భాగం 13
దేవున్ని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి?
చెడు చేయకండి. 1 కొరింథీయులు 6:9, 10
మనం యెహోవాను ప్రేమిస్తే, ఆయనకు ఇష్టంలేని పనులు చేయం.
దొంగతనం, తాగుబోతుతనం, మత్తుపదార్థాలు వాడడం తప్పని యెహోవా చెప్తున్నాడు.
హత్య, కడుపులో బిడ్డను చంపడం, సలింగ సంయోగం, అత్యాశ, గొడవలు వంటివి దేవునికి అసహ్యం.
మనం విగ్రహాల్ని పూజించకూడదు, మంత్రతంత్రాలు చేయకూడదు.
చెడ్డపనులు చేసేవాళ్లు భూపరదైసులో ఉండరు.
మంచి చేయండి. మత్తయి 7:12
దేవున్ని సంతోషపెట్టాలంటే మనం ఆయనలా ఉండడానికి ప్రయత్నించాలి.
దయగా, ఉదారంగా ఉంటూ ఇతరుల మీద ప్రేమ చూపించండి.
నిజాయితీగా ఉండండి.
కరుణ చూపించండి, క్షమిస్తూ ఉండండి.
యెహోవా గురించి, ఆయన మార్గాల గురించి ఇతరులకు చెప్పండి.—యెషయా 43:10.