కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 11/8 పేజీలు 22-23
  • పిచ్చుక మిత్రువా లేక శత్రువా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పిచ్చుక మిత్రువా లేక శత్రువా?
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దుర్మార్గమైనదని ఎందుకు దృష్టించబడెను
  • భర్తీచేయు ముఖ్యాంశాలు
  • దేవుడు మనల్ని విలువైనవారిగా పరిగణిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యెహోవా ‘మీ తలవెండ్రుకలను’ లెక్కించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • దేవుని దృష్టిలో మీకు విలువ ఉంది!
    తేజరిల్లు!—1999
  • జీవితం మీద ఆశ ఎందుకు వదులుకోకూడదు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 11/8 పేజీలు 22-23

పిచ్చుక మిత్రువా లేక శత్రువా?

క్రొత్త పొరుగువారు ఇప్పుడే వచ్చారు. పాతనివాసులను బయటికినెట్టి, వింతగా చూస్తున్న ప్రేక్షకులను తరిమివేసి, ఒక కుటుంబాన్ని పెంచి పోషించే దైనందిన వ్యవహారములో వారు స్థిరపడ్డారు.

వాటి పేరు, పిచ్చుక, ఆ మాట వివిధ రకములైన పిట్టలకు వర్తించినను, సామాన్యంగా అది బంగారు పిచ్చుక కుటుంబానికి చెందినవాటికే వర్తిస్తుంది. పిచ్చుకలు సర్వసాధారణంగా చిన్నగా, ఉండి బూడిద, గోధుమ మరియు నలుపు రంగుగల ఈకలు కల్గి అంత ప్రాధాన్యత సంతరించుకొనని పక్షులు. వాటిలో అనేకము ప్రావీణ్యంగా పాటలు పాడగలవు.

అయితే, పిచ్చుకలు బహుశ మీరు యిష్టపడే పొరుగువారు కాకపోవచ్చును. అయినను, వాటి ధైర్యము, సర్దుకుపోయే స్వభావమునుబట్టి అవి మెచ్చుకొనబడినను, కొన్ని ప్రాంతాలలో ఈ చిన్న పిట్టలు కొన్ని ప్రాంతాల ప్రజల అయిష్టతకు గురైనాయి.

దుర్మార్గమైనదని ఎందుకు దృష్టించబడెను

చెట్లను నాశనముచేయు పురుగులనుండి వాటిని కాపాడుననే నిరీక్షణతో 1851 లో ఈ ఇంటి పిచ్చుక (పాస్రర్‌ డొమెస్టికస్‌) లేదా ఇంగ్లీషు పిచ్చుకను ఐరోపానుండి ఉత్తర అమెరికాకు తీసుకొని వెళ్ళారు. అయితే, పల్లెలలో నివసించే దానికన్నా నగరాలలో నివసించుట సులభమని పిచ్చుకలు త్వరలోనే గ్రహించాయి. కనుక పురుగులను తినే బదులు, పారవేయబడిన ఆహారపదార్ధముల వైపు మళ్లాయి, చెత్త గంపలపై దాడిచేయడంలో ఆరితేరినవి. ఆ ఇంటి పిచ్చుకకున్న “సర్దుకుపోయే స్వభావం మరియు దురాక్రమణ చేయు స్వభావం” అని నార్త్‌ అమెరికన్‌ బర్డ్స్‌ అనే పుస్తకము చెపుతూ, “గోధుమ వర్ణపు ఎలుక, నల్ల ఎలుక, చిట్టెలుకలవంటి వలస ప్రాణుల లక్షణాలతో సరిపడుతున్నది” అని గమనిస్తుంది.

పిచ్చుకలు ప్రతి మూలలో లేదా ఆశ్రయమున్న చోట తమ గజిబిజి, అస్తవ్యస్త ఇళ్లను కడతాయి. ఈకలు, ఊలు, పారవేయబడిన బట్టముక్కలు, తమగూళ్లను కట్టుటకు అవి యిష్టపడే వస్తువులు. తరచుగా అవి మునుపున్న స్థానిక పిట్టలను తరిమి, వాటి గూళ్లను మొండిగా స్వాధీనము చేసుకొని, పారద్రోలబడిన వాటి గుడ్లను బయటకు నెట్టివేస్తాయి. అంతేకాదు, వివిధరకాల పండ్లను పిచ్చుకలు నాశనం చేస్తాయి, పక్వానికొచ్చిన విత్తనాలను, లేత కూరగాయలను అవి తినివేస్తాయి.

బ్రెజిల్‌కు కూడ కావాలనుకొని తీసుకు రాబడిన ఈ పిచ్చుక పంటలను నాశనము చేయడమేకాక టికు టికు అనే ప్రియమైన పిట్టను కూడా అది పారద్రోలింది. పరిమాణములోను, రంగులోను పిచ్చుకను పోలియుండే ఈ టికు-టికు ఎంతో కలివిడిగా ఉండి, పంటలకు హానికరమైన కీటకాలను నాశనముచేసే ప్రయోజనకరమైన చిన్నపిట్ట.

భర్తీచేయు ముఖ్యాంశాలు

అయినను ఆటలను ప్రేమించు పిచ్చుకలు కిచకిచలాడుచు పాడుతుంటాయి. తమగూటినుండి క్రిందికి అక్కడనుండి మరలా పైకి ఎగురుతు రెక్కలు రెపరెప కొడుతూ ఉంటే వాటిని పరిశీలించి అనేక మంది ఆనందిస్తారు. పిట్టలను పరిశీలనగా చూచే ఒకాయన యిలా వివరించాడు: “మాయింటికి పరిసరాల్లో ఏడు పిచ్చుక గూళ్లున్నాయి . . . ఆ పిట్టలలో ఒక గుంపు నీటిలో ఆడుకొంటూ ఒకదానినొకటి ఢీకొట్టుకొంటూ కన్పిస్తాయి. కొన్ని మరింత ‘ఉత్సాహం’ లో మునిగిపోతాయి. అవి నీటిలో దూకి పైకి లేచి, అటుయిటూ కదిలి ఈకలన్నింటికి నీరు పట్టేంతవరకు వాటిని ఆడిస్తు ఉంటాయి. పిమ్మట అవి కంచె మీదకు ఎగిరి, తమ ముక్కును తుడిచి, కుక్క యిదుపు కున్నట్లు యిదుపుకొని నీటివైపు చూచి మరోసారి దూకుతాయి. అలా కనీసం గంట సేపు చేస్తాయి. ఆ పిమ్మట ఎగిరిపోయి గంటా లేక రెండు గంటల తర్వాత తిరిగివస్తాయి.” కొన్నిసార్లు పిచ్చుకలు రోడ్డు ప్రక్కనున్న యిసుకలో పులుముకొని లేదా పూలమడిలో పొర్లుతాయి.

ఆసక్తికరమైన విషయమేమంటే, పిచ్చుకలు బైబిలులో ప్రస్తావించబడ్డాయి. దేవుని మృదువైన పరామర్శను వివరించడానికి అంతగా ప్రాముఖ్యతను సంతరించుకోని ఈ పిట్టలను యేసు రెండుసార్లు ఉపయోగించాడు. తన 12 మంది అపొస్తలులను ప్రకటించుటకు పంపుచు, యేసు వారిని యిలా అడిగాడు: “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా?” అటుతర్వాత ఆయన యిలా వివరించెను: “అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తలవెంట్రుకలన్నియు లెక్కింపబడియున్నవి. గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు.” అటు తరువాత యేసు తన పరిచర్యలో ఈ ఉపమానమును మరలా పేర్కొని, దేవుడు కనీసం ఒక్కపిచ్చుకను కూడా మరువడు కనుక, తన్ను సేవించువారిని ఆయన మరువడని నొక్కి వక్కాణించెను.—మత్తయి 10:29, 31; లూకా 12:6, 7.

యెహోవా దేవుడు తన సృష్టిలోని వాటన్నిటిని, చిన్నాపెద్ద రెండింటిని విలువైనవిగా పరిగణించుననేది తేట తెల్లమవుతున్నది. అయితే కొన్ని ప్రాణుల గుణలక్షణాలు వాటిని మనకు ఎల్లవేళల ప్రీతిప్రాయంగా చేయకపోయినను వివిధరకములైన జీవరాసులనేకము మన మహాసృష్టికర్తయైన ఆయన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నాయి.—కీర్తన 104:24. (g91 10/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి