వృధాప్రసంగం—దానికెందుకంత ఆకర్షణ?
చైనా భాషలో దీన్ని షేన్-ట్యాన్; ఫిన్నిష్‌లో జూరు; ఇటాలియన్‌లో పెట్టిగోలిజ్జో; స్పానిష్‌లో చిస్మి అని అంటారు. అవును, వృధాప్రసంగం విశ్వవాప్తముగావున్నది. కొన్ని భాషల్లో ఈ వృధాప్రసంగం సరాసరి వ్యతిరేకార్థమే ఇవ్వవచ్చును. వృధాప్రసంగమనే ఈ మాటకు ఇంగ్లీషులో “వ్యర్థప్రసంగమని” అల్పసంగతులను గూర్చిన ముచ్చట అని మూలార్థం.
అయినను, ఆసక్తికరమైన విషయమేమంటే, ఇంగ్లీష్ పదము వ్యతిరేకార్థాన్ని సంతరించుకుంది. అందుచేత “వృధాప్రసంగం” అనే మాటకు ముందు “విషపూరిత” లేదా “హానికరమైన” అనే పదము తరచూవుంటుంది. ఎందుకంటే, వ్యర్థప్రసంగము అనేక సార్లు హానికరమగు లేక బాధాకరమగు ముచ్చటకు సమానమౌతుంది. అది “పరుని ప్రతిష్టను భంగపరచి, అపకీర్తి పాలుచేసే అపవాదులు లేక అపనిందలతో కూడిన పలుకు” అని నిర్వచింపబడి కొండెము అను పదములోనికి సహితం నేరుగా మార్చవచ్చును. గనుకనే ప్రాచీన సామెత ఇలా చెప్పుటలో ఆశ్చర్యంలేదు: “ఉత్తరపుగాలి వానపుట్టించును. కొండెగాని నాలుక కోపదృష్టిని కలిగించును.”—సామెతలు 25:23.
అదంత హాని కల్గిస్తున్న దృష్ట్యా, మరిదానికెందుకంత తిరుగులేని ఆకర్షణ వుందని మనం గమనిస్తున్నాం? హానికరముకాని, హానికరమైన వృధాప్రసంగమును ఒకడెట్లు గుర్తించగలడు?
వృధాప్రసంగం—పరస్పర ముచ్చట
అయితే ఈ వృధాప్రసంగానికి కారణమొకటున్నది: ప్రజలు ప్రజల యెడల శ్రద్ధను కలిగియున్నారు. మరి సహజంగా మనం ఇతరులను గూర్చి మాట్లాడుటకు మొగ్గుతాము. మానవతత్వశాస్త్రవేత్తయైన మాక్స్‌గ్లూక్‌మ్యాన్ ఒకసారి ఇలా అన్నాడు: “ప్రతిఒక్కరోజు, ప్రతిరోజులోని అధికభాగం, మనలో ఎక్కువమంది వృధాప్రసంగం చేస్తుంటాము. మేలుకొనియున్న సమయాన్ని మనమెలా వుపయోగిస్తున్నామోనని మనం వ్రాసిపెట్టుకొని వున్నట్లయితే మనలోకొందరికి వరుసక్రమములో వృధాప్రసంగం ‘పని’ తర్వాత రెండవదిగా వస్తుందని నా ఊహ.”
మన సాధారణ సంభాషణ, మితంగా దయతోకూడినదైతే ఎప్పటికప్పుడు జరిగే విషయాలను తెలిసికోవడానికి ప్రయోజనకరమగు సమాచారాన్ని అందించేదిగా పని చేయవచ్చును. అందులో ఎవరికి పెళ్లి అయింది, గర్భవతి ఎవరు, చనిపోయిందెవరు మొదలగు సర్వసాధారణ విషయములుండ వచ్చును లేదా ఏ దురుద్దేశములేని హాస్యసంభాషణ కావచ్చును.
అయిననూ, తరచూ వ్యర్థప్రసంగము మంచి అభిరుచిని, మర్యాదను మంటకలిపేస్తుంది. వాస్తవాలు వర్ణనాతీతమై, గోరంతకొండంతలగును లేదా వక్రీకరించబడును. తమాషా తలవొంపుకు దారితీస్తుంది. గుట్టు రట్టవుతుంది. నమ్మకాలు వమ్మయిపోవును. కీర్తిప్రతిష్టలు దెబ్బతింటాయి లేక సర్వనాశనమగును. దూషణ, సణుగుడు, ఫిర్యాదు మూలంగా స్తుతియోగ్యమైనవి మృగ్యమౌను. ఏ హాని తలపెట్టలేదనుకొనుటవల్ల ఎదుటి వ్యక్తికి ఏమాత్రము ఊరడింపు కలుగజేయదు. ఆవిధంగా హానికరమగు వృధాప్రసంగం తెల్లని గోడ మీద చల్లిన బురదతో పోల్చబడుతుంది. అది అతుక్కొని వుండక పోవచ్చుగానీ అశుద్ధమైన మాయని మచ్చని మిగుల్చుతుంది.
అంగీకరించబడుట
మనం సులభంగా వృధాప్రసంగం చేయుటకు గల మరొక కారణం, ఇతరులు మనలను ఇష్టపడాలని, అంగీకరించాలనే సహజ కోరికను బట్టియే. మనస్తత్వశాస్త్రవేత్తలగు జాన్ సాబిని మరియు మౌరీ సిల్వర్ ఇలా వ్రాశారు: “ఏదోక కారణాన్నిబట్టి, మాట్లాడవలసిన బాధ్యత నీకుంటుంది; ఆ బాధ్యతను నెరవేర్చుటకు సర్వజన సమ్మతమైన, సులభమైన సంతోషకరమగు పద్ధతి ఈ వ్యర్థప్రసంగమే.” (మొరాలిటీస్ ఆఫ్ ఎవిరీ డేలైఫ్) గనుక వ్యర్థప్రసంగం కొంతవరకు సంభాషణకు ప్రయోజనకరమగు ఆజ్యమయ్యుంది. అంగీకరించబడుటకు ఒక పద్ధతి.
అసలు సమస్య ఏమిటంటే, ప్రజలు వాస్తవానికంటే ఆవాస్తవిక సమాచారము వింటేనే అధికంగా సంతోషించుటకిష్టపడుచున్నారు. కొందరు ఆవేశపూరిత మరియు అసహ్యమైనవాటిని విని ఉలిక్కిపడాలని ఉబలాట పడుచున్నట్లు కనబడుచున్నారు. ఆ విధంగా వృధాప్రసంగం మనలను నిజంగా అంత ఆకర్షించునదిగా వున్నది—ఎంత పాపిష్టి, దూషణకరంగా వుంటే అంత రుచిగావుంటుంది దాని సారం అన్నట్లుంది. అదిరిపడే అపవాదులకు ఆధారములను గూర్చి ఎవరూ చింతించుటలేదు.
పత్రికల వృధాప్రసంగం
ఇటువంటి వృధాప్రసంగం మరో మానవ భ్రాంతిని—ఆపార కుతూహలాన్ని—ఆకర్షిస్తుంది. మనము రహస్యాలను ప్రేమిస్తాం. మనం తెలుసుకొనుటయందు ఆనందిస్తాము. 1730 సంవత్సరంనాటికే పెన్సిల్వేనియా గజట్ కొరకు బెంజమిన్ ఫ్రాంక్లిన్ వృధాప్రసంగాన్ని గూర్చిన వ్యాసం వ్రాస్తున్నప్పుడే ప్రజలు దానికి మూల్యం చెల్లిస్తారని తెలుసుకున్నారు.
పత్రికా వ్యర్థప్రసంగం ఇప్పటికీ వాడుకలోనే వుంది ఇంకా వృద్ధి అవుతూనేవుంది. ఐరోపాలోని వార్తాపత్రికలు రాజకుటుంబీకులు, వాహనములతో పందెములో పాల్గొనువారు, మరి ఇతర అంతర్జాతీయ ప్రఖ్యాతి గడించిన వారి కథలు గల చిత్రపటాలున్న సంక్షిప్త వార్తలతో వార్తాపత్రిక విక్రయ శాలలు పూర్తిగా నిండి వుంటున్నవి. అలా ఒక వార్తాపత్రిక శీర్షిక ఈ వ్యర్థప్రసంగాన్ని పెద్దవ్యాపారంగా వర్ణించింది.
ప్రజల ఇండ్లలో, పడకగదుల్లో, మనసుల్లో రహస్యంగా మెదిలేవాటిని గూర్చి తెలుసుకొనే కుతూహలం కల్గివుండుట ప్రయోజనకరమేనా? చెడుకోరికలను రేకెత్తించగల వాటిని చదువుట, చూచుట ఆరోగ్యకరమేనా? పత్రికల్లోని వ్యర్థప్రసంగం కుతూహలాన్ని దాని సరిహద్దులను దాటిస్తుంది.
“నేను దాన్ని ద్రాక్షాతీగల ద్వారా విన్నాను”
నిరాధారమైన పుకార్లు, తప్పుడుసమాచారము కూడా హానికరమగు వ్యర్థప్రసంగానికి ఆజ్యం పోసినవి. అమెరికా అంతర్యుద్ధసమయంలో సైనిక స్థావరాల మధ్య ద్రాక్షాతీగలవలె అసంఖ్యాకములైనన్ని టెలిగ్రాఫ్‌లైన్స్‌ను వేశారు. ఆవిధంగా “ఆ ద్రాక్షాతీగలు” అనిశ్చయమైన వార్తలకు సూచనగా మిగిలిపోయాయి, “నేను ద్రాక్షాతీగల ద్వారా విన్నాను,” అనే మాట, నిరాధారమైన పుకార్లు పుట్టించినపుడెల్లా ఒక అతిసాధారణమైన సాకుగా తయారయింది.
దురదృష్టకరమేమంటే, ద్రాక్షావల్లి తరచూ చేదుపండ్లను ఫలిస్తుంది. పుకార్లు కలవరం, మరణం, ఘోరకలికి కారణమైనవి. వాటి మూలంగా కలిగే వ్యాపార నష్టం అపారం. వారి హాంబర్గర్‌లలో క్రిములున్నాయని తప్పుడు పుకారు పుట్టినందుకుగాను ఒక ఫాస్ట్-ఫుడ్ రెస్టారెంట్ యాజమాన్యం ఆ పుకారుని తొలగించుటకై సంవత్సరము పొడుగునా డబ్బు ఖర్చుపెట్టవలసివచ్చింది. సబ్బులు తయారీ చేసే కంపెని దయ్యముల ఆరాధనలో పడిందని, సంస్థ చిహ్నము సాతానుకు సూచనయని లేచిన పుకారును అణగద్రొక్కడానికి ప్రయత్నిస్తూ సంవత్సరముల తరబడి—లక్షలాది డాలర్లను—ఖర్చుపెట్టింది.
అయిననూ, పుకార్లనుండి నష్టపోయేది అత్యంత గుండెపోటుకు బలైయ్యేది వ్యక్తులే. అయితే కట్టుడుకథలు మనోహరంగా వినిపిస్తాయి గనుక ప్రజలు వాటి ఫలితాలెలావున్నప్పటికి లేదా వాస్తవమేమైననూ వాటిని వ్యాప్తిచేయుటకే ఇష్టపడుతున్నారు.
విషపూరిత వ్యర్థప్రసంగం—కొండెమే
ఈర్షాద్వేషాలు తరచూ అత్యంత నాశనకరమగుదానికి—విషపూరిత వ్యర్థప్రసంగానికి లేక కొండెమునకు—మూలకారణములైయున్నవి. “కొండెగాడు” అనే మాటకు గ్రీకులో డయబోలోస్ అంటారు, బైబిలునందు ఈ పదము అపవాదియని తర్జుమా చేయబడింది. (ప్రకటన 12:9) ఈ బిరుదు చక్కగా సరిపోతుంది ఎందుకంటే సాతాను దేవుని మీద గొప్ప కొండెములాడిన వాడే. సాతానువలె కొందరు ఇతరులనుగూర్చి దుర్బుద్ధితో మాట్లాడుతారు. బాధతో లేక అసూయ ఫలితంగా ప్రతీకార భావంతో కొన్నిసార్లు అలా మాట్లాడుతారు. ఏదేమైననూ, ఇతరుల కీర్తిని హత్య చేయుటద్వారా వారి స్వలాభాన్ని వృద్ధిచేసికొనుటకు యత్నిస్తారు.
విషపూరిత వ్యర్థప్రసంగం లేక కొండెములాడుట నిజంగా చాలా దూషణకరమైన వ్యర్థప్రసంగమే, మరి హానికరమైన, కష్టం కలిగించే వ్యర్థప్రసంగం చేయుట బాధ్యతా రహితమైనది. అయితే మరి ఒకడెట్లు హానిలేని సంభాషణను హానికరమగు కొండెములకు దిగజారకుండ ఆపగలడు? (g91 6/8)
[5వ పేజీలోని చిత్రం]
స్నేహపూర్వకమైన వృధాప్రసంగము ప్రయోజనకరమైన సమాచారమును ఇచ్చిపుచ్చుకొనుటకు మరియు సంభాషణలను ప్రారంభించుకొనుటకు దోహదపడును.
[6వ పేజీలోని చిత్రం]
హానికరమగు వృధాప్రసంగం తెల్లని గోడ మీద చల్లిన బురదతో పోల్చబడుతుంది. అది అతుక్కోని వుండక పోవచ్చుగానీ అశుద్ధమైన మాయని మచ్చని మిగుల్చుతుంది.
[7వ పేజీలోని చిత్రం]
అవధానమును వారిపై మల్లించుకొనుటకు కొందరు వృధాప్రసంగము చేయుదురు