కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 3/8 పేజీలు 19-21
  • నేనెందుకు గుప్తశాస్త్రం జోలికి పోకూడదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేనెందుకు గుప్తశాస్త్రం జోలికి పోకూడదు
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వారెందుకు పాల్గొంటున్నారు
  • ‘నమ్మశక్యముకాని వేదన’
  • ఆత్మలోకంలోని నిజమైన నివాసులు
  • తేనెపూసిన పదునైనకత్తి
  • క్షుద్రవిద్యల్లో కాస్త ఆసక్తి చూపించడం హానికరమా?
    తేజరిల్లు!—2002
  • మంత్రతంత్రాలు చేయడం, అలాంటి వినోదం చూడడం ప్రమాదకరమా?
    యువత అడిగే ప్రశ్నలు
  • మంత్రతంత్రాలు ఎందుకు తప్పు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మంత్రవిద్య గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    తేజరిల్లు!—2017
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 3/8 పేజీలు 19-21

యవ్వనస్థులు ఇట్లు అడుగుదురు . . .

నేనెందుకు గుప్తశాస్త్రం జోలికి పోకూడదు

“నా తాతంటె నాకెంతో ఇష్టం” ఆ అమ్మాయి అంటున్నది, “ఆయన చనిపోయినప్పుడు నేనెంతో బాధపడ్డాను. ఆయనను మరల కలుసుకోనే వీలుందేమోనని నేను తెలిసుకొన గోరాను.” ఆ విధంగా ఆ అమ్మాయి గుప్తశాస్త్రం జోలికి పొవుటకారంభించింది.

ఈ మధ్యనే వచ్చిన వార్త ప్రకారం “ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ జర్మనీలో కనీసం 2,00,000 మంది పిల్లలు, యవనస్థులు గుప్తశాస్త్రం యొక్క వివిధ పద్ధతులలో అనుభవం సంపాదించి యున్నారు.” జపానులోని పాఠశాలలో సరదాగా ప్రేతాత్మల విద్య నేర్చుకొనే గుంపు ఒకటున్నది. వారిలో కొందరు భాషప్రేషణములో, వశీకరణ శాస్త్రములో మరి ఇతరులైతే భూత వైద్యములో ప్రత్యేక శిక్షణ పొందుచున్నారు. నైజీరియాలో ప్రాథమిక పాఠశాలకువెళ్లే విద్యార్థులు ఈ కాలంలో సోదె చెప్పు అలవాటును కల్గియుండుట అసాధారణమేమి కాదు. క్రైస్తవ తలిదండ్రులు పెంచిన కొందరు యవ్వనులే బహుశా అమాయకంగా మానవాతీత శక్తులతో ఆడుకున్నారని చెప్పుట విచారకరమే.

గుప్తశాస్త్రమెందు కంతగా యవనస్థుల నాకర్షిస్తూంది? దాని జోలికి పోవుట ఎందుకంత ప్రమాదకరం?

వారెందుకు పాల్గొంటున్నారు

గుప్తశాస్త్రంలో, జ్యోతిశాస్త్రం, హస్తసాముద్రికము, సోదె, ఇంద్రజాలము మొదలగువాటి ద్వారా దయ్యముల లోక జ్ఞానాన్ని వెదకి తెలుసుకొను, మానవాతీత పరిశోధనా విషయాలు ఇమిడియున్నవి. మరి ఎంతోమంది యవనస్థులెందుకు అట్టి వాటిని తొంగిచూడాలనే అభిలాష కల్గివుంటున్నారు? డర్క్‌ అనే అబ్బాయి చనిపోయిన తన తండ్రితో సంబంధమేర్పరుచుకోవాలని చాలా కుతూహలపడ్డాడు. తన మానసిక శక్తులను వృద్ధిపరచుకొనుటవల్ల అలా చేయగలననుకొని, వస్తువులను తాకకుండగనే వాటిని కదలించుటకు ప్రయత్నించు ప్రక్రియ ఇమిడియున్న ధ్యానమును అలవర్చుకున్నాడు. అట్టి ధ్యానము అతన్ని ఆత్మలోకం గడపదగ్గరకు నడిపించిందని డర్క్‌ అన్నాడు.

ఇతర యవనస్థులు భవిష్యత్‌ను గూర్చి భయపడుతున్నారు. వారు వారి విద్యాస్థానములను గూర్చి లేదా వివాహ అవకాశములను గూర్చి సలహా కోరుచున్నారు మరి ఆత్మలోకం వారికి సహాయపడుతుందని అనుకుంటున్నారు. ముఖ్యంగా సాతానును ఆరాధించడం ఆందోళన కల్గిస్తుంది! అసహ్యము పుట్టించే ఈ మతముయొక్క ఆకర్షణ ఏమిటి? “శక్తులుపొందటానికే నేనందులో చేరాను,” అని సాతాను ఆరాధనలో పడిపోయిన ఒక కెనడా దేశ యవనస్థుడు అన్నాడు. “ప్రజలకు హానిచేయుటకది నాకు శక్తినిస్తుంది.”

అయినను, యవనస్థులు వట్టి కుతూహలం కొరకే గుప్తశాస్త్రం జోలికి పోతున్నారని అధిక పరిశోధకుల నమ్మకము. “నాకెంతో కుతూహలంగా వుంది” అని గుప్తశాస్త్రం నందు తలదూర్చిన ఒక బాలిక ఒప్పుకుంది. మరో బాలిక ఇలా చెబుతుంది: “నేను ముందు ఎంతో సందేహించాను గాని నేననుకున్నా, ‘అసలు అదెలావుంటుందో కనీసం తెలుసుకుంటా,’ ” అలా అనుకుని ఆ అమ్మాయి తన మిత్రురాలు ఆహ్వానం మేరకు గుప్తజ్ఞాన క్లాసులో చేరింది.

అట్టి ఉబలాటముండబట్టియే కొందరు యవనస్థులు లిపిఫలకము వ్రాయుటకు లేదా వెళ్లికలా పెట్టిన గాజుయొక్క కదలికలను అధ్యయనము చేయుటద్వారా పద్యాలు మొదలగువాటిని వల్లించుటకు ప్రయత్నిస్తున్నారు. అక్కడనుండి ఒక్కచిన్న గంతులో దయ్యములకు సంబంధించిన స్ఫటికపు గోళం, టారొటు అను పేకాట కార్డులు, కంఠహార వతకలు, తేయాకు ఆకులు మరియు జాతక చక్రమునకు సంబంధించిన పుస్తకములనుపయోగించుట ద్వారా వాటి లోతైన దానిలోనికి ప్రవేశింతురు. కొందరైతే వృత్తిరీతిలో జాతకాన్ని చెప్పేవారిని లేక ఔషధ పురుషులను సంప్రదించుటకారంభిస్తున్నారు. అయితే వృత్తిరీతిలో అలా చెప్పేవారిలో అనేకులు మోసగాళ్లే. ఉదాహరణకు, అలెగ్జాండర్‌ తన స్థాయిని పెంచుకొను దృష్టితో ఒక ఔషధమనిషిని కలిశాడు. తన స్థాయి పెరగకపోగా అతనికి ఆర్థిక నష్టం కూడ వచ్చింది. అతని డబ్బు ఆ నకిలీ ఔషధ మనిషికి, దీనిని సిఫారసు చేసిన నామకార్థ మిత్రునికి మధ్యే ఖర్చయిపోయింది.

అయినను, అనేకమంది యవనస్థులు ఈ దయ్యములకు సంబంధించిన ప్రయత్నంలో ఆర్థిక నష్టంకంటె ఇంకా అధిక నష్టమొకటి కలుగుతుంది.

‘నమ్మశక్యముకాని వేదన’

మానవాతీతమైన వారితో సంబంధము పెంచుకున్నందుకు విచారం వ్యక్తపరచు యవనస్థులు సాధారణంగా “నాకు ముందే తెలిస్తే” అనే మాట చెప్పుటవింటాము. పర్సవాలిటి అనే దక్షిణ ఆఫ్రికా పత్రిక అలా చెప్పింది. ఒక విలాపం ఇలా వుంది: “నేనంత సరళంగా వుండక పోయివుంటే . . . నేను నమ్మశక్యముకానంత బాధననుభవించాను, శబ్దాలు, పీడకలలు, బెదిరింపులు విన్నాను. నేను బయట పడదామని ప్రయత్నించగా ఇతర సాతాను సంబంధికులు నన్ను మానసికంగా, శారీరకంగా వేధించారు.

జర్మనీలో పరిశోధించిన మొత్తము 24 శాతము ఉపాధ్యాయులు, విద్యార్థులపై గుప్తశాస్త్రప్రభావం బహుచెడ్డగా వున్నట్లు గమనించారు. కొందరు విద్యార్థులు చదువు మానుకున్నారు, నేర్చుకొనుటలో సమస్యలెదుర్కొన్నారు, భయంతో జీవించారు, నిరుత్సాహములో క్రుంగిపోయారు, ఇతరులకు లేదా తమకుతామే హానికల్గించే స్వభావాన్ని పెంచుకున్నారు. డర్క్‌ అనే అతను రాత్రిపూట నిద్రపోయేవాడుకాదు. అతనిట్లు జ్ఞాపకం చేసుకొంటున్నాడు: “దయ్యములు పట్టి పీడిస్తాయేమోననే భయంతో నేను కళ్లు మూసుకొనుటకు ధైర్యంచేసేవాన్నేకాదు. ప్రతిశబ్దం వణకుతో వినేవాన్ని.” మైకెల్‌ అను యవనస్థుడు తనకిచ్చిన ఔషధాన్ని సేవించిన తర్వాత “దయ్యముల బెదిరింపు వల్ల నిద్రలేని రాత్రులు గడిపి” అటువంటి బాధనే అనుభవించాడు. గుప్తశాస్త్రం అలవాట్లనభ్యసించు వ్యక్తులలో అశుభసూచక మార్పులు వచ్చినట్లు ఇతర వార్తలు వివరిస్తున్నవి. ఒక అమ్మాయి తన తల్లితో, తాను ఇక భవిష్యత్తులో నల్లని రంగు దుస్తులే వేసుకుంటుందని, (తన గదికి కూడ నల్లరంగు వేయాలనుకుంది) తెరచివుంచిన శవపేటికలో పడుకుంటుందని హెచ్చరించింది.

ఆత్మలోకంలోని నిజమైన నివాసులు

లేఖనములు స్పష్టీకరించునదేమనగా “చనిపోయినవారు . . . ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:5) గనుక ఆత్మలోకం చనిపోయిన వారి ఆత్మలుండే స్థలంకాదు. మరి అట్టి భయానక అనుభవాలకుగల కారణమేమిటి? దుష్ట దయ్యాలే కారణం! బైబిలు ప్రకారం వీరు అపవాదియగు సాతాను అనుచరులు, తిరుగుబాటు దూతలే. (1 పేతురు 3:19, 20; ప్రకటన 12:9) వారు మానవులలో కలకలం లేపి నిస్సహాయులను చేసే దారుణ చరిత్ర వారికున్నది.

ఉదాహరణకు లూకా 9:42 లో ఒక దయ్యం పట్టిన వ్యక్తిని అది “పడద్రోసి . . . విలవిలలాడించింది.” ఎంత దుర్మార్గం! అపొస్తలుల కార్యములు 19:16 ఆలాగునే కాబోవు ఏడుగురు మాంత్రికులమీద దయ్యము పట్టినవ్యక్తి విరుచుకుపడ్డాడు అని వర్ణించుచున్నది. ఇప్పటి అనుభవాలు స్పష్టంగా స్థిరపరిచేదేమనగా దయ్యాలు ఇసుమంతైనా తమ దుర్మార్గ పద్ధతులను మార్చుకొనలేదు.

జ్యోతిశాస్త్రం, ఇ. యస్‌. పి. టారోట్‌ పేకాట కార్డులు లేదా గుప్తశాస్త్రానికి సంబంధించిన ఏ విద్యయైనను భయంకరమైన అనుభవాలకు దోహదమీయవచ్చును. పర్సనాలిటి అనే పత్రిక ఇట్లన్నది: “మేము మాట్లాడిన వారందరి (గుప్తశాస్త్రంతో సంబంధమున్నవారి) అనుభవాలను పరిశీలిస్తే మర్యాద అనే పల్చని పైపూత మార్గాల ద్వారా సాతాను యొక్క సుడిగుండములో లోతుకు కూరుకుపోయి వున్నారని బయటపడింది. అవును, గుప్తశాస్త్రం మరేమి కాదు సాతాను, దయ్యములతో సంబంధమేర్పరచుకొనుటకు మొదటి మెట్టు.

తేనెపూసిన పదునైనకత్తి

కావున ఇశ్రాయేలీయులు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం దయ్యములకు సంబంధించిన సమస్త క్రియలను నిషేధించి, ఇలా చెబుతుంది: “మీమధ్య . . . శకునముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములను గానీ సర్పశకునములనుగానీ చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణపిశాచినడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణ చేయువానినైనను ఉండనీయకూడదు.”—ద్వితీయోపదేశకాండము 18:10, 11.

దయ్యములకు సంబంధించిన వస్తువులన్నిటిని నాశనముచేయుట ద్వారా మొదటి శతాబ్దములోని క్రైస్తవులు దయ్యములతో పూర్తిగా తెగతెంపులు చేసికొని పరిశుభ్రంగా వుండిరి. (అపొ. 19:19) యెహోవా స్నేహాన్ని కోరు యవనస్థులీనాడు ఆలాగే గుప్తశాస్త్రమునకు సంబంధించిన దేని జోలికి పోకుండ దూరంగా వుంటారు. అందులో దయ్యములకు సంబంధమున్న సమస్త సినిమాలు, పుస్తకాలు, తమాషా పుస్తకాలు, గోడలకంటించే కాగితాలతో సహా అన్ని చేరియున్నవి. సంగీతాన్ని కూడ నిశితంగా పరిశీలించి ఎన్నుకోవాలి. ఉదాహరణకు, పెద్ద శబ్దముతోచేయు పాప్‌ సంగీతము తరచూ దయ్యములతో ముడివేయబడినది.

టిబెటీయులు ఇలా ఒక సామెత చెబుతారు: “పదునైన కత్తిమీద పూసి ఇచ్చిన తేనెను తీసుకునేముందు కొంచెం ఆలోచించాలి.” కత్తిమీది తేనెను నాకుటకు ప్రయత్నించుటలో నీ నాలుకనే పోగొట్టుకోగలవు! అదేమాదిరి, నీ కుతూహలానికి ఆ మానావాతీతశక్తి ఎంత రమ్యంగా వున్నప్పటికి అది మాత్రం కత్తివంటిదే. గనుక గుప్తశాస్త్రం చెప్పు తరగతుల దగ్గరకు వెళ్లి పరిశీలించుటగాని అందులో భాగం వహించుమని వచ్చు ఎటువంటి ఆహ్వానమునైనను తిరస్కరించండి. గాజును అటుఇటు త్రిప్పి ఆడే ఆటవంటిది నిరపాయముగా కనబడవచ్చునేగాని అది దయ్యముల జోలికిపోయే అపాయంలో ముంచివేయవచ్చును. నిజమే, నీకు కుతూహలం ఉండవచ్చును. విషాహారమేమిటోనని కొంచెం చూద్దామని క్రుళ్లిన మాంసంతింటావా?

డర్క్‌, (ముందు తెల్పిన అబ్బాయి) గుప్తశాస్త్రంనుండి తన్నుతాను స్వతంత్రునిగా చేసికొన్నాడు. వాచ్‌టవర్‌ సొసైటీ ప్రచురణల సహాయముతో బైబిలును పఠిస్తు చనిపోయిన తన తండ్రిని గూర్చిన సత్యాన్ని గ్రహించగలిగాడు మరియు పునరుత్థాన నిరీక్షణను గూర్చి తెలిసికొన్నాడు. (కీర్తన 146:4; యోహాను 5:28, 29) ఈ సత్యమే, అతడు దయ్యములతో మాట్లాడవలెనను కోరికను విడనాడునట్లు చేసింది. (యోహాను 8:32) డర్క్‌ అనే అబ్బాయి ఇప్పుడెక్కడున్నాడు? యెహోవా సాక్షులతో కలిసిపోయి, సంపూర్ణ కాలసేవకునిగా వాచ్‌టవర్‌ సొసైటియొక్క ముద్రణా కార్యాలయములో పనిచేస్తున్నాడు.

అవును, బైబిలు మన ‘ఆత్మీయావసరతలను’ తీర్చుతుంది. (మత్తయి 5:3) అపాయకరమగు, మరణకరమగు గుప్తశాస్త్రం ద్వారా అనారోగ్యకరమగు కోరికను తృప్తిపరచేబదులు ఆత్మీయావసరతలు తీర్చుకొనుటవల్ల శాశ్వతకాల ప్రయోజనం కలుగుతుంది. (g90 3/8)

[21వ పేజీలోని చిత్రం]

లిపి ఫలకము వ్రాయుట లేదా వెళ్లికలా పెట్టిన గాజు యొక్క కదలికల వంటి ఆటల ద్వారా గుప్తశాస్త్రం జోలికి పోవచును.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి