్టబద్ధం కాలేదు.

గతంలో చర్చికాని, అన్యులు గాని లేక ప్యూరిటన్లుగాని క్రిస్మస్‌ను ఎలా దృష్టించారనే దానికన్నా ప్రాముఖ్యమైన విషయమొకటున్నది. నిజమైన క్రైస్తవులకు ఏది ప్రాముఖ్యమై యున్నది అనంటే . . .

యేసుక్రీస్తు క్రిస్మస్‌నెలా దృష్టించాడు?

నీ గౌరవార్థం ఓ ఆచారం జరుపవలసియుంటే దాని పద్ధతని నీ వంగీకరించుట ప్రాముఖ్యం కాదా? అందుచేత, మనమిలా ప్రశ్నించుకోవాలి: అన్యులలో పాతుకుపోయిన ఆచారాలను గూర్చి యేసు దృక్పథాన్ని గూర్చి బైబిలేమి తెలుపుచున్నది.

మత మార్పిడి చేసుకున్న వారి నిమిత్తం పవిత్రారాధనను పణంగా పెట్టిన మతనాయకులను యేసు ఖండించాడు. ఆయన అటువంటి నాయకులతో ఇట్లన్నాడు: “ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీ కంటె రెండింతలు నాశనపాత్రునిగా చేయుదురు.”—మత్తయి 23:15, ఫిలిప్స్‌.

అన్యుల, క్రైస్తవుల విశ్వాసాలను మిశ్రమము చేసి మతమార్పిడి చేయుటకు ప్రయత్నించకూడదు. యేసు యొక్క అపొస్తలుడైన పౌలు కొరింథులో నివసించే క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు.” (1 కొరింథీయులు 10:21) వారికి వ్రాసిన తదుపరి పత్రికలో పౌలు యింకను ఇలా వ్రాశాడు: “అవిశ్వాసులతో విజ్జోడుగా వుండకుడి. . . . క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం.”—2 కొరింథీయులు 6:14, 15, ఫిలిప్స్‌.

తనబిడ్డ మురికి కాలువలోనుండి మిఠాయిని తీసుకొనుటను అప్రమత్తంగావున్న ఓ తల్లిచూస్తే వెంటనే దాన్ని పారేసిరమ్మని అతనికి గట్టిగా చెబుతుంది. దాని తినడమంటేనే—దాని ముట్టుకోవడంకూడ—ఆమె సహించలేదు. క్రిస్మస్‌, అనేకులకు ప్రీతిగా ఉన్నను, మురికి ప్రాంతాల్లోనుండి తెచ్చుకున్నదే. తనవలె సత్యారాధికులనుండి యిలా కోరిన ప్రవక్త యెషయా భావాలతో యేసు మనోభావాలు ఏకీభవిస్తున్నాయి: “పోవుడి, పోవుడి, అచ్చటనుండి వెళ్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి.”—యెషయా 52:11.

కావున, నిజమైన క్రైస్తవులీనాడు క్రిస్మస్‌ పండుగ నాచరించరు. ఇది ఇతరుల దృష్టికి వింతగా వున్నప్పటి వారు ఆచారాలను యేసు మాదిరిగానే దృష్టిస్తారు. “వారెందు నిమిత్తము పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు” అని ఆయనను అడిగినపుడు ఆయనిలా సమాధానమిచ్చాడు: “మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?” ఇంకను ఆయన ఇలా అన్నాడు: “మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.”—మత్తయి 15:2, 3, 6.

నిజక్రైస్తవులు ఈనాడు మనుష్యులయొక్క అన్య పారంపర్యాచారాలతో మలినము కానటువంటి “పవిత్రమును నిష్కళంకమునైన భక్తి” ననుసరిస్తు యేసుతో ఐక్యతను కనబరుస్తున్నారు.—యాకోబు 1:27. (g91 12/8)

[13వ పేజీలోని చిత్రం]

“మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?”—మత్తయి 15:3

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి