దూరదర్శిని నిన్ను మార్చినదా?
“ప్రపంచాన్ని చూపే ఒక కిటికి.” అని దూరదర్శిని వర్ణించబడింది ట్యూబ్ ఆఫ్ ప్లెన్‌టీ—ది ఎవల్యూషన్ ఆఫ్ అమెరికన్ టెలివిజన్ అనే పుస్తకంలో రచయిత ఎరిక్ బార్నోవ్ తెలిపినదేమనగా, 1960 వ దశాబ్దపు తొలిదశకల్లా “అనేకమంది ప్రజలకు [దూరదర్శిని] ప్రపంచాన్ని చూపే ఒక కిటికి అయింది. అది వారికిచ్చిన దర్శనము అంతా నిజమైనలోకంవలె కనబడింది. వారు దాని విలువను సంపూర్ణతను నమ్మిరి.”
అయితే ఒక సాధారణ కిటికీ మాత్రం నీకందించే దృశ్యమును నీకొరకు అది ఎన్నుకోలేదు; అది వెలుగును, దృశ్యకోణమును నిర్ణయించలేదు; లేదా నీకు ఆసక్తిని కలిగించుటకై అది తన ప్రసార దృశ్యములను ఒక్కసారిగా మధ్యలోనే మార్చలేదు. కాని టివి అలా చేయగలదు. అట్టి మార్పులు, నీవు తిలకించువాటిని గూర్చి నీ భావాలను నిర్ణయాలను చాలావరకు ప్రభావితం చేయగలవు, అయినను టివి చిత్రాలను తయారు చేసే వారు వాటిని నడిపిస్తున్నారు. అత్యంత నిష్పక్షపాతమైన వార్తావిషయాలైనను, డాక్యుమెంటరీలైననూ, అవెంత అనాలోచితమైనవి అయిననూ సరే అట్టి నడిపింపుకు గురైతున్నవి.a
ఒక గొప్ప మోసకారి
అయిననూ తరచూ దూరదర్శిని నిర్వాహకులు దాన్ని తిలకించే వారి మీద నేరుగా ప్రభావం చూపవలెనని ప్రయత్నిస్తూ వుంటారు. ఉదాహరణకు నీవెలాగైనా కొనటానికి ప్రకటనలతో నిన్ను మభ్యపెట్టి ఎటువంటి మోసకరమైన ఆట ఆడాలన్నా వారికి సంపూర్ణ ఆధిపత్యమున్నది. రంగు, సంగీతం, అందమైన ప్రజలు, శృంగారం, శోభాయమానమైన పరిసరాలు. వారి ప్రదర్శనా పట్టిక విశాలం, దాన్ని వారు తెలివిగా ఉపయోగిస్తారు.
ప్రకటన మాజీ నిర్వాహక అధికారి ఇందులో తన 15 సంవత్సరముల అనుభవాన్ని గూర్చి వ్రాస్తూ ఇలా అన్నాడు: “[టివి వంటి] వార్తా సంస్థ ద్వారా నేరుగా ప్రజల బుర్రలోనికి వెళ్లి మాట్లాడుట సాధ్యమేనని, అటుతర్వాత ఇతరలోక మాంత్రికులవలె, ప్రజలు చేయాలని ఎన్నడూ అనుకోని వాటిని వారు చేయునట్లు ఆ ఊహలను వారిలో వదలి వేయవచ్చునని నేననుకొంటున్నాను.”
దూరదర్శినికి ప్రజల మీద అట్టి దారుణమైన శక్తి వున్నదని 1950 వ దశాబ్దం నాటికే స్పష్టమైంది. సంవత్సరానికి 50 వేల డాలర్లు సంపాదించే లిప్‌స్టిక్ తయారుచేసే కంపెని అమెరికా దూరదర్శినిలో ప్రకటన లివ్వడానికి ప్రారంభించింది. రెండు సంవత్సరాలలో అమ్మకాలు నింగికెగసి ఆదాయం సంవత్సరానికి 45 లక్షల డాలర్లకు చేరింది! ఒక బ్యాంక్, స్త్రీలకు ఇష్టమైన టివి కార్యక్రమాలలో ప్రకటనలిచ్చిన తర్వాత దాని ఖాతాలు 1 కోటి 50 లక్షల డాలర్ల బ్రహ్మాండమైన మొత్తానికి పెరిగినవి.
ఈ రోజు సగటు అమెరికా దేశస్థుడు ప్రతి సంవత్సరము 32,000 వ్యాపార ప్రకటనలు తిలకిస్తాడు. ప్రకటనలు భావోద్రేకాలమీద మోసకరంగా పనిచేస్తున్నాయి. బాక్స్‌డ్ ఇన్—ది కల్చర్ ఆఫ్ టివి అనే పుస్తకంలో మార్క్ క్రిస్పిన్ మిల్లర్ వ్రాసినట్లే వున్నది: “మనం తిలకించే దానిచేత మనం మలచబడుతున్నామనుట వాస్తవమే. దైనందిన జీవితాన్ని నింపివేసే వ్యాపార ప్రకటనలు తక్షణమే మనమీద ప్రభావం చూపించును.” ఇలా మలిచే ప్రభావం “ఖచ్చితంగా చాలా అపాయకరమైనదే ఎందుకంటే దాని గ్రహించుట కష్టం, గనుక మనం దాన్ని గ్రహించుటకు నేర్చుకునేంతవరకు అది విఫలం కాదు” అని ఆయన ఇంకా తెల్పుతున్నాడు.
దూరదర్శిని లిప్‌స్టిక్, రాజకీయ దృక్పథాలను, మరియు సంస్కృతినే గాక ఇంకా వేరే వాటిని కూడా అమ్ముతుంది. అది నైతిక నియమాలనుకూడా—లేక వాటి లేమిని అమ్ముతుంది
టివి మరియు నైతిక నియమాలు
అమెరికా దూరదర్శినిలో చాలాతరచుగా శృంగారలీలలను గూర్చి ప్రకటిస్తున్నారని తెలిసికొనుట కొందరికి ఆశ్చర్యం కల్గించవచ్చును. జర్నలిజం క్వార్టర్లీ లో 1989 నందు ప్రచురించిన అధ్యయనం ప్రకారం 66 గంటల ప్లూల్‌టైం నెట్‌వర్క్ కార్యక్రమంలో మొత్తం 722 సందర్భాలలో శృంగారలీలలను గూర్చి నేరుగాకానీ లేక మాటల ద్వారా గానీ, అలా అర్థంచేసికొనే రీతిగా గాని వర్ణించింది. కామస్పర్శ మొదలుకొని రతిలీల వరకు, హస్తప్రయోగం, పురుషసంయోగం, మరియు వావివరుసలులేని సంభోగము యొక్క ఉదాహరణను చూపించారు. వీటిని ప్రతిగంటకు సగటున 10.94 సందర్భాలలో చూపించేవారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు మాత్రమే ఇందుకు ప్రత్యేకమైనవి కావు. ఫ్రెంచి టివి చిత్రాలు సూక్ష్మమైన లైంగిక కౄరత్వమును ప్రదర్శిస్తున్నవి. వస్త్రాలు తొలగించి కవ్వించే కార్యక్రమాలు (స్ట్రిప్‌టీస్) ఇటలీ టివి లో దర్శనమిస్తున్నవి. స్పానిష్ టివి అర్థరాత్రులందు హింసాయుత, కామసంబంధమైన సినిమాలను చూపిస్తుంది.
హింస అనేది టివి యొక్క మరో అవినీతి క్రియ. అమెరికాలో టైం పత్రిక యొక్క టివి విమర్శకుడు ఇటీవల భయానక కార్యక్రమాలలో చూపించే “మంచి వికృత వినోదము”ను పొగడెను. వాటి ధారావాహికలలో శిరచ్ఛేదనం, అంగాంగ ఛేదనం, కొయ్యకుకొట్టి వ్రేలాడదీయడం మరియు దయ్యములు పీడించుట వంటివి చూపించబడెను. టివిలో చూపే హింస అంతా క్రూరమైనదేమి కాకపోవచ్చు—సులభంగా అంగీకరించేదిగా వుండవచ్చుననుట వాస్తవమే. పశ్చిమాఫ్రికాలోని కోటె డీ ఐవరిలోని ఒక మారుమూల గ్రామంలో, పశ్చిమదేశ దూరదర్శిని ప్రదర్శించగా చూచి దిగ్భ్రమచెందిన ఓ వయోవృద్ధుడు ఇలా మాత్రము అడుగగలిగాడు: “ శ్వేతజాతీయులెందుకు ఎప్పుడూ పొడుచుకుంటూ, కాల్చుకుంటూ ఒకరినొకరు గుద్దుకుంటూవుంటారు?”
దానికి సమాధానమేమంటే, దూరదర్శిని కార్యక్రమ నిర్వాహకులు ప్రేక్షకులేమి చూడాలని కోరుకుంటున్నారో వాటినే అందించాలని ఆశిస్తున్నారు. హింస ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. శృంగారలీలలు కూడా అంతే. గనుక టివి ఈ రెండింటిలో అధిక భాగాలను అందిస్తుంది—అయితే అంత ఎక్కువగా అంత త్వరలోనేకాదు, లేకపోతే ప్రేక్షకులు దాన్ని నిరాకరిస్తారు. ప్రైం టైం, అవర్ టైం అనే దానిలో డొన్నా మెక్‌క్రొహాన్ అన్నట్లు: “బాగా చూసే కార్యక్రమాలలో అధికం భాష, శృంగారం, హింస, లేక చెప్పే సంగతి విషయంలో వాటికి వీలున్నంత వరకు అంచువరకు వెళ్లును” అలా అంచువరకు వెళ్లిన తర్వాత, ఆ అంచును తొలగించి వేయుదురు. తత్ఫలితంగా, ప్రజలు క్రొత్త అంచుకొరకు సిద్ధంగా ఎదురుచూస్తూ వుంటారు.”
ఉదాహరణకు, సలింగ సంయోగము అనే విషయం దూరదర్శిని మంచి అభిరుచి అనే “అంచుకు” దూరమని ఒకనాడు భావించారు. అయితే ప్రేక్షకులు దానికి ఒకసారి అలవాటు పడిన తర్వాత వారింకా స్వీకరించుటకు సిద్ధపడ్డారు. ఒకఫ్రెంచి పత్రికా విలేఖరి ఇలా నొక్కిచెప్పాడు: “పురుష సంయోగం ఈ నాడు వక్రమార్గంగా చిత్రీకరించుటకు ఏ నిర్మాత ఎన్నటికి ధైర్యం చేయడు . . . అయితే సమాజం, దాని అసహనం ఇవే చెడ్డవి.” అమెరికాలోని కేబుల్ దూరదర్శిని 1990 సంవత్సరంలో 11 పట్టణాలలో ఒక ‘గే సోప్ ఓపెరా’ అనే ప్రధాన ప్రదర్శనను చూపించింది. అందులో ఇద్దరు పురుషులు శయనించు దృశ్యాలను చూపించారు. ఆ ప్రదర్శన నిర్మాత న్యూస్‌వీక్ పత్రికకు తెల్పుచూ “మేము అందరివలెనే వున్నామని ప్రజలు గ్రహించులాగున ప్రేక్షకులకు తెలియజేయుటకే” పురుషసంయోగులు అటువంటి దృశ్యాలను రూపొందించారు అని చెప్పాడు.
ఊహాలోకానికి వాస్తవానికి పోటీ
జర్నలిజం క్వార్టర్లీ లో వచ్చిన అధ్యయనము యొక్క రచయితలు గమనించిన దేమంటే టివి అక్రమ శృంగారలీలల వలన వచ్చే దుష్ఫలితాలను దాదాపు ఎన్నటికి చూపదు గనుక దాని “చక్కిలిగింత కల్గించే శృంగారలీలల” నిరంతర దాడి తప్పుప్రచారమునకు సమానమవుతున్నది. వారు మరొక అధ్యయనమును ఎత్తి చూపిస్తూ, టివి ధారావాహికలు ఈ సమాచారమును అన్నిటికంటె అధికంగా సరఫరా చేస్తున్నవి అని ముగించారు: శృంగార క్రీడ అవివాహిత జతలకే, మరి ఎవరికీ దానివల్ల రోగం రాదు.
నీవెరిగి యున్న లోకమిదేనా? యౌవనస్థులు గర్భంధరించకుండానే లేక సుఖరోగాలు లేకుండానే వివాహానికి ముందే లైంగిక సుఖం పొందుచున్నారా? ఎయిడ్స్ రోగం వస్తుందనే భయం లేకుండానే పురుష సంయోగం మరియు ద్విసంయోగం అనుభవించుచున్నారా? హింస మరియు కౄరత్వము తరువాత హీరోలు విజయవంతులగుదురు, విలన్లు అవమానము పొందుదురు—అయినా ఇద్దరూ తరచూ ఆశ్చర్యరీతిగా దెబ్బలేమీ లేకుండావుండుటా? చర్యలకు పర్యవసానములు లేని పరమానంద లోకమును టివి సృష్టిస్తుంది. మనస్సాక్షి, నీతి, ఆశానిగ్రహములనే నియమములకు బదులు తక్షణ సంతోషం అనే నియమమును పెంపొందిస్తున్నది.
నిజంగా దూరదర్శిని “ప్రపంచాన్ని చూపే కిటికి” కాదు—కనీసం నిజమైనలోకానికి మాత్రం కాదు. వాస్తవానికి, ఇటీవల ఓ పుస్తకం దూరదర్శినిని ది అన్‌రియాలిటీ ఇండస్ట్రీ (అసహజ పరిశ్రమ) అని పిలిచింది. టివి “మన జీవితాలలో అత్యంత ప్రధాన పాత్ర వహిస్తుంది. దాని ఫలితమేమంటే టివి వాస్తవమనగా ఏమిటో వివరించుటయే గాక ఇంకా ప్రాముఖ్యముగా మరియు కలత కలిగించే రీతిగా, టివి వాస్తవము కల్పనల మధ్యనున్న అసలు గీతను, అసలు భేదమును తుడిచివేస్తుంది,” అని ఆ పుస్తక రచయిత అంటున్నారు.
దూరదర్శిని ప్రభావానికి అభేద్యమై యున్నారని తలంచే వారికి ఈ మాటలు అకారణ భీతిని కలిగించునవిగా కనబడవచ్చును. ‘నేనుచూచే ప్రతిదాన్ని నేను నమ్మను’ అని కొందరు వాదిస్తారు. సరే, ఒప్పుకుందాం మరి టివిని మనం నమ్మకపోదుమేమో. అయితే నిపుణులు హెచ్చరించేదేమనగా జారిపోయే ఈ వితండవాదం టివి మన భావోద్రేకాలమీద చూపే కుయుక్తితో కూడిన పద్ధతులనుండి మనలను రక్షించలేదు. ఒక రచయిత ఇలా అన్నట్లుంది: “టివికున్న శ్రేష్టమైన కుయుక్తులలో ఒకటేమంటే మన మానసిక యాంత్రికత్వము మీద ఎంతటి ప్రభావం చూపుతుందో దానిని అది ఎన్నటికి బహిర్గతం చేయదు.”
ఒక ప్రభావిత యంత్రం
బ్రిటానియా బుక్ ఆఫ్ ది ఇయర్, 1990, ప్రకారం, అమెరికా వారు రోజుకు సగటున ఏడుగంటల రెండు నిమిషాలపాటు దూరదర్శిని చూస్తారట. మరి సంకుచితమైన అంచనా ప్రకారం ఆ సంఖ్య రోజుకు రెండుగంటలే వేస్తుంది, అయితే ఇంకా అలావేస్తేకూడ జీవిత కాలం మొత్తంలో అది ఏడు సంవత్సరాలు అవుతుంది. అట్లు టివిని అంతఅతిగా చూస్తే ప్రజలమీద ప్రభావం చూపక విఫలమౌతుందా?
టివికి, వాస్తవానికి మధ్యగల వ్యత్యాసాన్ని గుర్తించుటకు కష్టపడే ప్రజలను గూర్చి మనం చదివినప్పుడు అది అత్యంత ఆశ్చర్యంగా కనబడదు. మీడియా, కల్చర్ అండ్ సొసైటి అనే బ్రిటిష్ పత్రికలో ప్రచురించిన అధ్యయనము గమనించినదేమనగా టివి “వాస్తవ ప్రపంచానికి బదులు మరొకదాన్ని స్థాపించుకొనుటకు కొందరు ప్రజలను నిజంగా మోసగిస్తుంది,” అంటే వాస్తవాన్ని గూర్చిన వారి ఆశలు నిజమైన వాస్తవాలేనని తలంచునట్లు వారిని మభ్యపెడుతుంది. ఇతర అధ్యయనములు అనగా యు. యస్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ వారిచే క్రోడికరింపబడి నటువంటివి, ఈ పరిశోధనా ఫలితాలకు మద్దతునిస్తున్నట్లు గోచరిస్తున్నవి.
వాస్తవముల సాధారణ అభిప్రాయాల మీదనే టివి ప్రభావం వుంటే ఇక ప్రజల అసలు జీవితాలమీద క్రియలమీద ఎలా అది ప్రభావం చూపకుండ విఫలమౌతుంది? ప్రైం టైం, అవర్ టైం అనే పుస్తకంలో డొన్నా మెక్‌క్రొహాన్ వ్రాసిన రీతిగావున్నది: “విలువైన టివి ప్రదర్శన నిషేధాలను లేక భాషాహద్దులను ఉల్లంఘిస్తే ఇక మనం వాటిని ఉల్లఘించుటలో అంతకంటె స్వేచ్ఛమనకున్నదని మనమనుకుంటాము. అలాగే విచక్షణారహిత లైంగికత్వం సర్వసాధారణమైనపుడు, కామోద్రేకుడు సంతాన నిరోధక సాధనములను వుపయోగించు విషయం తెల్పినప్పుడు . . . వాటి ప్రభావం మనమీద వుంటుంది. ప్రతి సందర్భంలో టివి పనిచేస్తుంది—ఆలస్యంగా చర్య గైకొనే పద్ధతిలో—మనమెవరమని మనం నమ్మవలెనో మరియు మనం ఎవరిగా తయారవ్వవలెనో అద్దంవలె చూపిస్తుంది.”
నిశ్చయంగా టివి యుగం పెరిగేకొలది అవినీతి, హింస కూడ అంతే సమానంగా పెరుగుతున్నవి. తలవని తలంపుగా జరిగిందా? కానేకాదు. మూడు దేశాలలో టివి ప్రవేశపెట్టబడిన తర్వాతనే ఆ మూడు దేశాలలో నేరం, హింస పెచ్చుపెరిగిందని ఒక అధ్యయనము తెల్పింది. టివి ఎక్కడ ముందుగా ప్రవేశపెట్టబడిందో అక్కడ ముందుగానే నేరాల సంఖ్య పెరిగింది.
ఆశ్చర్యమేమంటే, కొందరనుకుంటున్నట్లు టివి విశ్రాంతి కొరకు సమయాన్ని గడిపేదని లెక్కించుటకు కూడా వీలులేకుండవున్నది. సమయాన్ని గడిపే అన్ని సందర్భాలతో పోల్చితే దూరదర్శినిని తిలకించే ప్రజలకు విశ్రాంతినిచ్చేది కానేకాదని 13 సంవత్సరాలలో 1200 అంశాలమీద చేసిన అధ్యయనం ప్రకారం తేలింది. బదులుగా అది ప్రేక్షకులను సందిగ్ధంలోను, ఎటూ తోచనీయకుండ కట్టిపడేసినట్లు చేసింది. ప్రత్యేకంగా చాలాసేపు చూసే సందర్భాలలో వారు చూచుటకు ప్రారంభించక ముందుకంటె ఘోరమైన మానసిక అస్థిరతలకు దిగజార్చింది. దీనితో పోల్చితే చదువునపుడు ప్రజలు ఎక్కువ విశ్రాంతిగా ఉన్నట్లు, మంచి మానసిక స్థితికి లోనవుతున్నట్లు, తదేక దృష్టికల్గి యుండునట్లు చేసింది.
అయితే మంచి పుస్తకమును చదువుట బహుశా ఎంత ప్రయోజనకరంగా కనబడిననూ సమయాన్ని హరించే ఆ హుషారైన దొంగ సులభంగా పుస్తకాలను ప్రక్కకు నెట్టేయవచ్చును. న్యూయార్క్ సిటీలో మొట్టమొదటి సారిగా దూరదర్శినిని ప్రవేశపెట్టినపుడు ప్రజాగ్రంథాలయాలలో పుస్తకాల పంపకం వెంటనే పడిపోతున్నట్లు తెలిపాయి. అంటే మానవజాతి ఇక చదవడం మానుకోబోతున్నదని కాదనుకోండి. అయిననూ, ఆ సొగసైన చిత్రాలు వారిని ఆకర్షించకపోతే ప్రజలీనాడు తక్కువ సహనముతో చదివెదరని, వారి ధ్యానం తక్షణం ఎగిరిపోతుందని చెప్పుచున్నారు. అయితే అటువంటి సంశయములను గణాంకములు, అధ్యయనములు బలపరచకపోవచ్చును. క్షణక్షణం అతిచిన్న విషయానికి ధ్యానమిస్తూ, తయారు చేయబడి తదేకంగా ప్రసారమయ్యే టివి వినోదపు తిండి మీదనే మనం ఎల్లపుడూ ఆధారపడివుంటే వ్యక్తిగత క్రమశిక్షణ, బుద్ధికుశలత విషయంలో మనం పోగొట్టుకునేదేమిటి?
ఆ పెట్టెయొక్క పిల్లలు
అయితే పిల్లల విషయంలోనే దూరదర్శిని సంగతి అత్యవసరమౌతుంది. మొత్తం మీద, టివి పెద్దవారికేమి చేస్తుందో దాన్నే నిశ్చయంగా పిల్లలకుకూడా చేస్తుంది—ఇంకా అధికంగానే చేస్తుంది. పిల్లలు టివిలో చూచే కల్పనా చిత్రలోకాన్నే సాధారణంగా ఎక్కువ నమ్ముతూవుంటారు. రెయినిస్కర్ మెర్కుర్‌క్రైస్ట్ అండ్ వెల్ట్ అనే జర్మనీ వార్తాపత్రిక, ఇటీవల చేసిన ఒక అధ్యయనమును ఎత్తి చూపిస్తూ పిల్లలు తరచూ “నిజజీవితానికి తెరమీద వారు చూచేదానికి గల తేడాను గ్రహించలేరు. అవాస్తవిక ప్రపంచంలో వారుచూచే దాన్ని వాస్తవ ప్రపంచంలోనికి మార్చుకుంటారు” అని తెల్పింది.
దశాబ్దాలకాలంలో జరిగిన పరిశోధనలో 3,000 కంటె ఎక్కువ వైజ్ఞానిక అధ్యయనములు ఈ ముగింపును బలపరచినవి, అదేమనగా హింసను ప్రోత్సహించే దూరదర్శిని పిల్లలు, యౌవనస్థులపై చెడుప్రభావములను చూపుచున్నది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, మరియు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వంటి ప్రసిద్ధిచెందిన సంస్థలన్నీ అంగీకరించునదేమనగా దూరదర్శినిలో చూపే హింస పిల్లలలో పోరాట స్వభావాన్ని, సంఘవ్యతిరేక లక్షణాన్ని కల్గిస్తుంది.
అధ్యయనములు ఇతర ఆందోళన కలిగించే ఫలితాలను వెల్లడిస్తున్నవి. ఉదాహరణకు, చిన్నప్పుడు బొద్దుగా వుండుటకుగల కారణం వారు టివిని అధికంగా చూస్తున్నందువల్లనేనని అంటారు. నిజానికి అక్కడ రెండు కారణములున్నవి. 1) చురుకుగా ఆడుకునే సమయానికి బదులు ఆ పెట్టెముందు కదలకండా కూర్చునే స్థితివస్తుంది. 2) టివి వ్యాపార ప్రకటనలు, అతితక్కువ పోషక విలువలున్న చెత్తాచెదారంవంటి ఆహారాన్ని పిల్లలకు అమ్ముచున్నవి. ఇతర పరిశోధన సలహా ఇచ్చినదేమంటే టివిని అధికంగా చూచే పిల్లలు స్కూలులో అతితక్కువ మార్కులు తెచ్చుకుంటారు. ముగింపు ఎంతో వివాదాస్పదమైనప్పటికీ, పిల్లల చదువులో నైపుణ్యం, పాఠశాలలో పనితనం చాలా క్షీణించుటకుగల కారణం టివియేనని అనేక మంది మనస్తత్వశాస్త్రజ్ఞులు మరియు ఉపాధ్యాయులు దాన్ని నిందిస్తున్నారని ఇటీవలి టైం పత్రిక తెల్పింది.
మరలా సమయమే అసలు విషయం. సగటు అమెరికా బాలుడు ఉన్నతపాఠశాల ముగించి వచ్చేటప్పటికి అతడు 17,000 గంటల సమయాన్ని టివి ముందు గడుపుచున్నాడు గానీ పాఠశాలలో మాత్రం 11,000 గంటలే గడుపుచున్నాడు. చాలామంది పిల్లలకు టివి అనేది వారి ముఖ్యపని కాకపోవచ్చును గాని అది వారి ప్రధమ కాలక్షేపంగా తయారయ్యింది. ఐదవతరగతి (పదేండ్ల పిల్లలు) పిల్లలలో సగంమంది రోజుకు నాలుగు నిమిషాలపాటు చదువుకుంటున్నారు గానీ 130 నిమిషాలపాటు టివి చూస్తున్నారని ది నేషనల్ PTA టాక్స్ టు పేరెంట్స్: హౌటు గెట్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఫర్ యువర్ చైల్డ్ అనే పుస్తకం తెలియజేస్తుంది.
ఆఖరుకు తేలిన ఫలితమేమంటే, టివి పిన్నలకు పెద్దలకు ఇద్దరికీ, నిజమైన అపాయములను తీసికొనిరాదని తీవ్రంగా వాదించేవారు బహుశా తక్కువే. అయితే దాని అర్థమేమిటి? ఇంట్లో టివి చూడకూడదని తల్లిదండ్రులు నిషేధించవలెనా? సాధారణ ప్రజలు దాన్ని బయట విసిరేసి లేక అటకమీద భద్రంగా పెట్టి దాని ప్రభావం నుండి తమ్మును తాము రక్షించుకొనవలెనా?
[అధస్సూచీలు]
a “కెన్‌యు రియల్లీ బిలీవ్ ది న్యూస్”, 1990, ఆగష్టు 22, అవేక్! సంచిక చూడండి.
[7వ పేజీలోని చిత్రం]
“శ్వేతజాతీయులు ఎందుకు ఎప్పుడూ పొడుచుకుంటూ, కాల్చుకుంటూ, ఒకరినొకరు గుద్దుకుంటూ వున్నారు?”
[0వ పేజీలోని చిత్రం]
టివిని కట్టేయండి, పుస్తకాలు తెరవండి