కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 3/8 పేజీలు 17-18
  • మండే స్వభావంగల దానిని కలుసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మండే స్వభావంగల దానిని కలుసుకోండి
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వెలిగించే అగ్గిపుల్లను కనిపెట్టుట
  • చెట్టుమొద్దునుండి అగ్గిపుల్ల వరకు
  • పుట్టుకతోనే గుడ్డివాడైన వ్యక్తికి యేసు చూపు తెప్పించాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • లోకమునకు వెలుగైయున్న వానిని అనుసరించుడి
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
తేజరిల్లు!—1992
g92 3/8 పేజీలు 17-18

మండే స్వభావంగల దానిని కలుసుకోండి

ఇటలీలోని మేల్కొలుపు! కరస్పాండెంట్‌ ద్వారా వ్రాయబడినది

కొన్నిసార్లు నేననుకుంటా, నాదొక అసాధారణ స్వభావమని—పీలగ, ఎండిపోయివుంటాను, మరి నిప్పురవ్వలు ఎగరేటట్టు చేసేతత్వం నాది. నేనెంత వేడిగావుంటానంటే క్షణంలో నన్ను రగల్చవచ్చును. అగ్నిగా మార్చవచ్చును. ఇతరులకీ విషయాలు తెలుసు గాబట్టి వారు నన్ను అలా వాడుకుంటారు. నిజమే, వేడెక్కే స్వభావం నాకున్న సహజలక్షణమే అనుకోండి. వాస్తవానికి, నేను మండకపోతేనే ప్రజలకు నా మీద కోపమొస్తుంది. అయితే దానికి కారణమున్నది, అదేమంటే—నేను అగ్గిపుల్లను గనుక.

కొన్నిసార్లు మీరు నేను మంటమండకపోతేనే నన్ను గమనిస్తారు లేదా అగ్గిపెట్టె ఖాళీగానున్నపుడే బహుశా నన్నుగూర్చి అనుకుంటారు. నిజంకాదా? అయితే మీరుకూడ పూర్వకాలంలో వారు చేసినట్లే పండిన ఆకుల కుప్పను తగులబెట్టుటకు రెండు చిన్నకర్రలను ఒరిసి రుద్దినట్లే రుద్దవలెనని లేక మీవ్రేళ్లను నలుగగొట్టుకొనవలసిన పరిస్థితికి వచ్చునటువంటి పనిని అంటే ఉక్కును చకుముకిరాయితో మీరుకొట్టుతూంటే నేను చూడాలని ఉంది. అప్పుడు మీరు వినయంగల అగ్గిపుల్లను అభినందిస్తారు.

వెలిగించే అగ్గిపుల్లను కనిపెట్టుట

అగ్గి ముట్టించుటకు కొన్ని అభ్యాసకరమైన మార్గాలను కనుగొనుటలో నాకుటుంబ చరిత్ర అంతా అనుభవాలమయమే. 17 వ శతాబ్దంలో సహితం జర్మన్‌ కెమిస్ట్‌ హెన్నగ్‌ బ్రాండ్‌ ఫాస్పరస్‌ను కనిపెట్టిన తర్వాత అగ్గిముట్టించుటకు అనువైన పద్దతిని కనిపెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అలా కనుగొనుటకు విజ్ఞాన శాస్త్రజ్ఞులు అనుకున్నదానికంటే ఎక్కువకాలం పట్టింది.

ఫ్రెంచ్‌ దేశస్థుడైన జీన్‌ చాన్‌సెల్‌, 19 శతాబ్దపు ఆరంభంలో, పోటాషియం క్లోరేట్‌, పంచదార, మరియు తుమ్మ జిగురు కలిసిన ఒక మండే స్వభావమున్న గట్టి పదార్థాన్ని కనిపెట్టాడు. దాన్ని గంధకంతోపాటు కలిపి కొంచెం తీసుకొని ఒక పుల్ల కొన భాగాన అంటించి, సల్‌ఫ్యూరిక్‌ ఆమ్లంతో కలిపి వెలిగించి చూశారు. దాన్ని జేబులో వేసికొని తిరిగే అంతమంచి వస్తువు మాత్రంకాదు!

మొట్టమొదటి గీటురాయి అగ్గిపుల్ల లేక “గీటువెలుగు”ను 1826 లో మందులమ్మే ఆంగ్లేయ దేశస్థుడైన జాన్‌ వాకర్‌ కనిపెట్టాడు. ఈ అగ్గిపుల్ల అటుతర్వాత లూసిఫర్‌ అగ్గిపుల్ల లేక లూసిఫర్‌ అని పిలువబడింది. ఎందుకు లూసిఫర్‌ అని పిలిచారు? ఎందుకంటే “వెలుగు-నిచ్చే”—ఫాస్‌ఫరస్‌ అను గ్రీకు పదాన్ని లాటిన్‌ భాషలో అలాగే పిలుస్తారు. మరి అదే గ్రీకు పదమును 2 పేతురు 1:19లో “వెలిగిచ్చువాడని” లేక “వేకువచుక్క” యని వాడియున్నారు. ఇంతెందుకు స్పానిష్‌, పోర్చుగీస్‌ వంటి కొన్ని భాషల్లో నన్నింకా ఫోస్‌ఫోరో అని పిలుస్తారు.

కాకర్‌ తన అగ్గిపుల్లను కనిపెట్టిన కాలంలోనే “ప్రోమీదియన్స్‌” (ప్రమోతియస్‌ అను గ్రీకు పురాణాల్లోనుండి ఒలంపస్‌నుండి ఒక రాక్షసుడు అగ్నిని దొంగిలించి మానవుని కిచ్చినట్లు) దర్శనమిచ్చినవి. అవి చాన్‌సెల్‌ కనిపెట్టినదానికి ఆధునిక అగ్గిపుల్లకు మధ్యస్థితిలో ఉండెను. పోటాషియంక్లోరేట్‌, పంచదార, జిగురులను కలిపి మంచి కాగితములో చుట్టేవారు. ఒకవైపు సల్ఫ్యూరిక్‌ ఆమ్లంతోనిండిన ఒక చిన్న గాజు గ్లాసువుండేది. గాజుగ్లాసును పగులగొడితే, ఆ ఆమ్లం, మండే చిక్కని పదార్థం రెండూకలిసి నిప్పు పుట్టించేవి. బీగెల్‌లో దక్షిణ అమెరికాను తాను దర్శించినవుడు చార్లెస్‌ డార్విన్‌ తన ప్రయాణములందు ఒక ప్రోమీతియన్‌ వున్న గ్లాస్‌ను కొరుకుటద్వారా యురేగ్వేలో సంచలనం సృజించాడు. ఇవి గీటుట వలన కలుగు అగ్గిపుల్లల వంటివి కావు గానీ అవి రసాయనిక ప్రక్రియగల అగ్గిపుల్లలు.

ఆ కాలంలో ఇటలీ కెమిస్టు డొమెనికా చిగ్లాయనో అనే ఇటాలియన్‌ కెమిస్టు ఈ నాకుటుంబం యెడల కూడా శ్రద్ధవహించాడు. అనేక ప్రయోగాలు చేసిన అనంతరం ఆయన నీలాంజన సల్ఫైడ్‌ మరియు ఇతర పదార్థముల నాధారంచేసుకొని ఒక మండే జిగటను తయారు చేసి దాన్ని చిన్నపుల్లల అంచుల్లో ముద్దగా అంటుకొనునట్లు చేశాడు. గరుకుగా వున్నచోట దానిని రుద్దితే ఆ జిగురు వెంటనే మండేది.

తర్వాతి కాలంలో ఈ జిగురు తయారగుటకు ముఖ్యభాగములైన ఈ పొటాషియం క్లోరేట్‌, వైట్‌ ఫాస్ఫరస్‌ రెండును విషపదార్థములైయుండెను. చివరకు, లెడ్‌ఆక్సైడ్‌ (లేక మాంగనీస్‌ డయాక్సైడ్‌తో పాటు ఎరుపు లెడ్‌) మరియు ఎర్రని ఫాస్ఫరస్‌ వీటికి బదులుగా వచ్చినవి. ఇందువల్ల వీటి ఉత్పత్తిలోను, వుపయోగంలోను వచ్చు చిక్కులను తొలగించుటకు సహాయపడినది.

చెట్టుమొద్దునుండి అగ్గిపుల్ల వరకు

ఈనాడు నన్ను దేనితో చేస్తున్నారు? పొట్టిగా, సన్నగా, ఎండిన నా శరీరం బహుశా దేవదారు, జాజి, తెల్లబూరగ చెట్లతో తయారు చేయబడుతుంది. నా తల ముఖ్యంగా ఫాస్ఫరస్‌ సల్ఫైడ్‌ క్లోరైడ్‌, ఇనుపరజను లేక జింక్‌ ఆక్సైడ్‌, పొడిచేసిన గాజు మరియు రబ్బరు లేక జిగురులతో మిళితములైయుంటుంది.

అగ్గిపుల్లలమైన మేము వివిధ కుటుంబాలకు చెందినవారము, మేము వెళ్లే పెట్టెలు కూడా అంతే. నేనైతే సాధారణ వంట గది అగ్గిపుల్లనే, గానీ సెరీనో అనేది కూడా ఉన్నది, అంటే అది మైనపు అగ్గిపుల్ల (చుట్టబడిన మైనపు కాగితముతో చేయబడిన ఈ అగ్గిపుల్ల ఇటాలియన్‌ తయారీ). మరింకను, స్వీడన్‌ దేశపు అగ్గిపుల్ల వున్నది (దానితలలో ఫాస్ఫరస్‌ వుండదు, మరి అదెంత ఆధునికమైనదంటే అగ్గిపెట్టె మీదనున్న ఫాస్ఫరస్‌కు తగిలితేనే ఆ పుల్ల మండుతుంది).

క్లుప్తంగాచెప్పాలంటే మా తయారి మూడు దశలుగా జరుగుతుంది. మొట్టమొదట అగ్గిపుల్ల అనే నా శరీరబాగాన్ని తయారు చేస్తారు; తర్వాత మండే జిగురు పదార్థాన్ని కలగలుపుతారు; చివరగా రెండు పదార్థాలను ఏకం చేస్తారు.

మొదటి దశలో, మొద్దుయొక్క బెరడును తీసివేసిన తర్వాత దాన్ని చదరపు పలకలుగాను లేక దీర్ఘచతుస్రాకారములో అడ్డంగా కోసి లక్షలాది చక్కని అగ్గిపుల్లలుగా తయారుచేస్తారు. అటువైపు మైనపు అగ్గిపుల్లలు తయారుచేయాలంటే, అద్దకం ద్వారా చాలా పొడవైన పేనిన మైనపు కాగితాన్నితీస్తారు. కత్తెరతో దాన్ని ఒక అంగుళం పొడవు ముక్కలుగా కత్తెరిస్తారు.

దాని జిగురును వివిధ రసాయనాలతో తయారు చేస్తారు, వాటితలలు వాటివాటి రకములను బట్టి రకరకాలుగా ఉండును. ఈ రెండింటిని కలిపేదే చివరి దశ. అగ్గిపుల్లలమైన మా తలలను వంచి ఒక చక్రంలోవుంచుతారు, ఆ జిగురుతోవున్న రోలర్‌ను తీసుకుని దానితో మాతలల మీదుగా అటుఇటు త్రిప్పుతారు. ఆ తర్వాత ఎండబెట్టి చివరకు పెట్టెలలో వేస్తారు. మమ్ములను పట్టుకొని మీరు గీచివెలిగించే స్థలమేమిటంటే అగ్గిపెట్టె అంచులకు గరుకుగా అంటిపెట్టుకొని వున్న గాజు పొడితో కలిసివున్న జిగురు పైభాగమే. ఒకనాడు చేతులతోనే అంతా తయారు చేసేవారు, గానీ ఇప్పుడైతే, అది యాంత్రిక ఉత్పత్తిగా మారింది. అందుకే లక్షలాదిగా మమ్ములను తయారుచేస్తున్నారు.

ఒక చిన్న హెచ్చరిక—పసివారు మాదగ్గరికి వచ్చేంత దగ్గరలో మమ్ములను వదలొద్దు. వారికి కుతూహలం ఎక్కువ, పెద్ద వారిని అనుకరించాలనుకుంటారు—తర్వాతి సంగతి మీకు తెలుసు వాళ్లు అగ్గిపెట్టెను తీసుకొని నన్ను గీయాలని చూస్తారు, మరి నాకున్న మండే స్వభావాన్ని బట్టిచూస్తే, ఒక చిన్న నిప్పురవ్వ పెద్ద అగ్నికే కారణం కావచ్చును. గనుక దయచేసి నా విషయంలో జాగ్రత్తగా ఉండండి! (g90 9/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి