కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 4/8 పేజీలు 3-4
  • వృధాప్రసంగము యొక్క శక్తి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వృధాప్రసంగము యొక్క శక్తి
  • తేజరిల్లు!—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • వృధాప్రసంగం—దానికెందుకంత ఆకర్షణ?
    తేజరిల్లు!—1992
  • ఇతరుల గురించి మాట్లాడుకుంటే ఏమిటంత హాని?
    తేజరిల్లు!—1999
  • వృధాప్రసంగం—నీకును ఇతరులకును హాని కలుగకుండ తప్పించుకునేదెలా
    తేజరిల్లు!—1992
  • ఎవరైనా నా గురించి పుకార్లు చెప్తుంటే నేనేమి చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 4/8 పేజీలు 3-4

వృధాప్రసంగము యొక్క శక్తి

ఆ యవ్వన స్త్రీ ఆత్మహత్య ఇంగ్లీషు పట్టణాన్ని కుదిపింది. అంతకంటే అదిరించే విషయం పంచనామా చేసే అధికారి తుదినిర్ణయమే: ‘ఆమె ఉబుసుపోకు వృధాప్రసంగం మూలంగా చనిపోయింది.’ ఆ పట్టణస్థుల వృధాప్రసంగం, వ్యర్థమైన, పిచ్చిమాటలమూలంగా ఆ యవ్వన స్త్రీ యొక్క పేరు ప్రతిష్ట, చివరకు నిండు ప్రాణమే బలైపోయింది.—దిసోషల్‌ సైకాలజీ ఆఫ్‌ హియిర్‌సే, బై రాల్ఫ్‌ యల్‌. రాస్నో అండ్‌ గ్యారీ అలన్‌ ఫైన్‌.

అన్ని సందర్భాల్లోను అంతటి ఘోరము జరుగకపోయిననూ వృధాప్రసంగానికి అంత శక్తి వుంటుదనుటలో సందేహము లేదు. అయితే అది సమాచారాన్ని పరస్పరంగా అందించుకొనుటకు దోహదం చేస్తుందనుకోవచ్చునుగానీ, అది ప్రభుత్వాల అస్థిరతకు, కుటుంబ విచ్ఛిన్నతకి, జీవితాలే పాడైపోవుటకు కారణం కావచ్చును.

నిద్రలేని రాత్రులకు, తలనొప్పి, అజీర్తికి కారణం ఈ వృధాప్రసంగమేనని నిందించబడుతోంది. దాని మూలంగా నీవుకూడా ఏదో ఒక సారి ఆవేదన అనుభవించి వుంటావు. నిజానికి ఓ రచయిత విలియం యమ్‌. జోన్స్‌ ఏమని హెచ్చరిస్తున్నాడంటే ఈ వ్యాపార లోకంలో “నీ జీవితంలో ఎవరో ఒకరు నీమెడమీద కత్తి వేయడానికి ప్రయత్నిస్తారనే విషయాన్ని నీవు అంగీకరించక తప్పదు.”

లోకమంతటా ఒకరిమీద చెప్పే వృధాప్రసంగాలను దాదాపు చీదరించుకుంటున్నారు. అమెరికాలోని సెమినోల్‌ జాతి ప్రజల్లో “ఎవరి విషయమైనా చెడుగామాట్లాడితే” దాన్ని అబద్ధం, దొంగతనం క్రింద లెక్కిస్తారు. పశ్చిమాఫ్రికాలో ఒక సమాజంలో వృధాప్రసంగం చేసినవారు వారి పెదవులు కోయబడుట లేక ఆఖరకు మరణశిక్ష పొందు ప్రమాదములో ఉండిరి. వాస్తవంగా, మానవ చరిత్రయంతటిలోను వృధాప్రసంగమును అరికట్టడానికి ప్రయత్నాలు జరిగినవి.

ఈ ఊకదంపుడు హానికరమగు మాటలను మాట్లాడే వృధాప్రసంగీకుల సిగ్గుతీయడానికి 15, 18 శతాబ్దముల మధ్యకాలంలో ఇంగ్లాండు, జర్మనీ, తర్వాత అమెరికాదేశాలలో, అటువంటి వారిని పూర్తిగా నీళ్లలో ముంచి తడుపుటకు డక్కింగ్‌ స్టూల్‌ అని పిలువబడే కుర్చీ బాగా ప్రసిద్ధిచెందినది. అట్టి నేరస్థున్ని పట్టుకొని కుర్చీకి కట్టివేసి అదేపనిగా నీళ్లలో ముంచేవారు.

నీళ్లలో ముంచే పద్ధతి అవమాన పంథాల్లో నడువగా, ఇటీవలి కాలములోకూడా వృధాప్రసంగీకులకు వ్యతిరేక పోరాటం జరుగుతోంది. ఉదాహరణకు 1960 వ దశకంలో అమెరికాయందు ఆ ప్రభుత్వకార్యకలాపములకు భంగం వాటిల్లుతుందనే గట్టి నమ్మకం కల్గివున్న ప్రాంతాలలో పుకార్లను-అరికట్టే కేంద్రాలు అని పిలువబడే స్థావరాలను ఏర్పాటు చేశారు. ఉత్తర ఐర్లాండ్‌, ఇంగ్లాండు దేశాలలో అటువంటి సేవా కేంద్రాలను నడిపించారు, కొన్ని ఆర్థిక సంస్థలకు హానికల్గించు రీతిగా కల్పించబడిన వృధాప్రసంగమునరికట్టే చట్టాలను తెచ్చారు.

అయితే వృధాప్రసంగీకుల ఎదుట ఈ ప్రయత్నాలేమి పని చెయ్యడంలేదు. అట్టి వృధా ప్రేలాపన ఇంకా సజీవంగానే ఉంది, విస్తరిస్తూనేవుంది. ఏ చట్టం, ఏ మానవ పద్ధతి దాని తీక్షణమైన వేడిని ఇంతవరకు ఆర్పలేక పోయింది. ఈ వృధాప్రసంగం ప్రతి చోట వున్నది. ఇరుగుపొరుగువారిలో వృధాప్రసంగమే, కార్యాలయాల్లోనూ అదే మాట, అంగళ్లలోనూ అదే వృధాప్రసంగం, గుంపుల్లోనూ వృధా మాటలే, కుటుంబములోనూ వృధా మాటలే. అది అన్ని సంస్కృతులను, జాతులను, నాగరికతలను దాటి వస్తుంది. ఒక నిపుణుడిలా అన్నాడు: “వృధాప్రసంగం శ్వాసించునంత సర్వసాధారణమైయున్నది.” ఆయనింకా ఇలా అన్నాడు: ‘అది మానవనైజంలో లోతైన భాగమైపోయింది.’

నిజమే, వృధాప్రసంగం తరచూ మానవనైజంలోని ఒక చీకటి భాగాన్ని, అనగా ప్రతిష్టను దెబ్బతీయుటలో ఆనందించే, సత్యాన్ని వక్రీకరించే, జీవితాలనే నాశనంచేసే భాగాన్ని బయలుపరుస్తుంది. అయిననూ, వృధాప్రసంగం సహజంగా చెడ్డదేమీ కాదు. మామూలుగా మాట్లాడుకొనుటలో ఒకవైపు మంచి కూడవున్నది. హానికరమగు, హానిలేని వృధాప్రసంగమునకు మధ్య ఎక్కడ గీత గీయవలెనో తెలుసుకుంటే ఇతరులను దానికి బలిచేయకుండ నువ్వందులో పడిపోకుండా తప్పించుకొనుటకు కీలకమదియే. (g91 6/8)

[4వ పేజీలోని చిత్రం]

వృధాప్రసంగీకులను అరికట్టుటకు స్థానిక ప్రభుత్వాలు ప్రయత్నించే ఒక పద్ధతి డక్కింగ్‌ స్టూలునుపయోగించి నీళ్లలో ముంచి తడిపివేయుటే.

[క్రెడిట్‌ లైను]

Historical Pictures Service

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి