కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 4/8 పేజీలు 22-23
  • బ్రిటన్‌లోని “పిచ్చి ఆవు” సమస్య

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బ్రిటన్‌లోని “పిచ్చి ఆవు” సమస్య
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆధునిక పశువుల-దాణా
  • మానవుని సంబంధం
  • మీరు తింటారా?
  • రక్తమార్పిడి–ఎంత వరకు సురక్షితము?
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
తేజరిల్లు!—1992
g92 4/8 పేజీలు 22-23

బ్రిటన్‌లోని “పిచ్చి ఆవు” సమస్య

బ్రిటన్‌లోని మేల్కొలుపు! ప్రతినిధి ద్వారా

నవంబరు నెల 1986 సంవత్సరములో బ్రిటన్‌లోని పశువుల్లో మొట్టమొదటి సారి ఒక క్రొత్త వ్యాధి ప్రబలింది. అప్పటినుండి 11,000 కంటె అధికంగా పశువులు రోగగ్రస్తమైనవి, ప్రతివారం షుమారు 200 క్రొత్తవి రోగపీడిత పశువులుగా రికార్డు అయినవి. వ్యాధిని సాంకేతికంగా బోవైన్‌ స్పాంజీఫాం ఇన్‌సిఫాలోపథి, లేక క్లుప్తంగా బియస్‌ఇ (BSE) అంటారు, పత్రికాసంస్థలు తక్షణమే రోగాన్ని “మ్యాడ్‌ కౌ” వ్యాధి అంటే పిచ్చి ఆవు వ్యాధి అని దాని వినాశకర లక్షణాలనుబట్టి పిలిచారు.

బియస్‌ఇ (BSE) ఏమిటి, అదెలా ఉత్పన్నమైనది, అదెందుకు అంత బెంబేలెత్తిస్తుంది?

బియస్‌ఇ అనేది ఒక పిచ్చివంటిది, అంటే “సరిక్రొత్త అంటురోగ క్రిములు” అని వర్ణించబడిన అసాధారణ మాంసకృత్తుల మూలంగా మెదడులోని భాగాలు నశించిపోవు మెదడు వ్యాధి. సూక్ష్మ దర్శినితో చూస్తే రోగపీడిత ప్రాంతం మెత్తగా, గుంటగా కనబడుతుంది. రోగం ముదిరేకొలది పశువు చిరచిరలాడుతుంది. బరువు తగ్గిపోతుంది, మరియు ఎప్పుడైతే దాని కాళ్లు నిలద్రొక్కుకొనలేక పోతుందో అప్పుడది కూలిపోయి చనిపోవును లేదా చంపబడవలసి వస్తుంది.

బ్రిటన్‌లోని గొర్రెలమందకు సాధారణమైన, సమీపలక్షణాలున్న ఈ పిచ్చినుండి పశువులకీ వ్యాధి సోకింది. ఇదెలా జరిగింది?

ఆధునిక పశువుల-దాణా

ఆవు మేతమేసే పశువు, అది సాధారణంగా గడ్డి తిని జీవిస్తూ నెమరు వేస్తు వుంటుంది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో బ్రిటన్‌లోని పశు ఆహార ఉత్పత్తిదారులు మామూలు దాణాకు అసహజ మాంస కృత్తులను కలిపారు. ఇందులో పశువధశాలలో ఏరిపారేసిన మాంసపు చెత్తాచెదారము, పిచ్చిగల శవాలతో సహా ముక్కలుచేసి, వండి, ఎండబెట్టిన పొడి కలిసి యున్నది. పశువులేగాక ఐదురకముల లేళ్లు, ఒక అరుదైన అరేబియా దుప్పి కూడా బ్రిటిష్‌ జంతుప్రదర్శన శాలలో ఈ మెదడు వ్యాధివల్లనే చనిపోయినవి. ఇవన్నీ ఈ పశు-దాణా తిన్నవే. పారవేసిన పచ్చి గొర్రెమాంసమును తినిపించినందువలన పెంపుడు స్థలములోని ముంగిసలకు కూడా ఇటువంటి రోగమే సోకింది.

బియస్‌ఇ, గొర్రెలకున్న పిచ్చి ఈ రెండు వ్యాధులుకూడా అతి ఉష్ణోగ్రతలను, విద్యుదావిష్టకణము చెందు క్రాంతి వికీరణమును, అతినీలలోహిత కిరణముల కాంతిని తట్టుకోగలవు. సామాన్యంగా ఉడకబెట్టుట, ఇతర వడబోతలవల్ల అంతుచిక్కని ఈ క్రిములు నాశనంకావు. గొర్రెలకు సోకిన ఈ పిచ్చి మనుష్యులకు సోకిందనుటకెట్టి ఆధారాలు లేక పోయినప్పటికి, వేధించే ప్రశ్న ఏమంటే: పశుమాంసమును తిను మానవులకు ఈ బియస్‌ఇ ఏ అపాయాన్ని తెస్తుంది?

మానవుని సంబంధం

ఎవరూ, ఈ దేశంలో గానీ మరే చోటనైనాగాని బియస్‌ఇ అనే వ్యాధిని గూర్చి బెంబేలుపడనవసరము లేదని” బ్రిటిష్‌ ప్రభుత్వాధికారి, వ్యవసాయ శాఖా మంత్రి జాన్‌ గమ్మర్‌ అభిప్రాయం. అయితే ప్రతి ఒక్కరు అదే నిశ్చయత కల్గివుండరు. ఇంగ్లాండ్‌, లీడ్స్‌ విశ్వవిద్యాలయము క్లినిక్‌ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ రిచర్డ్‌ లాసి ది ఇండిపెండెంట్‌ వార్తాపత్రికకు వ్రాసిన వ్యాసములో ఇలా వ్రాశాడు: “ఒకవేళ ఆవుకు ఆహారం మూలంగా ఆ వ్యాధి వస్తే అది నోటి ద్వారానే రావాలి, కనీసం మొదటి దశలో. అందుకే ఇది మనుష్యునికి నోటి ద్వారానే వ్యాపించే అవకాశముంది.”

ఈ హేతువు కనుగుణంగా, జర్మనీ దేశం బ్రిటన్‌నుండి గోమాంస దిగుమతిని నిషేధించింది, ఎందుకంటే బియస్‌ఇ—రోగంలేని పశువుల మాంసమే దిగుమతి అవుతుందనే అభయం లభించలేదు. అమెరికా బ్రిటన్‌నుండి పశువుల పిండములు, వీర్యముల దిగుమతిని నిషేధించింది. ఈ బియస్‌ఇ రోగ కారణంగానే రష్యా ఇంకొక అడుగు ముందుకెళ్లి పాల ఉత్పత్తి పదార్థాలన్నింటితోపాటు, గొర్రె, మేకల మాంస దిగుమతిని పూర్తిగా నిషేధించింది. ఇంగ్లాండులో కొన్ని పాఠశాలలు ఈ వ్యాధిలేదని నిరూపించిన గోమాంసాన్ని మాత్రమే విద్యార్థులకివ్వడానికి నిర్ణయించినవి.

ప్రభుత్వం తీసుకున్న ఇతరచర్యలతో, పారవేసిన గోమాంసాన్ని విక్రయించుటను నిషేధించింది. బ్రిటిష్‌ ప్రజలు సంవత్సరానికి 3 వేల మిలియను డాలర్లను గోమాంసానికి, ఆ మాంసముతో తయారైన ఆహార పదార్థములు అంటే బర్‌గర్‌లు మరియు పైల కొరకు వ్యయపరుస్తున్నారు, మరియు వారి ఆరోగ్యం పాడు కాదనే గట్టి నిశ్చయత వారికవసరం. అయినను, ఈ బియస్‌ఇ అనే వ్యాధి పశువులనుండి మానవులకు సంక్రమించదని “అభయమిచ్చుటకు ఇంకా ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పట్టవచ్చునని” ఒక ప్రభుత్వాధికార నివేదిక ఒప్పుకుంటుంది. “వచ్చే చిక్కంతా, కృత్రిమ ఉత్పాదన కాలాన్ని గూర్చియే. బియస్‌ఇ అనే వ్యాధి ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమిస్తే, సిజెడి (CJD) అను రోగమున్న రోగుల సంఖ్య ఎక్కువైందనే విషయం తెలిసేటప్పటికి, ఆ రోగం అంటిన ప్రజలను గూర్చి ఏమి చేయుటకు వీల్లేనంతగా అప్పటికే ఆలస్యమైపోవునని” ఎడిన్‌బర్గ్‌ మ్యారోపథోజెనిసిస్‌ విభాగ మాజీ డైరెక్టర్‌ డా. రిచర్డ్‌ కెంబెర్లిన్‌ వివరిస్తున్నాడు.a

ఈ భయాందోళనను పారద్రోలడానికి ఇప్పుడిప్పుడే విజ్ఞాన శాస్త్రజ్ఞులు అత్యవసరంగా సరిక్రొత్త, ఖచ్చితమైన పరిష్కారాలను అన్వేషిస్తున్నారు, మరి ఈ పరిశోధన నిమిత్తం బ్రిటిష్‌ ప్రభుత్వం 20 మిలియన్‌ డాలర్లు కేటాయించింది. అయితే బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ సక్రమంగానే ఇలా అంటుంది: “గోమాంసము సురక్షితమైనదా కాదా అని ఇంతవరకు పరీక్షింపబడలేదు, పరీక్షింపబడేది కాదేమో.”

మీరు తింటారా?

మానవారోగ్య ఫలితమెలా వున్ననూ, బియస్‌ఇ గూర్చి చర్చ, పశువుల నిరుపయోగ పదార్థములను పునరుపయోగం చేసే అలవాటువైపు ప్రజల ధ్యానాన్ని మళ్లించింది. బ్రిటిష్‌ పశువులు, కోళ్లకు, కోళ్లపెంటతో తయారుచేయబడిన దాణా ఇస్తున్నారు, వ్యాపారస్తులు దీన్ని డిపియం (డ్రైయిడ్‌ పౌల్ట్రి మాన్యూర్‌) అని పిలుస్తారు, ఇది చనిపోయిన పక్షులు, వాటి రెట్ట, ఈకెలతో కూడిన పొడి. ఎండపెట్టిన పంది రక్తాన్ని, చాక్లెట్‌ సుగంధంతో కలిపి దూడలకిస్తారు. 1988 సంవత్సరమునుండి ఈ పశువుల దాణా ఇవ్వడం చట్టవిరుద్ధమైనప్పటికీ, గొర్రెల పుర్రెలు, వాటి నిరుపయోగ మాంసంతోపాటు దంచి కలిపి ఇప్పటికి పందులకు, కోళ్లకు దాణాగా ఇస్తున్నారు. ఆ అలవాటు “అసహజ క్రియలని” ఒక ప్రభుత్వాధికార నివేదిక ఖండించింది. ఆహారోత్పత్తిలో వీటి ఉపయుక్తతను, ఆర్థిక వుపయోగాలను పరిగణలోనికి తీసుకుని కొందరు వాటి వాడుకను సమర్థించ వచ్చును. అయితే ఆరోగ్యరీత్యా అవి ఉపయోగకరమేనా? (g90 11/8)

[అధస్సూచీలు]

a సిజెడి (క్రుడ్జ్‌ఫెల్డ్‌-జేకబ్‌ డిసీజ్‌) అనేది మానవునికి వచ్చే వ్యాధి, ఇది బియస్‌ఇ కోవకు చెంది అటువంటి క్రిమిమూలంగా సంక్రమించే రోగము. ఈ రకమైన పిచ్చి త్వరగా వ్యాపించి, రోగాన్ని కనుగొనిన సంవత్సరంలోపల రోగానికి గురియైన రోగి నిస్సహాయుడౌతాడు. ఈ సిజెడి అనే వ్యాధి రక్తమార్పిడి ద్వారా, శరీరధాతువుల మూలంగా వ్యాపిస్తుంది. బ్రిటన్‌లో షుమారు 2,000 మంది, అమెరికాలో 7,000 మంది ఈ వ్యాధి సోకి బాధపడుచున్నారు ఎందుకంటే చనిపోయిన వారి శ్లేష్మ గ్రంథుల ద్వారా తీయబడిన వృద్ధిచేయు హార్మోనులను వారు ఇంజక్షన్‌ ద్వారా తీసుకున్నారు. అమెరికా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌హెల్త్‌ డైరెక్టర్‌ డా. పాల్‌ బ్రౌన్‌ ఇలా అంటున్నాడు: “సిజెడి రోగమున్న రోగినుండి తీసే ఏ కణమైనా ఒక బలిష్టమైన టైంబాంబు వంటిదే.”

[23వ పేజీలోని చిత్రం]

బియస్‌ఇ (BSE) ఆవు మెదడులో రంధ్రములు.

[క్రెడిట్‌ లైను]

J.A.H. Wells, Crown Copyright Material

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి