ప్రపంచ పరిశీలన
మొజాంబిక్ నందలి సాక్షులు చట్టరీత్యా గుర్తింపు పొందారు
మొజాంబిక్ నందలి ఆగ్నేయాఫ్రికా దేశమందు యెహోవాసాక్షుల ప్రకటన పనికి చట్టరీత్యా గుర్తింపు యివ్వబడింది. న్యాయ మంత్రిత్వశాఖనుండి ఫిబ్రవరి 11, 1991 తేదీన వచ్చిన లేఖ ఇలా చెప్పుచున్నది: “ఇతరమత సంస్థలవలె యెహోవాసాక్షులు మొజాంబిక్ రిపబ్లిక్‌యొక్క రాజ్యాంగమునందు పొందుపర్చబడిన సర్వహక్కులను అభయాలను అనుభవిస్తారు.” దేశ మత వ్యవహారముల సంచాలకునిచే అది సంతకము చేయబడినది. గత జనవరిలో బైబిలు వర్తమానమును ప్రకటించి నివేదించిన 5,235 మంది సాక్షులు ఈ శుభవార్త ఆనందముతో స్వీకరించారు. మొజాంబిక్ నందు ఇటీవల జరిగిన మూడు “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశములకు హాజరైన 13,971 మంది ప్రతినిధులు కూడా అధికార గుర్తింపు ప్రకటనకు కృతజ్ఞులైయున్నారు. అచ్చట 357 మంది బాప్తిస్మము పొందారు. (g91 6/22)
సోవియట్ రష్యానుండి శుభవార్త
సోవియట్ యూనియన్ నందలి యెహోవాసాక్షుల అసోసియేషన్‌యొక్క చట్టపరమైన గుర్తింపు సమ్మతి పత్రమును న్యాయమంత్రిత్వశాఖ, వారి అసోసియేషన్ ప్రతినిధులకు మార్చి 28, 1991 నాడు అందజేసినది. (g91 7/8)
“మరింత దౌర్జన్యకరమైన ఇటలీ”
ఇటలీలో 1990 కొరకు నేరముపై గణాంక పట్టిక సేకరించబడెను, ఇటాలియన్ దినపత్రిక కొరియారా డాలా సారా ప్రకారము అది “తేటగా మాట్లాడుచున్నది. ప్రమాద సూచనకు అది హేతువు నిస్తున్నది. “గత సంవత్సరముకంటె 21.8 శాతం నేరము ఎక్కువైనది. ఇటాలియన్ స్టేటిస్టిక్స్ ఇన్‌స్టిట్యూషన్ ISTAT, అందించిన లెక్కల ఆధారముగా 1990లో 25,01,640 నేరాలు న్యాయశాఖాధికారులకు నివేదించబడినవి. అలా సగటున ప్రతిదినము దోపిడి, భయోత్పాత వేగముతో వృద్ధియగుటతో 6,854 నేరములు జరుగుచున్నవి. 1990లో 24,817 మంది పిల్లలు నేరములు చేసిరని నివేదించబడినందున, ఎట్టి అభివృద్ధియైనా అనిశ్చయంగా ఉన్నది, 1989తో పోల్చితే అది 17.9 శాతం పెరుగుదల. “మరింత దౌర్జన్యకరమైన ఇటలీ” 1990 దశాబ్దములోనికి ప్రవేశించనైయున్నది అని లా రెపబ్లికా అను దినపత్రిక చెప్పుచున్నది. (g91 7/8)
ఆఫ్రికాలోని బలిష్ట మృగములను పరిరక్షించుట
ఒక దశాబ్దకాలములో మొట్టమొదటిగా ఆఫ్రికాలోని ఏనుగుల సంఖ్యపెరిగిందని జర్మన్ నిపుణుల బృందమొకటి ఇటీవల ప్రకటించెనని దక్షిణాఫ్రికా వార్తాపత్రిక దిస్టార్ నివేదించెను. ప్రస్తుతము ఆఫ్రికాలో 6,09,000 ఏనుగులు ఉన్నవని ఆ బృందము అంచనావేసింది. అనగా 1979 లో జీవించి యున్నవాటిలో సగంకన్నా తక్కువే, కాని ఈ తరుగుదల వైఖరి తుదకు నిల్చిపోయినదని ఆ బృందము నమ్ముచున్నది. ఏనుగు దంతముల ధరకు పగ్గాలువేసి ఆ వ్యాపారమును చిన్నాభిన్నముచేసిన విస్తృత ఏనుగు దంత నిషేధమును వారు కొనియాడిరి. ఈ లోగా ఆఫ్రికా ఖడ్గమృగములను కాపాడుటకు కూడా ప్రయత్నములు వేగంగా కొనసాగినవి. నమీబియాలో అటవీ శాఖాధికారులు ఖడ్గమృగముయొక్క కొమ్ములను తీసివేస్తున్నారు, కనుక వేటగాళ్ళు దానిని చంపడానికి కారణమేమి లేదు. అయితే ఇట్టి నిరాశాజనకమైన పద్ధతి ఏ మాత్రం పనిచేయదని స్విట్జర్లాండ్ అటవీశాఖాధికారి టెడ్ రైలీ ప్రవచించెనని, దిస్టార్ తెల్పుచున్నది. పిల్ల ఖడ్గమృగములను సహితము వాటి చిన్న కొమ్ములకొరకు వేటగాళ్ళు సంహరించుటను అతడు చూచాడు. (g91 7/8)
హంగేరినందు సాతాను సంబంధ ఆరాధనలు
హంగేరిలో యౌవనుల మధ్య సాతాను ఆరాధన ఎంతగా బహుళవ్యాప్తి అయ్యిందంటే అది దేశాన్ని విభ్రాంతిపర్చింది. లండనులో ప్రచురించబడుచున్న ఒక వార పత్రిక ది యూరోపియన్ నివేదించిన ప్రకారము, “మంత్రప్రయోగములపై ఇటీవల లభ్యమగుచున్న పత్రికలను చదివిన మీదట యౌవనులు సాతాను విధానమునకులోనై శోధించబడిన యువకులు చేసిన వందలాది సంహారములు పరిశోధనలో బయటపడినవి.” అట్టి మతాచార సంహారములో ఒక 17 ఏండ్ల బాలుడు తన 13 ఏండ్ల చెల్లెలను పొడిచి ఆమె అవయవాలను తునాతునకలు చేసి వాటిని గదిలో ఉన్నవారికి పంచాడు. క్రిష్టియన్ డెమోక్రటిక్ ప్యూపుల్స్ పార్టీ ప్రతినిధి బేలా సెపి, భీతిగొల్పు సాహిత్యము, చలన చిత్రములు, వీడియోల ప్రకటనలపై నిషేధము విధించుమని అర్థించడంలో ఆశ్చర్యములేదు. (g91 7/8)
గ్రేట్ బారియర్ రీఫ్—అంతపురాతనమైనది కాదు
ప్రపంచములో అతి పెద్ద నేపాలవృక్ష నిక్షేపము—ది గ్రేట్ బారియర్ రీఫ్—ఒకనాడు తలంచినంతటి పురాతనమైనదేమి కాదు. ఆస్ట్రేలియాకు ఈశాన్య తీరమున 1,250 మైళ్ల పొడవున వ్యాపించి యున్న శిలానిక్షేపము 2 కోట్ల సంవత్సరముల నాటిదని అంచనావేయబడెను. అయితే, ఈ నేపాలవృక్ష నిక్షేపములను అధ్యయనము చేస్తున్న భూగర్భశాస్త్రజ్ఞులు ఇటీవల ఈ నిక్షేపములందు రంధ్రాలు వేశారు. వారి అన్వేషణ ఈ నిక్షేపముయొక్క వయస్సునుగూర్చి పునరాలోచన చేసేందుకు శాస్త్రజ్ఞులను పురికొల్పింది. అది కేవలం 5 లక్షలనుండి 10 లక్షల సంవత్సరములు ఉంటుందని వారిప్పుడు నమ్ముచున్నారు. లక్షలాది సంవత్సరములలో వివిధరకములైన జీవరాసులు క్రమేపి ఉనికిలోనికి వచ్చినవని నమ్మే సాంప్రదాయ పరిణామ సిద్ధాంతమునకు ఈ అన్వేషణ భిన్నముగా కన్పించుచున్నందున అది విజ్ఞాన శాస్త్ర రంగములో సంచలనము సృష్టించవచ్చునని, ఫ్రెంచి పత్రిక టెర్రీ సావేజ్ చెప్పుచున్నది. ఈ నిక్షేపమునుండి లభించిన సాక్ష్యము చూపునదేమంటే జీవమనేది టెర్రీసావేజ్ వర్ణించినరీతిగా “ఒక పెద్ద జన్యువిస్ఫోటము” నుండి ఉద్భవించినది. (g91 7/8)
ప్లాస్టిక్ అడవులు
“ఒక వేళ మనము కృత్రిమ అడవులను నాటితే, యిక పది సంవత్సరములలో ఎడారులను సాగుచేయగలము” అని ఆంటోనియో ఇబానెజ్ ఆల్బా అనే నిర్మాణకుడు చెప్పుచున్నాడు. దాని కార్యసాధన విషయము ఎట్లున్నను, ఉత్తరాఫ్రికాలోని అనేక దేశములు ఈ తలంపును స్వీకరించినవి, అని మ్యాడ్రిడ్ దినపత్రిక డైరియో 16 నివేదించుచున్నది. రాత్రులందు గాలిలోని తేమను సేకరించి పగటివేళ చల్లదనాన్ని విడుదలచేసే అడవుల సహజ పాత్రను నిర్వహించుటయే ఈ లక్షలాది ప్లాస్టిక్ వృక్షముల ఉద్దేశ్యము. పది సంవత్సరముల కాలములో ఈ కృత్రిమ వృక్షములు సిద్ధాంతరీత్యా తగినంత వర్షపాతమును కలుగజేసి సహజ వృక్షములు ఆ పనిని చేపట్టేలా చేయగలవు. ఈ ప్లాస్టిక్ వృక్షములు ఎలా ఉంటాయి? వాటి నిర్మాణకుడు యిలా వివరిస్తున్నాడు, “ప్రకృతి నిర్మాణములే శ్రేష్టము కనుక, అవి మంచును సేకరించి, ఆవిరియగుటకు దోహదపడే నిర్మాణముగల తాటిచెట్లవలె ఉంటాయి. వాటి ప్రధాన ప్రయోజనములు ఏమిటి? వాటిని సాగుచేయనవసరములేదు, వంట చెరకుగా నరికివేయబడజాలవు. (g91 7/8)
గోధుమ వర్ణ ఎలుగులకు వీడ్కోలు?
గోధుమ వర్ణ ఎలుగుల ఆఖరి సంతతిని ఫ్రాన్సు త్వరలో కోల్పోనైయున్నదని లి ఫిగారో అను పారిస్ వార్తాపత్రిక నివేదించినది. బ్రిటీషు నుండి స్పెయిన్ వరకు ఒకనాడు వాటి నివాస స్థలముగా కలిగియుండిన గోధుమ వర్ణ ఎలుగులు, పశ్చిమ ఐరోపానుండి పూర్తిగా అంతరించిపోయినవి. అధికారరీత్యా ఫ్రాన్సులోని ఈ ఎలుగులు 1962 నుండి రక్షిత ప్రాణులుగా ఎంచబడుచున్నవి. అయితే వేటాడుట విషము పెట్టుట ఫ్రాన్సునుండి స్పెయిన్ వరకునున్న ప్రీనీస్ పర్వతములందు ఈ ఎలుగుల సహజనివాసము పాడైపోవడంవలన బ్రతికి బయటపడిన ఎలుగుల సంఖ్య పదికి తరిగిపోయిందని, ఈ ప్రాణులను కలకాలం నిలపడానికి యివి బహు తక్కువని పర్యావరణాధికారులు భయపడుతున్నారు. ఎలుగులను కాపాడుటకు చేసిన ప్రయత్నముల వైఫల్యమునుగూర్చి విచారిస్తూ, పర్యావరణాధికారి జార్జెస్ ఇరోమ్ యిలా తెల్పెను: “పర్యావరణమును కాపాడుటలో మా పూర్తి అసమర్థతను అది చూపిస్తున్నది. అయితే, నేడు పర్యావరణమే జీవమని మేము గుర్తించాము.” (g91 7/8)
శాంతియుతమైన సహజీవనము
కాకులకు మనుష్యులకు మధ్య జరిగిన పోరాటంలో—కనీసం జపానులోని ఓటానగరంలో, కాకులే గెల్చినవి. కొన్ని సంవత్సరములనుండి కాకులు, పారవేయబడిన ఇనుప ముక్కలతో, రాగి తీగెలతో విద్యుత్ ప్రవాహక పెద్ద స్థంభములపై వాటి గూళ్లను నిర్మించుకొనుచున్నవి. తమ లోహపు గూళ్లు విద్యుత్ విఘాతము కల్గించునని కాకులకు తెలియదు. అట్టిగూళ్ళను తదేకంగా తొలగించడములో విసిగివేసారిన టోక్యో ఎలక్ట్రక్ పవర్ కంపెనీ తుదకు గూళ్ళ నిర్మాణములో కాకులకు సహాయపడవలెనని నిర్ణయించుకొనెను. ఎలక్ట్రిక్ కంపెనీ యొక్క క్రొత్త పద్ధతి ప్రకారము ఆ మొదటి సంవత్సరములోనే విద్యుత్ సమస్యలను అరికట్టురీతిగా బుట్టలను పోలిన కొన్ని వందల గూళ్ళను ప్రవాహక స్థంభములకు కట్టిరి. ఈ క్రొత్త బుట్టలతోకాకులు సంతసించినట్లు కన్పించినది. చివరకు ఇప్పుడు ఓటాలోని కాకులు, విద్యుత్ కంపెనీ శాంతియుత సహజీవనము కొనసాగించుచున్నవి. (g91 7/8)
పుస్తకాల దొంగలు
పుస్తకాల దొంగలు పెరిగిపోవటంతో గ్రంథాలయాధికారులు, పుస్తక పరిశ్రమలోని యితరులు కలతచెందుచున్నారు. ది న్యూయార్కు టైమ్స్ బుక్ రివ్యూ ప్రకారము ‘గ్రంథాలయ సంస్థ ప్రతి సంవత్సరము ఎన్ని పుస్తకములను కొంటున్నదో అన్ని పుస్తకములు దొంగిలించబడుతున్నవి’ అని చికాగో పబ్లిక్ లైబ్రరీ సేకరణాభివృద్ధి డైరెక్టర్ మేరీ ఎలెన్ క్విన్ చెప్పుచున్నది. డాక్టర్లు, పత్రికా విలేఖరులు, న్యాయవాదులు, అధ్యయన నిపుణులు, ఉపాధ్యాయులు, మరియు గ్రంథాలయాధికారులు కూడా పుస్తకాల దొంగల జాబితాలో చేర్చబడిరి, మరియు పుస్తకాలను దొంగిలించే వ్యక్తులను “ప్రపంచ ప్రముఖులలో కొందరని” ఒక అనుభవశాలి పేర్కొనెను. బైబిలే “స్పష్టముగా అతి ఎక్కువగా దొంగిలించబడు పుస్తకమని, అన్ని కాలాల్లోనూ ప్రియమైనది కనుక దానిని దొంగిలించకుండ ఉండలేరు” అని పరిశీలకులు చెప్పుచున్నారు. (g91 6/22)
ఆఫీసులోనుంచే రహదారి
జపానులో ఒసాకా నగరమందు ఒక స్థూపాకార భవనము గుండా ఒక రహదారి తిన్నగా ఆవలివైపునకు పోవుటను చూచి ఆశ్చర్యపోతున్నారు. “రోడ్డు నిర్మాణము ఆ భవనమును తాకదు కనుక అది కంపించదు. ఆఫీసులో పనిచేయువారికి శబ్దము, విడువబడిన పొగమూలంగా ఏవిధమైన ఆటంకము కలుగకుండా చేయడానికి రహదారిని మూసివేసే గోడను కూడా నిర్మించనైయున్నాము,” అని హేన్షిన్ రహదారి పబ్లిక్ కార్పోరేషన్ అధికారి వివరించినట్లు మైనిచి,డైలీ న్యూస్ తెల్పుచున్నది. ఈ నిర్మాణముయొక్క ముఖ్య ఉద్దేశ్యమేమనగా ఆ ప్రాంతములో చదరపు మీటరు 75,000 డాలర్లు, కాబట్టి ఈ 16 అంతస్థుల భవనములో పైకి నిర్మించబడిన ఈ రహదారిని ఐదవ అంతస్థునుండి ఏడవ అంతస్థుగుండా తీసికొనిపోవుట ద్వారా హేన్షిన్ కార్పోరేషన్ దాదాపు 1,20,00,000 డాలర్లు పొదుపు చేయగల్గింది. ఒసాకాలో నిర్మించ తలపెట్టిన మూడు భవనసముదాయములో నుండి వెళ్లే రహదారులలో ఇది మొదటిది, ఇది వచ్చే సంవత్సరము ప్రారంభము కానైయున్నది. (g91 7/8)
ఎవరు నిర్ణయిస్తారు?
తల్లిదండ్రులు వాటిని కొనేటట్లు చేసేందుకు పిల్లలను ఎలా ఒప్పించాలో వ్యాపారప్రకటనలు చేసేవారికి తెలుసు. లి ఫిగారో మ్యాగజైన్ నివేదించిన ప్రకారము చిల్డ్రన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్స్ నిర్వహించిన సర్వే బయల్పరచునదేమనగా “ఈ క్రింది వర్గములలో ఒక పిల్లవాని అభిప్రాయము నిర్ణయాత్మకంగా వున్నది: ఆహారము 70 శాతము, సెలవునుగూర్చిన పథకము 51 శాతము, ఆరోగ్యము పరిమళ ద్రవ్యములు 43 శాతము, గృహసంబంధమైన వస్తువులు 40 శాతము, టి.వి., టేప్‌రికార్డర్లు 33 శాతము, కార్లు 30 శాతము. “ఒక పెద్ద వ్యాపార ప్రకటనల సంస్థ నిర్వాహణాధికారి సూక్ష్మమైన హితవునిచ్చెను: “తమ పిల్లలు తమ్మును ఏలడానికి పెద్దవాళ్లు అనుమతించకూడదు.” (g91 7/8)