కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 థెస్సలొనీకయులు 2
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 థెస్సలొనీకయులు విషయసూచిక

    • 2

      • పాపపురుషుడు (1-12)

      • స్థిరంగా ఉండమనే ప్రోత్సాహం  (13-17)

2 థెస్సలొనీకయులు 2:2

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/1990, పేజీ 14

2 థెస్సలొనీకయులు 2:3

అధస్సూచీలు

  • *

    లేదా “మోసం చేయకుండా.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2008, పేజీ 30

    9/1/2003, పేజీ 6

    9/1/1990, పేజీలు 12-17

    కొత్త లోక అనువాదం, పేజీ 1837

2 థెస్సలొనీకయులు 2:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/1990, పేజీలు 13-14, 15-16

2 థెస్సలొనీకయులు 2:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    7/2019, పేజీ 4

    కావలికోట,

    9/1/1990, పేజీ 14

2 థెస్సలొనీకయులు 2:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    7/2019, పేజీ 4

    కావలికోట,

    9/1/1990, పేజీ 12

    8/1/1990, పేజీలు 22-23

2 థెస్సలొనీకయులు 2:8

అధస్సూచీలు

  • *

    అక్ష., “తన ప్రత్యక్షత వెల్లడైనప్పుడు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    7/2019, పేజీ 4

    కావలికోట,

    9/15/2010, పేజీ 28

    9/15/2008, పేజీ 30

    9/1/1990, పేజీలు 12-16, 17-18, 22-23

    ప్రకటన ముగింపు, పేజీ 282

2 థెస్సలొనీకయులు 2:9

అధస్సూచీలు

  • *

    లేదా “వింతలు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/1990, పేజీలు 12-13

2 థెస్సలొనీకయులు 2:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/1/1990, పేజీలు 12-13

2 థెస్సలొనీకయులు 2:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2022, పేజీలు 7-8

2 థెస్సలొనీకయులు 2:13

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2008, పేజీ 30

2 థెస్సలొనీకయులు 2:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2008, పేజీ 30

2 థెస్సలొనీకయులు 2:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2013, పేజీలు 8-9

2 థెస్సలొనీకయులు 2:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/1995, పేజీ 19

2 థెస్సలొనీకయులు 2:17

అధస్సూచీలు

  • *

    లేదా “బలపర్చాలని.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/1995, పేజీ 19

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
2 థెస్సలొనీకయులు 2:1-17

2 థెస్సలొనీకయులు

2 అయితే సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతకు సంబంధించి, మనం ఆయనతో కలిసి ఉండేలా సమకూర్చబడడానికి సంబంధించి మేము మిమ్మల్ని కోరేదేమిటంటే, 2 యెహోవా* రోజు వచ్చేసిందని ఎవరైనా చెప్తే వెంటనే అయోమయంలో పడిపోకండి, భయాందోళనలకు గురికాకండి. ప్రవచనం రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు, మా నుండి వచ్చిందనిపించే ఉత్తరం రూపంలో కావచ్చు, ఎలా తెలిసినా సరే ఆ విషయాన్ని నమ్మకండి.

3 ఎవ్వరూ మిమ్మల్ని ఏ రకంగానూ తప్పుదోవ పట్టించకుండా* చూసుకోండి. ఎందుకంటే, ముందు మతభ్రష్టత్వం పుట్టుకొచ్చి, నాశనపుత్రుడైన పాపపురుషుడు వెల్లడైన తర్వాతే ఆ రోజు వస్తుంది. 4 ఆ పాపపురుషుడు ఓ వ్యతిరేకి. దేవుడని పిలవబడే ప్రతీదాని మీద, పూజింపబడే ప్రతీ వస్తువు మీద తనను తాను హెచ్చించుకుంటాడు. అలా, తనే ఓ దేవుణ్ణని అందరిముందూ చూపించుకుంటూ దేవుని ఆలయంలో కూర్చుంటాడు. 5 నేను మీతో ఉన్నప్పుడు ఈ విషయాలు చెప్పేవాణ్ణి, మీకు గుర్తులేదా?

6 ఆ పాపపురుషుడు వెల్లడవ్వాల్సిన సమయం కన్నా ముందే వెల్లడవ్వకుండా ఇప్పుడు అతన్ని ఎవరు అడ్డుకుంటున్నారో మీకు తెలుసు. 7 నిజమే, ఎవ్వరికీ అంతుచిక్కని అతని దుష్టత్వం ఇప్పటికే పనిచేస్తోంది, అయితే అతన్ని అడ్డుకుంటున్న వ్యక్తి వెళ్లిపోయేవరకే అతని దుష్టత్వం అలా అంతుచిక్కకుండా ఉంటుంది. 8 ఆ తర్వాత, పాపపురుషుడు వెల్లడి చేయబడతాడు. యేసు ప్రభువు తన ప్రత్యక్షత సమయంలో* తన నోటి ఊపిరితో అతన్ని నాశనం చేస్తాడు. 9 కానీ, పాపపురుషుని ప్రత్యక్షత సాతాను వల్ల జరుగుతుంది. శక్తివంతమైన పనులు, బూటకపు అద్భుతాలు, అబ్బురపర్చే కార్యాలు* చేయడానికి అతనికి శక్తిని ఇచ్చేది సాతానే. 10 రక్షణనిచ్చే సత్యం పట్ల బలమైన కోరికను చూపించనందువల్ల నాశనమౌతున్నవాళ్లను మోసం చేసేందుకు అతనికి శక్తినిచ్చేది కూడా సాతానే. 11 వాళ్లు సత్యం పట్ల ఆసక్తి చూపించలేదు కాబట్టి, వాళ్లు అబద్ధాన్ని నమ్మేలా మోసపోవడానికి దేవుడు అనుమతిస్తాడు. 12 సత్యాన్ని నమ్మకుండా అవినీతిని ప్రేమించినందుకు వాళ్లందరూ తగిన తీర్పు పొందాలని దేవుడు అలా అనుమతిస్తాడు.

13 అయితే, యెహోవా* ప్రేమిస్తున్న సోదరులారా, మీకోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంది. ఎందుకంటే మీకు రక్షణ కలగాలని దేవుడు ముందు నుండే మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఆయన తన పవిత్రశక్తితో మిమ్మల్ని పవిత్రపర్చడం ద్వారా, సత్యం విషయంలో మీకున్న విశ్వాసం ద్వారా అలా ఎంచుకున్నాడు. 14 మేము ప్రకటించే మంచివార్త ద్వారానే దేవుడు మిమ్మల్ని ఆ రక్షణ కోసం పిలిచాడు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను సంపాదించుకోవాలనే ఉద్దేశంతో దేవుడు అలా చేశాడు. 15 కాబట్టి సోదరులారా, స్థిరంగా ఉండండి. విన్నవాటి ద్వారా లేదా మేము రాసిన ఉత్తరం ద్వారా మీరు ఏ విషయాలైతే నేర్చుకున్నారో వాటిని ఎప్పుడూ పాటిస్తూ ఉండండి. 16 అంతేకాదు, మనల్ని ప్రేమిస్తున్న మన తండ్రైన దేవుడు అపారదయతో మనకు శాశ్వతమైన ఊరటను, గొప్ప నిరీక్షణను ఇచ్చాడు. దేవుడు, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు 17 మీకు ఊరటను ఇవ్వాలని, మీరు ఎప్పుడూ మంచిపనులు చేసేలా, మంచిమాటలు మాట్లాడేలా మిమ్మల్ని స్థిరపర్చాలని* కోరుకుంటున్నాను.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి