కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 7/8 పేజీలు 14-16
  • వారి విశ్వాసము కొండలను పెకలించును

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వారి విశ్వాసము కొండలను పెకలించును
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రొత్త బెతేలు ప్రతిష్టాపన
  • “స్వచ్ఛమైన భాషతో యెహోవాసాక్షులు”
  • అంతర్జాతీయ మాధుర్యము
  • 1990వ సంవత్సరపు “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశమునకు రండి
    మన రాజ్య పరిచర్య—1990
  • స్వచ్ఛమైన భాష ఆరాధికుల గొప్పసమూహమును ఐక్యపరచుచున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • “భాషా భేదాలున్నా ప్రేమచేత ఐక్యమయ్యారు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • “దైవిక జీవిత మార్గము” 1998 యెహోవాసాక్షుల జిల్లాసమావేశాలు
    మన రాజ్య పరిచర్య—1998
తేజరిల్లు!—1992
g92 7/8 పేజీలు 14-16

వారి విశ్వాసము కొండలను పెకలించును

అట్టి ముఖ్యశీర్షికతో బ్యూనోస్‌ ఏర్స్‌ దినపత్రిక క్రోనికా, డిశంబరు 7, 1990 రివర్‌ప్లేట్‌, వేలెజ్‌ సార్స్‌ ఫీల్డ్‌ ఫుట్‌బాల్‌ స్డేడియంలో జరిగిన యెహోవాసాక్షుల సమావేశములను గూర్చి నివేదించెను. నిజమే, దాదాపు 6,000 మంది విదేశీ ప్రతినిధులను 20 విభిన్న దేశములనుండి అర్జెంటీనావరకు ప్రయాణించివచ్చి, “స్వచ్ఛమైన భాష” అను సమావేశములో వేలాది మంది సహోదరులతో కలిసికొనుటకు వారిని దృఢమైన విశ్వాసమే పురికొల్పింది. కొరియా సాక్షుల స్థానిక సంఘములనేకములు ఇందులో చేరియున్నవి. విదేశీ ప్రతినిధులు, బ్రిటన్‌, కెనడా, చిలీ, జపాను, స్పెయిను, అమెరికా (అలస్కా కూడ) మరి యితర అనేక దేశములనుండి వచ్చిరి. వారిని ఏది పురికొల్పింది? అర్జెంటీనాలో జరిగిన రెండవ అంతర్జాతీయ సమావేశమునకు మద్దతునివ్వాలను తమ కోరికయే.

క్రొత్త బెతేలు ప్రతిష్టాపన

అయితే సమావేశమునకు ఎంతో ముందే విశ్వాససంబంధమైన గొప్ప సంఘటనలు సంభవించినవి. అసోసియేషన్‌ డిలాస్‌ టెస్టిగీస్‌ డి జెహోవా (యెహోవాసాక్షుల అసోషియేషన్‌) వారి క్రొత్త అర్జెంటీనా బ్రాంచికార్యాలయము అక్టోబరులో సందర్శక ప్రసంగీకుడైన థియోడర్‌ జారక్జ్‌, యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యునిచే ప్రతిష్టించబడినది. ఈ క్రొత్త వసతి భవన సముదాయము 259 అంతర్జాతీయ, 690 అర్జెంటీనా స్వచ్ఛంద సేవకులచే నిర్మించబడెను. రోడ్డుకు యిరువైపుల చెట్లు వరుసగానున్న బ్యూనోస్‌ ఏర్స్‌ ప్రాంతములో బెతేలు లేదా “దేవునియిల్లు” వున్నది, దానిలో 129 వసతి గదులు 300 మంది కొరకు భోజనశాల ఏర్పాటుచేయబడినవి. అర్జెంటీనాలో 84,000 మంది కంటె ఎక్కువమంది సాక్షులున్నారు మరియు యింకా ఎంతో ఎక్కువ అభివృద్ధికి అవకాశాలున్నాయి కనుక, ఈ క్రొత్త బ్రాంచి భవనము త్వరలో పూర్తిగా నిండిపోతుందనుటలో సందేహములేదు.

“స్వచ్ఛమైన భాషతో యెహోవాసాక్షులు”

“స్వచ్ఛమైన భాష” అనే అంతర్జాతీయ సమావేశపు ముఖ్యాంశము పత్రికా ప్రతినిధులతో సహా అనేకులకు అర్థంకాలేదు. పైన పేర్కొనిన ముఖ్య శీర్షికను ప్రచురించిన క్రోనికా, “స్వచ్ఛమైన భాష” అను పదానికి ఒక ప్రసంగీకుడిచ్చిన నిర్వచనాన్ని పేర్కొన్నది. “దేవునిగూర్చియు భూమి మరియు మానవుని యెడల ఆయన సంకల్పాన్ని గూర్చియు బైబిలునందు గల సత్యముయొక్క కచ్చితమైన అవగాహన . . . స్వచ్ఛమైన భాష మాట్లాడుట ఎవరైన నేర్చుకున్నయెడల, అతని ఆలోచనా విధానము అతని మాట అతని ప్రవర్తన దేవున్ని ఏకైక సత్యదేవునిగా గుర్తించుటయందు కేంద్రీకరించబడి యుండును.”

ఒక కోటి జనాబాగల నగరమైన బ్యూనోస్‌ ఏర్స్‌, దాని మధ్య జరుగబోవు సమావేశమునుగూర్చి దానికి చక్కగా తెలియజేయబడింది. ఆరు రోజుల కాలంలో చట్టబద్ధంగా రేడియో, టి.వి కేంద్రములు ఆ కార్యక్రమమును గూర్చి 40 సెకెండ్లు ఉచిత ప్రచారము క్రమంగా చేసాయి. శనివారము కార్యక్రమము క్రొత్త సాక్షుల బాప్తిస్మముతో పత్రికా విలేఖరులను ఆకర్షించింది. ఈ రెండు స్టేడియముల చివరి భాగంలో మూడేసి నీళ్ళతొట్టెలు ప్రేక్షకులకు కన్పించేరీతిగా ఏర్పాటుచేయబడినవి, అయితే మధ్యాహ్న కార్యక్రమాన్నికల్లా బాప్తిస్మము పూర్తిచేయడానికి 12 తొట్టెలు కూడా సరిపోలేదు. కాబట్టి రివర్‌ ప్లేట్‌ స్టేడియంనందలి తొట్టెలను కన్పించని స్థలానికి మార్చారు. రివర్‌ ప్లేట్‌నందు 1,363 మంది, వెలెజ్‌ సార్స్‌ఫీడ్డ్‌నందు 748 మంది, మొత్తము 2,111 మంది బాప్తిస్మము తీసుకున్నారు! క్రొనికా పత్రికలోని ముఖ్య శీర్షిక యిలా వ్రాసింది: “రివర్‌ మరియు వెలెజ్‌ నందు విశ్వాసమును అద్భుతంగా వ్యక్త పర్చిన మరొక సంగతేమంటే సాక్షులు బాప్తిస్మము పొందడము.” ఈ రెండు సమావేశములకు 67,000 మంది కంటె ఎక్కువ హాజరైరి.

అంతర్జాతీయ మాధుర్యము

వివర్ణములుగల ప్రేక్షకుల మధ్య తిరుగుతుంటే, జాతులలోను, సంస్కృతులలోను భౌతిక తారతమ్యములు స్పష్టంగా కనిపించినవి. ఒక అర్జెంటీనా సహోదరి, ఒక ప్రత్యేక చెక్క కప్పులోనుండి లోహపు బొంబేయా లేక గొట్టంతో యెర్భా మాటె అనే టీ త్రాగుచున్నది. స్పెయిన్‌ నుండి వచ్చిన 800 మందిలో ఆదేశానికి సంబంధించిన అందమైన దుస్తులు ధరించిన సహోదరీలున్నారు. జపాన్‌ నుండివచ్చిన 900మందిలో వారి సాంప్రదాయక కిమోనో వస్త్రములు ధరించిన కొందరు స్త్రీలున్నారు. ఒక మెక్సికో ప్రతినిధి నల్లని సూటు ధరించి, వెడెల్పాటి అంచుగల మెక్సికో టోపిని ధరించాడు. అయితే ఇన్ని బాహ్య తారతమ్యములున్నను వారి ఆత్మీయ ఐక్యత అందరికి తేట తెల్లమగుచున్నది. సమావేశము ముగిసిన తరువాత అనేకమంది సావనీర్లను, సమావేశ బ్యాడ్జిలు, పెన్నులు, పోస్టుకార్డులు, ఈ అద్భుతమైన సంఘటనకు గుర్తుగా ఉండే దేనినైనను మార్చుకొనుచుండిరి.

ఈ సమావేశ ప్రభావము విమానాశ్రయాలలో కూడా విస్తరించింది. అమెరికాలో ప్లోరిడా, మియామినందు ఇది తేటగా కన్పించింది. ఇచ్చట అనేక మంది గుంపులు వేరే విమానాలను ఎక్కేసమయములో కలుసుకున్నారు. బ్యూనోస్‌ ఏర్స్‌ నుండి తిరిగివెళ్తున్న అమెరికానుండి వచ్చిన పెద్దగుంపు, మెక్సికోకు తిరిగివెళ్తున్న ఒక జపాన్‌ బృందమును కలుసుకున్నారు. వెంటనే, అమెరికా యాత్రికులందరిచుట్టూ ఉత్సాహవంతులైన జపాను సహోదరులు గుమిగూడి సంభాషించుట కారంభించారు. అక్కడ జరుగుచున్న దానినిచూచి ఆ ప్రాంతమందున్న యితరులు కలవరముచెంది విస్తుపోయారు. “స్వచ్ఛమైన భాష” అను స్వభావాన్ని పంచుకొనుచున్న సాక్షులు వీరే!

సమావేశ కార్యక్రమము అంతర్జాతీయ సహవాసము ఎంత మధురంగా ఉండెనంటే, ఆదివారం సమావేశము ముగిసినప్పటికి కూడ స్టేడియమును విడిచివెళ్ళడానికి ఎవ్వరు యిష్టపడలేదు. వివిధ దేశములనుండి వచ్చినవారు తమ భాషలలో కింగ్‌డం పాటలను సంగీతము లేకుండా పాడుచు తమ చేతి రుమాళ్లతో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. ఆనందభరితులైన సమావేశ ప్రతినిధులు తుదకు తమ గృహాలకు తిరిగి వెళ్ళేంతవరకు దాదాపు ఒక గంటసేపు ఇలా కొనసాగింది. అంత త్వరగా ముగ్ధుడు కాజాలని అర్జెంటీనా పత్రికా ఫొటో గ్రాఫర్‌ యిలా అన్నాడు: “అట్టి భావోద్రేకత, అట్టి అనురాగము మునుపెన్నడు అర్జెంటీనాలో చూడడం జరుగలేదు!” (g91 7/8)

[15వ పేజీలోని చిత్రాలు]

బ్యూనోస్‌ ఏర్స్‌నందు డిశంబరు 6-9 1990లో జరిగిన “స్వచ్ఛమైన భాష” అను యెహోవాసాక్షుల రెండు జిల్లాసమావేశములకు 67,000 మంది కంటె ఎక్కువ మంది హాజరయ్యారు

[16వ పేజీలోని చిత్రాలు]

అర్జెంటీనాలోని క్రొత్త బ్రాంచి కాంప్లెక్సు, 84,000 మంది సాక్షులకంటె ఎక్కుమందికి సేవచేయడానికి సిద్ధంగా ఉన్నది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి