ఎవరూ ఇష్టపడని చేప
సొరచేప మీకు యిష్టమా? కానేకాదు. కొంతమందికది ప్రీతికరమైన భోజనము నందిస్తున్నను, తమ కిష్టమైన చర్మము దానికున్నను, లేదా తమ జీవనోపాధికి తామిష్టపడి చంపే ప్రాణియైనను అనేకులకు సొరచేప అంటే యిష్టముండదు. ఆ కారణంచేత అనేకానేక సొరచేపలు చంపబడుతున్నవి. కేవలం కరేబియన్ సముద్రములో మెక్సికో భాగమందు, అమెరికా తూర్పుతీరమున సంవత్సరానికి సొర చేపలను పట్టుట గత పది సంవత్సరాల కాలంలో 1,000 శాతం పెరిగిందని యు.ఎస్. న్యూస్ & వర్ల్డ్ రిపోర్ట్ తెల్పుచున్నది.
సొరచేపలను కాపాడండి అనే గావుకేకను మీరు వినలేదంటే, ఆశ్చర్యము లేదు. అయితే, సొరచేప అపాయకరమైన దని క్షమింపజాలని తినే యంత్రమని మనుష్యులను తినాలనే ప్రేరణ తప్ప మెదడులో ఇంకేమి లేనిదని అనేకులు ఊహిస్తారు. కాని సొరచేప దాడులు జరిగినాకూడా, భయం కలిగించే సినిమాలు తీసేవారు మిమ్మును నమ్మింపజేయు దానికంటే చాలా తక్కువ.
యు.యస్. న్యూస్ & వరల్డ్ రిపోర్టు ప్రకారము, “ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 100 కంటె కొంచెము తక్కువ [సొరచేప దాడులు] నివేదించబడ్డాయి, అందులో అనేకము ప్రాణహాని కల్గించలేదు.” అంతేకాకుండా, సొరచేపలన్నీ ఎదురుదాడి చేసేటివి కావు. ఈ జీవరాసులు 10 సెంటీ మీటర్లనుండి 18 మీటర్ల పొడవు, బరువులో 28 గ్రాములనుండి 14,000 కిలోగ్రాములు బరువు పరిధిలో ఉంటాయి. ఈ 3,000 రకముల జీవులలో (దాదాపు పెద్దవాటితో కలుపుకొని) దాదాపు 90 శాతం మానవులకు ఏ హాని చెయ్యవు.
సొరచేపలు ఉపయోగకరమైనవి. సముద్రగర్భమందు శుభ్రపర్చేదిగా, సముద్రములో రోగగ్రస్తమైన ప్రాణులను విడువబడిన వాటిని అది గుటగుట మ్రింగివేసి ప్రాముఖ్యమైన శ్రుభపర్చే పాత్రను అది నిర్వహిస్తుంది. సొరచేపలకు క్యాన్సరు లేదా ప్రధాన అంటువ్యాధులు సోకడంలేదు కనుక వాటి స్వయం రక్షక విధానమును శాస్త్రజ్ఞులు ఆసక్తితో అధ్యయనము చేస్తున్నారు. అయినను సొరచేపలు అభేద్యమైనవికావు. అవి నిదానంగా సంతానోత్పత్తి చేస్తాయి (సంవత్సరానికి రెండుపిల్లలను లేదా పసికందులను కంటాయి), కనుక అవి అధికంగా నాశనము చేయబడితే త్వరగా కోలుకోలేవు.
అదృష్టవశాత్తుగా చివరకు సొరచేప కొంతమంది స్నేహితులను కనుగొంటున్నది. సొరచేపలను మానవులు ఎంతమేరకు తీసుకోవచ్చును అనే దానిపై హద్దులు నియమించి, ఆ చేపను కాపాడుటకు యు. ఎస్. నేషనల్ మెరైన్ ఫిషరీస్ 100 పేజిల పథకమును తయారుచేసింది. అయితే, ఎంతమంది మనుష్యులను సొర తినవచ్చో ఎవ్వరూ ప్రతిపాదించలేదు. కాని మనుష్యుని, సొరచేపను సృష్టించినవాడు తన మానవ పిల్లలు ఈ భూమిపై ఏమాత్రము భీతినొందని కాలమునుగూర్చి వాగ్దానముచేశాడు.—యెషయా 11:6-9. (g91 11/8)