మా పాఠకులనుండి
విమర్శను స్వీకరించుట కొన్నివారములనుండి నేను చేయుచున్న పనివిషయములో ఈరోజు ఉదయాన్నే నేను విమర్శించబడ్డాను. ఆ విమర్శ ప్రయోజనకరమైనదైనను, నా పర్యవేక్షక అధికారి కఠినంగా మాట్లాడాడు. నేను చాలా కలతచెందాను. నేను యింటికి వెళ్లిన తరువాత, “నీవు విమర్శను స్వీకరించుటకు అసహ్యించు కొందువా?” (మార్చి 8, 1992) అనే శీర్షికను చదివాను అది నా మనోభావాన్ని చెప్పలేనంతగా మార్చివేసినది.
డి. బి., అమెరికా
ఆ శీర్షిక నిజంగా సహాయకరమైనది. ఇటీవల నేను విమర్శించబడి కృంగి నిరాశతో మునిగిపోయాను. అయితే, ఆ శీర్షికను పదేపదే చదవడం మూలంగా, నా సమస్యను నేను అధికమించగల్గాను.
ఎన్. ఒ., జపాను
మనిషి మృగము “మనిషి, మృగము సమాధానముతో జీవించి నపుడు” అను అంశము కొరకు నా హృదయపూర్వక అభినందన తెలుపగోరుచున్నాను. (మార్చి 8, 1992) నేను ఒక సంవత్సరమునుండి బైబిలు విద్యార్థినై భూమిని నిత్య పరదైసుగా మార్చుటనుగూర్చిన యెహోవా సంకల్పమునుగూర్చి నేర్చుకున్నాను. ఆ శీర్షిక యెహోవా యెడల నాకున్న ప్రేమను, ఆయన నూతన లోకములో జంతువులతో సమాధానము కల్గి జీవించుటను గూర్చిన నా కోరికను బహుగా వృద్ధిచేసినది.
ఏ. ఎస్., బ్రెజిల్
నేను ఎల్లవేళల జంతువులను ప్రేమగా చూస్తాను. నేను విశ్వవిద్యాలయమునకు వెళ్ళి వారి జంతు సంబంధ కార్యక్రమములో పొల్గొనాలని అనుకున్నాను, కేవలము కొన్ని జంతుజాలములను గూర్చి మాత్రమే పఠనము చేయుటకు జీవితకాలమంతయు గడిపితే, నేను ఏమి సాధించగల్గియుండేవాడిని? యెహోవాయొక్క నూతనలోకములో అన్ని జంతువులనుగూర్చి నేను నిరంతరం పఠనము చేయగలను. ఒకనాటికి ఆ కోరిక నిజమవునని తెలిసికొని ఆ శీర్షికను చదువుచున్నపుడు ఆనందముతో కన్నీరు కార్చాను.
ఎల్. ఎమ్., అమెరికా
వృద్ధులయెడల శ్రద్ధచూపుట “పెరుగుచున్న ఒక సమస్య” అను శీర్షిక నాకు అద్భుతమైన ప్రోత్సాహము నిచ్చినది. 86 సం.ల ప్రాయమున్న నా తండ్రి యిప్పుడు ఆల్జిహైమర్స్ వ్యాధితో (నరములకు సంబంధించిన ఒక వ్యాధి) బాధపడుచున్నాడు. కనుక ఆయనను ఆసుపత్రిలో పెట్టుటకంటె యింటివద్దనే ఉంచి శ్రద్ధ తీసికోవాలనుకొనుచున్నాను. ఆయన పరిస్థితి మరీ హీనమయ్యేసరికి, సమస్యలు, ఆయన విషయములో శ్రద్ధ తీసికొనుటనుగూర్చిన మానసిక వత్తిడి ఎక్కువైనది. పూర్తి నిరాశతో నిండిపోయాను! అప్పుడు మీ శీర్షికలను చదివాను. ఎంతో ఓదార్పును పొందాను, కళ్లలో నీళ్లునిండినవి. మున్ముందు ఎన్నెన్నో సమస్యలు క్లిష్టకాలములు ఉన్నవి, కాని చివరి వరకు నా తండ్రి విషయములో శ్రద్ధతీసికోవాలనే నా నిర్ణయమునకు దృఢమైన ప్రోత్సాహమును పొందగలిగాను.
టి. హెచ్., జపాను
మెక్సికోనగరం “మెక్సికోనగరం—ఒక పెరుగుచున్న వైపరీత్యమా?” అనే శీర్షికలో తప్పు ఉన్నదని నేను కనుగొన్నాను. ఒక పెద్ద కుటుంబమును కల్గియుండుట సాంస్కృతిక వారసత్వమని మీరు అన్నారు. అయితే ఈ అసాధారణ సంఘటన దేశములో కొన్ని భాగములందే సంభవించుచున్నది గాని మెక్సికోనగరమునందు కాదు.
ఎస్. సి., మెక్సికో
ఆ శీర్షిక కొంత తప్పు భావన కల్గించియుంటే మేము చింతిస్తున్నాము. అయితే, ఆ వ్యాఖ్యానము మెక్సికో నంతటిని గూర్చిచేసినది, కేవలము మెక్సికోనగరమును మాత్రమే కాదు.—సంపా.
బిడ్డ మరణము “బైబిలు దృక్పథము—దేవుడెందుకు నా బిడ్డను తీసుకున్నాడు?” అన్న శీర్షిక (మే 8, 1992) కొరకు మీకు వందనములు. నేను నా భర్త మా మొదటి బిడ్డను గర్భస్రావం మూలంగా పొగొట్టుకున్న దినముననే ఆ పత్రిక పోస్టులో వచ్చింది. మేము పొందిన ఈ నష్టానికి దేవుడు బాధ్యుడు కాడని మాకు అది ఒక అభయమిచ్చు జ్ఞాపికగా ఉండెను.
జె. జి., అమెరికా