ఇండ్లలో అగ్ని ప్రమాదాలను అరికట్టుట
ఓ కథ చెప్పినట్లు శ్రీమతి పేట్రిక్ ఓలిరీ అనే ఆవిడగారి ఆవు కిరోసిన్ ల్యాంప్‌ను తన్నితే గిడ్డంగి నిప్పంటుకొనుటతో 1871 లో చికాగోనందు గొప్ప అగ్ని చెలరేగింది. ఆస్తికి, ప్రాణానికి అపారనష్టం వాటిల్లింది. ఒక వార్త ప్రకారం ఆ అగ్నికి, 17,400 భవనాలు నాశనమైనవి, 250 మంది ప్రజలు బలైపోయారు, 1,00,000 మంది నిరాశ్రయులయ్యారు.
ఈనాడు, 120 సంవత్సరాల తర్వాత ఆధునిక అగ్ని మాపక సాంకేతిక జ్ఞానం పెద్ద అగ్ని ప్రమాదాలను అరికట్టుటకు సహాయపడుతుంది. అయినను ఇండ్లలో జరిగే అగ్ని ప్రమాదాలు అపాయాన్ని తెస్తునేవున్నవి. అమెరికాలో ఒక సంవత్సరంలోనే ఐదువేలమంది ఇండ్లలోని అగ్ని ప్రమాదాలవల్ల మరణించారని యన్యఫ్పిఏ. (నేషనల్ ఫైర్ ప్రొటెక్టన్ అసోషియేషన్) తెల్పుతుంది. వాన్ కోవర్ సన్ లో వ్రాయబడిన సమాచారం ప్రకారం యన్ యన్యఫ్పిఏ, ఇండ్లలో అగ్ని ప్రమాదం జరుగకుండ నివారించుటకు సహాయపడు కొన్ని సాధారణ చిట్కాలు ఇచ్చింది:
▫ ఇంటో పొగత్రాగనీయవద్దు. ఇంట్లో సంభవించే అగ్నిప్రమాదాలు అత్యధికముగా నిర్లక్ష్యంగా పొగత్రాగేవారివల్లనే జరుగుతున్నాయి.
▫ ఎవరూ లేకుండానే లేదా నీవు నిద్రపోయేటప్పుడు గదిని వేడిచేసే ఉపకరణాలను పనిచేయుటకు విడువవద్దు.
▫ సర్క్యూట్ల శక్తికి మించి విద్యుత్ సరఫరా చేయవద్దు. తగిన ఫ్యూజ్లనే వాడండి.
▫ అగ్నికొలిమి బట్టీలను, చిమ్నీలను శుభ్రంచేయండి. సంవత్సరానికొకసారి తనిఖీ చేయండి.
▫ పొగను పసికట్టే యంత్రాలను క్రమంగా తనిఖీ చేయండి, ప్రతి సంవత్సరం వాటికి క్రొత్త బ్యాటరీలు వేయండి. పొగను పసికట్టే యంత్రాలు చేసే శబ్దాన్ని అందరూ విని గుర్తించేలా చూడండి.
▫ అగ్నిప్రమాద సమయంలో కుటింబీకులంతా తప్పించుకునే మార్గాన్ని తనిఖీ చేయండి, మార్గాలను తెరచివుంచండి. (g91 8/8)