మా పాఠకులనుండి
ఒక బిడ్డ యొక్క మరణము “బైబిలు దృక్పథము” నందు “దేవుడెందుకు నా బిడ్డను తీసుకున్నాడు”? (మే 8, 1992) “బిడ్డ యొక్క మరణము—దేవుడు దానినెందుకు అనుమతించెను?” అనే శీర్షికలు నాకు అవసరమైన సరియైన సమయములో ఓదార్పునిచ్చినవి. జనవరి 9 తేదిన నేను ఒక బిడ్డను కన్నాను, తను మూడుగంటల తర్వాత చనిపోయింది. నేను ఆగ్రహం చెందాను, పొరపాటున దేవుని మీదకూడా ఉగ్రురాలు నయ్యాను. అప్పుడు నేను ఈ శీర్షికలను చదివాను. దేవుని కనికరముయొక్క లోతు ఆ పేజీలలో కుమ్మరించబడింది. నేను ఏడ్చి విలపించాను. నేను ఒంటరిదాననై నిస్సహాయస్థితిలో ఉండగా మీరందించిన నిరీక్షణకు మీకు వందనములు”
సి. కె., జపాన్
పాడే పక్షులు “మే 8, 1992 సంచికలో పాడే పక్షులను గూర్చి వ్రాసిన ఆకర్షణీయమైన శీర్షిక కొరకు మీకు కృతజ్ఞతలు. నా భర్త అనేక సంవత్సరములనుండి మా పెరట్లో పక్షులకు ఆహారము వేస్తున్నాడు, మేమిరువురము వాటిని చూస్తూ ఆనందిస్తున్నాము. పక్షులు తమ స్వరాలను నమ్మశక్యము కాని విధంగా వల్లిస్తాయని చదివిన మీదట మేము వాటిని వినగలుగు తున్నాము కూడ. యెహోవా మరొక అద్భుతాన్నిగూర్చి కడుచక్కని వర్ణన నిచ్చినందుకు మేము మీకు ఎంతో కృతజ్ఞులైయున్నాము.
జె. ఎస్., అమెరికా
ఆత్మరక్షణ “బైబిలు దృక్పథం—ఆత్మరక్షణ—క్రైస్తవుడు ఎంతవరకు వెళ్లవచ్చును?” (జూలై 8, 1992) అనే శీర్షికను చదివినప్పుడు ఆత్మరక్షణ పోరాటములు జగడమాడుటకు, పైబడుటకు సంసిద్ధున్ని చేస్తుందనే అభిప్రాయానికి ఒకడు వచ్చేటట్లు చేస్తుంది. అలా జరగదు. అనేక ఆత్మరక్షణ పోరాటాలు శారీరక నియంత్రణ, స్వయం క్రమశిక్షణ, మరి యితర ఏ ఆటలకంటే ఎంతో ఉన్నతమైన సరళ ప్రవర్తనను అవి అందిస్తాయి.
టి. ఎమ్., జర్మనీ
ఆత్మరక్షణ పోరాటములు అందు పాల్గొనే వారికి కొంత విలువను ప్రసాదించవచ్చుననేది నిజమే కావచ్చును. అయినను, తోటి మానవున్ని ఒకడు ఎలా గాయపర్చవచ్చునో అవి నేర్పును, అది యెషయా 2:4 మరియు మత్తయి 26:52 నందలి బైబిలు సూత్రములకు పొందికగాలేదు.—ప్రకాశకులు.
నీవేమైయున్నావో నీవు మార్చుకొనవలెనా? హస్త ప్రయోగమనే చెడ్డ అలవాటును అధికమించడానికి నేను ప్రయత్నించినను, మరలా మొదటి స్థితికి వస్తున్నందున నేను నిరుత్సాహము చెందాను అయితే, “నీవేమైయున్నావో నీవు మార్చుకొనవలెనా” (జూలై 8, 1992) అనే అంశం మీద వరుసగా నున్న శీర్షికలనుబట్టి, నన్ను నేను మార్చుకొనుటకు ఐదు నిర్దిష్టమైన చర్యలను గూర్చి నేను నేర్చుకొనగల్గాను. నా చెడు అలవాటును అధిగమించుటకైన నా నిశ్చయతను అది బలపర్చింది.
ఆర్. హెచ్., జపాన్