కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 థెస్సలొనీకయులు 1
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 థెస్సలొనీకయులు విషయసూచిక

    • 1

      • శుభాకాంక్షలు (1, 2)

      • అంతకంతకూ ఎక్కువౌతున్న థెస్సలొనీకయుల విశ్వాసం  (3-5)

      • లోబడనివాళ్ల మీద పగతీర్చుకోవడం  (6-10)

      • సంఘం కోసం ప్రార్థన  (11, 12)

2 థెస్సలొనీకయులు 1:1

అధస్సూచీలు

  • *

    ఇతనికి సీల అనే పేరు కూడా ఉంది.

2 థెస్సలొనీకయులు 1:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2005, పేజీ 32

2 థెస్సలొనీకయులు 1:4

అధస్సూచీలు

  • *

    లేదా “మీరు సహిస్తున్న.”

  • *

    లేదా “శ్రమల్లో.”

2 థెస్సలొనీకయులు 1:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 33

    కావలికోట,

    11/15/2004, పేజీ 19

2 థెస్సలొనీకయులు 1:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2004, పేజీ 19

    5/1/1994, పేజీలు 52-53

2 థెస్సలొనీకయులు 1:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 33

    కావలికోట (అధ్యయన),

    9/2019, పేజీ 12

    కావలికోట,

    11/15/2004, పేజీ 19

    5/1/1994, పేజీలు 52-53

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
2 థెస్సలొనీకయులు 1:1-12

2 థెస్సలొనీకయులు

1 మన తండ్రైన దేవునితో, ప్రభువైన యేసుక్రీస్తుతో ఐక్యంగా ఉన్న థెస్సలొనీకయుల సంఘానికి పౌలు, సిల్వాను,* తిమోతి రాస్తున్న ఉత్తరం.

2 మన తండ్రైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని ప్రసాదించాలి.

3 సోదరులారా, మీ కోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంది. మేము అలా చెప్పడం సరైనది, ఎందుకంటే మీ విశ్వాసం అంతకంతకూ ఎక్కువౌతోంది, మీలో ప్రతీ ఒక్కరికి ఒకరిమీద ఒకరికున్న ప్రేమ కూడా పెరుగుతోంది. 4 అందుకే దేవుని సంఘాల్లో మీ గురించి మేము గొప్పగా మాట్లాడుతుంటాం; మీరు మీ హింసలన్నిట్లో, మీరు ఎదుర్కొంటున్న* కష్టాల్లో* ఎంతో సహనాన్ని, విశ్వాసాన్ని చూపించారు. 5 దేవుని నీతిగల తీర్పుకు అది రుజువు. దీనివల్ల మీరు దేవుని రాజ్యానికి అర్హులౌతారు. నిజానికి, ఇందుకోసమే మీరు బాధలు అనుభవిస్తున్నారు.

6 మిమ్మల్ని శ్రమ పెట్టేవాళ్లను దేవుడు శ్రమలపాలు చేస్తాడు. నిజానికి, అది ఆయన దృష్టికి న్యాయమే. 7 పరలోకం నుండి మండుతున్న అగ్నిలో యేసు ప్రభువు శక్తిమంతులైన తన దేవదూతలతో కలిసి ప్రత్యక్షమైనప్పుడు, ప్రస్తుతం శ్రమలు అనుభవిస్తున్న మీరు మాతోపాటు విడుదల పొందుతారు. 8 అప్పుడు, దేవుడు తెలియనివాళ్ల మీద, మన ప్రభువైన యేసు గురించిన మంచివార్తకు లోబడనివాళ్ల మీద ఆయన పగ తీర్చుకుంటాడు. 9 శాశ్వత నాశనమనే శిక్ష పడిన వీళ్లు ప్రభువు కళ్ల ముందు నుండి వెళ్లగొట్టబడతారు. ఆయన గొప్ప శక్తిని వాళ్లు ఇక చూడరు. 10 ఆయన తన పవిత్రులతో కలిసి మహిమపర్చబడడానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. ఆయన మీద విశ్వాసం ఉంచినవాళ్లంతా ఆ రోజు ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తారు. మేము ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు నమ్మారు కాబట్టి మీకు కూడా అందులో భాగం ఉంటుంది.

11 అందుకే మేము మీ కోసం ఎప్పుడూ ప్రార్థిస్తున్నాం. దేనికోసమైతే దేవుడు మిమ్మల్ని పిలిచాడో దానికి ఆయన మిమ్మల్ని అర్హులుగా ఎంచాలనీ, ఆయన తన శక్తితో తనకు ఇష్టమైన ప్రతీ మంచిదాన్ని చేయాలనీ, విశ్వాసంతో మీరు చేసే ప్రతీదాన్ని ఆయన సంపూర్ణం చేయాలనీ ప్రార్థిస్తున్నాం. 12 మన ప్రభువైన యేసు పేరు మీ ద్వారా ఘనపర్చబడాలని, అలాగే మీరు ఆయనతోపాటు ఘనపర్చబడాలని మా ఉద్దేశం. ఆ ఘనత మన దేవుని అపారదయ వల్ల, ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ వల్ల కలుగుతుంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి