కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • yc పాఠం 4 పేజీలు 10-11
  • నాన్నను, యెహోవాను సంతోషపెట్టిన అమ్మాయి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నాన్నను, యెహోవాను సంతోషపెట్టిన అమ్మాయి
  • చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెఫ్తా వాగ్దానం
    నా బైబిలు కథల పుస్తకము
  • నమ్మకంగా ఉంటే దేవుని ఆమోదాన్ని పొందుతాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • కష్టమైనా సరే ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • యెఫ్తా ఇచ్చిన మాట
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
yc పాఠం 4 పేజీలు 10-11
తన చిన్నారి కూతురితో సమయం గడుపుతున్న యెఫ్తా

4

నాన్నను, యెహోవాను సంతోషపెట్టిన అమ్మాయి

ఇశ్రాయేలు సైన్యం శత్రువులతో యుద్ధం చేస్తుండగా యెహోవాకు ప్రార్థిస్తున్న యెఫ్తా

యెఫ్తా యెహోవాకు ఏమని మాటిస్తున్నాడు?

యుద్ధం నుండి తిరిగి వస్తూ, తనకు ఎదురొచ్చిన కూతుర్ని కౌగిలించుకున్న యెఫ్తా

ఎంత కష్టమనిపించినా, యెఫ్తా కూతురు నాన్న మాట నిలబెట్టింది

ఈ చిత్రంలో ఉన్న అమ్మాయిని చూశారా?— ఆమె యెఫ్తా అనే వ్యక్తి కూతురు. బైబిల్లో ఆమె పేరు లేదు కానీ ఆమె వాళ్ల నాన్నను, యెహోవాను సంతోషపెట్టిందనే విషయం మాత్రం ఉంది. ఇప్పుడు ఆమె గురించి, వాళ్ల నాన్న గురించి తెలుసుకుందాం.

యెఫ్తా చాలా మంచి మనిషి. కూతురుకు యెహోవా గురించి నేర్పించడానికి ఆయన ఎంతో సమయం వెచ్చించేవాడు. ఆయన చాలా బలవంతుడు, మంచి నాయకుడు కూడా. అందుకే, శత్రువుల మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు ముందుండి నడిపించమని ఇశ్రాయేలీయులు ఆయనను అడిగారు.

యుద్ధంలో గెలవడానికి సహాయం చేయమని యెఫ్తా యెహోవాకు ప్రార్థించాడు. ఒకవేళ యుద్ధంలో గెలిస్తే, ఇంటికి వెళ్లినప్పుడు ఇంట్లో నుండి ముందుగా ఎవరు తనకు ఎదురొస్తారో వాళ్లను యెహోవాకు ఇస్తానని మాటిచ్చాడు. అలా ఎదురొచ్చే వ్యక్తి, చనిపోయేంతవరకు దేవుని గుడారంలో ఉంటూ అక్కడ పనిచేయాలి. ఆ రోజుల్లో గుడారం అనేది ప్రజలు దేవుణ్ణి ఆరాధించే స్థలం. అయితే, యెఫ్తా యుద్ధంలో గెలిచాడు! మరి ఇంటికి వెళ్లినప్పుడు ఇంట్లో నుండి ముందుగా ఎవరు ఆయనకు ఎదురొచ్చారో తెలుసా?—

అవును, యెఫ్తా కూతురే ఆయనకు ఎదురొచ్చింది! ఈమె యెఫ్తాకు ఒక్కగానొక్క కూతురు. అయితే ఇప్పుడాయన ఆమెను పంపించేయాలి. ఈ విషయం ఆయన్ని చాలా బాధపెట్టింది. కానీ మీకు గుర్తుందా? ఆయన దేవునికి మాటిచ్చాడు. వాళ్ల కూతురు ఇంకేమీ ఆలోచించకుండా ఇలా అంది: ‘నాన్నా, నువ్వు దేవునికి మాటిచ్చావు, దాన్ని నిలబెట్టుకోవాలి.’

గుడారం కోసం కట్టెలు పోగేస్తున్న యెఫ్తా కూతురు; ఆమెను చూడడానికి వచ్చిన ఆమె స్నేహితురాళ్లు

యెఫ్తా కూతురి స్నేహితురాళ్లు ప్రతీ సంవత్సరం ఆమెను చూడడానికి వచ్చేవాళ్లు

యెఫ్తా కూతురు కూడా చాలా బాధపడింది. ఆమె గుడారం దగ్గర సేవ చేయడానికి వెళ్తే పెళ్లి చేసుకునేందుకు, పిల్లల్ని కనేందుకు వీలుండదు. అయితే, నాన్న మాట నిలబెట్టాలని, యెహోవాను సంతోషపెట్టాలని ఆమె ఎంతగానో కోరుకుంది. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం కన్నా అదే చాలా ముఖ్యమని ఆమె అనుకుంది. అందుకే, ఆమె చనిపోయేంతవరకు ఇంటికి దూరంగా గుడారంలోనే జీవించింది.

ఆమె చేసిన పని వాళ్ల నాన్నను, యెహోవాను సంతోషపెట్టిందా?— అవును, వాళ్లిద్దర్నీ సంతోషపెట్టింది. మీరు కూడా చెప్పిన మాట వింటే, యెహోవాను ప్రేమిస్తే యెఫ్తా కూతురిలా ఉండవచ్చు. అప్పుడు మీరు కూడా మీ అమ్మానాన్నల్ని, యెహోవాను ఎంతో సంతోషపెడతారు.

మీ బైబిల్లో చదవండి

  • ద్వితీయోపదేశకాండము 6:4-6

  • న్యాయాధిపతులు 11:30-40

  • 1 కొరింథీయులు 7:32-34

ప్రశ్నలు:

  • యెఫ్తా ఎవరు? ఆయన దేవునికి ఏమని మాటిచ్చాడు?

  • నాన్న మాట నిలబెట్టడం యెఫ్తా కూతురికి ఎందుకు సులువైన పని కాదు?

  • యెఫ్తా కూతురు ఏది చాలా ముఖ్యమని అనుకుంది?

  • మీరు యెఫ్తా కూతురిలా ఉండాలంటే ఏమి చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి