కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 4/8 పేజీ 21
  • ఆకాశమెందుకు నీలంగా ఉన్నది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆకాశమెందుకు నీలంగా ఉన్నది?
  • తేజరిల్లు!—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన అమూల్యమైన వాతావరణం
    తేజరిల్లు!—1995
తేజరిల్లు!—1992
g92 4/8 పేజీ 21

ఆకాశమెందుకు నీలంగా ఉన్నది?

అంతరిక్షములో అత్యధిక భాగములు అంధకారములో అలుముకొనివున్నవి. ఆకాశం అని మనం పిలిచేది అంతరిక్షభాగం. ఈ పెద్దవిశాలమువైపు, ఆకాశమునుచూచి అనేకులు ఇట్లు ఆశ్చర్యపడుదురు, ‘ఆకాశమెందుకు నీలంగా వున్నది? మనకు కనబడే ఇతర ముఖ్య రంగుల ప్రతిఛాయలో—ఉదాహరణకు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, కాషాయ లేక ఎఱుపు రంగుల్లో ఎందుకు లేదు?

సూర్యుని వెలుగులో, వివిధ కాంతి కిరణాలున్నవి, వాటిని వివిధ దృశ్యమగు ప్రతిచ్ఛాయారంగులలో చూడగలము. వీటిలో అంత్యంత పొడవైన కాంతికిరణాలు ఎర్రగా వున్నవి, అతి చిన్నవి నీలి లేక ఊదారంగులో వున్నవి. మన వాతావరణమందున్న వాయువు కణములు పొడవాటి ఎర్రని కిరణములకంటె పొట్టివైన నీలిరంగు కిరణములను విస్తారముగా వెదజల్లును. అందుకే నిర్మలాకాశం నీలిరంగులో కనబడుతూవుంటుంది. ధూళివంటి అసంఖ్యాకములైన గట్టి అణువులతో కూడి, భూమిచుట్టు వున్నగాలి వెలుగును ప్రసరింపజేసి అద్దమునుండి ప్రతిబింబిస్తున్నరీతిలో దృశ్యముగా కనబడునట్లు చేయును.

మరోవైపు పరిశీలిస్తే, సూర్యుడు దిగ్మండలం సమీపంలో వున్నపుడు సూర్యుని వెలుగు ఈ వాతావరణములోనికి అధికభాగముగుండా ప్రయాణించి కంటికి చేరును, మరియు పొడవాటి కిరణాలు పొట్టికిరణాల కంటే బాగుగా వ్యాపించును. గనుకనే ఆకాశం ముదురు కాషాయము, ఎరుపు రంగులలో కనబడునట్లు చేయును. గాలిలోని గట్టి అణువులు ఎరుపురంగు అధికం చేయును. అలాగే ఆకాశం పొగతోను లేక దట్టమైన మేఘాలతో నిండియున్నపుడు అన్ని రంగుల వెలుగు కిరణాలు వెదజల్లబడును ఇందువల్ల ఆకాశం బూడిద రంగులో కనబడుతుంది.

వాతావరణ ఆకాశములో వెలుగు ప్రసరింప జేయుటలోని దేవుని అనంత జ్ఞానం, కీర్తనల రచయిత మాటలను మనకు జ్ఞాపకమునకు తెస్తున్నవి: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.”—కీర్తన 19:1. (g90 8/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి