ఫార్మ్‌ను చూడగోరిన ఆఫ్ఘన్ అనాథలు
ఆధునిక సమాజము ఎక్కువగా నగరవాసులగుచున్నందున లక్షలాదిమంది పిల్లలకు పొలాన్ని గాని వాటిలోని పశువులనుగాని చూచే అవకాశం లభించడంలేదు. సామాన్యంగా ఆఫ్ఘనిస్తాన్ లోని పిల్లలకు అమెరికాలోని పొలాలను చూచే అవకాశం నిశ్చయంగా ఎన్నడు లభించదు. కాబట్టి, యుద్ధముచే ధ్వంసముచేయబడి అంగహీనులు కాబడిన అనాధలైన పిల్లలతో కూడిన చిన్న గుంపు ఒకటి న్యూయార్కు నగరమునకు ఉత్తరంగా కారులో రెండుగంటలు ప్రయాణిస్తే వాల్కిల్ వద్ద కేంద్రీకృతమైన వాచ్‌టవర్ ఫార్మ్స్‌ను సందర్శించగల్గుట వారికి ఎంత పులకరింపుగా ఉండునో ఊహించుము.
యెహోవాసాక్షులచే నిర్వహించబడుచున్న ఈ అసాధారణ వ్యవసాయ-ముద్రణా సముదాయములో జరుగుచున్న వాటిని వారికి అర్థమయ్యేటట్లు సహాయపడుటకు ఆఫ్ఘన్ అనువాదకులు ఈ గుంపుతోపాటు వచ్చారు. అక్కడ వెయ్యికంటె ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు పనిచేస్తారు. వారిని వాచ్‌టవర్ ఫార్మ్స్ కుటుంబమని అంటారు.
వారి సందర్శనము, స్వాగతముతో కూడిన ఫలహారముతో ప్రారంభమైంది, పిమ్మట ఆ గుంపు వాచ్‌టవర్, అవేక్! పత్రికలను తయారుచేయుటకు వాడబడుచున్న అతిపెద్ద నాలుగు రంగుల ముద్రణాయంత్రములను చూడడానికి వెళ్లారు. ఒక గైడు యిట్లన్నాడు: “వారి హృదయాలు ఫార్మ్ పశువులను చూచుటపై కేంద్రీకృతమైయున్నను, ముద్రణనిర్వాహక పరిమాణమును, ప్రభావశీలతను చూచి వారు ఆనందించుట నాకాశ్చర్యమనిపించింది.”
అతడింకను యిట్లన్నాడు: “అటుతరువాత దూడలున్న స్థలమందు ఈ పిల్లలకు, వాటిని పట్టుకొని ఆహారము తినిపించే అవకాశమియ్యబడింది. ఆ దృశ్యములు చూడముచ్చటగా ఉన్నవి—ఆ లేగ దూడలకు తినిపించడానికి మరిన్ని ఆకుపచ్చని ఆకులు తెచ్చేందుక పిల్లలు పరుగెత్తారు. కోళ్ల గదిలో వారంతా కోడి పిల్లలను చేత పట్టుకున్నారు. అన్నింటికన్నా వింతేమంటే, మీ కిష్టమైన అమెరికా ఆహారమేమని అడిగినప్పుడు వెంటనే ‘కెంటక్కీ కోడివేపుడు’ (ప్రత్యేక మిశ్రమములను పూసిన కోడి వేపుడు భాగాలు, అవి కెంటక్కీ కోడివేపుడు ఫాస్ట్ పుడ్ స్టోర్స్ వారిచే అమ్మబడును) అని సమాధానమిచ్చారు!”
మధ్యాహ్న భోజనసమయము వచ్చేసరికి, భోజన శాలలో ఫార్మ్ కుటుంబములో అనేకులతో పాటు అన్నము, కోడికూరతో భోజనమును ఆరగించారు. అటుపిమ్మట, అ కుటుంబ సభ్యులు, సుదూర ప్రాంతము నుండి వచ్చిన ఈ యౌవనులకు పలకరించుటకు తండోపతండాలుగా వచ్చారు. వారు పిల్లలను ప్రేమిస్తున్నారని తేటతెల్లమైనది.
మధ్యాహ్నమందు పిల్లలు ట్రాక్టర్లమీద ఎక్కి స్టీరీంగ్ చక్రమును పట్టుకొని ఉల్లసించారు. అంతేకాదు వాళ్లంత గుఱ్ఱమును స్వారీ చేయాలని కోరారు, వారి కోరిక త్వరలోనే అనుమతించబడినది. తదుపరి పెద్ద పులకరింపు ఏమిటి? ఎరుపు రంగులోనున్న అతిపెద్ద అగ్నిమాపక యంత్రముతోవున్న వాచ్‌టవర్ ఫామ్స్ అగ్నిమాపక దళమే. ఎంతటి పులకరింపు! ఒకరి తరువాత ఒకరు దానిమీదకు ఎక్కి సైరన్ మ్రోగించువారి సంతోషాన్ని మీరు వారి ముఖాలలో చూడగలరు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు అట్టివాటినే యిష్టపడతారు—రంగు మరియు శబ్దము!
ఈ సందర్శనను బట్టి తమ స్పందన ఏమని అడిగినప్పుడు, వారిలో పెద్దపిల్లవాడైన అహ్మద్ ఇలా అన్నాడు: “ముద్రణాయంత్రమును, భోజనమునకు ముందు, ఆఖరున ప్రార్థించుట—భోజనశాలయందున్న ప్రతిదానిని చూచి నేను ఆనందించాను.” వారిలో ప్రతి ఒక్కరు పశువులను, గుఱ్ఱపు స్వారిని ఎంతగానో ప్రేమించారు.
అనాథలకుగాని మరి ఎవనికైనను దయ చూపినయెడల అది క్రైస్తవ విశ్వాసమునకు, ప్రేమగల దేవుడైన యెహోవాకు శ్రేష్ఠమైన సిఫారసుగా పనిచేయగలదని ఈ సంక్షిప్త అనుభవము వివరించుచున్నది. బైబిలు యిట్లనెను: “తండ్రియైన దేవుని యెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తియేదనగా—దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.” (యాకోబు 1:27)—ఉచితవ్యాసం.