“ప్రచారము” ఎందుకు?
రోమన్ కాథోలిక్ చర్చి మిషనరీలను పర్యవేక్షించేందుకు 1622 లో పోప్ గ్రెగరీ XV, 13 మంది కార్డినల్స్, ఇద్దరు ప్రీలేట్స్ మరియు ఒక కార్యదర్శితో కూడిన సంఘమును లేదా కమిటీని ఏర్పాటు చేసెను. దానినతడు కాంగ్రిగేషియో డి ప్రోపగాండా ఫిడి అని పిలిచాడు—అది విశ్వాసాన్ని ప్రచారము చేసే సంఘము. కొంతకాలమైన తరువాత ఈ పదము, మత మార్పిడి చేయడానికి అనువైన తలంపులను లేదా నమ్మకాలను వ్యాప్తి చేయడానికి ఎట్టి ప్రయత్నము చేయదనే భావానికి వచ్చింది.
నేడు, ప్రచారమనేది ఉదాహరణకు యుద్ధసమయాలలో వాస్తవాలను పెడత్రోవ పట్టించడానికి ప్రజల మనస్సులలో అలజడి రేపడానికి తరచు ముడిపెట్టబడింది. మంచి వ్యాపార ప్రకటన కూడా ముఖ్యంగా అది సమ్మతింపజేయునదైతే “ప్రచారమని” వర్ణించవచ్చునని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ది వరల్డ్ బుక్ ఎన్ సైక్లోపీడియా యిలా వ్యాఖ్యానించుచున్నది: “ప్రజాస్వామ్య సమాజమందలి విద్యా బోధకులు ప్రజలకు ఎలా తలంచాలో బోధిస్తారు, కాని ప్రచారకులు ఏమి తలంచాలో వారికి చెబుతారు.” (g91 11/8)