దూరదర్శిని నిన్ను అదుపులో పెట్టుటకు ముందే నీవు దాన్ని అదుపులో పెట్టుము
దూరదర్శినికి సంచలనాత్మక శక్తివుంది. అమెరికా టివి పరిశ్రమ, అభివృద్ధి చెందుచున్న దేశాలను టివి నుపయోగించమని ఒప్పించే సమయములో అది ఒక టివి యొక్క సంపూర్ణ ఊహాకల్పిత చిత్రాలను కానుకలుగా సమర్పించుటకు సిద్ధమైంది. దేశాలన్నీ తరగతిగదులుగా మారిపోవును, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానము, సారవంతమైన నేలను కాపాడుట, కుటుంబనియంత్రణ మొదలగు విద్యావిషయక కార్యక్రమాల కొరకు సుదూర ప్రాంతాలు సహితం వీటిని చూడవచ్చును. పిల్లలు భౌతిక రసాయినిక శాస్త్రములనుగూర్చి నేర్చుకొని పరస్పర సాంస్కృతిక సహకార విస్తరణ వలన ప్రయోజనము పొందగలరు.
వ్యాపార సంబంధమైన దూరదర్శిని రావడంతో అటువంటి కలలన్నీ చాలవరకు కరిగిపోయినవి—అయితే పూర్తిగా కాదనుకోండి. దూరదర్శినిని “ఒక విశాల బంజరు భూమి” అని నామకరణం చేసిన, ది ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఛైర్మన్, న్యూటన్ మినో సహితం 1961 వ సంవత్సరంలో ఇచ్చిన అదే ప్రసంగములో ఒప్పుకున్నదేమంటే టివి కొన్ని గొప్ప ఘనకార్యములను ఉల్లాసభరిత వినోదములను యిచ్చి కీర్తిసంపాదించింది.
నిశ్చయంగా అది ఈనాటికి వాస్తవమే. టివి అందించే వార్తలు ప్రపంచంలో జరిగే వాటిని గూర్చి మనకు తెలియజేస్తున్నవి. టివిలో వచ్చే సృష్టిని గూర్చిన కార్యక్రమాలు మనం మరొకవిధంగా ఎన్నటికి చూడలేని వాటిని రవ్వంతైనా చూసే భాగ్యం కల్గిస్తున్నవి, అంటే గాలిలో ఈదుచున్నట్లు కనబడే చిన్నపక్షి (హమ్మింగ్ బర్డ్) నెమ్మదిగా కదిలేచిత్రం తీయగా కనబడే దాని అసలైన సొగసు, లేక రంగురంగులతో భూమినుండి మొలచి వచ్చిన విధంగా తీసిన ఫొటోగ్రఫీలో కనబడే పుష్పగుచ్ఛాల కొత్తతరహా నాట్యమును చూపిస్తుంది. ఇకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు అంటే నృత్యనాటికలు, సర్వసమ్మేళనాలు, సంగీత రూపకాలు ఉన్నవి. మరి నాటికలు, చలనచిత్రాలు ఇంకా ఇతర కార్యక్రమాలు ఉన్నవి—కొన్ని గంభీరమైన వివేకంకల్గించేవి, మరికొన్ని మంచి వినోదభరితమైనవి.
పిల్లలకు విద్యాభ్యాస కార్యక్రమములున్నవి. పిల్లలు హింసనుచూసి టివి నుండి కరుకుతనం ఎలా నేర్చుకోగలరో మాదిరికరమైన వాటినుండి వారు స్నేహశీలత, ఆశానిగ్రహం కల్గివుండుటకు కూడ నేర్చుకొనగలరు.
అత్యవసర సమయాల్లో ఎలా ప్రతిస్పందించవలెనో చూపించే కార్యక్రమాలు పిల్లల ప్రాణాలను సహితం రక్షించినవి. అందుకే, అవర్ ఎన్డేంజర్డ్ చిల్డ్రన్ అనే పుస్తకములో వాన్స్ పేకర్డ్ ఇలా వ్రాస్తున్నాడు: “వారి పిల్లలు అదుపు తప్పితే తప్ప, చీదరించుకుని లేక వేధించబడుచున్న తల్లిదండ్రులు తమ టివిలను అటక మీద పెడితే, బహుశా వారు అతిగా ప్రవర్తిస్తున్నారేమో.”
అదుపునందుంచుకొనుట
పెద్దలైనా లేక పిల్లలైనా మనం ఎవరిని గూర్చి మాట్లాడినప్పటికీ దానికి కీలకం ఒకటే అనేది స్పష్టం, అదే—అదుపు. మనం టివిని అదుపులో పెడుతున్నామా, టివి మనల్ని అదుపులో పెడుతుందా? పేకర్డ్ సలహా ప్రకారం, కొందరికి టివిని అదుపులో పెట్టే మార్గమొక్కటే, దాన్ని తీసివేయడం. కానీ అనేకమంది ఇతరులు దాని ప్రయోజనాల నుపయోగించుకుంటూ టివిని అదుపులో పెట్టే మార్గమును కనుగొనియున్నారు. ఈ క్రింద కొన్ని సలహాలివ్వబడినవి.
✔ ఒకటి రెండు వారాలు, మీ కుటుంబం టివిని చూసే సమయాన్ని జాగ్రత్తగా వ్రాసి పెట్టుకోండి. చివర్లో మొత్తం గంటలు కూడండి, మరి టివి కొరకు వెచ్చించే సమయం యుక్తమేనా కాదా ప్రశ్నించుకోండి.
✔ టివిలోని కార్యక్రమాలను చూడండి—టివిని మాత్రమే కాదు. చూడతగినదేమైనా వున్నదో లేదో టివి ప్రసార పట్టికను చూడండి.
✔ కుటుంబంతో కలిసిమెలిసి సరదాగా కాలం గడుపుటకు కొన్ని సమయాలను కేటాయించి, భద్రపరచుకోండి.
✔ పిల్లలుగానీ యౌవనస్థులుగానీ వారి స్వంత గదిలో టివిని పెట్టుకొనుట మంచిదికాదని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటప్పుడు పిల్లవాడేమి చూస్తున్నాడో గమనించి సరి చేయుటకు తలిదండ్రులకు కష్టంకావచ్చును.
✔ ఒక వీసిఆర్ను (వీడియో క్యాసెట్ రికార్డర్) నీవు కొనగలిగితే అది నీకు సహాయపడగలదు. మంచి వీడియో టేపులను అద్దెకు తెచ్చుకుంటే లేదా మంచి కార్యక్రమాలను టేపు చేసుకొని వీలున్నప్పుడు చూస్తే మీ టివిలో ఉన్నదాన్ని అదుపులో పెట్టుటకు మరియు ఎప్పుడు మీ టివి నడుస్తుంది అనేది అదుపులో పెట్టుటకు నీవు విసిఆర్ను వుపయోగించవచ్చును. అయితే ఒక హెచ్చరిక. అదుపు తప్పితే విసిఆర్, తెరముందు సమయాన్ని వృధా చేయవచ్చును, లేదా అవినీతికరమైన వీడియో టేపులకు మార్గమేర్పడవచ్చును.
నీ బోధకుడెవరు?
మానవుడు నేర్చుకునే ఒక యంత్రంవంటివాడే. మన జ్ఞానేంద్రియాలు నిత్యం సమాచారాన్ని నిల్వచేసుకుంటూ ప్రతి సెకండుకు 10,00,00,000 కంటె ఎక్కువ సంకేతపు చిన్నముక్కలతో కూడిన సమూహాన్ని మన మెదడుకు చేరవేస్తూనే వుండును. మన జ్ఞానేంద్రియాలకు మనమెట్టి ఆహారాన్ని అందిస్తున్నామో నిర్ణయించుకొనుట ద్వారా ఆ సముహములో వున్నదాని ఎడల మనం కొంత ప్రభావం చూపగలం. టివి కథ విశదంగా ఉదహరించినట్లే మనం తినే వాటిని త్రాగేవాటిని బట్టి మన శరీరం కలుషితమైనంత సులభంగా మనమనస్సు మరియు స్వభావం కలుషితం కావచ్చును.
మనచుట్టూవున్న ప్రపంచాన్ని గూర్చి మనమెలా నేర్చుకోగలం? ఎటువంటి సమాచార ఆధారములను మనం ఎన్నుకుందాం? మన బోధకుడెవరు లేక ఏమిటి? ఈ విషయంలో యేసుక్రీస్తు మాటలు శ్రేష్టమైన ఆలోచన నందిస్తున్నవి: “ఒక విద్యార్థి తన బోధకునికంటె గొప్పవాడు కాదు, అయితే సంపూర్ణ శిక్షణపొందినవాడు తన బోధకునివలె అవుతాడు.” (లూకా 6:40, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్) మన బోధకుడని టివి దగ్గరే మనం అత్యధిక సమయాన్ని గడిపితే, అది చూపించే విలువలను నియమాలను అమలుపెట్టుటకు దాన్ని మనం అనుకరించుదుమేమో. సామెతలు 13:20 ఇలా తెల్పుతుంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును.”
టివి మన ఇండ్లలోనికి బుద్ధిలేని లేదా అవినీతి పరులను తీసికొని రాకపోయిననూ అది ఒక అత్యవసరమైన దానిని ఇవ్వడంలేదు. టివిలో కనబడేది, ప్రతి మానవునికి సర్వసాధారణంగా అవసరమైన దానిని గూర్చి చాలా తక్కువగా చూపిస్తుంది: ఆత్మీయావసరతలను గూర్చి. ఈ లోకమెంత విచారకరమైన పరిస్థితిలో వుందో చూపించుటలో టివి చాలా బాగుగా పని చేయవచ్చును గానీ, మానవుడెందుకు తననుతాను నడుపుకొనలేడు అనే విషయాన్ని మనకు తెలియజేయుటకు అదేంచేస్తుంది? సృష్టి అందాలను మనకది చక్కగా చూపించవచ్చును గానీ, మనలను సృష్టికర్త యొద్దకు తెచ్చుటకు అదేం చేస్తుంది? మనకది భూనలుదిశలను చూపించవచ్చును, గాని మానవుడు ఎప్పుడైనా ప్రశాంతంగా జీవించునని అది మనకు చెప్పగలదా?
అటువంటి ముఖ్యమైన ఆత్మీయ ప్రశ్నలకు సమాధానమివ్వకుండ “ప్రపంచాన్ని చూపే కిటికీ” ఏదియు సంపూర్తికాలేదు. అదే ఖచ్చితంగా బైబిలును ఎంతో విలువైనదిగా చేస్తుంది. మనసృష్టికర్త దృష్టిలో అది ఒక “ప్రపంచాన్ని చూపే కిటికీ” వంటిది. మన జీవిత సంకల్పమును గూర్చి మనం గ్రహించునట్లు సహాయపడుటకును, భవిష్యత్ యొక్క దృఢమైన నిరీక్షణ మనకందించుటకును అది తయారు చేయబడినది. అతి క్లిష్టమైన ప్రశ్నలకు సరియైన సమాధానములు అందులో సిద్ధంగా ఉన్నవి. అవి ఎల్లప్పుడూ ఆశ్చర్యమును గొలిపే బైబిలునందు చదువుటకు వేచియున్నవి. (g91 5/22)
అయితే మనం టివిని అదుపులో పెట్టకపోతే మనకు సమయమెక్కడ దొరుకుతుంది.