కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 6/8 పేజీ 32
  • కానరీపక్షులు చనిపోయినప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కానరీపక్షులు చనిపోయినప్పుడు
  • తేజరిల్లు!—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘లౌకికాత్మను’ ఎదిరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • పాడే పక్షులు—వివేచనకతీతమైన కళానిపుణులు
    తేజరిల్లు!—1992
తేజరిల్లు!—1992
g92 6/8 పేజీ 32

కానరీపక్షులు చనిపోయినప్పుడు

కానరీపక్షులు మానవులకంటె త్వరగా విషవాయువుకు బలైపోవును. ఈ కారణం చేత పూర్వం బొగ్గుగనుల కార్మికులు ఈ పక్షిని గూడులో పెట్టుకొని గనిలోపల ప్రవేశించి అపాయకరమైన విషవాయువులేమైనా విడుదలైయున్నవా అని పరిశోధించేవారు. ఆ పక్షి చనిపోతే గనికార్మికులు అక్కడనుండి తప్పించుకొనిపోయి గని గాలిని సరిగ్గా ప్రసరింపజేసేంతవరకు తిరిగిరారు. ఈ విషయాన్ని మనస్సునందుంచుకొని కెనడాలో ప్రఖ్యాత విజ్ఞానశాస్త్రజ్ఞుడగు డా. డేవిడ్‌ సుజుకి చేసిన వ్యాఖ్యానము ఒకవ్యక్తి సరిగ్గా గ్రహించగలడు.

మన భూగోళమునకు బహుశా తక్షణమే రాబోవు నాశనాన్ని గూర్చి విచారం వ్యక్తంచేస్తూ ఆయన ఈ క్రింది ఉదాహరణ నుపయోగించాడు: “బొగ్గుగని కార్మికుడు ఒక కానరీపక్షిని తనవెంట బొగ్గుగనిలోనికి తీసికెళ్లగా ఆ కానరి పక్షి చనిపోతుంది, ఇక బొగ్గు కార్మికుడు ‘ఓ, ఆ పక్షి వూరకనే చనిపోయింది, నేను పక్షిని కాదుగదా’ అని అనలేడు. ఆ కానరీ పక్షి అదే గాలిని పీల్చుకునే చనిపోయింది.”

ఆయన ఇంకను ఇలా అన్నాడు: “సెయింట్‌ లారెన్స్‌ జలసంధిలో 22 తెల్ల తిమింగలములు చనిపోవుట చూస్తే, మరి అవెంత విషపూరిత రసాయనాలు కలిగి యున్నవంటే నీవు వాటిని తాకవలెనంటె నీ చేతులకు తొడుగులు వేసికొని, తలకు ముసుగు వేసుకొనవలసి వస్తుంది. క్యుబెక్‌లోని మేపుల్‌ చెక్కెర అడవి పదేళ్లలో నాశనమౌతుందని ప్రజలు మనకు చెబితే, సీలుజాతి చేపలు 10,000 వరకు చనిపోయాయనియు, గంటకు రెండు రకాల జీవులు అంతరిస్తున్నవని ప్రజలు చెబితే, మరి వాటికి గల కారణం వారికి తెలియదు, మరి నిశ్చయంగా . . . అవి కానరీ పక్షులవంటివే మరియు ఆ ప్రాణులున్న పరిస్థితిలో మనం లేమని మనమనుకుంటే, మనం పిచ్చివాళ్లమే.”

డా. సుజుకి విచారం వ్యక్తం చేసేదేమనగా రాజకీయ నాయకులు ఈ “కానరీల” మీద శ్రద్ధచూపరు లేదా కొంచెమే చూపుతారు మరియు పిల్లలు కొల్లలుగా చనిపోయే వరకు పరిస్థితి యొక్క తీవ్రతను గమనించరు. ఆయన ఇలా అంటున్నారు: “గనుక మనము పిల్లలను మన కానరీపక్షులుగా చేద్దామా?

అయితే నిజమైన క్రైస్తవులు శ్రద్ధ కనబరచెదరుగాని నిరాశ చెందరు. “నిరాకారముగా నుండునట్లు సృజించలేదు, నివాసస్థలమగునట్లుగా” భూమిని సృజించిన సృష్టికర్తయైన యెహోవా, భవిష్యత్‌ దృష్టిలేని, దురాశపరులైన మనుష్యులు నిరంతరం ఈ వాతావరణమును పాడుచేయుట కనుమతించడు. తన వాక్యమైన బైబిలు నందు ఆయన “భూమిని నాశనము చేయువారిని నాశనము చేయును” అని వాగ్దానము చేస్తున్నాడు.—యెషయా 45:18; ప్రకటన 11:18. (g92 1/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి