దేవుని వాక్యానికి మీ జీవితంపై పని చేసే శక్తి ఉందా?
రోజూ బైబిలు చదవడం వల్ల మనం విశ్వాసంలో “వేరుపారినవారై,” “స్థిరపరచబడుచు” ఉంటాం. (కొలొ. 2:6, 7) కానీ, యెహోవా వాక్యం మన జీవితంపై పని చేయాలంటే మనం అందులో ఉన్న సూత్రాల గురించి బాగా ఆలోచిస్తూ వాటిని పాటించాలి. (హెబ్రీ. 4:12; యాకో. 1:22-25) యెహోషువ 1:8లో చదవడం గురించి మూడు విషయాలు ఉన్నాయి. (1) దేవుని వాక్యాన్ని “దివారాత్రము” చదవాలి. (2) ‘ధ్యానించాలి.’ అంటే చదువుతున్న వాటి గురించి ఆలోచిస్తూ, జరిగిన సమయసందర్భాలు, పరిస్థితుల గురించి ఊహించుకోవడానికి వీలుగా చిన్నగా బయటకు చదవడం. (3) ‘దానిలో రాయబడిన వాటన్నిటిని’ పాటించడానికి నిజాయితీగా ప్రయత్నించండి. ఈ విషయాలను మనం అలవాటు చేసుకుంటే ‘వర్ధిల్లుతూ చక్కగా ప్రవర్తిస్తాం.’