కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 6/8 పేజీ 31
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మోజాంబిక్‌లో సమావేశం
  • క్షామం, అయిననూ ఆహారకొరత లేదు
  • పక్షుల దొంగ రవాణా
  • ఆసియాలో ఎయిడ్స్‌
  • ఎలుకలను పట్టే తెగ
  • ఉష్ణంవల్ల నేపాళవృక్షములు నశించిపోతున్నవి
  • టాగ్వా విత్తనాలు—ఏనుగులను రక్షించగలవా?
    తేజరిల్లు!—1999
  • పగడం—ప్రమాదంలో ఉంది మరియు నశిస్తోంది
    తేజరిల్లు!—1996
  • పగడపు దిబ్బలను కాపాడేందుకు ఏమి చేయవచ్చు?
    తేజరిల్లు!—1996
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1995
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 6/8 పేజీ 31

ప్రపంచ పరిశీలన

మోజాంబిక్‌లో సమావేశం

అనేక సంవత్సరములపాటు నిషేధింపబడిన అనంతరం మోజాంబిక్‌లోని యెహోవాసాక్షులు అధికారులిచ్చిన అధిక స్వాతంత్ర్యాన్ని అభినందిస్తున్నారు. ఇటీవల మోజాంబిక్‌ రాజధాని నగరమైన మాపుటో లోని కోస్టా డొ సోల్‌ క్రీడా స్టేడియం నందు “స్వచ్ఛమైన భాష” అను నాలుగు రోజుల జిల్లా సమావేశం జరిగింది. మాపుటోలో ప్రచురింపబడే టెంపో అనే పత్రిక, ఆ సమావేశ ప్రారంభకూటమునకు ఆరువేలమంది హాజరయ్యారని తెల్పింది. పోర్చుగీస్‌, ట్సోంగా భాషల్లో ప్రసంగాలివ్వబడినవి. “మనుష్యులమధ్య చీలికలకు కారణమైన భాషా భేదాలున్నప్పటికిని క్రైస్తవ ఐక్యతను బలపరచుటయే” ఆ సమావేశము యొక్క వుద్దేశమని టెంపో ఇంకా తెలిపింది. “దేశ, కుల, విద్య, సాంఘిక” తారతమ్యములున్ననూ అంతర్జాతీయముగా యెహోవాసాక్షులు ఆ లక్ష్యసాధనే వారి ధ్యేయముగా పెట్టుకొని కృషిచేస్తున్నారని ఆ శీర్షిక వివరిస్తుంది. (g91 5/8)

క్షామం, అయిననూ ఆహారకొరత లేదు

“ప్రపంచబ్యాంకు నిర్వహించిన అధ్యయనముల ప్రకారం ఇటీవలి కాలంలో క్షామం పెరిగింది, ముఖ్యంగా లాటిన్‌ అమెరికాలో” అని బ్రెజిల్‌లోని శావో పౌలోలో జరిగిన సెమినార్‌నందు ఫ్రెంచ్‌ ఆర్థిక శాస్త్రవేత్త జాక్వీస్‌ కోన్‌కోల్‌ అన్నాడు. “క్షామం—తొంబయవ దశాబ్దమునకు ఒక సవాలు” అని దాని మూలాంశమే అయినప్పటికీ ప్రపంచమంతట పోషకాహార లోపమున్నదని చెప్పబడుచున్న 111,60,00,000 మంది ప్రజలను ఆదుకునే విషయం ఏమంత ఎక్కువగా చర్చించబడలేదు. “నిపుణుల అభయం ప్రకారం, ఆహారకొరత వల్ల సమస్య రావడంలేదు” అని ఓ ఎస్టాడో డి యస్‌. పౌలో పత్రిక తెలుపుతుంది. “ప్రపంచం, అందులోని 5.3 [వెయ్యి మిలియన్ల] జనాబాకు సరిపడే ఆహారం తయారు చేస్తుంది. గానీ ఆహారాన్ని కొనే స్థోమత ప్రజలకు లేదు.’ ఎందుకు? అంతర్జాతీయ రుణం విషయంలో జరిగే పరస్పర చర్చలలో ప్రజోపకార కార్యక్రమాల సంఖ్యను తగ్గించుటవలన క్షామం తీవ్రమౌతున్నదనే నింద వున్నది. కోన్‌కొల్‌ ప్రకారం మరో కారణమేమనగా: “పట్టణాలలో జనాబా పెరుగుచున్నందువల్ల క్షామం వికృతరూపం దాల్చింది.” (g91 5/8)

పక్షుల దొంగ రవాణా

“ప్రతి సంవత్సరము మోసపూరిత అధికార పత్రాలద్వారా చిల్లరగా 50 మిలియన్‌ డాలర్ల విలువ చేసే కనీసం 2,25,000 పక్షులను దొంగ రవాణా లేదా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఆఫ్రికా, ఇండోనేషియా, మెక్సికో, మరియు దక్షిణ అమెరికాలోని అడవులనుండి స్థానికప్రజలు చిలుకలను పట్టుకొని కొన్ని డాలర్లకే అమ్మివేస్తున్నారు. “ఆ పక్షులు అమెరికా లేక ఐరోపాలోని వినియోగ దారులకు చేరేటప్పటికి, కొన్ని పక్షులు, కేరీబియన్‌లోని డొమినికాకు చెందిన పెద్ద పక్షులవంటివి ఒక్కొక్కటి 1,00,000 డాలర్లకు అమ్ముడుపోతుంది,” అని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెల్పుతుంది. అడవుల్లో అనేక రకాల చిలుకజాతులు అంతరించే ప్రమాదమున్నదని చెప్పబడుచున్నది. దొంగరవాణా జరిగే వాటిలో 90 శాతం “సరైన ఆహారం లేక అమానుష పరిస్థితులవలన రవాణాలోనే చనిపోతున్నవి,” అని అనుకుంటున్నారు. (g91 5/8)

ఆసియాలో ఎయిడ్స్‌

ఆ మధ్య, 1990 ఫిబ్రవరిలో ఆసియాలో షుమారు 2,000 మంది ఎయిడ్స్‌ రోగులున్నట్లు తెలుపబడినది. అయితే ఆసియాలో మొత్తం 5,00,000 మందికి హెచ్‌ఐవి వైరస్‌ సోకిందని డబ్లూఎచ్‌ఓ (ప్రపంచ ఆరోగ్యసంస్థ) అంచనా వేసిందని ఇటీవల ఐక్యరాజ్యసమితి సమర్పించిన రిపోర్టు తెలియజేస్తుంది. ఏసియావీక్‌ పత్రిక ప్రకారం, “ఐక్యరాజ్యసమితి ఇప్పుడే తెలియజేసినట్లు ఆసియాలోని ఎయిడ్స్‌రోగుల సంఖ్య అత్యంత గణనీయంగా పెరుగును.” ఈ సమస్యను ప్రతిఘటించుటకై మంచి విద్యాబోధన, సమాచార ప్రచారాలు జరుగవలెనని ఆరోగ్యసంస్థ సిఫారసు చేస్తుంది. (g91 5/8)

ఎలుకలను పట్టే తెగ

ఇండియాలోని తమిళనాడు వ్యవసాయదారులు ఎలుకల బెడదను తప్పించుకోవడానికి రసాయనాలు, క్రిమిసంహారక మందులు, ఎరలున్న బోనులను ఉపయోగిస్తున్నారు. అందులో విఫలమైనందున వ్యవసాయదారులు ఆ పని చేయడానికి ఇరుల తెగవారిని డబ్బిచ్చి నియమించుకున్నారని ఇండియా టుడే తెల్పుతుంది. మొదటి సంవత్సరములో ఈ ఇరుల తెగవారు 16,000 హెక్టార్లలో షుమారు 1,40,000 ఎలుకలను పట్టుకున్నారు. ఈ ఇరుల తెగవారు “క్రిమిసంహారక మందులను వాడరుగానీ మూషికముల ప్రవర్తనా తీరును ఆధారం చేసుకుని వారి స్వంత పద్ధతులుపయోగిస్తారు.” ఎలుకలు దూరే బొక్కసములను మూసివేసి వాటిని పట్టుకుంటారు. వారు చాలా ఎలుకలను పట్టుకొనగలుగు చున్నారు గనుక ఈ ఇరుల తెగవారు ఇప్పుడు ఎలుక మాంసాన్ని కోళ్లకు, చేపలకు ఆహారంగా వేయాలని, ఎలుక చర్మాన్ని వుపయోగకరమగు తోలుగా తయారు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. “ఇరుల తెగవారి ప్రయోగాత్మక పద్ధతి నిశ్చయంగా విజయం సాధిస్తుందని ఈ ప్రయోగం రుజువు చేసింది” అనియు ఇది ఎలుకలను అదుపులో పెట్టుటకు తక్కువ ఖర్చుతో కూడినదనియు ఇండియా టుడే తెల్పుచున్నది. (g91 5/8)

ఉష్ణంవల్ల నేపాళవృక్షములు నశించిపోతున్నవి

“భూగోళం వేడెక్కుటకుగల మొదటి రుజువు నేపాళవృక్షములు తెల్లబడుట వల్లనే కావచ్చును,” అని ప్యూర్టోరికో విశ్వవిద్యాలయాధికారి ఎర్నెస్ట్‌ విలియమ్స్‌ అన్నాడు. సముద్రము యొక్క అధిక ఉష్ణం, నేపాళవృక్షములు ఆహారంగా తీసికొనే సూక్ష్మదర్శినితో చూడగలిగే నాచును పైకుబుకునట్లు చేస్తుంది. దీనిమూలంగానే నేపాళవృక్షము మీద తెల్లనిమచ్చలు ఏర్పడుచున్నవి, దాన్ని బట్టి “తెల్లబారుట” అనే పదం వచ్చింది. “నాచు అనే తోడు దానికి లేకపోతే నేపాళవృక్షం బలహీనపడి ఉత్పత్తిని మానివేస్తుంది.” తెల్లమచ్చలు, రోగపీడిత నేపాళవృక్షాలు అనేక స్థలాల్లో, బెహామాస్‌, బెర్ముడ, ఫ్లోరిడా, హవాయి, జమైకా, ఓకినావా మరియు ప్యూర్టోరికోలలో కూడ కనబడినవి. ది టొరాంటో స్టార్‌ పత్రిక తెలుపుచున్నదేమనగా 1980 వ దశాబ్దము గత వంద సంవత్సరములలోకెల్ల అత్యంత ఉష్ణంవున్న కాలమనియు, “రాబోవు శతాబ్దంలో ఉష్ణోగ్రత చాలా డిగ్రీలు పెరుగుతూనే వుంటుందని వాతావరణ నిపుణులు ముందుగానే తెల్పుచున్నారు,” అందువల్ల ఈ నేపాళవృక్షాలకు ప్రమాదం ముంచుకొస్తుంది. (g91 5/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి