మా పాఠకులనుండి
వృధాప్రసంగము “వృధాప్రసంగము—హానికలుగకుండా తప్పించుకొనేదెలా.” అది నాకు అత్యంత అవసరమైన సమయమందు వచ్చింది. నాకు ఒక మంచి స్నేహితురాలిగా ఉండిన ఒక అమ్మాయితో ఒక సమస్యను కల్గియుంటిని, ఆమె నన్ను గూర్చి హానికరమైన వృధాప్రసంగాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నది. దానిని అర్థం చేసుకొని, తాళుకొనుటకు మీ శీర్షిక నాకు నిజంగా సహాయం చేసింది.
ఎం. పి., అమెరికా
కొలస్సియం “కొలస్సియం—రోము యొక్క పురాతన ‘వినోద’ కేంద్రము.” (gbr-6-TU) అను శీర్షిక ఎంతో లీనమైపోయేటట్లు చేసేదిగా ఉన్నట్లు నేను గమనించాను. పురాణమునుండి సత్యాన్ని మీరు వేరుచేసిన విధం ప్రేరణగా ఉన్నట్లు, ఒక చరిత్రకారునిగా నేను భావించాను.
ఎన్. హెచ్., అమెరికా
ఊపిరి తిత్తులు “ఊపిరితిత్తులు—ఒక అద్భుత నిర్మాణము.” (gbr-6-TU) అను శీర్షిక చదివిన తరువాత మీకు వ్రాయాలని ప్రేరేపించబడ్డాను. దానికి ఒక్క రోజుముందే, నేను మా ఆంటీని ఊపిరితిత్తుల క్యాన్సర్ మూలంగా పోగొట్టుకున్నాను. శరీరము యొక్క అద్భుతాన్ని గూర్చిన నా మెప్పుదలను ఆ శీర్షిక వృద్ధిచేసింది. సులభంగా అర్థం చేసికొనగల్గే విధంగా కూడ అది ఉంది. ఆలాగే నా ఊపిరి తిత్తులను (పొగాకు) వంటి వాటితో పాడు చేసికొనకుండా వాటని గూర్చి తగిన శ్రద్ధను తీసుకునేందుకు అది నాకు సహాయపడింది.
సి. జి., అమెరికా
వృద్ధులయెడల శ్రద్ధ చాలా అనారోగ్యముతోనున్న నా తండ్రిని నేను చూసుకుంటూ ఉన్నాను. నా తోబుట్టువులు నాకు తోడ్పడలేదు సరికదా, ‘నీవే గట్టి దానివి. దీనిని నీవు చేపట్టగలవు’ లేదా ‘కొన్ని సంవత్సరాల క్రితమే ఒక సేవాశ్రమము కొరకు నీవు వెదకి యుండాల్సింది’ అని అంటున్నారు. నేను పెండ్లి చేసికొని పిల్లల్ని కనే అవకాశాలు గతించిపోయాయని గుర్తెరిగి, నాలో నేను దుఃఖించడం ప్రారంభించాను. భావోద్రేక సమస్యలు కూడా ప్రారంభమైనవి. అయితే “వృద్ధులను మీరు గౌరవించెదరా?” అనే శీర్షిక నాకు ఓదార్పును, సహించుటకు అవసరమగు బలాన్ని ఇచ్చింది.
ఎస్. బి., అమెరికా