కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • yc పాఠం 3 పేజీలు 8-9
  • యెహోవా మీద నమ్మకం ఉంచిన రాహాబు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మీద నమ్మకం ఉంచిన రాహాబు
  • చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాహాబు గూఢచారులను దాచిపెట్టింది
    నా బైబిలు పుస్తకం
  • ఆమె “తన చేతల వల్ల నీతిమంతురాలని తీర్పు పొందింది”
    కావలికోట: దేవుడు ప్రేమలేని వాడని అనుకునేలా చేసిన అబద్ధాలు
  • రాహాబు—విశ్వాస క్రియలనుబట్టి నీతిమంతురాలిగా తీర్చబడింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • రాహాబు వేగులవాళ్లను దాచిపెట్టడం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
yc పాఠం 3 పేజీలు 8-9
డాబా మీద దాక్కున్న గూఢచారుల దగ్గరకు వచ్చిన రాహాబు

3

యెహోవా మీద నమ్మకం ఉంచిన రాహాబు

కాసేపు మనం యెరికో పట్టణంలో ఉన్నట్టు ఊహించుకుందాం. అది కనానులో ఉంది. అక్కడివాళ్లు యెహోవాను నమ్మని ప్రజలు. ఆ పట్టణంలో రాహాబు అనే ఒక స్త్రీ ఉండేది.

రాహాబు చిన్నప్పుడు కొన్ని కథలు వింది. మోషే ఎర్ర సముద్రాన్ని రెండుగా ఎలా విడగొట్టాడో, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి ఎలా తీసుకొచ్చాడో ఆ కథల వల్ల ఆమెకు తెలిసింది. యుద్ధాల్లో శత్రువులను ఓడించడానికి యెహోవా వాళ్లకు ఎలా సహాయం చేశాడో కూడా ఆమెకు తెలిసింది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు యెరికోకు దగ్గర్లో మకాం వేశారనే వార్త ఆమె చెవిన పడింది!

రాహాబు యెహోవా మీద నమ్మకం ఉంచింది కాబట్టి గూఢచారుల్ని కాపాడింది

ఓ రోజు సాయంకాలం, ఇద్దరు ఇశ్రాయేలీయులు యెరికో పట్టణం గురించి తెలుసుకోవడానికి రహస్యంగా అందులోకి ప్రవేశించారు. ఆ ఇద్దరు గూఢచారులు రాహాబు ఇంటికి వచ్చారు. ఆమె వాళ్లను ఆహ్వానించి, వాళ్లకు ఆశ్రయమిచ్చింది. గూఢచారులు నగరంలోకి జొరబడ్డారని, వాళ్లు రాహాబు ఇంటికి వెళ్లారని ఆ రాత్రి రాజుకు తెలిసింది. వాళ్లను బంధించి తీసుకురమ్మని రాజు తన మనుషులను పంపాడు. అప్పుడు రాహాబు ఆ ఇద్దరు గూఢచారుల్ని డాబామీద దాచిపెట్టి, రాజు పంపిన మనుషులతో ఇలా అంది: ‘వాళ్లు ఇక్కడికి వచ్చారు కానీ, ఎప్పుడో పట్టణం నుండి వెళ్లిపోయారు. అయినా, మీరు వెంటనే వెళ్తే వాళ్లను పట్టుకోవచ్చు!’ రాహాబు ఆ గూఢచారుల్ని ఎందుకు కాపాడిందో మీకు తెలుసా?— ఎందుకంటే ఆమె యెహోవాను నమ్మింది, అంతేకాదు కనాను దేశాన్ని ఆయన ఇశ్రాయేలీయులకు ఇచ్చేస్తాడని కూడా ఆమె నమ్మింది.

యెరికో పట్టణం నాశనమయ్యే సమయంలో ఆమెకు, ఆమె ఇంట్లోవాళ్లకు ఎలాంటి హాని జరగదని ఆ గూఢచారులు వెళ్తూవెళ్తూ ఆమెకు మాటిచ్చారు. అయితే, ఆమెను ఓ పని చేయమన్నారు. అదేంటో తెలుసా?— ‘ఈ ఎర్ర తాడు తీసుకో. దీన్ని నీ కిటికీ నుండి బయటికి కనిపించేలా వేలాడదీయి. అప్పుడు నీ ఇంట్లో ఉన్నవాళ్లంతా సురక్షితంగా ఉంటారు.’ రాహాబు సరిగ్గా వాళ్లు చెప్పినట్టే చేసింది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసా?—

యెరికో గోడ మీదున్న రాహాబు ఇంటి కిటికీలో నుండి వేలాడుతున్న ఎర్రతాడు

యెహోవా రాహాబును, ఆమె ఇంట్లో ఉన్నవాళ్లను రక్షించాడు

కొన్ని రోజుల తర్వాత, ఇశ్రాయేలీయులు పట్టణం చుట్టూ తిరిగారు. అలా వాళ్లు రోజుకు ఒకసారి చొప్పున ఆరు రోజులు తిరిగారు. కానీ ఏడవ రోజు మాత్రం వాళ్లు ఏడుసార్లు తిరిగారు. ఆ తర్వాత వాళ్లంతా ఒకేసారి గట్టిగా అరిచారు. అప్పుడు యెహోవా, పట్టణం చుట్టూవున్న గోడలు కూలిపోయేలా చేశాడు. అయితే, కిటికీ నుండి ఎర్ర తాడు వేలాడుతున్న ఇల్లు మాత్రం కూలిపోకుండా అలాగే ఉంది! చిత్రంలో అది కనిపిస్తోందా?— రాహాబు, ఆమె ఇంట్లోవాళ్లు క్షేమంగా ఉన్నారు!

రాహాబు నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?— రాహాబు యెహోవా గురించి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకుంది. అందుకే ఆమె ఆయన మీద నమ్మకం ఉంచింది. యెహోవా గురించి మీరు కూడా ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకుంటున్నారు కదా. మరి రాహాబులా మీరు కూడా యెహోవా మీద నమ్మకం ఉంచుతున్నారా?— మీరు నమ్మకం ఉంచుతున్నారని మాకు తెలుసు!

[8వ పేజీలోని చిత్రం]

మీ బైబిల్లో చదవండి

  • యెహోషువ 2:1-24; 6:1-5, 14, 15, 20-25

  • హెబ్రీయులు 11:31

ప్రశ్నలు:

  • రాహాబు చిన్నప్పుడు ఏ కథలు వింది?

  • ఆమె ఇశ్రాయేలు గూఢచారులకు ఎలా సహాయం చేసింది? ఎందుకు చేసింది?

  • ఆ గూఢచారులు రాహాబుకు ఏమని మాటిచ్చారు?

  • రాహాబు నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి