ప్రపంచ పరిశీలన
ఇటలీలో రక్తమార్పిడిని గూర్చిన చట్టం
ఇటలీ రాజ్యాంగ చట్టం ప్రకారం ఒకని ఇష్టానికి వ్యతిరేకంగా ఫలాని వైద్య చికిత్సనే చేయించుకోవాలని ఎవరిని బలవంతపెట్టకూడదు. ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల జారీచేసిన చట్టం రక్తమార్పిడికి కూడ యీ రాజ్యాంగ నిబంధన వర్తిస్తుందని స్థిరపరచుచున్నది. వాస్తవానికి 1991 జనవరి 15న జారియైన యీ చట్టం తెలియజేయునదేమనగా “రక్తమార్పిడులు, రక్తముతో తయారైన పదార్థములు, లేక రక్త ద్రవములు వైద్య చికిత్సకుపయోగించు అలవాటు అపాయకరము; గనుక వాటిని తీసుకునే వ్యక్తియొక్క సమ్మతి అవసరం.” మరోవిధంగా చెప్పాలంటే రోగులు రక్తములోని చిక్కులను తెలిసికొనవలెను మరియు దాన్ని త్రోసిపుచ్చే హక్కును కల్గియున్నారు. జారీ అయిన చట్టముయొక్క అనుబంధం అంగీకరించునదేమనగా రక్తమార్పిడుల మూలంగా “కాలేయరోగం మరియు ఎయిడ్స్ వంటి అంటురోగాలు రాగలవని, “ఇటీవలనే అంటురోగమునకు గురైన వ్యక్తులను ఎల్లప్పుడు లెబొరేటరీ పరీక్షలు గుర్తించలేవు.”
వేధించబడిన పిల్లలు
దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పిల్లలను శారీరకంగా కొట్టడం ఎక్కువైపోతుంది. దెబ్బలుతింటున్న పిల్లలు సహాయం అడుగలేనంత లేతప్రాయం గలవారైయున్నారు. కేప్‌టౌన్ వార్తా పత్రిక కేప్ టైమ్స్ ప్రకారం, ఇలా వేధింపబడి ఆసుపత్రిలో “గత రెండేండ్ల నుండి శారీరకంగా దెబ్బలుతిన్న వారిలో నాలుగోవంతు సంవత్సరం లోపు పిల్లలే.”
అది బోయింగ్ 737 జెట్ విమానమంత పొడవైనది
“అదేమైతేనేమి, దాని అవశేషాలు చాలా పెద్దవి. మెడ, వెన్నెముకలు ఒక్కొక్కటి 5 అడుగుల నిడివితో అడ్డముగాను, ప్రక్కటెముకలైతే 10 అడుగుల నిడివితో పొడవుగాను వున్నందున అది పూర్తిగా 90-100 అడుగుల పొడవు వుండునని విజ్ఞాన శాస్త్రజ్ఞులు అంచనా వేయవలసి వచ్చిందని” కెనడా దేశపు వాంకోవర్ సన్ అను పత్రిక నివేదించింది. అంటే అది బోయింగ్ 737 జెట్ విమానమంత పొడవున్నదన్నమాట. పందొమ్మిది వందల ఎనభై ఆరులో కెనడా, చైనా దేశపు విజ్ఞాన శాస్త్రజ్ఞుల బృందమొకటి ఇన్నర్ మంగోలియాలోని ఒక స్థలములో భూమిని త్రవ్వగా అచ్చట యీ బ్రహ్మాండమైన జంతువు మెడ శిలాకారములో కనబడింది. నాలుగు సంవత్సరాల అనంతరం దాని పెద్ద పుర్రెను త్రవ్వి వెలికితీశారు. “ఈ పుర్రెను కనుగొనుటలోవున్న నిజమైన ప్రాముఖ్యత ఏమనగా యీ ప్రాచీన సరీ సృపము, ఉత్తర అమెరికాలో ప్రసిద్ధిచెందిన ప్రాచీన సరీ సృపములకు చెందినదాకాదాయని మేము మొట్టమొదటిసారిగా నిర్ణయించగలము,” అని కెనడాలోని ఆల్బెర్టా నందలి డ్రంహెల్లర్ నొద్దనున్న రాయల్ టిరెల్ మ్యూజియం ఆఫ్ పెలాంటాలజీకి సంబంధించిన ఫిలిప్స్ క్యూరీ అన్నారు.
కులంయొక్క క్రూరత్వం
ఇటీవల బహిరంగముగా ముగ్గురు యౌవనులను హత్యచేయుట వెనుక ఇండియాలోని కులవ్యవస్థే కారణమని ఇండియా టుడే నివేదించింది. మెహ్‌రానా అనే చిన్న పట్టణంలో 18 సంవత్సరాల జాటప్ కులమునకు చెందిన యువకుడు, జాట్ అనే గొప్పకులానికి చెందిన 16 సంవత్సరాల యువతి ప్రేమలో పడ్డాడు. ఇది గమనించిన ఆ యువతి తలిదండ్రులతో సహా జాట్ కులానికి చెందిన ధనవంతులు అధికముగానున్న ఒక సభలో, ఆ యౌవనులకు, మధ్యవర్తిగావున్న మరో జాటప్ కులానికి చెందిన యువకునికి మరణశిక్ష విధించారు. యౌవనులను గంటలతరబడి నానా హింసలుపెట్టి, వారి తండ్రులచే వారి కుమారుల మెడలకు బలవంతంగా ఉరి త్రాడు వేయించారని భోగట్టా. ఆ ముగ్గురు యువకులను పట్టణపు నడివీధిలో ఉరితీశారు. ఇండియా టుడే తెల్పునదేమనగా వారిని హత్యచేసిన నేరస్థులంతా ఇప్పుడు జైళ్లలో వున్నారు. “ఈ దేశములోని గ్రామాలు ఇంకా మధ్యయుగపు కులవ్యవస్థలో కూరుకుపోయి ఏ ‘నవ నాగరికత’ దాన్ని చెరిపి వేయునంత దుస్థితిలో వున్నదనుటకు ఇదొక విషాద జ్ఞాపిక” అని వాపోయింది.
“జీవిత విశ్వవిద్యాలయం”
జాన్ మేజర్ గారు 1990 నవంబరులో ప్రధానమంత్రి కాకముందు బ్రిటన్‌లో ఆర్థికశాఖకు చాన్స్‌లర్‌గా పనిచేశారు. ఆయన తన 16వ ఏట చదువు మాని వేశాడు. తానే స్వయంగా అంగీకరించినట్లు తన “జీవిత విశ్వవిద్యాలయం”నుండే తాను విద్య నేర్చుకున్నాడట. “విద్యార్హతలున్న బోలెడు మంది నాకు తెలుసు. . . . వారిలో అనేకులు పూర్తిగా పనికిరానివారే; వారికి కనీస ఇంగిత జ్ఞానం లేదు. ప్రజలు నిజంగా ఏమైనా సాధించాలనుకుంటే వాస్తవానికి వారికి తెలివి, ఇంగిత జ్ఞానం ప్రాముఖ్యం” అని ఆయన అన్నాడు. ఆయన చెప్పిన వాటిని అనేకులు అంగీకరించక పోయిననూ, జాన్ రే అనే మాజీ హెడ్ మాస్టర్ అంగీకరించాడని లండన్ ది టైమ్స్ పత్రిక ఇలా తెల్పుతుంది: “విద్యార్హతలు అంటే ప్రత్యేకంగా ఆ సబ్జక్ట్ లోనే అతడు అర్హుడు, అంతేగాని అంతకంటె ఇక ఏమీ లేదు. కొన్ని విద్యాలయాలు ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, వాస్తవ ప్రపంచములో సంబంధం లేకుండా వున్నవి. అర్హతలు లేనివారే ఎంతో సమర్థవంతులుగా వున్నట్లు నేను గమనిస్తున్నాను.”
ఆసియా వన్య ప్రాణులను సంరక్షించుట
థాయ్‌ల్యాండ్ వంటి ఆసియా దేశాలు ఆ సవాలు నెదుర్కొంటున్నవి. ఏసియావీక్ ప్రకారం, సహజ రక్షణా ప్రపంచ నిధి థాయ్‌ల్యాండ్‌ను వేరుచేసి అది అపాయకరమైన వన్యప్రాణులను చట్టవిరుద్ధంగా అమ్మి వ్యాపారం చేస్తుందని ఆ దేశాన్ని “ప్రపంచముయొక్క వన్యప్రాణి సూపర్ మార్కెట్” అని పిలుస్తుంది. తమ దేశానికి సంబంధించని వన్యప్రాణులను థాయ్‌ల్యాండ్ చట్టం రక్షించుటలేదు; ఆ విధంగా చుట్టున్న దేశాల అపాయకరమగు వన్య మృగాల వ్యాపారమునకు అది మార్గమైంది. విదేశి జంతువులను పక్షులను అమ్మే సంతలున్నవి, మరియు కొన్ని రెస్టారెంట్లలో మొసళ్లు, అరిచే జింక, అడవిపంది వంటి అపాయకరమగు జంతు మాంసములను ‘అడవి ఆహారం’ అనే పేరుతో భోజనం లిస్టులున్నవి.
యుద్ధం, ఆటబొమ్మల పరిశ్రమ
పర్షియన్ గల్ఫ్ యుద్ధవార్తలు దూరదర్శినిలో చూచి ఉత్తేజితులైనందున జపానులో యుద్ధ ఆటబొమ్మల అమ్మకము మూడింతలు, నాలుగింతలు కూడ పెరిగింది. ది డైలి ఏమూరి తెలియజేయునదేమనగా “ఇరాక్ మీద మిత్రదేశాల సైన్యాలు చేసిన దాడిలో వుపయోగించిన విమానములు ట్యాంక్‌లవంటి ప్లాస్టిక్ మోడల్స్ వున్న దుకాణములలోనికి పిల్లలను సున్నిత హృదయులైన పెద్దలను, గల్ఫ్‌యుద్ధంలో జరిగిన బాంబుదాడులలో గూర్చి తెల్పిన వార్తలు నడిపించినవి.” అత్యంత జనాదరణ పొందిన యుద్ధ ఆటబొమ్మలేవనగా, రాడార్‌ను తప్పించుకోగల స్టెల్త్ బాంబర్, F-15 ఈగాల్ ఫైటర్, M-1 అబ్రామ్స్ ట్యాంక్, మరియు అవేక్ హెలికాఫ్టర్. ఆటబొమ్మల వ్యాపారమందు యిలా అమ్మకాలు అధికమైతే, ఆ పరిశ్రమకు “యుద్ధోన్మాది అనే చెడ్డపేరు వస్తుందని” కొందరు భయపడుచున్నారు.
ప్రమాదములోనున్న జంతువులు
చైనాలోని స్టేట్‌కౌన్సిల్ యొక్క పర్యావరణ కమిటీ ఇటీవల తెలియజేసిన దేమనగా “నిర్లక్ష్యంతో కూడిన వేట మూలంగా చైనాలో అడవి జంతువుల సంఖ్య తగ్గిపోతుంది, అరుదైన జంతువులు అంతరించి పోతున్నవి.” క్వాంగ్‌టంగ్ ప్రాంతములోని రెస్టారెంట్లను, రేవులను, మరియు ప్రయివేట్ వ్యాపారములను పరిశీలించిన మీదట, అరుదైన జంతువులను చంపి అక్కడ అమ్ముచున్నట్లు ఇన్‌స్పెక్టర్ల గ్రూపు ఇటీవల కనిపెట్టింది. చైనా టుడే అనే పత్రిక ప్రకారం, “రాక్షసబల్లి, చీమదిండి, పెద్ద అగ్నిమకరము, వానరం మరియు పునుగు పిల్లి మొదలగు వాటితోపాటు 1,286 అరుదైన జంతువులను చంపి, అమ్మి లేక 11 పెద్ద పట్టణాలకు దొంగరవాణా చేసేవారు.” చైనా ఎన్‌వైరాన్‌మెంటల్ న్యూస్ తెల్పునదేమనగా ‘అధికారులలో కొందరితో సహా కొంతమంది ప్రజలు అడవి జంతువులను పరిరక్షించుటలోగల ప్రాముఖ్యతను పూర్తిగా గ్రహించలేకపోతున్నారు. వారి దృష్టిలో ఏ అడవి జంతువునైనా వేటాడవచ్చును ఎందుకంటె అవి ఎవరికి చెందినవి కావు.’
అంతరిక్షంలో చెత్తకుండి
భూమి చుట్టూ పరిభ్రమించే మానవ తయారీ చెత్తకుండి పెరిగిపోవుట గమనించిన విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతరిక్షనౌక, అట్టి చెత్తకుండీ ఈ రెండూ ఢీకొంటే వ్యోమగాములు మరణించవచ్చు లేదా అంతరిక్ష యానములలో ప్రమాదం వాటిల్లవచ్చు. పరిశోధకుల అంచనా ప్రకారం టెన్నీస్ బంతికంటె పెద్దవి షుమారు 7,000 వస్తువులు, మరి అంతకంటె చిన్నవి ఓ 35 లక్షల ముక్కలేవో అంతరిక్షంలో తేలియాడుతున్నవి. “రంగు ముక్కలైనా ప్రమాదం తేగలవు ఎందుకంటె అంతరిక్షంలో అవి గంటకు 60,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ వుంటాయని” మ్యూనిచ్ వార్తా పత్రికయైన సుడెట్స్‌కె జైటింగ్‌లో వచ్చిన శీర్షికను అనువదించినపుడు ది జర్మన్ ట్రిబ్యూన్ తెల్పుచున్నది. ఈ భూమి చుట్టూ తిరుగుచున్న యీ మానవ తయారీ చెత్తకు సంబంధించిన ముక్కలు యిలా పెరిగిపోతూ ఒకదానితో నొకటి ఢీకొంటూ వుంటే శనిగ్రహం చుట్టున్న రింగులవలె భూమిచుట్టూ కాస్మిక్ ధూళివంటి వలయం” ఏర్పడవచ్చును.
ఇండియాలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుట
ఇండియాలో చెట్టాపట్టాలేసుకుని తిరిగే అలవాటు ఎక్కువైపోతుంది మరియు కొందరిప్పుడు దాన్ని జీవిత వాస్తవముగా అంగీకరిస్తున్నట్లు కనబడుతుంది. ఒక దశాబ్దం క్రితం జంటలు చేతులు పట్టుకొని దారిన నడిచివెళ్లుట “అరుదైన ఓ పక్షిని చూచినట్లుండేది. ఇప్పుడైతే పిచ్చుకలు కనబడినంత విచ్చలవిడిగా అలా నడిచివెళ్తున్నారు.” అలా చెట్టాపట్టాలేసుకొని తిరిగే జంటలు సముద్ర తీరాల్లోను, పార్కుల్లోను, సినిమా థియేటర్లలోను, ఫాస్ట్‌ఫుడ్ లభించే స్థలాల్లోను కనబడవచ్చును. బయట అలా చెట్టాపట్టాలేసుకుని తిరగడం సర్వసాధారణమై పోయింది. భారత సమాజంలో వచ్చిన యీ మార్పుకుగల కారణం పాఠశాలలలోను కళాశాలల్లోను తోటివిద్యార్థుల వత్తిడివల్లను, సినిమాల్లోను, దూరదర్శిని కార్యక్రమాల్లోను అశ్లీలత మితిమీరుతున్నందువల్లనేనని కొందరంటున్నారు.
శిశుసంపర్క మతగురువులను దాచుటయా?
“శిశుసంపర్క నేరస్థులుగా పరిగణించబడిన మతగురువులను కొన్ని శాఖలు ఇంకను దాచి సంరక్షిస్తున్నవి,” అని నేషనల్ కెథోలిక్ రిపోర్టర్‌లో ఇటీవల పెద్ద అక్షరాలతో వార్త వచ్చింది. అత్యాచార నేరాలను తీర్చుటలో ప్రవీణుడైన జాఫ్రి యాండర్‌సన్ అనే ఒక అడ్వకేటును యీ పత్రిక ఇంటర్వ్యూ చేసింది. మత గురువులు శిశుసంపర్కం చేసే క్రియ ప్రజల్లో విపరీతమైన విమర్శకు గురైనప్పటినుండి అనగా 1985వ సంవత్సరం నుండి మతగురువులు చిన్న పిల్లలను మానభంగం చేసిన సందర్భాలు వెయ్యికంటె ఎక్కువగా వున్నవని ఆయన అంచనా వేస్తున్నాడు. కొనసాగుచున్న యీ క్లిష్ట సమస్యకు చర్చియొక్క ప్రతిస్పందనను యాండర్‌సన్ పరుష పదజాలముతో యిలా దుయ్యబట్టాడు: “అది బాధ్యతను మరిచే ధారావాహిక గాథ” అని అతడు నిందిస్తూ, నేరస్తులను దాచి సంరక్షించుటలో చర్చి సంసిద్ధత వ్యక్తం చేయుట శోచనీయమన్నాడు. “సాధారణ నియమం ప్రకారం, చర్చియొక్క నిబంధనాపూర్వక ప్రతిస్పందన అటు బాధితుల విషయంలోను ఇటు పరిష్కార వ్యవహారంలోను బుద్ధిపూర్వకమైన లోపము కనబడుతుంది.”